*13 డివిజన్ మహిళా అధ్యక్షురాలుగా జన్ను ప్రభావతి*




వరంగల్ జిల్లా:

[  Crime journalist. ]


(వరంగల్):- వరంగల్ నగరంలోని13వ డివిజన్ మహిళ అధ్యక్షురాలుగా జన్ను ప్రభావతిని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ-మురళీధర్ రావు ఆదేశాల మేరకు నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా మహిళ అధ్యక్షురాలు నారగోని స్వప్న-మురళి గౌడ్ తెలిపారు.13వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోట్ల ప్రసాద్ సమక్షంలో 13వ డివిజన్ మహిళ అధ్యక్షురాలుగా జన్ను ప్రభావతికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జన్ను ప్రభావతి మాట్లాడుతూ పార్టీ కోసం 30 సంవత్సరాల నుండి తమవంతు కృషి చేశానని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాక తమ వంతు సహాయం చేశానని, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ-మురళీధర్ రావు, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నారగోని స్వప్న-మురళి గౌడ్, బొట్ల ప్రసాద్ నా కృషిని, పట్టుదలను గుర్తించి డివిజన్ మహిళ అధ్యక్షురాలుగా నిర్మించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ..డివిజన్ అభివృద్ధి కోసం కార్యకర్తలను, మహిళలను అందరిని కలుపుకొని కృషి చేస్తానని తెలిపారు.
*నత్త నడకన మినీ మేడారం జాతర పనులు*




[  Crime journalist ]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:


మొగుళ్ళపల్లి-ముల్కలపల్లి గ్రామాల మధ్యన గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ఈనెల 21 నుండి ప్రారంభం కానుండగా ఇంతవరకు జాతర లో ఎలాంటి పనులు జరగలేదు, గత కొన్ని సంవత్సరాల నుండి మొగుళ్లపల్లి-ముల్కలపల్లి గ్రామాలకు చెందిన డైరెక్టర్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్నారు. కాగా ఈ సంవత్సరం ఇంతవరకు కమిటీ నిర్ణయం కాకపోవడంతో అసలు జాతర నడుస్తుందా లేదా అన్న సందేహాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో రాజకీయ జోక్యం కలుగజేసుకోవడంతో ఇదంతా జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పందించి జాతర కమిటీ విషయాన్ని ఓ కొలిక్కి తీసుకువచ్చి జాతర పనులను ప్రారంభించి వేగవంతం చేసి జాతరను విజయవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
*బీసీ కుల జన గణన అసెంబ్లీలో ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం*



*బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి మరువలేనిది - మార్క అనిల్ గౌడ్ -బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి*


[ Crime journalist ]


(తెలంగాణ రాష్ట్రం):- స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు అట్టడుగు స్థానంలోనే ఉన్నారు. బీసీల జీవితాల్లో నూతన మార్పుకు శ్రీకారం చుట్టిన మొదటి ప్రభుత్వం మన తెలంగాణ.తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే దేశంలో బీసీల అస్తిత్వం బలపడుతుంది. రేపటి దేశ రాజకీయాల్లో నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఒక సంచలనం. బీసీల ఆత్మగౌరవం నేడు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా దేశవ్యాప్తంగా వినబడేలా చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన మార్క అనిల్ గౌడ్.
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్*



*ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్*



*-వాగుల శివారులో ఇసుక అక్రమ రవాణా జరగకుండా జెసిబితో గుంతలు*

*-వినూత్న రీతికి శ్రీకారం చుట్టిన ఎస్ఐ మాధవ్ గౌడ్ కు అభినందనల వెల్లువ*


[  Crime journalist ]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(మొగుళ్ళపల్లి ):-మండలంలోని వాగుల నుండి ఇసుక అక్రమ రవాణా జరగకుండా మొగుళ్లపల్లి ఎస్ఐ. తీగల మాధవ్ గౌడ్ అడ్డుకట్ట వేశారు. మండలంలోని వేములపల్లి గ్రామ శివారులోని గల గునకపల్లి, ఇస్సిపేట గ్రామ శివారులోని వాగొడ్డుపల్లి వాగుల నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఎస్ఐ. తీగల మాధవ్ గౌడ్ గుర్తించారు. దీంతో వాగుల శివారుల నుండి అక్రమంగా ఇసుక తరలకుండా జెసిబి సహాయంతో వాగుల చుట్టూ గుంతలు తీయించారు. కాగా ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ వినూత్న రీతికి శ్రీకారం చుట్టడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ మాట్లాడారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థినీలకు మహిళలకు ఉన్న రక్షణ చట్టాలు, సైబర్ నేరాల కోసం అవగాహన కల్పించిన షీటీమ్ బృందం, పోలీసులు


