రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం - ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ

[Streetbuzz News Crime journalist]

తెలంగాణ రాష్ట్రం:

(సిద్దిపేట 10పిబ్రవరి):- తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 

అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.8% మాత్రమే కేటాయించింది అంటే విద్యారంగానికి 21,389 కోట్ల రూపాయలు కేటాయించింది. గత బడ్జెట్ తో పోల్చినప్పుడు కేవలం 2,296 కోట్లు విద్యారంగానికి పెరిగినట్లు ఉన్నా మొత్తం బడ్జెట్ పోల్చినప్పుడు పెరిగింది, ఇది చాలా తక్కువ, గత విద్యారంగ బడ్జెట్ తో పోల్చినప్పుడు కేవలం 1.31 % మాత్రమే పెంచారు. ఈ నిధులతో ప్రస్తుతం ప్రభుత్వ విద్య యే మాత్రం అభివృద్ధి కాదని ఎస్ఎఫ్ఐ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినట్లు ప్రతి మండలంలో తెలంగాణ మోడల్ ఇంటర్నేషనల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పినా కేటాయించింది 500 కోట్ల రూపాయలు మాత్రమే, 500 కోట్లతో ఎలా వీటిని నిర్వహిస్తారని ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తుంది. రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలనలో యూనివర్శీటీలు దెబ్బతిన్నాయి.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెస్ ,భవనాలు, ఖాళీల భర్తీ, మౌళిక సదుపాయాలు కల్పిస్తామని ప్రతి యూనివర్శీటీకి అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పారు. ఉస్మానియా కు 1000కోట్లు ,మహిళ యూనివర్శీటీఅభివృద్ధి కోసం నిధులు నిర్వహణ, బాసర ఐఐఐటి అభివృద్ధి, అలాగే సిద్దిపేట జిల్లా లో గత ప్రభుత్వం మినీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపు లేదు ? ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలలో నూతన యూనివర్శీటీలు కోసం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ యూనివర్శీటీలు అభివృద్ధి కోసం 500కోట్లు మాత్రమే కేటాయించారు. రాష్ట్రంలో ఉన్న 11 రాష్ట్ర యూనివర్శీటీలకు కనీసం నిర్వహణకు కూడా నిధులురావు. ఒక్క ఉస్మానియా యూనిర్శీటీకే 350 కోట్లు పైగా నిర్వహణకు అవసరం. కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, జెఎన్టీయుహెచ్, ఫైన్ ఆర్ట్స్, మహిళా యూనివర్శీటీ, అగ్రికల్చర్ యూనివర్శీటీ, వెటర్నరీ, హర్టీకల్చర్ లాంటి వాటికి నిధులు కేటాయింపులు లేవు.,తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రకారం బాసర ఐఐఐటిల లాగా మరో రెండు కేటాయిస్తామని చెప్పి వాటి గురించి కూడా ప్రస్థావన లేదు?

- పాఠశాల విద్యారంగ లో ఖాళీలు భర్తీ ,మధ్యాహ్న భోజనం నిధులు, ఏకోపాధ్యాయ పాఠశాలలు, నూతన భవనాలు, లైబ్రరీ, ముత్రశాలలు ,మౌళిక సదుపాయాలు కోసం ఈ నిధులు సరిపోవని ఎస్ఎఫ్ఐ భావిస్తోంది.

గురుకులాలు నిర్మాణం కోసం 1546కోట్లు కూడా సరిపోవని 800 పైగా గురుకూలాలకు స్వంత భవనాలు లేవని, ఉన్న గురుకులాలు కూడా సరైన మౌళిక సదుపాయాలు లేవు.ఈబడ్జెట్లో గత ఆరేళ్ళ నుండి పెండింగ్ ఉన్న స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ 7200 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి విడుదల కోసం నిధులు కేటాయించలేదు? గురుకులాలు, కెజిబివిలు, సంక్షేమ వసతిగృహలకు గత సంవత్సరం నుండి మెస్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి. వాటి నిధులు గురించి కూడా ప్రస్తావన లేదు. అందుకే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా కాకుండా 15% నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని చెప్పి 7.8% నిధులు మాత్రమే కేటాయించారు. నిధులను పెంచి‌ ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. లేకపోతే విద్యార్థులను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఎస్ఎఫ్ఐ తెలిపింది.ఈ కార్యాక్రమంలో SFI సిద్దిపేట జిల్లా కమిటీ

