ఇరాక్ లో మృతి చెందిన వ్యక్తి కుటుంబ తల్లిదండ్రులకు బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు ఆర్దికంగా అందించిన VBA-RPI-TVYS రాష్ట్ర అధ్యక్షులు


ఇరాక్ లో మృతి చెందిన వ్యక్తి కుటుంబ తల్లిదండ్రులకు బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు ఆర్దికంగా అందించిన VBA-RPI-TVYS రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్


మంచిర్యాల జిల్లా :

[. Streebuzz news Crime journalist. ]



(జన్నారం 24- ఫిబ్రవరి):- మండలంలోని దేవునిగూడ గ్రామ పంచాయతి లో బతుకుదెరువు కోసం చాల చిన్న వయసు లో వలస వెళ్లి బ్రెయిన్ స్ట్రోక్ తో ఈరాక్ లో మృతి చెందిన కునారపు వెంకటేష్ కుటుంబానికి బియ్యం ఆర్ధిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్న మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ (MP)అభ్యర్థి మరియు వంచిత్ బహుజన్ ఆఘాడి (VBA) రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) తెలంగాణ ఎస్ సి, ఎస్ టి, బిసి మైనారిటీ విద్యార్థి యువజన సంఘం TVYS రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ .గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ ఎక్కడ మన పేద వాళ్ళు ఉన్న వాళ్లకు తన వంతుగా సహాయం చేస్తానని అన్నారు.గవ్వల శ్రీకాంత్ చేస్తున్న సహాయ సహకారాలను గ్రామ యువత వివిధ వర్గాలకు చెందిన ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమములో అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సామాజిక కార్యకర్త ఆత్రం అనసూయ, మాజీ సర్పంచ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి గవ్వల లక్ష్మి ,నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి తీగల శేఖర్, యూత్ సామాజిక కార్యకర్తలు, నాయకులు ,రాగి రవీందర్ ,కట్కం మల్లేష్ ,ముత్యంపెల్లి వెంకటచారి, కండ్లే దుబ్బయ్య ,సాకలి దేవయ్య, కునారాపు గంగన్న,గోలి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్లు కోరుతూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ని ఆశ్రయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి


[ Streebuzz news Crime journalist]



(హైదరాబాద్ ) :- నేడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన భారీ ఆర్థిక శూన్యతను పూడ్చే ప్రయత్నాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్ మెట్రో, మూసీ రివర్ఫ్రంట్ పునరుద్ధరణ వంటి అభివృద్ధి ప్రాజెక్టులకు సాఫ్ట్ లోన్లు కోరుతూ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా)ని ఆశ్రయించారు.
ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న - ప్రముఖ సామాజికవేత్తలు





ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న - ప్రముఖ సామాజికవేత్తలు వలుస సుభాష్ చంద్రబోస్


సిద్దిపేట జిల్లా:

[ Streebuzz news Crime journalist]


హుస్నాబాద్ నియోజకవర్గం:

