తరిమెల ప్రజల కల సాకారం అందించిన జగనన్న తరిమెల వద్ద పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి.. ప్రారంభించిన ఆలూరు సాంబశివారెడ్డి, సమన్వయకర్త వీరాంజన
తరిమెల ప్రజల కల సాకారం అందించిన జగనన్న
తరిమెల వద్ద పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి
◆ రాకపోకలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు.
◆ పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, పెనుగొండ ఎమ్మెల్యే మరియు అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త ఎం. శంకర్ నారాయణ, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు పైలా నరసింహయ్య.
గ్రామ ప్రజల సమక్షంలో వీరంతా దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
పాదయాత్ర సమయంలో తరిమెల, చిట్టూరు గ్రామాల ప్రజలకు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని సాంబ శివారెడ్డి, శంకర్ నారాయణ, వీరాంజనేయులు అన్నారు.
శింగనమల మండలం తరిమెల గ్రామంలో తరిమెల నుంచి చిట్టూరు గ్రామాల మధ్య నూతనంగా నిర్మించిన బ్రిడ్జిను వారు ప్రారంభించారు.
సాంబ శివారెడ్డి మాట్లాడుతూ..పాదయాత్ర సమయంలో రెండు గ్రామాల ప్రజలు రాకపోకలకు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారన్నారు. వర్షాకాలంలో నదిలోంచి నడుచుకుంటూ అవతలికి వెళ్లాల్సి వస్తోందని ప్రజలు తమ ఇబ్బందులను తెలియజేశారన్నారు. జగనన్న సీఎం అయ్యాక ఉన్నతాధికారులతో మాట్లాడి పెన్నా నదిపై లో లెవెల్ పైపు కల్వర్టు నిర్మించడానికి చర్యలు చేపట్టారన్నారు. ఇందుకు ఎంపీ నిధులను దాదాపు రూ.3.50 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు.
బ్రిడ్జి నిర్మాణం పూర్తయి వినియోగంలోకి రావడంతో శింగనమల, పెద్దవడుగూరు మండలాల ప్రజల రాకపోకలకు ఎంతో అనుకూలంగా ఉందన్నారు. ప్రజల కష్టాలను తీర్చి.. సంక్షేమ పాలన అందిస్తున్న జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు.
తరిమెల గ్రామ ప్రజల కష్టాలను గుర్తించి, బ్రిడ్జి నిర్మాణం కొరకు కృషి చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Mar 03 2024, 07:03