రెడ్డమైన అరవింద్

జిల్లా అధ్యక్షుడు

దాసరి ప్రశాంత్,

SFI జిల్లా కార్యదర్శి

(9652946701) పాల్గొన్నారు.

ఆదివారం హుస్నాబాద్ లో జరగవలసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సమావేశాలు రద్దు

[Streetbuzz News Crime journalist]

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మనవి. 

సిద్దిపేట జిల్లా:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తేదీ 11-2-2024 ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు జరగాల్సిన మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి సమావేశాలు అనివార్య కారణాల వల్ల రద్దు కావటం జరిగింది. మళ్ళీ తిరిగి సమావేశాల తేదీ ప్రకటిస్తామని తెలియ జేస్తున్నామని తెలిపిన సమాచార నిమిత్తం గౌరవ తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి గారి కార్యాలయం.

AP NEWS: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం


[Streetbuzz News Crime journalist]

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో మినీలారీ, కావేరి ట్రావెల్స్ బస్సుని ట్రాలీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జైంది. ఇద్దరు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయారు. తీవ్రగాయాలైన వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది

ఇదేమన్న...కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకున్నవా.- జగ్గారెడ్డి*

[Streetbuzz News Crime journalist]

మా ప్రభుత్వం కూల్చితే కూలాడానికి..మీరు కట్టిన కాళేశ్వరం అనుకుంటున్నారా.? 

అంతర్యుద్ధం మా పార్టీలో కాదు...హరీష్ తో మీ పార్టీలోనే వస్తోంది చూసుకో..! 

కామారెడ్డి లో తోపు అనుకున్న కేసీఆర్ ఎందుకు తుస్సు అన్నాడో మొదలు సమాధానం చెప్పు 

ప్రశాంత్ రెడ్డి 

 ప్రోటోకాల్ విషయంలో BRS ప్రభుత్వం దారిలోనే మేము.

 జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు 

ప్రశాంత్ రెడ్డి మీ హరీష్ రావు దగ్గర కాళేశ్వరం డబ్బులు ఉన్నాయి 

60 కోట్లు పంచి గెలిచాడు 

నా దగ్గర 60 కోట్లు ఉంటే పట్ట పగలు చుక్కలు చూపెట్టే వాణ్ణి 

మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీ అభ్యర్థి గెలిచాడు 

పేద ప్రజలను మభ్య పెట్టి 

మీ అభ్యర్థి గెలిచాడు 

నా దగ్గర 60 కోట్లు ఉంటే మీకు డిపాజిట్ వచ్చేది కాదు

మీ కాళేశ్వరమే.. ఇద్దరు ENC ల సస్పెన్షన్ వరకు వచ్చింది 

ప్రశాంత్ రెడ్డి..నీ బుర్రకు ఇప్పుడైనా ఎక్కిందా..? 

ఉత్తమ్..జగ్గారెడ్డి..రేవంత్..

శ్రీదర్ బాబు..జీవన్ రెడ్డి లాంటి వాళ్ళం టార్గెట్ లీడర్స్ ఉన్నాం

మీ దగ్గర కాళేశ్వరం ఉండే.. మా దగ్గర ఏముంది అప్పులు తప్పా.

హరీష్ నల్లధనం ఎక్కడ పెట్టారో సీఎం కి చెప్తా

లెక్కలు బయటకు రావాలి 

9 ఏండ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ కామారెడ్డి లో ఎందుకు ఓడిపోయారు..?