(కోహెడ మండలం 24 ఫిబ్రవరి):-  మండలంలోని పరివేద, గ్రామాల్లో కొలువుధీరిన సమ్మక్క - సారలమ్మ వనదేవతలకు వందనాలు తెలుపుతూ ఈరోజు సంకల్ప స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ సామాజిక సేవకులు గవర్నర్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక రక్షకులు వనదేవుతులని ఆయనే పేర్కొన్నారు. పోరాట స్ఫూర్తి త్యాగాల కీర్తి వనదేవతలు సమ్మక్క సారలమ్మ చరిత్ర గుడి లేని తల్లులను గుండె నిండా కొలుచుకునే పురాతన నుండి వస్తున్న ఆచారం అదే మేడారం కుంభమేళ జాతర సకలజని కోటి భక్తులు దర్శించుకోవడం మహా వైభవం అలాంటి ములుగు జిల్లాను సమ్మక్క - సారలమ్మ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ మరియు మేడారం జాతరను జాతీయ పండుగ కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని ఆయన కోరారు. ఉన్నత చదువుల్లో సమ్మక్క సారలమ్మ జీవిత పోరాటం చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సమ్మక్క సారలమ్మ పోరాటం చేసిన స్ఫూర్తిని నేటి యువత పునికి పుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో వలస సుభాష్ చంద్రబోస్ కు ఘనంగా సన్మానం జరిగింది. గతాన్ని గుర్తిస్తూ సమ్మక్క సారలమ్మ తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా తెలంగాణ రావాలని పరివేద గ్రామంలో ప్రముఖ సంఘ సేవకులు తెలంగాణ యూత్ ఫోరం వ్యవస్థాపక మేము అభిమానించే నాయకుడు ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశం మేరకు పరివేద వనదేవతలకు సమ్మక్క సారలమ్మ కు తెలంగాణ రావాలని అమరుల త్యాగాలను స్మరిస్తూ సమ్మక్క సారలమ్మ వారి నమ్మకంతో ఆనాడు ముడుపు కట్టిన సందర్భం గుర్తు చేసుకున్నారు. కోహెడ మండల యువ నాయకులు తెలంగాణ యూత్ జెయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ వలస సుభాష్ చంద్రబోస్ అప్పటి ఆల్ ఇండియ ఫార్వర్డ్ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి దళిత విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు న్యాయవాది జేరిపోతుల కిరణ్ కుమార్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, ప్రముఖ సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు తెలంగాణ ఉద్యమ కోసం ముడుపు కట్టిన సందర్భం తీపి గుర్తులు ఆని వలస సుభాష్ చంద్రబోస్ నేత పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పరివేద జాతర కమిటి, తెలంగాణ రాష్ట్ర జాక్ కన్వీనర్ మంద మల్లేశం,ఉపాధి క్షేత్ర సహాయకులు నాంపల్లి శ్రీనివాస్, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ చర్యలు




జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

[ Streebuzz news Crime journalist ]


(మొగుళ్ళపల్లి):- మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన కొలువుదీరిన శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొగుళ్లపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ చర్యలు తీసుకుంటున్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చే వాహనదారులకు వెహికల్స్ పార్కింగ్ ఏర్పాటు చేసి, ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చొరవ చూపారు. జాతరలో దొంగల పట్ల ప్రమాదంగా ఉండాలని భక్తులను అప్రమత్తం చేశారు. ఆకతాయిలా భరతం పట్టేందుకు పోలీస్ నిఘాను ఏర్పాటు చేశారు. భక్తుల పట్ల ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ చూపిస్తున్న అభిమానం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు



సిద్దిపేట జిల్లా:

[ Streebuzz news Crime journalist ]


(వర్గల్) :- ఇండ్ల నిర్మాణాల కోసం వినియోగించే సెంట్రింగ్ బాక్స్ ల అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ను సిద్దిపేట జిల్లా గౌరారం పోలీసులు గురువారం అరెస్టు చేశారు.ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ బాలాజీ మాట్లాడుతూ వర్గల్ కమాన్ వద్ద తనిఖీలు చేస్తుండగా గౌరారం వైపు వస్తున్న అశోక్ లేలాండ్ వాహనంలోని ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నామని ,వారిని విచారించగా ఇండ్ల నిర్మాణాల వద్ద ఉన్న సెంట్రింగ్ బాక్సులు , ఇనుప పైపులను దొంగతనాలు చేశామని మెదక్ లో నాలుగు చోట్ల సిద్దిపేటలో ఏడు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితులు చెప్పడం జరిగిందని అన్నారు. సెంట్రిగ్ బాక్సులు ఇనుప పైపులను సిద్దిపేట జిల్లాలో ఏడు చోట్ల, మెదక్ జిల్లాలో 11 చోట్ల చోరీకి పాల్పడ్డారని చోరీకి పాల్పడ్డ వ్యక్తులు నల్గొండ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించామని, వీరితోపాటు మరో 17 మంది ఉన్నట్లు విచారణ లో తేలిందని తెలిపారు.
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజి మంత్రి పువ్వాడ దిగ్ర్భాంతి

