ప్రజాసేవలో ముందంజ అబినందిస్తున్న ప్రజలు

•మొగుళ్ళపల్లి ఎస్ఐ మాధవ్ గౌడ్ కు ప్రశంస •

[జయశంకర్ భూపాలపల్లి జిల్లా Crime journalist]

వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ ను మండల ప్రజలు అభినందిస్తున్నారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు గోదావరిఖనిలో విద్యనభ్యసించిన ఆయన ఎంబీఏ విద్యను హైద్రాబాదులో కొనసాగించారు. జనవరి 1, 1986నపోచమ్మ-వెంకటస్వామి గౌడ్ దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన ఆయన 2014 బ్యాచ్ లో ఎస్ఐగా ఎంపికై హైద్రాబాద్ గ్రేహౌండ్స్ లో ఏడు సంవత్సరాలు పని చేశారు. విధి నిర్వహణలో భాగంగా 2023లో రేగొండ సివిల్ సెకండ్ ఎస్ఐగా విధులను నిర్వహించిన ఆయన 2024 జనవరి 14న మొగుళ్ళపల్లి ఎస్ఐగా విధుల్లో చేరారు. తన అభివృద్ధికి తోడ్పడింది అమ్మ నాన్న లే అని ఆయన తలుచుకుంటున్నారు. ఆయన మొగుళ్ళపల్లి మండలంలో విధుల్లో చేరినప్పటి నుంచి ప్రజాసేవకుఅంకితమయ్యారు. ప్రజా సమస్యలు తీర్చడంలో ఆయన ముందుండివ్యవహరిస్తున్నారు. దీంతో మండల ప్రజలు ఆయననుఅభినందిస్తున్నారు.

మాత రమాబాఘనంగాయి అంబేద్కర్ జయంతి వేడుకలు - పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన - సామజిక కార్యకర్త, పీవీ సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు


సిద్దిపేట జిల్లా Crime Journalist:

(హుస్నాబాద్ నియోజకవర్గం ఫిబ్రవరి 07) :- కోహెడ మండలం మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు ప్రముఖ సామజిక కార్యకర్త, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు

ఆధ్వర్యంలో నిర్వహించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రైవేట్ హాస్పిటల్ లోని రోగులకు పండ్లు, బ్రేడ్ లు పంపిణీ చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ త్యాగాల తల్లి మాతా రామా భాయి కోట్లాది ప్రజల హక్కులు కోసం అంబేద్కర్ చేసిన పోరాటాలకి ఏ మాత్రం ఆటంకం కలిగించ కుండా పిడకలు అమ్మి కుటుంబాన్ని పోషించి,అన్ని విధాలా అంబేద్కర్ కి అండగా ఉండి ఎంతో కఠినమైన పేదరికాన్ని అనుభవించి తన బిడ్డల అనారోగ్యానికి మందులు కొనటానికి డబ్బులు లేక వైద్యం ఇప్పించలేక తన ముగ్గురు కొడుకులను కన్నా ఒక్క కుమార్తెను కోల్పోయి తను కూడా అనారోగ్యంతో వైద్యానికి డబ్బులు లేక చనిపోతూచావులు నాకు కొత్త కాదు ఇప్పటికే ముగ్గురు కొడుకులను ఒక కుమార్తెను కోల్పోయాను. నా ఆరోగ్యం కూడా క్షీణించింది కనీసం మిగిలిన ఒక్క కుమారుడనైన మంచిగా చూడు అని తన భర్త అంబేద్కర్ కి లేఖ వ్రాసి ప్రాణాలు విడిచిన త్యాగాల తల్లి మాత బాయీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సుతారీ కనుకయ్య, కాంటాస్టేడ్ ఎమ్మెల్యే మరాఠీ మణిదీప్, కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు పద్మారెడ్డి, గంగాధర్ రమేష్, తిరుపతి, బుమయ్య, సంపత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్ లో టిఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ల పాసింగ్ అవుట్ పెరేడ్

[హైదరాబాద్ Crime Journalist]

(హైదరాబాద్):- కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్ లో టిఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ల పాసింగ్ అవుట్ పెరేడ్

ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీ.సీ. సజ్జనార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు. మరోయుమంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజల సంస్థ ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద 800 మందికి పైగా నియామకాలు ఇవ్వడం జరుగుతుంది.ఇది నిరంతర ప్రక్రియ.అందులో భాగంగా ఈరోజుకొంతమంది కానిస్టేబుల్ లకి నియామక పత్రాలు ఇచ్చారు.ఆర్టీసీ సంస్థను తిరిగి తెలంగాణ ప్రజలకు నంబర్ 1 రవాణా సంస్థగా ఉంచే ప్రయత్నం జరుగుతుంది.గతంలో కరోనా , సమ్మె కారణంగా ఆర్టీసీ కి పలు సమస్యలు ఏర్పడ్డాయి. వాటన్నిటిని అదిగమించడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటుంది.నూతనంగా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఉచితంగా మహిళలకు ప్రయాణం అందిస్తున్నాం.

