భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటన పై హర్షం వ్యక్తం చేసిన పిడిశెట్టి రాజు
ప్రధాని నరేంద్రమోడీ కీ కృతజ్ఞతలు తెలిపిన
- సామజిక కార్యకర్త, పివి సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు
[Streetbuzz News Crime journalist]
సిద్దిపేట జిల్లా :
హుస్నాబాద్ నియోజకవర్గం:
(కోహెడ మండలం 09 ఫిబ్రవరి ) :- భారతదేశ నూతన ఆర్థిక సంస్కరణల పితామాహుడు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీ భారత దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న వరించడం పట్ల ప్రముఖ సామాజిక కార్యకర్త, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పిడిశెట్టి రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మేధావులు, తెలుగు తొలి ప్రధాని పివి నరసింహారావు కీ భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. విశిష్ట పండితుడు మరియు రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు, శాసనసభ సభ్యునిగా చేసిన కృషిని ఆయన సమానంగా గుర్తుంచుకుంటారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలకపాత్ర పోషించింది, దేశం యొక్క శ్రేయస్సు మరియు అభివృద్ధికి బలమైన పునాది వేసింది. ప్రధానమంత్రిగా నరసింహారావు పదవీకాలం భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్లకు తెరిచిన ముఖ్యమైన చర్యలతో గుర్తించబడింది, ఇది ఆర్థిక అభివృద్ధి యొక్క కొత్త శకాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంకా, భారతదేశం యొక్క విదేశాంగ విధానం, భాష మరియు విద్యా రంగాలకు ఆయన అందించిన సహకారం భారతదేశాన్ని క్లిష్టమైన పరివర్తనల ద్వారా నడిపించడమే కాకుండా దాని సాంస్కృతిక మరియు మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన నాయకుడిగా అతని బహుముఖ వారసత్వాన్ని నొక్కి చెబుతుంది.
ఆ మహానుభావుడికి మరియు మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పీతామాహుడు ఏం ఏస్ స్వామినాథ్ లకు భారతరత్న ప్రకటన పట్ల భారత కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేస్తూ గతంలో పివికి భారతరత్న ఇవ్వాలనీ వంగర నుండి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కీ 2019లో వినతిపత్రం సమర్పించామని, వారిపై ఉన్నా గౌరవం, భక్తితో ప్రస్తుతం కోహెడ మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో పీవీ నరసింహారావు కాలనీ, మార్గ్ పెట్టడం జరిగిందనీ రాజు పేర్కొన్నారు.
Feb 10 2024, 06:29