 కేసీఆర్ తోపు అంటారు కదా.. తోపు ఎందుకు తుస్సు అయ్యాడు 

 ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పు 

ఎదుటి వాడు ఏమంటారో ఆలోచించి మాట్లాడు ప్రశాంత్ 

ఎక్కువ మాట్లాడితే.. అన్నీ బయటకు తిస్తాం

మీ దగ్గర MLA లు.. సీఎం ని కలిసే వాళ్ళా 

కేటీఆర్..హరీష్ దగ్గరికి పోయే వాళ్ళు 

మీ MLA లు మా దగ్గరికి వస్తే సీఎం ని కలుస్తారు 

మల్లారెడ్డి కూడా మా దగ్గరకు రావచ్చు 

 ఇప్పుడు ఆయన మాట్లాడటం లేదు కదా 

20 మంది MLA లు వచ్చి తీరుతారు 

మా ప్రభుత్వం ను పడేస్తాం అంటున్నారు మీరు .. 

అందుకే 20 మంది MLA లు వస్తున్నారు

మా ప్రభుత్వాన్ని కూల్చడం అంటే... కూలి పోయే కాళేశ్వరం కట్టినట్టు అనుకుంటున్నవా 

నాసిరకం సిమెంట్ తో కట్టినట్టు కాదు 

130 ఏండ్ల పునాది కాంగ్రెస్ ది 

మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి 

జగ్గారెడ్డి కి పదవులు అవసరం లేదు 

నేను కాంగ్రెస్ కి ఆయుధం 

ఆయుధం కి పదవులు అవసరం లేదు 

మీకు పోస్టులు ఉంటేనే లీడర్స్  

నాకు బ్యాక్ గ్రౌండ్ లేకుండా లీడర్ అయ్యా 

జగ్గారెడ్డి ఒక బ్రాండ్ 

మీలెక్క ఎవరో పేరు చెప్పి నాయకుడిని కాలేదు

అంతర్యుద్ధం మా దగ్గర కాదు.. మీ పార్టీలో జరిగి తీరుతుంది 

 మీ పార్టీ లో కేసీఆర్ కి వెనక నుండి గడ్డపార గుచ్చాడానికి హరీష్ సిద్ధంగా ఉన్నాడు

రెండు నెలల్లో 15 కోట్ల మంది మహిళలు RTC బస్సు లో తిరిగారు 

535 కోట్లు మహిళల ఉచిత ప్రయాణం కోసం ఖర్చు చేసింది

 మాతో యుద్ధం కి రావడానికి ముందు ముస్లిం లకు ఇస్తాం అన్న 12 శాతం రిజర్వేషన్ ఇచ్చారా..? 

ST ల రిజర్వేషన్లు ఏమైంది..?

నిరుద్యోగ భృతి ఇస్తా అని ఇవ్వలేదు 

దానిమీద రాజకీయ దాడి చేస్తాం 

మేము ఊరుకుంటామా 

మేము చేస్తుంటే మీరు బురద జల్లుతున్నారు 

మీరు చేయని పనుల పై మేము కూడా నిలదీస్తాం 

మా పార్టీ కార్యకర్తలు కూడా నిలదిస్తారు

ప్రోటోకాల్ ఇవ్వడం లేదు అని BRS అంటుంది 

రాజకీయంగా మీరు మాకు నేర్పిన విద్య 

 మీ దారిలోనే మేము ప్రయాణం చేస్తున్నాం 

 ప్రోటోకాల్ లో మీరు వేసిన దారిలోనే మేము

. మీరు 9 ఏండ్లు మాకు పెట్టిన ఇబ్బందులు మేము పెట్టము 

మీ అంత మూర్ఖులం మేము కాదు 

మీరు మమ్మల్ని పోలీసులతో గడ్డపార తో పొడిచినట్టు పొడవం.. సూదితో పొడుస్తాం 

కాంగ్రెస్ కి ఎంత చేత నవుతుందో మీరే చూస్తారు 

ప్రశాంత్ రెడ్డి కి ఏం తెలుసు.. కేసీఆర్ రాసిన స్క్రిప్టు చడవడమే కదా..?

