madagoni surendar

Feb 07 2024, 17:30

శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల పోస్టర్ ను ఆవిష్కరచిన.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,నకిరేకల్ ఎమ్మెల్యే

శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల పోస్టర్ ను ఆవిష్కరచిన.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం.

నల్గొండ జిల్లా:-నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని ఈ నెల 14 నుండి 21 వరకు అత్యంత వైభవంగా జరిగే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల పోస్టర్ ను హైదరాబాద్ సెక్రటేరియట్ లో అవిష్కరించిన.తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల నిర్మాణ, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.ఈ కార్యక్రమంలో. నకిరేకల్ నియోజకవర్గ నాయకులు, ఆలయ ఈవో,ప్రధాన అర్చకులు తదితరులు.

.

madagoni surendar

Feb 07 2024, 17:12

మెట్రో ట్రైన్ లో ప్రయాణించిన రాష్ట్రపతి

న్యూ ఢిల్లీ :-మెట్రో ట్రైన్ లో ప్రయాణించిన రాష్ట్రపతి

న్యూ ఢిల్లీ :-

చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ వికాస్‌ కుమార్‌ కూడా రాష్ట్రపతితో కలిసి ప్రయాణించారు.

ఈ సందర్భంగా మెట్రో ప్రయాణం గురించిన వివరాలను రాష్ట్రపతికి వికాస్‌ కుమార్‌ వివరిం చారు. ఆమె కొందరు అధికారులతో కలసి ఖాళీ బోగీలో ప్రయాణిస్తున్న 27 సెకన్ల వీడియో నెట్లో వైరల్ అవుతోంది.

అయితే రాష్ట్రపతి ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ప్రయాణించారు, ఎందుకు ప్రయాణించారు వంటి వివరాలు మాత్రం తెలియరాలేదు..

madagoni surendar

Feb 07 2024, 10:48

తెలంగాణలో 9వేల అంగన్వాడి టీచర్లు, హెల్పేర్ల నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో 9వేల అంగన్వాడి టీచర్లు, హెల్పేర్ల నోటిఫికేషన్ జారీ

హైదరాబాద్::-

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 9,వేల అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అనుమతించిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయనున్నారు.

గతంలో అంగన్‌వాడీ టీచర్ల పోస్టులకు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉండేది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఉపాధ్యాయులతో పాటు హెల్పర్లుగా నియమితులైన వారు కనీసం ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

అదేవిధంగా, వయోపరి మితి 18 నుండి 35 సంవత్సరాలు.. 65 సంవత్సరాలు దాటిన తర్వాత వారి సేవలను పొందకూడదు. విద్యార్హత మార్కులు, స్థానికత, ఇంటర్వ్యూ మొదలైన వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

తెలంగాణలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో అంగన్వాడీ టీచర్‌తోపాటు, హెల్పర్ ఉంటారు. గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైనవారు రాజీ

madagoni surendar

Feb 06 2024, 12:51

భారత్‌ రైస్‌' ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌.. ₹29కే కిలో బియ్యం

డిల్లీ :-భరత్ రైస్ ' ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌.. ₹29కే కిలో బియ్యం

దిల్లీ: దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం రంగం సిద్ధం చేసింది. 'భారత్‌ రైస్‌' (భారత్ రైస్ ) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న (మంగళవారం) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

₹29కే కేజీ భారత్‌ రైస్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ దిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. భారత ఆహార సంస్థ (ఫ్ సి ఐ) నుంచి సేకరించిన 5లక్షల టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(యన్ ఏ ఫ్ ఇ డి ), భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (యన్ సీసీఫ్ ), కేంద్రీయ భండార్‌ విక్రయ కేంద్రాల ద్వారా తొలి విడతలో విక్రయించనున్నారు.ఈ రైస్‌ను 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే భారత్‌ గోధుమపిండి కిలో రూ.27.50, భారత్‌ శనగ పప్పును రూ.60 చొప్పున నాఫెడ్‌బజార్‌.కాం తదితర ఈ-కామర్స్‌ వేదికల్లో విక్రయాలకు మంచి స్పందన వస్తుండగా.. భారత్‌ రైస్‌కు సైతం అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.

madagoni surendar

Feb 06 2024, 11:34

నివాళులుఅర్పించిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్ సుంకరబోయిన నరసింహ్మ యాదవ్

నివాళులుఅర్పించిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట,కట్టంగూర్ మాజీ జడ్పీటీసీ నరసింహ్మ యాదవ్