ఇప్పటి వరకు 14 న్నర కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. అక్యూపెన్సీ రేషియో బస్ స్టాండ్ లు ఖాళీగా ఉన్న పరిస్థితి నుండి బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో నూతన బస్సుల కొనుగోలు ,నూతన సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది.ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ సహకారంతో ఏండి మార్గదర్శకంలో ముందుకు పోతున్నాం.ప్రజలంతా సహకరించాలి.దేశ వ్యాప్తంగా రైల్వే ఏ విధంగా ఉపయోగ పడుతుందో పేద ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలకు గమ్యానికి చేర్చే వ్యవస్థ రాష్ట్ర రవాణా లో ఆర్టీసీ పాత్ర కీలకమైంది.

ఆర్టీసి మనందరిది దానిని మనం కాపాడుకోవాలి. ఆర్టీసీ ని ముందుకు తీసుకుపోవడంలో అందరి సలహాలు కోరుతూ ఆర్టీసీ సంస్థను ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నము చేస్తున్నామని తెలిపారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటూ మాట్లాడుతూ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న ప్రతిపక్షాలను ఏం చేయాలి? ప్రజలదే నిర్ణయం

  హుస్నాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు - మార్క అనిల్ గౌడ్

[సిద్దిపేట జిల్లా Crime Journalist]

(హుస్నాబాద్):- గత ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు స్వాగతించారు తమ నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు ఓట్ల ద్వారా బలాన్ని సమకూర్చారు. నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీలు ఏవైనా నాయకులు ఎవరైనా ప్రజా తీర్పును గౌరవించాలి. పదేపదే ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు ప్రజా ప్రభుత్వాన్నికూలదోయాలనే కుట్రతో ప్రజా తీర్పును అగౌరవపరుస్తూ ప్రభుత్వం కూలిపోతుంది అని అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు. అలాంటి పార్టీలకు నాయకులకు గుణపాఠం చెప్పాలంటే ప్రజా ఆయుధం ఓటు ద్వారా మరొకసారి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో జీవితకాలం గుర్తుండేలా ప్రజా తీర్పు ఎలా ఉంటుందో దెబ్బ రుచి చూపించి ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షించబడాలంటే ప్రజలే రథసారదులుగా మారి ప్రజల నిర్ణయాన్ని అగౌరవపరిచే పార్టీలను నాయకులను ప్రజా జీవితం నుంచి తరిమికొట్టాలి.

విద్యార్థి దశనుండే లోకజ్ఞానం కలిగి ఉండాలి - గజ్వేల్ ఏసిపి రమేష్

•మండల ప్రజా పరిషత్ స్కూల్లో విద్యార్థుల అభివృద్ధి అవగాహన సదస్సు•

[సిద్దిపేట జిల్లా Crime Journalist]

(గజ్వేల్ నియోజకవర్గం)

(గజ్వేల్ ):- విద్యార్థి దశనుండే లోకజ్ఞానం కలిగి ఉండాలి అని, విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని గజ్వేల్ ఏసిపి రమేష్ అన్నారు, మంగళవారం గజ్వేల్ లో మండల ప్రజా పరిషత్ స్కూల్లో ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రసన్న ఆధ్వర్యంలో విద్యార్థుల అభివృద్ధి అవగాహన సదస్సు నిర్వహించారు అతిథిగా గజ్వేల్ ఏసిపి రమేష్ హాజరయ్యారు, అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రుల తో ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని వసతులున్న గవర్నమెంట్ స్కూల్లో తల్లిదండ్రులు చేర్పించాలని వారన్నారు, ప్రైవేటు స్కూలుకు దీటుగా గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నదని వారన్నారు

 తల్లిదండ్రులు గుర్తించవలసింది ఇంత చిన్న పిల్లని చదువు చెప్పడానికి గైడ్ చేసుకుంటుంది అంటే మి తల్లిదండ్రులకు అదృష్టం

ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ వ్యవసాయం చేసేవాళ్లేకాద కాబట్టి మీరు మీ పిల్లలకు ఎంకరేజ్ చేయాలి మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలను కూడా తీసుకొచ్చి జైన్ చేయించాలి 

