వ్యాపారాల నుండి దాసరం గుట్టను కాపాడాలని కోరుతూ అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ వారికి వినతి*
[ Streetbuzz News Crime journalist]
[సిద్దిపేట కలెక్టరేట్]
రియలేస్టేట్:
(సిద్దిపేట జిల్లా):- తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ ఉన్న దాసరం గుట్టను కబ్జా చేస్తున్నారని వారి నుండి గుట్టను కాపాడాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బద్దీపడిగా కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం రోజున ప్రజావాణి లో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ కు సీపీఎం అద్వర్యం లో వినతిపత్రాన్ని అందజేశారు.
వందల సంవత్సరాల నుండి దాసారం గుట్ట కొమురవేల్లి మల్లన్న గుడి పరిధి లో ఉందని దీని సర్వేనెంబర్ 305 లో 22 ,ఎకరాల 10 గుంటల భూమి దొరల కాలం నుండి ప్రభుత్వ భూమిని దేవాలయానికి వచ్చే విధంగా చూసేంతవరకు ఈ భూమిని బ్లాక్ లిస్టులో పెట్టాలని కావున దేవాలయం ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా ఈ భూమిని కొమరవెల్లి మల్లన్నకు తీసుకోవాలని అప్పటివరకు ఈ భూమి క్రయవిక్రయాలు జరగకుండా ఆపాలని కొమరవెల్లి మండల అన్ని గ్రామాల నుండి ప్రజలు కోరుకుంటున్నారని కావున సీపీఎం కొమురవెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టులో ఈ భూమిని కొమురవెల్లి మల్లన్నకు కేటాయించాలని కేసు కూడా ఉందని పలుమార్లు దేవాలయ ఈఓ గారిని కలిసి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగిందని, కొమురవెల్లి మల్లన్న వసతి గృహాలకు గుట్ట పైకి వెళ్లే రోడ్లకు దాదాపు 7 కోట్ల రూపాయలు రోడ్లకు ఖర్చు పెట్టినారని అయినా ఆ డబ్బులు వృదా అయినవి తప్ప ఉపయోగం లొకి రాలేదు. ప్రజా ప్రతినిధులు వాళ్ల స్వప్రయోజనాలకు కమిషన్లకు కకృతి పడి మల్లన్నకు భూములు తీసుకోవడంలో విఫలమైనారు , డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు దేవాలయానికి పెద్ద ఆస్తి వచ్చేది కావున ఇప్పటికైనా ప్రభుత్వ వారధిగా ప్రధానంగా అధికారులుగా ఈ భూమిని దేవస్థానానికి వచ్చే విధంగా క్రయవిక్రయాలు జరగకుండా భూమిని బ్లాక్ లిస్ట్లో పెట్టించి కొమురవెల్లి మల్లన్న కు దాసారం గుట్ట ని హిటాచీల ద్వారా గుట్టను పారదోలుతున్నారని కావున తక్షణం ఈ భూమిని మల్లన్న ఆస్తిగా మార్చడం కోసం తగిన ఆదేశాలు ఇచ్చేంతవరకు భూమిని కాపాడడం కోసం సిపిఎం కొమురవెల్లి, మల్లన్న భక్తులను మండలంలోని అన్ని గ్రామాల ప్రజలను ఏకం చేసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కావున ఈ భూమిని బ్లాక్ లిస్టు పెట్టించి క్రయవిక్రయాలు జరగకుండా మన కొమురవెల్లి దేవస్థానానికి తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చి న్యాయం చేయగలరని అలాగే సుమారు పది ఎకరాల భూమి గుట్ట పక్కకు పార్కింగ్ స్థలం ఉపయోగంగా దీని ద్వారా దేవాలయానికి ఆదాయం
వస్తుందని దేవాలయానికి పెద్ద ఆస్తిఅని
దేవాలయంకు అప్పగించాలని వారు కోరారు . ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దాసరి ప్రశాంత్, తడూరి రవీందర్ , తదితరులు పాల్గొన్నారు.
Feb 13 2024, 07:39