[ Crime journalist ]

సిద్దిపేట జిల్లా:

(గజ్వేల్ 15-పిబ్రవరి ):- గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్ విద్యార్థినిలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన గజ్వేల్ ఏసిపి ఏ బాలాజీ, గజ్వేల్ సిఐ సైదా, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ, తొగుట సిఐ లతీఫ్ గజ్వేల్ షీటీమ్ బృందం. చదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తావియ్యకూడదు. ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలి.తల్లిదండ్రులను విద్యను నేర్పిన గురువులను జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు. సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి. అపరిచిత వ్యక్తుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్దు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని ఇష్టపడి చదువుకోవాలి. చదువు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకొని ఉద్యోగం సాధించిన వారే అని తెలిపారు.ఈ సందర్భంగా గజ్వేల్ ఏసిపి ఏ. బాలాజీ, మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ గారి ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. షీటీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి, సైబర్ నేరాల గురించి, ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి, ఇవి టీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్ తదితర అంశాల గురించి, సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి, సైబర్ సెక్యూరిటీ, మైనర్ డ్రైవింగ్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి. గతంలో జరిగిన నేరాల గురించి నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి. భరోసా సెంటర్లో ఫోక్సో కేసులలో 18 సంవత్సరాలు లోపు ఉన్న బాలికలకు అందిస్తున్న సేవల గురించి. మహిళలు గృహహింసకు వరకట్నం గురించి శారీరకంగా మానసికంగా హింసించే తదితర అంశాల గురించి స్నేహిత మహిళా సెంటర్లో నిర్వహించే కౌన్సిలింగ్ గురించి వివరించారు. విద్యార్థులు యొక్క గోల్ గురించి. అపరిచిత వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలని అంశాల గురించి. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, మరియు తదితర అంశాల గురించి మరియు చట్టాల గురించి విద్యార్థినిలకు వివరించారు. మరియు ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్ 100,, సిద్దిపేట షిటీమ్ వాట్సప్ నెంబర్ 8712667434 స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ 9494639498, మహిళా పోలీస్ స్టేషన్ సిద్దిపేట 8712667435 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.సైబర్ నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నేరస్తులు పంపే ఏ లింకులు కూడా ఓపెన్ చేయొద్దని, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలోగజ్వేల్ సిఐ సైద, తొగుట సిఐ లతీఫ్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ, కాలేజ్ ప్రిన్సిపల్ శశికళ, అధ్యాపకులు, గజ్వేల్ షీటీమ్ సిబ్బంది శ్రీరాములు, ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుళ్లు శ్యామల, లావణ్య, కానిస్టేబుళ్లు మహేష్, రామచంద్రారెడ్డి. తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ కళాబృందం చే ప్రజలకు అవగాహన కల్పించే కనువిప్పు కార్యక్రమం ‌




[ Crime journalist ]

సిద్దిపేట జిల్లా:

(దౌల్తాబాద్ - 15 ఫిబ్రవరి):- పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం తేదీ: 15-02-2024 రాత్రి దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని " దొమ్మాట గ్రామంలో నిర్వహించారు. మూఢనమ్మకాలు,మంత్రాలు తంత్రాలు, సామాజిక రుక్మతల గురించి రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, హెల్మెట్ వినియోగం, ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో తొగుట సీఐ.లతీఫ్, దౌల్తాబాద్ ఎస్ఐ. శ్రీరామ్, ప్రేమ్ దీప్, పాల్గొన్నారు.ఈ సందర్భంగా తొగుట సిఐ లతీఫ్, మాట్లాడుతూ మూఢనమ్మకాలు నమ్మవద్దు,సైబర్ నేరాలపట్ల ప్రమాదంగా ఉండాలి. మోటార్ సైకిల్ వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. మెజీషియన్ నరేష్ మూఢనమ్మకాలపై అద్భుతంగా మెజీషియన్ చేసి ప్రజల యొక్క అనుమానాలను పటాపంచలు చేశారు. ఈ టెక్నాలజీ ప్రపంచంలో భానుమతి వాళ్లు చేశారు వీళ్ళు చేశారు అంటే నమ్మవద్దు ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రిలో చూపించుకోవాలన్నారు. చిన్నచిన్న తగాదాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు *సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి* *గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* జిల్లాలో చిన్న పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగులు వచ్చినాయని సోషల్ మీడియాలో పుకార్లు, షికార్లు చేస్తున్నారు, అలాంటి వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలోప్రవేశించలేదని,గ్రామాలలో పట్టణాలలో ఎవరైనాఅనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సంఘవిద్రోహశక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినా బ్యాంకు వివరాలు ఏటీఎం కార్డు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పవద్దు.వాట్సప్ కు మరియు ఫోన్ కు ఎలాంటి మెసేజ్ వచ్చిన ఓపెన్ చేయవద్దు స్పందించవద్దు. పోలీస్ కళా బృందం, తెలంగాణ సాంస్కృతిక సారథి సిద్దిపేట రూరల్ టీమ్ కళాకారులతో "కనువిప్పు "అనే కార్యక్రమం ద్వారా మూఢనమ్మకాల పై మరియు మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలు, కుటుంబ కలహాలు గురించి, పేకాట ఆడుట వలన కుటుంబలో జరుగుతున్నపరిణామాలను, వరకట్నం వలన జరుగుతున్న సంఘటనలు గురించి, ఈమధ్య జరుగుతున్న ఆత్మహత్యలు గురించి, మరియు వృద్ధులైన తల్లిదండ్రులను మంచి చూసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ , షీ టీమ్స్ జరుగుతున్న సైబర్ నేరాల గురించి పాటల ద్వారా, సిడిల ద్వారా కళాబృందం సభ్యులు బాలు, రాజు, రవీందర్, తిరుమల, వెంకటాపురం రవి, రవీందర్, ఎల్లయ్య, తిరుమలయ్య, భార్గవి పాటల రూపంలో మరియు నాటకం రూపంలో ప్రజలను చైతన్య పరిచినారు. చిన్నచిన్న ఆస్తి తగాదాలకు పోయిప్రాణాలుతీసుకోవద్దని ఆలోచించకుండా క్షణికావేశంలో చేసే పొరపాట్లు మనిషి జీవితాన్ని మొత్తాన్ని మార్చేస్తాయని ఏదైనా సమస్య ఉంటే గ్రామ పెద్దలతో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని, పరిష్కారం కానిసమయంలో పోలీస్ స్టేషన్ కు రావాలని ఇరువర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.మనిషి కక్షలు కారుణ్యాలతో ఏ పని చేయవద్దని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP. పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయడం బాధితులకు ఉన్న ఒకే ఒక గొప్ప ఆయుధం. టోల్ ఫ్రీ నెంబర్లు 1930, కాల్ చేయాలని సూచించారు. ప్రజలు ఎవరైనా తమ సెల్ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వారు CEIR పోర్టల్ (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ ద్వారా అట్టినెంబర్ను www.ceir.gov.in వెబ్సైటులోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలని, అలా చేసినట్లయితే త్వరగా వారి మొబైల్స్ లను పట్టుకోవడం జరుగుతుందని, దాని గురించి తెలియని వారు మీ సేవ కేంద్రంలో లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరాలు అప్లోడ్ చేసుకోవాలని సూచించారు కావున ప్రజలు ఈ CEIR అప్లికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. గ్రామంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100, లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యం ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పాడి కౌశిక్ రెడ్డి జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో- మార్క అనిల్ గౌడ్ - బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి

మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి పిచ్చికూతలు కూస్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు - మార్క అనిల్ గౌడ్ [ Crime journalist ]

