ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటూ మాట్లాడుతూ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న ప్రతిపక్షాలను ఏం చేయాలి? ప్రజలదే నిర్ణయం
హుస్నాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు - మార్క అనిల్ గౌడ్
[సిద్దిపేట జిల్లా Crime Journalist]
(హుస్నాబాద్):- గత ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు స్వాగతించారు తమ నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు ఓట్ల ద్వారా బలాన్ని సమకూర్చారు. నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీలు ఏవైనా నాయకులు ఎవరైనా ప్రజా తీర్పును గౌరవించాలి. పదేపదే ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు ప్రజా ప్రభుత్వాన్నికూలదోయాలనే కుట్రతో ప్రజా తీర్పును అగౌరవపరుస్తూ ప్రభుత్వం కూలిపోతుంది అని అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు. అలాంటి పార్టీలకు నాయకులకు గుణపాఠం చెప్పాలంటే ప్రజా ఆయుధం ఓటు ద్వారా మరొకసారి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో జీవితకాలం గుర్తుండేలా ప్రజా తీర్పు ఎలా ఉంటుందో దెబ్బ రుచి చూపించి ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షించబడాలంటే ప్రజలే రథసారదులుగా మారి ప్రజల నిర్ణయాన్ని అగౌరవపరిచే పార్టీలను నాయకులను ప్రజా జీవితం నుంచి తరిమికొట్టాలి.
Feb 07 2024, 19:17