*బోసిపోతున్న గ్రామపంచాయతీలు వెల వెల..! స్పెషల్ ఆఫీసర్లు రారు..సిబ్బంది ఉండరు

[ Streetbuzz News Crime journalist ]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(మొగుళ్ళపల్లి) :-గత జనవరి నెల 31 తో గ్రామపంచాయతీ సర్పంచుల పాలన కాలం గడువు ముగిసిపోయింది. దీంతో ప్రత్యేక అధికారులను ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయించారు. ఈ క్రమంలో స్పెషల్ ఆఫీసర్లు కాని రావడం లేదు. గ్రామపంచాయతీ సిబ్బంది కూడా ఉండడం లేదు. దీంతో మొగుళ్ళపల్లి మండలంలోని గ్రామపంచాయతీలు అన్ని వెల వెల బోతున్నాయి. గతంలో పనిచేసిన సర్పంచ్ లు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక అవస్థలను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మారినప్పటికీ సర్పంచుల దౌర్భాగ్య పరిస్థితి నేటికి మిగిలే ఉంది.

మొగుళ్లపల్లి పీహెచ్సీలో ఏడు పోస్టుల ఖాళీలు

[Streetbuzz News Crime r]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(మొగుళ్లపల్లి ఫిబ్రవరి 08):- మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహిళా సూపర్వైజర్ పోస్టులు రెండు, మేల్ సూపర్వైజర్ పోస్ట్ ఒకటి, మేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు మూడు, స్టాఫ్ నర్స్ పోస్ట్ ఒకటి ఖాళీలుగా ఉన్నాయి. ఈ కాళీ పోస్టులను భర్తీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇటీవల కాలంగా ప్రబలుతున్న నూతన వైరల్ ప్రభావం ప్రభంజిస్తున్న తరుణంలో జనం జడుసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని జనం కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్లపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ప్రజా సమస్యలను తీర్చిదిద్దాలనికోరుతున్నారు.

కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా లింగారావు!పార్టీ ఉనికి లేనప్పప్పుడే సింగిల్ విండో చైర్మన్ గా

[Streetbuzz News Crime Journalist]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(మొగుళ్లపల్లి) :- రంగాపురం గ్రామానికి చెందిన పోలినేని లింగారావు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా వ్యవహరించారు. మండలంలో పార్టీ ఉనికి లేనప్పుడు పిఎసిఎస్ చైర్మన్ గా తొమ్మిది సంవత్సరాలు కొనసాగారు. ఎన్,ఎస్,యు, ఐ తో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన డిగ్రీలో వివిధ పదవులను చేపట్టారు. ఎన్ ఎస్,యు, ఐ లో జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ మెంబర్ గా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు.ఆసమయంలోనే మొగుళ్ళపల్లి సింగిల్ విండో చైర్మన్ గా పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ క్రమంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి క్రాఫ్ లోన్స్, సబ్సిడీ ఎరువులను అందజేసి రైతాంగానికి తోడ్పడ్డారు. 9 సంవత్సరాల కాలంలో ఆయన రైతుల మన్ననలు పొందడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గెలుపు కోసం మండలంలోని ముఖ్యులను కలిసి విజయ బావుటాను ఎగురవేశారు.

బీసీల పట్ల నాడు వివక్ష నేడు జ్యోతి పూలే పేరుతో కవిత కొత్త రాజకీయం

గౌడ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్ 

[Streetbuzz News Crime Journalist]

తెలంగాణ రాష్ట్రం:- 10 సంవత్సరాల కేసిఆర్ పాలనలో బీసీలకు న్యాయం జరిగిందా కవిత గారు?తమరు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో జ్యోతి పూలే విగ్రహాన్ని పెడితే ఎవరైనా వద్దన్నారా?దయచేసి జ్యోతి పూలే లాంటి మహాత్ముల పేరుతో రాజకీయాలు మానుకొని ఆత్మ విమర్శ చేసుకొని గతంలో తమరు బీసీల పట్ల ఎలాంటి విధానాన్ని అనుసరించారు గుర్తు చేసుకోండి?బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడమే కాకుండా బీసీ బందు పేరుతో బీసీ కులాల్లో చిచ్చుపెట్టారు?తెలంగాణలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ ఆలోచించండి బీసీల పేరుతో రాజకీయం చేసే ఇలాంటి వాళ్లను రాజకీయ సమాధి చేయండి.

