హామీలు నెరవేర్చని నాయకులను నిడదీయండి:సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,డివిజన్ నాయకులు ముసలి సతీష్
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,డివిజన్ నాయకులు ముసలి సతీష్
చర్ల :భూర్జవ,పాలక పార్టీలను ఓడించండి.
గత హామీలను అమలు చేయని పాలకులను నిలదీయండి.న్యూడెమోక్రసీ.
బూర్ జవా పాలక పార్టీలను ఓడించాలని గతంలో హామీలను ఇచ్చి విస్మరించిన పాలకులను ఇప్పుడు నిడదీయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,డివిజన్ నాయకులు ముసలి సతీష్* లు పీలుపు నిచ్చారు.
గతంలో పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని విచ్చలవిడి హామీలను ఇచ్చి ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా విస్మరించిన పార్టీలను గ్రామాలకు వస్తే నిలదీయాలని భూర్జవ పార్టీలను ఓడించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరించి పెట్టుబడి కార్పొరేట్ శక్తులకి ప్రజల ఆస్తులను చేస్తున్నారని అందులో భాగమే నూతన అటవీ సంరక్షణ నియమాలను తీసుకొస్తున్నారని అడవుల నుండి ఆదివాసీలను గెంటివేయడం కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని వారన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ప్రభుత్వం సాగు చేసుకుంటున్న భూములను హరితహారం పేరుతో గుంజుకొని ప్రజలని మోసం చేసిందని వారన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా అడిగిన ప్రశ్నించిన గొంతుకలపై ఊపా పిడి యాక్ట్ లాంటి కేసులను నమోదు చేసి జైలవనిర్బంధిస్తున్నారని వారన్నారు.ఎన్నికలే శాశ్వతంగా బతికే పాలక బూర్జవ పార్టీలను ఎండగట్టాలని,విప్లవ పార్టీలను ప్రజాస్వామిక వాదులను గెలిపించుకుంటే ప్రజా సమస్యలను పరిష్కరించుకోవచ్చని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రోడ్లెక్కి అనేక ఆందోళన చేసిన పట్టించుకోని నాయకులు ఈరోజు ఎన్నికలు రాగానే రంగురంగుల జండాలతో రంగురంగు వేషాలతో వచ్చి ప్రజల దగ్గర కొత్త కొత్త హామీలతో ముందుకు వస్తున్నారని ఇవి ఎవరు కూడా నమ్మొద్దని ఆ పార్టీలో ఆ వేషాలు అన్నీ కూడా ప్రజల్ని మోసం చేయడం కోసమేనని వారన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో పేదలకు చేసింది ఏమీ లేదని పైగా గ్యాస్,విద్య,విద్యుత్తు, వైద్యం అందని ద్రాక్షగా మార్చాలని వారన్నారు.ఇప్పటికీ అనేక గ్రామాలలో రోడ్లు,రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అనేకసార్లు అధికారులకు పాలకులకు విన్నవించిన ఫలితం లేదని వారు అన్నారు.అందుకే ప్రజలందరూ ఆలోచించి ఓటేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.బిజెపి ప్రభుత్వం హిందూ మతం మతోన్మాదం పేరుతో కులాల మధ్య చిచ్చుపెట్టి ఐక్యంగా ఉన్న గ్రామాలలో విచ్ఛిన్న చర్యలు చేపట్టి విభజించు పాలించు అనే సూత్రాన్ని పాటిస్తుందని వారన్నారు.బిజెపి, కాంగ్రెస్,బి ఆర్ ఎస్ అన్ని ఒక్క తాను గుడ్డలేనని అధికారం కోసమే వేరు ఆరాటపడుతున్నారు.తప్పితే ప్రజా సమస్యల కోసం కాదని ఇది ప్రజలందరూ గమనించాలని వారు పిలుపునిచ్చారు.ఈ క్రమంలో ప్రజల కోసం పని చేసే వారిని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని,ప్రశ్నించే గొంతుకలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్,భాను,నరసింహారావు,సీతారాములు,సరోజ,కోటమ్మ,కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,డివిజన్ నాయకులు ముసలి సతీష్

క్రైస్తవులంతా బిఆర్ యస్. అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి మద్దతు ప్రకటించారు.
BRSకు జై కొట్టిన రాష్ట్ర మాల సంఘాల JAC
మీరు వేసిన ఓటుతోనే సూర్యాపేట ఎంతో అభివృద్ధి
కాంగ్రెస్ పార్టీను వీడి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన ఎస్ కె అష్రాఫ్.

ప్రస్తుతం దేశం ఉల్లి ధరల్లో గణనీయమైన పెరుగుదలను ఎదుర్కొంటోంది. గతంలో కిలో ఉల్లి ధర రూ. 30 నుంచి రూ. 40గా మాత్రమే ఉండేది. అయితే, ప్రస్తుతం, ఉల్లిపాయలను చాలా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఒక కిలో ఉల్లిపాయలను రూ. 80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు.
BRS కంచర్ల భూపాల్ రెడ్డి గారికి MIM మద్దతు ..
Nov 24 2023, 13:43
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.5k