గరిడేపల్లిలో మెడికల్ క్యాంపును సందర్శించిన డి ఎం హెచ్ ఓ డాక్టర్ కోటాచలం
సూర్యాపేట జిల్లా :-గరిడేపల్లిలో మెడికల్ క్యాంపును సందర్శించిన డి ఎం హెచ్ ఓ డాక్టర్ కోటాచలం
సూర్యాపేట జిల్లా :-
గరిడేపల్లి మండలం,కల్మలచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సర్వారం గ్రామంలో గత కొద్దీ రోజులుగా విష జ్వరం కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా శనివారం రోజు సూర్యాపేట జిల్లా మెడికల్ అధికారి (డిఎంహెచ్ఓ) డాక్టర్ కోటాచలం, జిల్లా మాస్ మీడియా అధికారి అంజయ్య గౌడ్ తో కలిసి సర్వారం గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును సందర్శించడం జరిగింది. వారు మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటివరకు 74 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 17 మందికి డెంగ్యూ వ్యాధిగా నిర్ధారణ అయింది అని డాక్టర్ సింహచలం చెప్పారు.మరియు గ్రామంలో మురికినీటి కాల్వలను మరియు వాటర్ ట్యాంక్ గేట్ వాల్వును ను పరిశీలించారు ముఖ్యంగా డ్రైనేజీలలో త్రాగు నీటి పైపులు మురికి కాలువలలో మునిగి ఉండి నీరు కలుషితం అయ్యి మరియు కాలువలలో మురికి నీరు నిలువ ఉండడం వలన దోమలు వృద్ధి చెంది జ్వరాలు ప్రబలుతున్నాయన్నారు పారిశుధ్య లోపం లోపించింది అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి పరిసరాల పరిశుభ్రత మరియు వ్యాధులపై అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.గరిడేపల్లి గ్రామంలో జ్వరాలు తగ్గేవరకు మెడికల్ క్యాంపును కొనసాగించాలని వైద్యాధికారిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్ కుమార్ డాక్టర్ శృతి, మాస్ మీడియా అధికారి అంజయ్య గౌడ్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరాజు ,హెచ్ ఇ ఓ రామకృష్ణ,సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, గ్రామ సె క్రటరీ బాలాజీ, ఏఎన్ఎం అనిత, ఆశా కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
.
Feb 10 2024, 19:25