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన

సింగన్నగూడ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన గజ్వేల్ ఏసిపి యం. రమేష్, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, గజ్వేల్ షీటీమ్ బృందం

 సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి

 అపరిచిత వ్యక్తుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్దు

తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని ఇష్టపడి చదువుకోవాలి

చదువు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు

 ప్రభుత్వ,ప్రైవేటుఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకొని ఉద్యోగం సాధించిన వారే 

[Streetbuzz News Crime journalist]

సిద్దిపేట జిల్లా:

(ములుగు ఫిబ్రవరి 07);- సింగన్నగూడ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన గజ్వేల్ ఏసిపి యం. రమేష్, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, గజ్వేల్ షీటీమ్ బృందంఈ సందర్భంగా గజ్వేల్ ఏసిపి యం. రమేష్ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. షీటీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి, సైబర్ నేరాల గురించి, ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి, ఇవి టీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్ తదితర అంశాల గురించి, సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి, సైబర్ సెక్యూరిటీ, మైనర్ డ్రైవింగ్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి. గతంలో జరిగిన నేరాల గురించి నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి. భరోసా సెంటర్లో ఫోక్సో కేసులలో 18 సంవత్సరాలు లోపు ఉన్న బాలికలకు అందిస్తున్న సేవల గురించి. మహిళలు గృహహింసకు వరకట్నం గురించి శారీరకంగా మానసికంగా హింసించే తదితర అంశాల గురించి స్నేహిత మహిళా సెంటర్లో నిర్వహించే కౌన్సిలింగ్ గురించి వివరించారు. విద్యార్థులు యొక్క గోల్ గురించి,అపరిచిత వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలని అంశాల గురించి,యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, మరియు తదితర అంశాల గురించి మరియు చట్టాల గురించి విద్యార్థినిలకు వివరించారు. మరియు ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్ 100, నెంబర్ కు సిద్దిపేట షిటీమ్ వాట్సప్ నెంబర్ 8712667434 స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ 9494639498, మహిళా పోలీస్ స్టేషన్ సిద్దిపేట 8712667435 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.సైబర్ నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నేరస్తులు పంపే ఏ లింకులు కూడా ఓపెన్ చేయొద్దని, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, స్కూల్ హెడ్మాస్టర్ మహమ్మద్ అబ్దుల్ రహీమ్,

అధ్యాపకులు,గజ్వేల్ షీటీమ్ సిబ్బంది శ్రీరాములు, ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుళ్లు శ్యామల, లావణ్య, కానిస్టేబుళ్లు మహేష్, రామచంద్రారెడ్డి.తదితరులు పాల్గొన్నారు.

గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి- 16న జరిగే సమ్మె గ్రామీణ బందును జయప్రదం చేయాలి

[Streetbuzz News Crime journalist]

సిద్దిపేట జిల్లా:

(కొండపాక):- కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా 2024 ఫిబ్రవరి16న అఖిల భారత స్థాయిలో కార్మికుల సమ్మె గ్రామీణ బందుకు పాల్గొంటామని తెలియజేస్తూ ఉమ్మడి కొండపాక మండల ఎంఈఓ శ్రీనివాసరెడ్డి మరియు తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ కి మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు ఉమ్మడి మండల కార్యదర్శి అమ్ముల బాల నర్సయ్య మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 /- వేలు నిర్ణయించి అమలు చేయాలని కార్మికుల్ని బానిస తత్వంలోకి నెట్టే 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని మధ్యాహ్న భోజన నిర్వహణ స్వచ్చంద సంస్థలకు ఇచ్చే నిర్ణయం ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం వాటాల అమ్మకం ప్రైవేట్ పరం చేయడం ఆపాలని,కేంద్ర స్కీంలకు బడ్జెట్ తగ్గించవద్దు, స్కీం వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల ఆహారవస్తులపై జిఎస్టి ఉపసంహరించాలని నూతన విద్యా విధానం 2022 చట్టాన్ని రద్దు చేయాలని గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని అవసరమైన గ్యాస్ ను సబ్సిడీకి ఇవ్వాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు గుడ్డుకు 8 రూపాయలు పెరిగినందున అధానంగా బడ్జెట్ ఇవ్వాలని కోరారు.లేనియెడల పిల్లలకు రెండే రోజులు గుడ్లు పెడదామని తెలియజేశారు. గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలి ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని అక్రమ తొలగింపులు అరికట్టాలని రాజకీయ వేధింపులు ఆపాలని వంట షెడ్డు వంట పాత్రలు మౌలిక వసతులు కల్పించాలని కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలని సామాజిక భద్రత కల్పించాలని ప్రమాద బీమా పి ఎఫ్ ఈ ఈ ఎస్ ఐ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ 16న జరిగే సమ్మెలో మేము సైతం పాల్గొంటున్నామని తెలియజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు కృష్ణ,ఉప్పలయ్య,పుష్ప,అరుణ,కలవ్వ అనిత, అంసవ్వ, తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ చలాన్ వున్న వాహనదారులు రాష్ట్ర ప్రభుత్వ రాయితీని తేది 15-02-2024 వరకు సద్వినియోగం చేసుకోండి -గజ్వేల్ ఏసిపి రమేష్

[Streetbuzz News Crime Journalist]

సిద్దిపేట జిల్లా:

•15వ తేదీ తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులను గుర్తించి మొత్తం డబ్బులు కట్టించడం జరుగుతుందని కావున ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి .ఈ అవకాశం వాహనదారులు 15వ తేదీ చివరి రోజు కావున వాహనదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపిన యం. రమేష్, గజ్వేల్ ఏసిపి. 