హైదరాబాద్:

[ Streebuzz news Crime journalist ]

(హైదరాబాద్):- కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజీ మాజి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గతేడాది ఫిబ్రవరిలో కంటోన్మెంట్ సీనియర్ ఎమ్మెల్యే అయిన తన తండ్రి సాయన్న మృతి నుండి ఇంకా కోలుకొక ముందే, ప్రజా సేవలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కంటోన్మెంట్ ప్రజల మన్ననలు పొందిన యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం అత్యంత బాధాకరమన్నారు. ఆమె మరణం కంటోన్మెంట్ ప్రజలకు, బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోదైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న ఆత్రం అనసూయ - రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు


• అదిలాబాద్ MP కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ అశిస్తుంది •



• సామాజిక కార్యక్రమాలలో ముందున్న ఆత్రం అనసూయ •

[ Streebuzz news Crime journalist]

(అదిలాబాద్ జిల్లా):- గత 33 సంవత్సరాలుగా అదిలాబాద్ జిల్లాలో టీచర్ గా డిప్యూటీ వార్డెన్ గా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తూ దాదాపు వేలాది మంది గిరిజన విద్యార్థి వారి తల్లిదండ్రులలో పరోక్షంగా ప్రత్యేక్షంగా సంబంధాలు కలిగి ముదొల్ బాసర నుండి నిర్మల్, బోథ్, అదిలాబాద్ ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ బెజ్జుర్ వరకు ఇటు జన్నారం వరకు మంచి పేరు అందరితో సన్నిత సంబంధాలు కలిగి ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ గుర్తించి అదిలాబాద్ ఎంపి టికెట్ ఇస్తే గెలిసి శ్రీ రాహుల్ గాంధీ గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ఎంపి గా గెలిసి గిఫ్ట్ గా ఈవ్వడనికి సిద్దమైనట్లు ఆత్రం అనసూయ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదటి నుంచి మా తాత తండ్రుల నుండి ఇప్పటి వరకు అందరు కాంగ్రెస్ పార్టీకి సంబందించిన వారేనని అన్నారు .కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమే కాకుండా వేయించిన వారు కాబట్టి ఆత్రం అనసూయ ముక్కుసూటిగా ఉంటూ ఎలాంటి తప్పు చేయకుండా అందరికీ మేలు జరగాలి అందరు బాగుండాలి అందులో నేనుండాలి ఆని కోరుకునే మహిళ ఆత్రం అనసూయ. గిరిజన ఆదివాసీ ముద్దు బిడ్డ భర్త తో పాటు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులు అందరు స్థిరపడ్డారు సంపాదించుకోవడానికి కాకుండ రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. •మృతిని కుటుంబానికి ఆర్ధిక సహాయాన్ని అందించి మానవత్వన్ని చాటుకున్న ఆత్రం అనసూయ• •అదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం సామాజిక కార్యకర్త ఆత్రం అనసూయ• అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాటగూడలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలుసిన వెనువెంటనే ఆ గ్రామానికి చేరుకుని దహన సంస్కారాలు నిర్వహించాడానికి తన బాధ్యతగా ఆర్ధిక సహాయాన్ని అందించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. పేద వాళ్లకు మరింత మీ సహాయాన్ని అందించి ఆదుకోవాలని అక్కడి ప్రజలు కోరారు.వారితో పాటు మాజి సర్పంచ్ గెడం యశ్వంత్, యూత్ సభ్యులు బీంరావు ,రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
పట్టుదల ముందు పేదరికం అడ్డు కాదు - బీసీ జిల్లా అధ్యక్షుడు కందూరి అయిలయ్య



సిద్దిపేట జిల్లా:

[ Streebuzz news Crime journalist ]

