బెల్ట్ షాపుల తో మహిళలపై పెరుగుతున్న నేరాలు.మునుగోడు తరహాలో బెల్టు షాపులను ఎత్తివేయాలి.
బెల్ట్ షాపుల తో మహిళలపై పెరుగుతున్న నేరాలు
మునుగోడు తరహాలో బెల్టు షాపులను ఎత్తివేయాలి.
రౌండ్ టేబుల్ సమావేశంలో. జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి పిలుపు.
.
నల్గొండ జిల్లా:-
మిర్యాలగూడ.
విచ్చలవిడి మద్యంతో జిల్లాలో నేరాలు పెరిగిపోతున్నాయని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం బెల్టు షాపులను ఎత్తివేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి యు టి యఫ్.రాష్ట్ర కార్యదర్శి నాగమణి డిమాండ్ చేశారు.
గురువారం నాడు మిర్యాలగూడ కార్యాలయంలో "విచ్చలవిడి బెల్టు షాపులు-పెరుగుతున్న నేరాలు" అనే అంశంపై ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి యు టి యఫ్.రాష్ట్ర కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ.నూతన ఆదాయ మార్గాలను సృష్టించాల్సిన పాలకులు మద్యాన్ని ఆధారంగా చేసుకొని మద్యం పైన వచ్చే ఆదాయం ఆధారంగా ప్రభుత్వాలు నడపడం అనేది దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన విచ్చలవిడి బెల్ట్ షాపుల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో పసిపిల్లల నుండి మొదలుకొని పండు ముసలి వరకు 'మధ్యమనే' వ్యసనానికి లోనై మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారని వారన్నారు. విచ్చలవిడి మద్యం అమ్మకాల ద్వారానే మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని వారన్నారు. మునుగోడు నియోజకవర్గం లో బెల్టు షాపు లేని వ్యవస్థను అక్కడ ఎమ్మెల్యే తీసుకురావడం శుభ పరిణామం అన్నారు. మునుగోడు తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం బెల్ట్ షాప్ నిషేధిత పాలసీని తీసుకొచ్చిఎత్తివేయాలని కోరారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారికి వాస్తవంగా ఎలాంటి ఉపాధి అవకాశాలు లేనట్లయితే అలాంటి వారికి ప్రభుత్వం మరో మార్గం ద్వారా ఆదాయ వనరులను సమకూర్చుకునే విధంగా వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.బెల్ట్ షాపులో ఎత్తివేత కోసం జిల్లావ్యాప్తంగా కార్యాచరణ చేపట్టి బెల్ట్ షాపుల నిషేధిత ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని వారన్నారు.
ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలే బోయిన వరలక్ష్మి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో.
హెచ్ఎం అరుణకుమార నాగమణి, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి బంటు కవిత,టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీ సభ్యురాలు మట్టమ్మ,సీనియర్ నాయకురాలు గాద పద్మ,
ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి గోవర్ధన,
జిల్లా కమిటీ సభ్యురాలు నాగమణి,
జిల్లా కమిటీ సభ్యురాలు
పూలమ్మ,జిల్లా కమిటీ సభ్యురాలు శాంతమ్మ,టౌన్ అధ్యక్షురాలు ఊర్మిళ,హుస్సేన్,కృష్ణవేణి,
సరిత,మంగ,తదితరులు పాల్గొన్నారు.
పోలెబోయిన వరలక్ష్మి
జిల్లా అధ్యక్షులు.
మిర్యాలగూడ.
Feb 09 2024, 10:11