(గజ్వేల్ నియోజకవర్గం):- ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ గజ్వేల్ డివిజన్ పరిధిలో ఈ-చలాన్ పెండింగ్ వున్న వాహనదారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భారీరాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ-చాలన్ డబ్బులు పెండింగ్ ఉన్న వాహనదారులు ఆన్ లైన్ ద్వారానే పెండింగ్ చలాన్ డబ్బులు చెల్లించాలి.

ఈ చాలన్ సిస్టమ్ ద్వారా అన్ని పెండింగ్ చలన్ లు చెల్లించాలి.

 ఆన్లైన్ అనగా ఫోన్ పే & పే టీం ఏం & గూగుల్ పే వంటి సేవలు ఉపయోగించుకోవచ్చు.లేదా మీ సేవ ఈ సేవ లో చెలించవచ్చు.

 [తేదీ: 15-02-2024 వరుకు ట్రాఫిక్ చాలన్ లకు రాయితీ వర్తిస్తుంది]

ద్విచక్ర వాహనలకు 80% శాతం రాయితీ ,ఆర్టీసీ బస్సులు ఆటోలకు, తోపుడు బండ్లపై 90% శాతం రాయితీ,నాలుగు చక్రాల వాహనాలకు, లారీలకు, భారీ వాహనాలకు 60% శాతం రాయితీ.

చెల్లింపులు అన్ని ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి

echallan.tspolice.gov.inతెలంగాణ ఈ చాలన్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.ఈ-చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులు 15-02-2024 వరకు డిస్కౌంట్ చలానాల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, వాహనాలపై ఎలాంటి జరిమానా లేకుండా చూసుకోవాలని సూచించారు.ఫిబ్రవరి,15 తారీకు తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ-చాలన్ పెండింగ్ వాహనదారులను గుర్తించి పెండింగ్ ఉన్న మొత్తం డబ్బులను కట్టించడం జరుగుతుందని ఏసిపి ఒక ప్రకటనలో తెలిపిన యం. రమేష్అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గజ్వేల్.

ఫిబ్రవరి 16దేశవ్యాప్త కార్మికులసమ్మె, గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని కరపత్రాలు పంపిణీ

బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను ఎంగడదాం! హమాలీ వెల్ఫేర్ బోర్డు సాధనకై ఐక్యంగా పోరాడుదాం!! *దేశవ్యాప్త సమ్మె-గ్రామీణభారత్ బంద్ ను జయప్రదం చేద్దాం - అమ్ముల బాలనర్సయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు

[Streetbuzz News Crime journalist]

సిద్దిపేట జిల్లా:

(ఉమ్మడి కొండపాక 07-02-2024) :-  కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ,కార్మికుల విధానాలను వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై ఇంటింటికి వెళ్లి బుధవారం రోజు మాత్ పల్లి, తిప్పారం తిమ్మారెడ్డిపల్లి గ్రామాలలో కరపత్రాలు పంపిణీ చేశారు.ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదంచేయాలని సిఐటియు, రైతు,వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు.ఈ సంద్బంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాలనర్సయ్య మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారానికొచ్ఛి 10సం.లు పూర్తయిన కార్మికవర్గ,రైతాంగ,వ్యవసాయ కార్మికుల,ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కార్మికులకు,రైతులకు ఇచ్చిన హామీలు చేయకపోగా కార్మికవర్గం దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చేందుకు.ఈ కొడ్స్ అమల్లోకి వస్తే సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు కనీస వేతనాలు నిర్ణయించి హక్కు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం తెచ్చిన 2008 సామాజిక భద్రత చట్టాన్ని అటకెక్కించిందన్నారు.4 కొడ్స్ తెచ్చి కార్మికుల హక్కులను కాలరాసిందన్నారు.వామపక్ష పార్టీల పోరాటల ఫలితంగా వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. గ్రామీణ పేదలకు ఉన్న ఉపాధికి బడ్జెట్ తగ్గించారు. 200రోజులు పని కల్పించి, రోజు కూలీ రూ.600లు ఇవ్వాలనే డిమాండును ఖాతరు చేయటం లేదన్నారు..రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చెల్లిస్తామన్న హామీని బిజెపి ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు.రైతు వ్యతిరేక 3 చట్టాల తెచ్చిన సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు.ఇప్పటికైన అన్ని రకాల కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26000/- వేలు ఇవ్వాలని,హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుచేసి సంక్షేమ పథకాలు అమలుచేయాలని 50 సంవత్సరాలు పైబడిన హమాలీలకురూ.10000/-లు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ పరిస్థితుల్లో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక,రైతాంగ,ప్రజా వ్యతిరేకవిధానాలు,మతతత్వ ధోరణులకు నిరసనగా ఫిబ్రవరి 16న జరుగుతున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ బంద్ లో రైతులు,వ్యవసాయ కార్మికులు, కార్మికులు లక్షలాదిగా పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మర్కుకు పోశయ్య భోగి సాయికుమార్ ఫొటోల నరహరి బొల్లం ఆమ్మూర్తి, ముద్దపురం ఎల్లయ్య అశోక్ కృష్ణ లక్ష్మణ్ లక్ష్మి పుష్ప అరుణ అనిత కలవ అంశవ్వ ఉప్పలయ్య కవిత తదితరులు పాల్గొన్నారు.