నల్గొండ జిల్లా :-నకిరేకల్ మండల పాలెం గ్రామానికి చెందిన నోముల యాదగిరి మృతిచెందంగా వారి మృతదేవానికి పూలమాలలు వేసి నివాళులుర్పించి అనంతరం.కుటుంబ సభ్యులను పరామర్శించిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్, కట్టంగూర్ మాజీ జడ్పీటీసీ సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,

madagoni surendar

Feb 05 2024, 19:39

సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్

హైదరాబాద్ :--సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్

నేను ఒకటే చెప్తాన కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విస్మరించిన బిఆర్ఎస్ నాయకులను.కానీ వేరే పార్టీ నాయకుడు వారు ఎమ్మెల్యే అయినా ఎంపీ. అయినా గాని..మన పార్టీ కోసం కష్టపడ్డ గ్రామ.మండల నియోజకవర్గ.జిల్లా స్థాయి నాయకులను కార్యకర్తలను కాదని ఎవరన్నా నాయకుడు తన సొంత ప్రయోజనాల కోసం బిఆర్ఎస్ నాయకులను పార్టీలోకి తీసుకొని వస్తే తగు చర్యలు ఉంటాయి.ఫస్టు లోకల్ గా ఉండే మన పార్టీ కార్యకర్తలతో సమావేశమై అడిగి తెలుసుకుని మన కార్యకర్త ఆ(వేరే పార్టీల) వ్యక్తి మన పార్టీలోకి వద్దు అంటే అంటే అసలు చేర్చుకోవద్దు అలా కాకుండా కార్యకర్తతో నాకేం అవసరం నేను మండల నాయకుడిని కదా జిల్లా నాయకుడిని కదా నేను చేర్చుకుంటా పార్టీలో అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పరిణామాలు వేరేలా ఉంటాయి జాగ్రత్త రాష్ట్ర జిల్లా మండల్ నాయకులు.

madagoni surendar

Feb 05 2024, 19:22

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి తెలంగాణ శ్రీశైలంగా పేరుపోందిన చెర్వుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాల రివ్యూ సమావేశంలో.నకిరేకల్ ఎమ్మెల్యే

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి

తెలంగాణ శ్రీశైలంగా పేరుపోందిన చెర్వుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాల రివ్యూ సమావేశంలో పాల్గొన్న

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా :-నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి., అనంతరం ఈనెల 14 నుండి 21 వరకు అత్యంత వైభవంగా జరిగే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల రివ్యూ మీటింగ్ లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు..

వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ :-

బ్రహోత్సవములకు తెలంగాణ రాష్ట్రం నుండి నలుమూలలుగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు..

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పాలొన్ని ఈ బ్రహోత్సవములను విజయం చేయాలి

గుట్ట పైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు.

ఏక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అన్ని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

.

madagoni surendar

Feb 05 2024, 15:14

నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత 38 వ వార్డు కౌన్సెలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండ జిల్లా.:-

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో జరిగిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక

నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత 38 వ వార్డు కౌన్సెలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి...

జనవరి 8 న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని కోల్పోయిన బీఆర్ఎస్..

బుర్రి శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ గా ఎన్నుకున్న మెజారిటీ కౌన్సిలర్లు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్ట మొదటగా అవిశ్వాస తీర్మానంతో నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్..

madagoni surendar

Feb 05 2024, 13:11

మూడేళ్ల చిన్నారిపై కామాంధుడి అఘాయిత్యం. స్థానికుల దేహశుద్ధి పోలీసులకు అప్పగింత

మూడేళ్ల చిన్నారిపై కామాంధుడి అఘాయిత్యం.

స్థానికుల దేహశుద్ధి పోలీసులకు అప్పగింత

హైదరాబాద్ :- కామా తురాణం న భయం న లజ్జ.. అని పెద్దలు చెప్పారు. కామం నెత్తికెక్కితే మంచి చెడు కళ్ళకు కనిపించదు. అలాంటి కామాంధులకు భయము సిగ్గు శరం ఉండదు. ఓ ప్రబుద్ధుడు తన మనవరాలి వయసున్న చిన్నారి పై అఘాయిత్య ప్రయత్నం చేశాడని తెలుసుకున్న స్థానికులు వాడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. ఈ సంఘటన షాద్ నగర్ పట్టణంలోని అయ్యప్ప కాలనీలో చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. మూడేళ్ల చిన్నారిని చాక్లెట్లు ఆశ చూపి దుశ్చర్య ప్రయత్నం చేసినట్టు స్థానికులు మీడియాకు తెలిపారు. ఈ విషయమై పోలీసు స్టేషన్ కు మీడియా వివరాలు కోరగా ప్రస్తుతం సంఘటన ఇన్విజిగేషన్లో ఉందని చెప్పారు. సంబంధిత ప్రబుద్ధుడు ఆర్టీసీలో మెకానిక్ గా పనిచేసి రిటైర్డ్ అయినట్టు స్థానికులు చెప్పారు..

madagoni surendar

Feb 05 2024, 12:56

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్ సుంకరబోయిన నరసింహ్మ యాదవ్

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్ సుంకరబోయిన నరసింహ్మ యాదవ్

నల్గొండ జిల్లా :-కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన సరిపెల్లి యాదగిరి మృతిచెందంగా వారి మృతదేవానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం.కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్ సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,వారి వెంట మాజీ ఎంపీపీ రెడ్డిపల్లి వెంకటమ్మ సాగర్,ఓబీసీ మండల అధ్యక్షులు బొడ్డుపల్లి సైదులు,పట్టణ అధ్యక్షులు చెరుకు యాదగిరి,మాజీ ఎంపీటీసీ గట్టిగొర్ల సత్తయ్య, సీనియర్ నాయకులు కొంపెల్లి యాదయ్య, జిల్లా కాంగ్రెస్ యువజన నాయకులు ముక్కాముల శేఖర్ యాదవ్, మండల యువజన నాయకులు మేడి విజయకుమార్,తదితరులు ఉన్నారు.

.