పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించిన గజ్వేల్ ఏసిపి
సిద్దిపేట జిల్లా:
[Streebuzz news crime journalist]
(గజ్వేల్ 20-పిబ్రవరి ):- గజ్వేల్ ఏసిపి బాలాజీ తన కార్యాలయంలో పెండింగ్ ఉన్న కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు పెండింగ్ ఉన్న కేసుల గురించి సంబంధిత ఎస్ఐ సీఐలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ బాలాజీ మాట్లాడుతూ పారదర్శకంగా కేసుల దర్యాప్తు ఉండాలని, ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. ప్రతి అధికారి తప్పకుండా సంఘటనా స్థలాన్ని సందర్శించాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా కేసులను చేదించి త్వరగా చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. ఫోక్సో, ఎస్సీ ఎస్టీ, మహిళలకు సంబంధించిన కేసులలో ఎలాంటి జాప్యం లేకుండా 60 రోజులలో చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. సైబర్ నేరాల గురించి, మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి గ్రామాలలో పట్టణాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు, గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా జరగకుండా నిరంతరం నిఘా పెంచాలని తెలిపారు. నేరస్తులకు శిక్షలు పడే విధంగా కేసుల ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, తొగుట సిఐ లతీఫ్, తొగుట ఎస్ఐ లింగం, బేగంపేట ఎస్ఐ రవికాంత్ రావు, ములుగు ఎస్ఐ విజయ్, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.
Feb 23 2024, 07:26