రేవంత్ కి చెప్తున్నా.. 

బీజేపీ వాళ్ళు..BRS కి ఏదో ఒకటి చేయండి అని లేపుతారు 

మా జాగ్రత్తలు మాకు ఉంటాయి

ఎస్, బి,ఐ బ్యాంక్ లో భారీ చోరి

[Streetbuzz News Crime journalist]

కాకినాడ జిల్లా :

(ప్రత్తిపాడు మండలం):- ఉత్తరకంచి ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. సుమారు రూ. 30 లక్షల నగదు,రూ. కోటిన్నర విలువ చేసే బంగారం అపహరణకు గురైంది. బ్యాంక్ వెనుక భాగంలో కిటికీ డ్రిల్స్ను గ్యాస్ కట్టర్తో తొలగించి దుండగులు బ్యాంకులోకి చొరబడినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ సతీష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఏపీలో *డీఎస్సీ* నోటిఫికేషన్ విడుదల

BIG BREAKING NEWS:

 

[Streetbuzz News Crime journalist]

6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

 2,280 SGT పోస్టులు

 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు

 1264 టీజీటీ పోస్టులు

 215 పీజీటీ పోస్టులు

 42 పిన్సిపల్ పోస్టులు

ఈ నెల 12 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది

ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తాం - మంత్రి బొత్స

ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ జంగా కృష్ణ మూర్తి ఆత్మీయ సమావేశం

[Streetbuzz News Crime journalist]

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ జంగా కృష్ణ మూర్తి ఆత్మీయ సమావేశం

భారీ ర్యాలీగి గురజాల నియోజకవర్గ నలుమూలల నుండి తరలి వచ్చిన జంగా అభిమానులు

సమావేశంలో జంగా కృష్ణ మూర్తి కామెంట్స్

పేద కుటుంబానికి చెందిన తనని ఇంతగా ఆదరించిన వారికి జంగా కృతజ్ఞతలు తెలిపారు

తన ఆవేదన పంచుకోవటానికే ఆత్మీయ సమావేశం ఏర్పాటు :జంగా

1999 శాసన సభ్యుడిగా 

ఉన్న రోజు నుండి నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉన్నాను 

బడుగు బలహీన వర్గాలకు సేవ చేసా కనుకే ఇంతగా ఎదిగా :జంగా

1998లో పార్లమెంట్ ఎన్నికల్లో రోశయ్య సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం జరిగింది అని అన్నారు

నియోజకవర్గంలో బిసి అభ్యర్ధి ఉంటే బాగుంటుందని రోశయ్య,జనార్దన్ రెడ్డి సీటు ప్రకటించరు

ఆరోజు గెలుపు కాంగ్రెస్ పార్టీ, నా యస్సి,యస్టి,బిసీల కృషి

1999లో ప్రతిపక్షంలో ఉన్నాము

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణం సమయంలో జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి చేయాలని పాదయాత్ర చేసాం :జంగా

ఆరోజుల్లో జండా పట్టుకున్న సమయంలో నవ్విన వ్యక్తులు ఈరోజు నియోజకవర్గం లోపెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చవిచూసాను కాని ఎక్కడ భయపడలేదు

2017 వరకు కార్యకర్తల కోసం పనిచేసి వారికి అండగా ఉన్న, అనేక కేసులు బరించా

వైసీపీ కోసం బీసి వర్గాల కోసం రాష్ట్ర మంతటా పాదయాత్ర చేసా

2019 ఎన్నికల ముందు MLC ఇస్తానంటే ఎన్నికల్లో చేయనని ఎన్నికల తర్వాత ఇవ్వమన్న వ్యక్తి కాసు మహేష్ రెడ్డి అని ఆరోపించారు

పిడుగురాళ్ల బహిరంగ సభలో నియోజకవర్గాన్ని గెలిపించుకుంటామని మాట నిలబెట్టుకున్నామని అన్నారు