జయాపజయాలకు కృంగి పోకుండా ,విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని వారన్నారు, విద్యార్థి దశనుండే లోకజ్ఞానం కలిగి ఉండాలి అని, విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అన్నారు చదువు పై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,విద్యార్థులు సోషల్ మీడియాల కు బానిసలు కాకుండా తగు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారన్నారు, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు తల్లిదండ్రుల పెంపకం చాలా ముఖ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ యశస్విని ప్రొజెక్టర్స్ విద్యార్థులకు అందజేశారు, లయన్స్ క్లబ్ పరమేశ్వర స్పోర్ట్స్ మెటీరియల్ విద్యార్థులకు అందజేశారు స్కూల్ ఉపాధ్యాయులు పాపారావు. శారద. కౌన్సిలర్ బొగ్గుల చందు .విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు

విద్యుత్ మీటర్ రీడర్లకు సహకరించండి - ట్రాన్స్ కో ఏ ఈ అడ్డగట్ల ప్రమోద్

[జయశంకర్ భూపాలపల్లి జిల్లా Crime journalist]

(మొగుళ్ళపల్లి):- గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందుటకు మండలంలోని విద్యుత్ వినియోగధారులు నేటి నుండి మీ గ్రామాలలో మీటర్ రీడింగ్ తీసేటువంటి స్పాట్ బిల్డర్స్ కు మీ యొక్క రేషన్ కార్డ్ మరియు ఆధార్ కార్డులను చూపించి మీ యొక్క సర్వీస్ నెంబర్ కు అనుసంధానం చేసుకొవాలని ట్రాన్స్ కో ఏ ఈ అడ్డగట్ల ప్రమోద్ విద్యుత్ వినియోగధారులకు సూచించారు.

యావత్ తెలంగాణలోనే ఏకైక టెక్నికల్ సెంటర్ కేంద్రంగా వరంగల్ పలించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొండా సురేఖ కృషి

కొండాసురేఖచిత్రపటానికిఅభిమానులపాలాభిషేకం

[వరంగల్ Crime Journalist] :- యావత్ తెలంగాణలోనే ఏకైక టెక్నికల్ సెంటర్ కేంద్రంగా వరంగల్ జిల్లాను ఎంపిక చేయడంలో అటవీ, పర్యావరణ దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన కృషి జీవితాంతం మర్చిపోలేనిదని కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ముఖ్య నాయకులు నల్గొండ రమేష్ గౌడ్ అన్నారు. మంగళవారం రూ:200 కోట్లతో వరంగల్ లో స్థాపించేందుకు రాష్ట్ర మంత్రి వర్గాన్ని ఒప్పించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి వరంగల్ సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నారగోని స్వప్న మురళి గౌడ్ నేతృత్వంలో కొండా దంపతుల అభిమానులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నల్గొండ రమేష్ మాట్లాడారు. వరంగల్ నగర పురోగతికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ..వేలాదిమంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వరంగల్ జిల్లాలో టెక్నికల్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి కొండా సురేఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 20 టెక్నికల్ సెంటర్ లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా.. అందులో ఒక టెక్నికల్ సెంటర్ (హబ్) ను వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ లోని రంగశాయిపేటలో ఏర్పాటు చేసేందుకు మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మంత్రి కొండా సురేఖ పట్టుదలతో విశేష కృషి చేశారన్నారు. టెక్నికల్ సెంటర్ ఏర్పాటు వరంగల్ జిల్లా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. పట్టుదలతో వరంగల్లో టెక్నికల్ సెంటర్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించిన మంత్రి కొండా సురేఖను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలంతా మనసారా అభినందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కుండా దంపతుల అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలి-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు

[జయశంకర్ భూపాలపల్లి జిల్లా Crime journalist]:-

సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలినేని లింగారావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని..బాల్క సుమన్ చెప్పుతో కొడతానని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మండిపడ్డారు. బాల్క సుమన్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. తన స్థాయిని మరిచి బాల్క సుమన్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బాల్క సుమన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం

[ నల్లగొండ జిల్లా Crime Journalist]

(నకిరేకల్ నియోజకవర్గం):-

1). నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన దుబ్బాక సోమిరెడ్డి గారు అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..

2). అనారోగ్యంతో బాధపడుతు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన మోరోజు గోవిందమ్మ గారిని పరామర్శించి, ప్రస్తుత ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు..

3).నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన నోముల యాదగిరి గారు అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..

ప్రైమ్ 9న్యూస్ చానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఏసిపి రమేష్

[Crime journalist సిద్దిపేట జిల్లా]

(గజ్వేల్ నియోజకవర్గం):- సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను గజ్వేల్ ఏసిపి రమేష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వారికి మరియు యాజమాన్యానికి ప్రేక్షకులకు శుభాభినందనలు తెలిపారు. మీడియా రంగంలో తమకంటూ స్థానం కల్పించుకుంటూ ప్రైమ్ 9 ఛానల్ ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.