భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి తెలంగాణ శ్రీశైలంగా పేరుపోందిన చెర్వుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాల రివ్యూ సమావేశంలో.నకిరేకల్ ఎమ్మెల్యే

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి

తెలంగాణ శ్రీశైలంగా పేరుపోందిన చెర్వుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాల రివ్యూ సమావేశంలో పాల్గొన్న

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా :-నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి., అనంతరం ఈనెల 14 నుండి 21 వరకు అత్యంత వైభవంగా జరిగే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవముల రివ్యూ మీటింగ్ లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు..

వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ :-

బ్రహోత్సవములకు తెలంగాణ రాష్ట్రం నుండి నలుమూలలుగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు..

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పాలొన్ని ఈ బ్రహోత్సవములను విజయం చేయాలి

గుట్ట పైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు.

ఏక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అన్ని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

.

నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత 38 వ వార్డు కౌన్సెలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండ జిల్లా.:-

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో జరిగిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక

నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత 38 వ వార్డు కౌన్సెలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి...

జనవరి 8 న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని కోల్పోయిన బీఆర్ఎస్..

బుర్రి శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ గా ఎన్నుకున్న మెజారిటీ కౌన్సిలర్లు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్ట మొదటగా అవిశ్వాస తీర్మానంతో నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్..

మూడేళ్ల చిన్నారిపై కామాంధుడి అఘాయిత్యం. స్థానికుల దేహశుద్ధి పోలీసులకు అప్పగింత

మూడేళ్ల చిన్నారిపై కామాంధుడి అఘాయిత్యం.

స్థానికుల దేహశుద్ధి పోలీసులకు అప్పగింత

హైదరాబాద్ :- కామా తురాణం న భయం న లజ్జ.. అని పెద్దలు చెప్పారు. కామం నెత్తికెక్కితే మంచి చెడు కళ్ళకు కనిపించదు. అలాంటి కామాంధులకు భయము సిగ్గు శరం ఉండదు. ఓ ప్రబుద్ధుడు తన మనవరాలి వయసున్న చిన్నారి పై అఘాయిత్య ప్రయత్నం చేశాడని తెలుసుకున్న స్థానికులు వాడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. ఈ సంఘటన షాద్ నగర్ పట్టణంలోని అయ్యప్ప కాలనీలో చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. మూడేళ్ల చిన్నారిని చాక్లెట్లు ఆశ చూపి దుశ్చర్య ప్రయత్నం చేసినట్టు స్థానికులు మీడియాకు తెలిపారు. ఈ విషయమై పోలీసు స్టేషన్ కు మీడియా వివరాలు కోరగా ప్రస్తుతం సంఘటన ఇన్విజిగేషన్లో ఉందని చెప్పారు. సంబంధిత ప్రబుద్ధుడు ఆర్టీసీలో మెకానిక్ గా పనిచేసి రిటైర్డ్ అయినట్టు స్థానికులు చెప్పారు..

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్ సుంకరబోయిన నరసింహ్మ యాదవ్

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్ సుంకరబోయిన నరసింహ్మ యాదవ్

నల్గొండ జిల్లా :-కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన సరిపెల్లి యాదగిరి మృతిచెందంగా వారి మృతదేవానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం.కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన.నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్ సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,వారి వెంట మాజీ ఎంపీపీ రెడ్డిపల్లి వెంకటమ్మ సాగర్,ఓబీసీ మండల అధ్యక్షులు బొడ్డుపల్లి సైదులు,పట్టణ అధ్యక్షులు చెరుకు యాదగిరి,మాజీ ఎంపీటీసీ గట్టిగొర్ల సత్తయ్య, సీనియర్ నాయకులు కొంపెల్లి యాదయ్య, జిల్లా కాంగ్రెస్ యువజన నాయకులు ముక్కాముల శేఖర్ యాదవ్, మండల యువజన నాయకులు మేడి విజయకుమార్,తదితరులు ఉన్నారు.

.