ఎన్నికల అనంతరం నాలుగు సంవత్సరాలు కనీసం ఏ కార్యక్రమానికి పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు

అనేక ఇబ్బందులు గురిచేసారని నా దగ్గరకు వచ్చిన వారిని ఇబ్బందులు పెట్టడం చేసారు

పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారిని పక్కడపెట్టి తన ఆదాయం కోసం, వ్యపారాల కోసం నడుస్తున్నారు

గామాలపాడులో ఆసరా కార్యక్రమానికి సర్పంచ్ అయిన తన కుమారుడికి కనీసం సమాచారం ఇవ్వకుండా అవమానించారు

10సంవత్సరాలు ఏ ఒక్క అధికారి నైనా , పోలీసులలైనా కొట్ట మని చెప్పానా

నేడు మన పార్టీకి సంబందించిన కౌన్సిలర్ ని పోలీస్ స్టేషన్లో కొట్టించడం ఏమిటి అని ప్రశ్నించారు

బిసి సామాజిక వర్గం వ్యక్తి పై ఇంతడి దుర్మార్గమా అని అన్నారు

నేడు నియోజకవర్గ పరిస్థితి దృష్ట్యా చాలా బాదగా ఉందన్నారు

 వైసీపీ పెద్దల దృష్టిలో కి తీసుకు వెల్లిన్నా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు

రాబోయే రోజుల్లో ప్రజల ఆకాంక్ష తో నా రాజకీయ ప్రస్థానం మొదలైందో ఆ ఆశయాల కోసం ముందు సాగుతానన్నారు

నేడు వస్తున్న కధనాలను ఖండించారు

నా పోరాటం ఆత్మగౌరవ పోరాటం అన్నారు 

 తెదేపా లో చేరతాడని అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు

ఈ సమావేశం నా ఆవేదన పంచుకోవటానికి , ఆత్మీయుల సలహాలకోసం అన్నారు

భవిష్యత్తు లో తీసుకునే నిర్ణయానికి నా వెన్నంటే ఉంటారని ఆకాంక్షించారు

నా నైజం నమ్మిన వ్యక్తులకు మోసం చెయ్యడం కాదని నమ్మితే ప్రాణమైనా ఇస్తాన్ననారు

వారి లాగా ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య ఏరుదాటాక బోడి మల్లయ్య అనడం కాదన్నారు

ఎవరు భయపడవద్దని మీకు నేను అండగా ఉన్నానన్నారు

ఎన్నికల్ల సమయంలో అందరూ వస్తారని తరువాత పట్టించుకోరని కానీ జంగా అలాకాదు ఎప్పుడు ఓకే లాగే ఉంటాడు

ఎవరైతే మీకు అండగా ఉంటారో వారికి అండగా ఉండాలన్నారు.

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటన పై హర్షం వ్యక్తం చేసిన పిడిశెట్టి రాజు

ప్రధాని నరేంద్రమోడీ కీ కృతజ్ఞతలు తెలిపిన 

- సామజిక కార్యకర్త, పివి సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు

[Streetbuzz News Crime journalist]

సిద్దిపేట జిల్లా : 

హుస్నాబాద్ నియోజకవర్గం:

 

(కోహెడ మండలం 09 ఫిబ్రవరి ) :- భారతదేశ నూతన ఆర్థిక సంస్కరణల పితామాహుడు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీ భారత దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న వరించడం పట్ల ప్రముఖ సామాజిక కార్యకర్త, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పిడిశెట్టి రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మేధావులు, తెలుగు తొలి ప్రధాని పివి నరసింహారావు కీ భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. విశిష్ట పండితుడు మరియు రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు, శాసనసభ సభ్యునిగా చేసిన కృషిని ఆయన సమానంగా గుర్తుంచుకుంటారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలకపాత్ర పోషించింది, దేశం యొక్క శ్రేయస్సు మరియు అభివృద్ధికి బలమైన పునాది వేసింది. ప్రధానమంత్రిగా నరసింహారావు పదవీకాలం భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్లకు తెరిచిన ముఖ్యమైన చర్యలతో గుర్తించబడింది, ఇది ఆర్థిక అభివృద్ధి యొక్క కొత్త శకాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంకా, భారతదేశం యొక్క విదేశాంగ విధానం, భాష మరియు విద్యా రంగాలకు ఆయన అందించిన సహకారం భారతదేశాన్ని క్లిష్టమైన పరివర్తనల ద్వారా నడిపించడమే కాకుండా దాని సాంస్కృతిక మరియు మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన నాయకుడిగా అతని బహుముఖ వారసత్వాన్ని నొక్కి చెబుతుంది.