(ఉమ్మడి కొండపాక):- చిన్నతనం నుండే అమ్మా నాన్న లేకపొయిన కడు పేదరికాన్ని బరిస్తూ పట్టుదల వదలక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కుకునూర్ పల్లి మండల కేంద్రానికి చెందిన తుప్పటి కర్నాకర్ ను బీసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కందూరి అయిలయ్య అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవైపు తినడానికి తిండి లేక పోయినా తమ్ముడు , చెల్లెలిని సాదుకుంటూ వీలు కుదిరినప్పుడ్లా చదువుకొని తన పట్టుదలను వదలలేదన్నారు. సంకల్పం గట్టిగా ఉంటే సదించనిది లేదని కర్నాకర్ నిరూపించారని అన్నారు.ప్రతి కష్టాన్ని అధిగమించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నాకర్ ,నవీన్ ,డాక్టర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
పట్టుదల ముందు పేదరికం అడ్డు కదు బీసీ జిల్లా అధ్యక్షుడు కందూరి అయిలయ్య



సిద్దిపేట జిల్లా:


(ఉమ్మడి కొండపాక):- చిన్నతనం నుండే అమ్మా నాన్న లేకపొయిన కడు పేదరికాన్ని బరిస్తూ పట్టుదల వదలక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కుకునూర్ పల్లి మండల కేంద్రానికి చెందిన తుప్పటి కర్నాకర్ ను బీసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కందూరి అయిలయ్య అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవైపు తినడానికి తిండి లేక పోయినా తమ్ముడు , చెల్లెలిని సాదుకుంటూ వీలు కుదిరినప్పుడ్లా చదువుకొని తన పట్టుదలను వదలలేదన్నారు. సంకల్పం గట్టిగా ఉంటే సదించనిది లేదని కర్నాకర్ నిరూపించారని అన్నారు.ప్రతి కష్టాన్ని అధిగమించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నాకర్ ,నవీన్ ,డాక్టర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ప్రభుత్వంలో అందరికి సమన్యాయం జరుగుతుంది - జిల్లా సీనియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్


సిద్దిపేట జిల్లా:


(నారాయణరావుపేట):- మండలంలోని జక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల ముఖ్య సమావేశంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిద్దిపేట జిల్లా సినియర్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నిక అయిన గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు నక్క కాంతయ్య, అధ్యక్షులు బోయిని బాలయ్య, కార్యనిర్వహ అధ్యక్షుడు సారుగు హరికృష్ణ, ఉపాధ్యక్షుడు మాట్ల రాజు, ప్రధాన కార్యదర్శి మోసర్ల భూపతి రెడ్డి, కార్యదర్శులుగా జక్కుల బుచ్చెయ్య, దాకం కనకయ్య గార్లకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకుని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు..అదే విదంగా జక్కాపూర్ గ్రామంలో ఆనాటి నుండి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ బలంగా, ఐక్యమత్యంగా ఉందని, అదే ఐక్యమత్యంతో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి, అందరికి అందుబాటులో ఉండాలన్నారు.ఇంకా అనేక సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి, వాటన్నింటిని కూడా ప్రభుత్వ పెద్దల దృష్జికి ఎప్పటికప్పుడు తీసుకపోయి, పరిష్కారం చేసుకునెందుకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ వీర్, మండల కిసాన్ సెల్ అధ్యక్షలు రాజేశం గౌడ్, సీనియర్ నాయకులు పల్లె శ్రీనివాస్, చిన్నకోడూర్ సీనియర్ నాయకులు కనకయ్య, తీగల భాస్కర్, పల్లె పర్శరాములు, నిరుగొండ దేవయ్య,కయ్యాల అంజయ్య, గుండెల్లి వేణు, పల్లె ప్రశాంత్, జక్కుల కనకయ్యా, ఎండి షాదుల్, రఫి, పనుగట్ల రామచంద్రము తదితరులు పాల్గొన్నారు.