నల్గొండ జిల్లా :-బీజేపీ ఆధ్వర్యంలో గావ్ చలో బస్తీ చలో

బీజేపీ ఆధ్వర్యంలో గావ్ చలో బస్తీ చలో

నల్గొండ జిల్లా :

-భారతీయ జనతా పార్టీ నకిరేకల్ పట్టణ అధ్యక్షులు పల్స శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం నాడు గావ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా ఉపాధ్యక్షురాలు అయితగోని అనిత పాల్గొని ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి బిజెపి బలోపేతాని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ప్రతి కార్యకర్త ఒకరోజు మొత్తం ఆ బస్తీలో ఉండి జరగబోయే భువనగిరి ఎన్నికల్లో బీజేపీ విజయభేరి మ్రోగించేలా చెయ్యాలని అన్నారు.ఈ దిశగా మోడీ పథకాలు ప్రతి గడపగడపకు తెలిసేలా చేయాలని దిశ నిర్దేశం చెయ్యడం జరిగింది.

.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ మండూరి ప్రభాకర్ రావు, గ్రామ చలో బస్తీ చలో అభియాన్ పట్టణ కన్వీనర్ మైల శ్రీనివాస్,కో కన్వీనర్ అప్ప అంజయ్య,ఉపాధ్యక్షులు వనం వేణు,గుర్రం నాగచంద్రు, కొల్లూరి జానయ్య,పట్టణ నాయకులు బ్రహ్మదేవర రవిశంకర్,కోట శ్రీను,సిద్ధోజు ఉపేంద్ర చారి,యెన్నం వెంకటేష్,కడింగు నాగరాజు, నర్సింగు అశోక్,రాపోలు శరత్,రవీందర్ నాగేష్, రమేష్,తదితరులు పాల్గొన్నారు

ప్రజా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి సీఎంను విమర్శించే స్థాయి అగ్గిపెట్టె రాజుకు లేదు.కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.

ప్రజా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి

సీఎంను విమర్శించే స్థాయి అగ్గిపెట్టె రాజుకు లేదు.

కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆనాడు స్వతంత్ర జడ్పిటిసి గా గెలుపొంది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డి ని అన్నారు..

2009లో లీటర్ పెట్రోల్ తీసుకుని ఒక రూపాయి పెట్టి అగ్గిపెట్టె తీసుకొలేని ఉద్యమ నాయకుడు హరీష్ రావు ని ఎద్దేవ చేశారు..తెలంగాణ కోసం అసలైన ఆత్మ బలిదానం చేసిన, తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన అమరుడు శ్రీకాంతా చారి అని మరొకసారి గుర్తు చేశారు..

డ్రామాలు అంటేనే కెసిఆర్ కుటుంబమని, సినీ నటుల కంటే గొప్ప నటులు కెసిఆర్,హరీష్ రావు అని అన్నారు...

అలాగే మా నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు..

బిఆర్ఎస్ నాయకులు ఓటమిని తట్టుకోలేకపోతున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు..

గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో దొంగ పాలన చేసినందుకు ప్రజలు బిఆర్ఎస్ కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన నడుస్తుందని, రేవంత్ రెడ్డి ని ప్రజలు మెచ్చుకుంటున్నారని, దీనిని జీర్ణించుకోలేకనే బిఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు..అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలలో 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాలను అమలు చేశామని,ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని పేర్కొన్నారు..అలాగే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు..

...

ఈ కార్యక్రమంలో

బట్టుపల్లి సర్పంచ్ నియోజకవర్గ నాయకులు తోలెం నాగేశ్వరరావు, నియోజకవర్గ యూత్ జనరల్ సెక్రటరీ మిట్టపల్లి నితిన్, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల మహిళా అధ్యక్షురాలు చందా వెంకటరత్నమ్మ, మండల నాయకులు ఎర్ర సురేష్ , జలగం కృష్ణ, మండల కార్యదర్శి షేక్ రఫీ, మండల నాయకులు దంచనాల రాజేంద్రప్రసాద్, నరసింహారావు, లాలయ్య, తదితరులు పాల్గొన్నారు..

భువనగిరి గురుకుల హాస్టల్లో దారుణం..

భువనగిరి గురుకుల హాస్టల్లో దారుణం..

ఒకే గదిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా:-

భువనగిరి గురుకుల హాస్టల్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం రాత్రి వేళ ఇద్దరు స్టూడెంట్స్ ఒకే గదిలో ఉరి వేసుకుని నూసైడ్ చేసుకున్నారు. గమనించిన తోటి స్టూడెంట్స్, హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థినుల ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పరీక్షల భయంతో చనిపోయారా లేదా ఇతర కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను టెన్త్ చదువుతోన్న వైష్ణవి, భవ్యగా గుర్తించారు. ఒకే గదిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటం హాస్టల్లో సంచలనంగా మారింది. అప్పటి వరకు తమతో కలిసి ఉన్న వారు ఉరి వేసుకుని చనిపోవడంతో తోటి విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు అవుతున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గంజాయి నిషేధంకై పోలీస్ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి.ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి.
నల్లగొండ జిల్లా:- గంజాయి నిషేధంకై పోలీస్ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టాలి.

