రైతులను ప్రోత్సహించడానికి రాతి దూలం పోటీలు.. ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి...
రైతులను ప్రోత్సహించడానికి రాతి దూలం పోటీలు.. ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి.
గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామం పామిడి పెన్నానది సమీపంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ క్షేత్రపాల కొండ శింగరప్ప స్వామి తిరుణాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్యయకర్త ఎం. వీరాంజనేయులు స్వామి వారిని దర్శించుకున్నారు.
గ్రామస్తుల ఆధ్వర్యంలో రాతి దూలం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులను ప్రోత్సహించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఎద్దుల రాతి దూలం పోటీలను నిర్వహించడం సంతోషకరమన్నారు.
గతంలో కల్లూరు నుంచి కొండపై కొలువైన సింగరప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు రోడ్డు మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దృష్టికి తీసుకురావడంతో ఆమె వెంటనే స్పందించి నూతనంగా తారురోడ్డు నిర్మించారన్నారు.
కొండపైకి రోడ్డు నిర్మించడంతో గ్రామస్తులు భక్తులు ఎమ్మెల్యే దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Mar 04 2024, 08:33