GHMC లో అన్ని అంశాల పై సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించాము -మంత్రి పొన్నం ప్రభాకర్

[Streetbuzz News Crime journalist]

(హైదరాబాద్ ఫిబ్రవరి 07):- GHMC అభివృద్ధి పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది.వచ్చే సమ్మర్ లో నీటి ఎద్ధడికి ఎలాంటి సమస్య లేదు.త్రాగునీటి సమస్య లేకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసాము.GHMC లో రెవెన్యూ పెంచుకోవడానికి ప్రత్యేక పాలసితో ముందుకు వెళ్ళబోతున్నం.మూసీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు ఉంటాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తాము.

అర్బన్ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం తీసుకునే ఆలోచనలో మా ప్రభుత్వం ఉంది.కేంద్ర ప్రభుత్వంతో మాకు ఎలాంటి విబేధాలు లేవు.అభివృద్ధిలో కేంద్రాన్ని కలుపుకొని వెళ్తాము.

హైదరాబాద్ అభివృద్ధి పై రోజూ వారీగా సమీక్షలు, సమస్యల పై రిపోర్ట్ తయారీ ఉంటుంది.GHMC పరిధిలో అధికారులు అలెర్ట్ గా ఉండాలని సూచన చేసాము.అప్పులు - ఆస్తులు అంశాల పై ముఖ్యమంత్రి కి నివేదిక ఇవ్వనున్నాము.గత ప్రభుత్వం తరహాలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు నిధుల కేటాయింపు ఉంటుంది.GHMC సమస్యల పై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని ఆదేశించాము.డబుల్ బెడ్ రూమ్ ల పై త్వరలోనే ప్రభుత్వం పాలసీ ప్రకటన చేస్తుంది.GHMC త్రాగునీటి అంశంలో రాజకీయ అపోహలు మాత్రమే,ఎలాంటి సమస్యలు లేవు.వచ్చే సమ్మర్ లో సిటీలో త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాదు.అధికారుల సమన్వయం కోసం ప్రత్యేకంగా Osd నీ నియమిస్తున్నాం.

ప్రజాసేవలో ముందంజ అబినందిస్తున్న ప్రజలు

•మొగుళ్ళపల్లి ఎస్ఐ మాధవ్ గౌడ్ కు ప్రశంస •

[జయశంకర్ భూపాలపల్లి జిల్లా Crime journalist]

వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ ను మండల ప్రజలు అభినందిస్తున్నారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు గోదావరిఖనిలో విద్యనభ్యసించిన ఆయన ఎంబీఏ విద్యను హైద్రాబాదులో కొనసాగించారు. జనవరి 1, 1986నపోచమ్మ-వెంకటస్వామి గౌడ్ దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన ఆయన 2014 బ్యాచ్ లో ఎస్ఐగా ఎంపికై హైద్రాబాద్ గ్రేహౌండ్స్ లో ఏడు సంవత్సరాలు పని చేశారు. విధి నిర్వహణలో భాగంగా 2023లో రేగొండ సివిల్ సెకండ్ ఎస్ఐగా విధులను నిర్వహించిన ఆయన 2024 జనవరి 14న మొగుళ్ళపల్లి ఎస్ఐగా విధుల్లో చేరారు. తన అభివృద్ధికి తోడ్పడింది అమ్మ నాన్న లే అని ఆయన తలుచుకుంటున్నారు. ఆయన మొగుళ్ళపల్లి మండలంలో విధుల్లో చేరినప్పటి నుంచి ప్రజాసేవకుఅంకితమయ్యారు. ప్రజా సమస్యలు తీర్చడంలో ఆయన ముందుండివ్యవహరిస్తున్నారు. దీంతో మండల ప్రజలు ఆయననుఅభినందిస్తున్నారు.