సిద్దిపేట జిల్లా:
(హుస్నాబాద్ నియోజకవర్గం):- మతి గతి తప్పి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి గౌరవ బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్సీగా హుజురాబాద్ నియోజకవర్గంలో నువ్వు అనుసరించిన పద్ధతి నువ్వు మాట్లాడిన మాటలకు ప్రజలు నీ గురించి ఏం మాట్లాడుకున్నారో అందరికీ తెలుసు.విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో 35 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి చిన్న వయసులోనే పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై 39 మంది ఎంపీలకు కన్వీనర్ గా వ్యవహరించి నేడు హుస్నాబాద్ నుంచి గెలుపొంది తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ప్రజా పాలన అందిస్తున్న పొన్నం ప్రభాకర్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. హుజురాబాద్ శాసనసభ ఎన్నికలలో నీ కుటుంబాన్ని అడ్డుపెట్టుకొనిగెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఓటర్లను మానసికంగా ఇబ్బంది పెట్టావు. దయగల ఓటర్లు ఎక్కడ ఈ పిచ్చోడు చచ్చిపోతాడు అని ఓట్లు వేసి గెలిపించారు. ఆ ఓట్లు వేసిన వాళ్లలో ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గం బీసీలదే. అలాంటి బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకున్ని వారి సతీమణిని కలుపుతూ ఊహాజనితంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశావు. బీసీల ఓట్లతో గెలిచిన నువ్వు బీసీ నాయకత్వాన్ని విమర్శించటం సిగ్గుచేటు. దయచేసి మన బీసీ సామాజిక వర్గ ప్రజలు ఇలాంటి వాళ్లకు చట్టసభకు వెళ్లే అవకాశం ఇవ్వకండి. ఇవాళ మన ఓట్లతో గెలిచి మన బీసీ ప్రజా ప్రతినిధిని నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న ఇతని అహంకారానికి తగిన గుణపాఠం చెప్పాలి. పొన్నం ప్రభాకర్ గారి గురించి వారి సతీమణి గురించి తప్పుగా మాట్లాడిన కౌశిక్ రెడ్డి వెంటనే వారి కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు.
అపరిచిత వ్యక్తుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి-మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్



జయశంకర్ భూపాలపల్లి జిల్లా: [  Crime journalist. ]


(మొగుళ్ళపల్లి14-పిబ్రవరి ):- మండల పరిధిలోని ప్రజలు ఎన్నికల పట్ల ప్రమాదంగా ఉండాలని మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ అన్నారు. బుధవారం అయినా విలేకరులతో మాట్లాడారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఎవరైనా అపరిచితులు అనుమానాస్పదంగా కనబడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. దొంగతనాలు, పసి పిల్లల అపహరణ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాత నిరసనపై నిఘా పెంచామని తెలిపారు. అనుమానితులను నూతన టెక్నాలజీ సాఫ్ట్వేర్ సహాయంతో తనిఖీ చేస్తున్నామని, పగలు మరియు రాత్రి సమయాల్లో మాతృతంగా పెట్రోలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి సహకరించాలని సూచించారు.
మొట్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్*

బ్యాంక్ సేవలను వినియోగించుకోండి - బ్యాంక్ మేనేజర్ దిలీప్ కుమార్ [  Crime journalist ]


తెలంగాణ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు 432వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసినట్లు, గురువారం ఏర్పాటు చేయబోయే బ్యాంక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ వై శోభ, ప్రభుదాస్, రీజనల్ మేనేజర్ వేమూరి సాయి కృష్ణ, సీనియర్ మేనేజర్ రాజు విచ్చేయుచున్నారని బ్యాంక్ మేనేజర్ దిలీప్ కుమార్ తెలిపారు. గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు, మహిళా సంఘాలు బ్యాంకు సేవలనువినియోగించుకోవాలని, రైతులకు క్రాఫ్ లోన్స్ మరియు హౌసింగ్ లోన్స్ ఇస్తామని, వినియోగదారులకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తామని, గురువారం ఏర్పాటు చేయబోయే బ్యాంక్ ప్రారంభోత్సవానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, రైతులు, మహిళలు తరలి రావాలని, అందరూ ఆహ్వానితులేనని, బ్యాంక్ లో జీరో అకౌంట్ ఖాతాలు తీసుకోవచ్చన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో గండ్ర జ్యోతికి ఆత్మీయ సన్మానం*



*-శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న కొడారి రమేష్ యాదవ్*

ఆంధ్రప్రదేశ్:

[ Crime journalist ]


(తిరుపతి 14-పిబ్రవరి ):- భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో కలకాలం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ..బిఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి దైవసంకల్పంతో భూపాలపల్లి నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్రగా వెళ్లి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం అక్కడికి వెళ్లిన చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ గండ్ర జ్యోతిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముడుపు రవీందర్, నాయకులు గాజుల శ్రీనివాస్, పసరగొండ లక్ష్మయ్య, పసరగొండ స్వామి, ఇండిగ నర్సింగారావు, గాజుల శంకరయ్య, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.