ఆ మహానుభావుడికి మరియు మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పీతామాహుడు ఏం ఏస్ స్వామినాథ్ లకు భారతరత్న ప్రకటన పట్ల భారత కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేస్తూ గతంలో పివికి భారతరత్న ఇవ్వాలనీ వంగర నుండి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కీ 2019లో వినతిపత్రం సమర్పించామని, వారిపై ఉన్నా గౌరవం, భక్తితో ప్రస్తుతం కోహెడ మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో పీవీ నరసింహారావు కాలనీ, మార్గ్ పెట్టడం జరిగిందనీ రాజు పేర్కొన్నారు.

ఇసుక అక్రమ రవాణా పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు*

ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రజ్ఞాపూర్ గ్రామ శివారు రాజీవ్ రహదారి, గౌరారం గ్రామ శివారు రాజీవ్ రహదారి పక్కన అక్రమంగా డంపు చేసిన ఇసుకను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు

[Streetbuzz News Crime journalist]

సిద్దిపేట జిల్లా:

గజ్వేల్ నియోజకవర్గం:

(వర్గల్ ఫిబ్రవరి 09) :- శుక్రవారం మధ్యాహ్నం సమయమున ప్రజ్ఞాపూర్ గ్రామ శివారు రాజీవ్ రహదారి, గౌరారం గ్రామం గ్రామ శివారులో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక డంపు చేసినారని నమ్మదగిన సమాచారం పైసిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది వెళ్లి ఇసుక డంపులను గుర్తించి  గజ్వేల్ పోలీసులకు, గౌరారం పోలీసులకు అప్పగించిన సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు సంబంధిత పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.

ఇసుక డంపు చేసిన నిందితుల వివరాలు

1. గుడికందుల నరేందర్, ప్రజ్ఞాపూర్ గ్రామం

2. గుడికందుల గణేష్, దాతర్ పల్లి, గజ్వేల్ మండలం.

3. బక్కల యాదగిరి, గ్రామం రాయరం, మండలం కుకునూరుపల్లి.

4. శ్రీరామ్ కృష్ణ, గ్రామం ప్రజ్ఞాపూర్.

5. గోపాల్ కృష్ణ, గ్రామం దాతర్ పల్లి, మండలం గజ్వేల్.

6. మామిండ్ల స్వామి, గ్రామం వర్గల్.   

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థినీ విద్యార్థులకు దంత పరిక్షలు నిర్వహించిన కామినేని దంత కళాశాల వైద్యులు

[Streetbuzz News Crime journalist]

నల్లగొండ జిల్లా:

(నకిరేకల్ నియోజకవర్గం):- కామినేని దంత వైద్య కళాశాల వైద్యులు నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కట్టంగూర్ పాఠశాల విద్యార్థులకు దంత వైద్య పరీక్షను నిర్వహించారు .

6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు సుమారు 380మందిబాలబాలికలకుదంతవైద్యపరీక్షలను నిర్వహించారు.అందులో సుమారు 140 మంది విద్యార్థులకుదంత సమస్యలను గుర్తించారు. వారికి వచ్చేవారం కామినేని దంత వైద్య కళాశాలలో దంత చికిత్సలు చేస్తామని వైద్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ అంబటి అంజయ్య, దంతవైద్యులు పాల్గొన్నారు.