ఆకతాయిలా ఆగడాలపై ప్రత్యేక ధృష్ఠి పెట్టాలి
ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి.

.
నల్లగొండ జిల్లాలోని గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవిస్తున్న "ఆకతాయిల ఆగడాల" పై సమగ్రమైన విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడగు ప్రభావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఐద్వా (అఖిల భారత ప్రజతంత్రమహిళా సంఘం) ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ఎస్పీ చంధనా దీప్తిని కలిసి జిల్లాలో రోజురోజుకు మితిమీరిపోతున్న గంజాయి ఆకతాయిల ఆగడాలపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా కేంద్రంలో గంజాయి, డ్రగ్స్ ప్రభావంకు యువత రోజు రోజుకు విపరీతంగా బానిసలు అవుతున్నారన్నారు..ఆకతాయిలు మత్తు పదార్థాల వ్యసనాలకు లోనై పార్కులను,రైల్వే స్టేషన్,పానగల్ చెరువు, బైపాస్ రోడ్డు,పట్టణ సరిహద్దు ప్రాంతాలలోని ప్రేమ జంటలను,యువ స్త్రీలను టార్గెట్ గా చేసుకొని మాటువేసి దాడులు చేస్తూ బెదిరిస్తూ డబ్బులు, స్త్రీల పై ఉన్న బంగారమే టార్గెట్ గా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు.తలొగ్గని అబ్బాయిల,అమ్మాయిల మొబైల్ పోన్ లు లాక్కొని,వీడియోలు తీస్తూ బలత్కారంతో సెక్సువల్ గా అనుభవిస్తున్నారని ఇంతటి దుర్మార్గాలకు ఒడిగడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాల నరసింహారెడ్డి కాలనీలో నల్లగొండ టూ టౌన్ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్న యువకులను పరిశీలిస్తే గంజాయి డ్రగ్స్ కు బానిసలై ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు అనేది స్పష్టం అవుతుందన్నారు. గతంలోనూ నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం,గోపాలాయపల్లి వేణుగోపాలస్వామి గుట్ట పరిధిలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు.జన సందర్శన తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని ప్రేమ జంటలనే లక్ష్యంగా పెట్టుకొని ఈజీ మనీ కి అలవాటు పడి సైకో ల్లాగా తయారై ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారన్నారు ్ ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణం గంజాయి లాంటి మత్తు పదార్థాలేనని ఐద్వా భావిస్తుంది. మహిళలనే టార్గెట్ గా పెట్టుకొని వికృత చేష్టలకు పాల్పడుతున్న ఆకతాయిలపై కఠినమైన చట్టాలను నమోదు చేసి త్వరతగతిన శిక్ష పడేలా చొరవ చూపాలని జిల్లా ఎస్పీ ని కోరారు.నల్లగొండ జిల్లాలో గంజాయి నిషేధంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి గంజాయి లాంటి మత్తు పదార్థాల మూలాలను చేధించి మహిళల హక్కులను పరిరక్షించాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీని కలిసిన వారిలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మీ,ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణ,మేకల వరుణ,బొల్లెపల్లి మంజుల,తదితరులు పాల్గొన్నారు. సామాజిక ఉద్యమ నమస్కారాలతో.. అఖిల భారత ప్రజతంత్రమహిళా సంఘం(ఐద్వా) నల్లగొండ జిల్లా కమిటీ 9490209264
వ్యక్తి దారుణ హత్య
వ్యక్తి దారుణ హత్య
                                  నల్లగొండ జిల్లా: (కేతేపల్లి):-  ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన జరిగింది.వివరాల్లోకెలితే   ఇప్పలగూడేంలో  ఓ వ్యక్తిని దారుణం గా హత్య చేశారు. కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో వంటల సైదులు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి నరికి చంపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్లు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చెపటరు.ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వ్యక్తి దారుణ హత్య.

వ్యక్తి దారుణ హత్య

నల్లగొండ జిల్లా:

(కేతేపల్లి):- ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన జరిగింది.వివరాల్లోకెలితే ఇప్పలగూడేంలో ఓ వ్యక్తిని దారుణం గా హత్య చేశారు. కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో వంటల సైదులు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి నరికి చంపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్లు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చెపటరు.ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.