మొట్లపల్లిలో కార్టన్ సెర్చ్
మొట్లపల్లిలో కార్డెన్ సెర్చ్ణ
-కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్న డిఎస్పీ రాములు, సీఐ వేణుచందర్, ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
[Crime journalist ]:
మొగుళ్ళపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామంలో డీఎస్పీ రాములు, సీఐ వేణు చందర్, ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ ల నేతృత్వంలో చిట్యాల సర్కిల్ పరిధిలోని స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులు 60 మందితో శుక్రవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రెండున్నర లీటర్ల గుడుంబాను పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలనుద్దేశించి డీఎస్పీ రాములు మాట్లాడారు. గ్రామంలో దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రముఖులు ముందుకు రావాలని కోరారు. నివాస ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల బారిన పడకుండా యువతను కాపాడుకునేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రమాదంగా ఉండాలని సూచించారు. ఇంటింటి సోదాలో కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చొరబడ్డ మావోయిస్టులను ఏరివేసేందుకు పోలీసులు కార్డెన్ సెర్చ్ చేసేవారు. కానీ ఇప్పుడు పల్లెల్లో గుడుంబా, దొంగతనాలు, మత్తు పదార్థాలు, క్రిమినల్ కేసులు పెరుగుతున్నందున ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు రమేష్, రవికుమార్, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Feb 02 2024, 22:56