కలలో దేవుడు కనిపించి పొలంలో గొయ్యి తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా..!
కర్ణాటక: కలలో దేవుడు కనిపించి పొలంలో గొయ్యి తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా..!
బెంగళూరుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి టెక్కారిలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. అయితే అతనికి కలలో అతను కొన్న భూమి పక్కనే ముస్లిం వ్యక్తి హమద్ బావాకు చెందిన వ్యవసాయ భూమిలో దేవాలయం ఉన్నట్లు కల వసీచింది. ఈ విషయాన్ని లక్ష్మణ్ గ్రామ ప్రజలకు తెలియజేశాడు. అనంతరం గ్రామస్థులు అందరూ కలిసి జ్యోతిష్కులను సంప్రదించారు. అప్పుడు కూడా అతనికి భూగర్భంలో దేవుడి ఉనికి గురించి సూచన వచ్చింది.
ఇందుగలడు అందులేడని సందేహం వలదు.. ఎందెందు వెదికినా దేవుడు కనిపిస్తాడని హిందువుల నమ్మకం. అందుకు మరోసారి నిదర్శనంగా నిలిచింది దక్షిణ కన్నడ జిల్లాలో జరిగిన ఓ ఘటన. బెల్తంగడి తాలూకా తెక్కరు గ్రామంలోని బత్రాబైల్‌లోని ఓ ముస్లిం వ్యక్తికి చెందిన వ్యవసాయ భూమిలో దేవాలయం ఉన్నట్లు మరొక వ్యక్తికి కల వచ్చింది. దీంతో ఆ ముస్లిం వ్యక్తి అనుమతితో జేసీబీతో భూమిని తవ్వగా వందేళ్ల క్రితం నాటి గోపాలకృష్ణుడి విగ్రహం లభ్యమైంది. దీంతో ఆ ముస్లిం వ్యక్తి తన ఆధీనంలో ఉన్న భూమిని ఆలయానికి ఇచ్చేశాడు.
బెంగళూరుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి టెక్కారిలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. అయితే అతనికి కలలో అతను కొన్న భూమి పక్కనే ముస్లిం వ్యక్తి హమద్ బావాకు చెందిన వ్యవసాయ భూమిలో దేవాలయం ఉన్నట్లు కల వసీచింది. ఈ విషయాన్ని లక్ష్మణ్ గ్రామ ప్రజలకు తెలియజేశాడు. అనంతరం గ్రామస్థులు అందరూ కలిసి జ్యోతిష్కులను సంప్రదించారు. అప్పుడు కూడా అతనికి భూగర్భంలో దేవుడి ఉనికి గురించి సూచన వచ్చింది. దీంతో జేసీబీతో భూమిని తవ్వారు. పదుల అడుగుల తవ్విన తర్వాత విరిగిన గోపాలకృష్ణుడి విగ్రహం కనిపించింది.
దీని ప్రకారం విగ్రహం దొరికిన స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించగా.. హమద్ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని విడిచిపెట్టారు. హమద్ తన పూర్వీకుల నుండి వ్యవసాయ భూమిని వారసత్వంగా పొందాడు. సర్వే చేయగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు తేలింది.
వందల సంవత్సరాల క్రితం.. గోపాలకృష్ణ దేవాలయంపై టిప్పు సుల్తాన్ దాడి చేసినట్లు చెబుతారు. గ్రామంలో పదేళ్ల క్రితం ఓ దేవాలయం ఉందనే విషయం వెల్లడైంది. అంతేకాదు ఓ ముస్లిం వ్యక్తి స్థలంలో గుడి ఉందన్న సమాచారం అందుకున్న కొంతమంది పెద్దలు కలిసి గోపాలకృష్ణ ఆలయ ట్రస్టు ఏర్పాటు చేశారు. గుడి గురించి అన్వేషణ ప్రారంభించారు. అయితే ఎక్కడనే విషయంపై సరైన సమాచారం లేకపోవడంతో గ్రామస్థులు మౌనంగా ఉండిపోయారు.
అయితే 10 ఏళ్ల క్రితం బెంగుళూరుకు చెందిన లక్ష్మణ అనే వ్యక్తి టెక్కరు సమీపంలోని కొంత భూమిని కొనుగోలు చేశాడు. ఇప్పుడు భూమి విషయం ఆలోచిస్తుండగా లక్ష్మణ్ సమీప స్థలంలో ఒక ఆలయం ఉందని కల వచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే లక్ష్మణుడి స్థలానికి సమీపంలో హమద్ స్థలం ఉంది.
దీని ప్రకారం భూమికి సంబంధించిన రికార్డును పరిశీలించగా అది ప్రభుత్వ భూమి అని తేలింది. ఆ విధంగా బెల్తంగడి ఎమ్మెల్యే హరీష్ పూంజా సహకారంతో ముస్లిం వ్యక్తి స్థలంపై సర్వే చేయించారు. సర్వేలో 25 సెంట్ల భూమి ప్రభుత్వానికి చెందినదని తేలడంతో హమద్ కొబ్బరి తోటను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
అనంతరం ఆలయ నిర్మాణానికి స్థలం ఇవ్వాలని గోపాలకృష్ణ ఆలయ ట్రస్టు డీసీని కోరారు. దీని ప్రకారం, జిల్లా కలెక్టర్ ఆలయాన్ని నిర్మించడానికి హిందూ మతపరమైన దేవాదాయ శాఖకు భూమిని రిజర్వు చేశారు. తాజాగా జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా కలలో వచ్చినట్లుగా పది అడుగుల లోతున్న బావిలో గోపాల కృష్ణుడు విగ్రహం కనిపించింది. ప్రస్తుతం హమద్ తన 75 సెంట్ల భూమిని ఆలయ ట్రస్టుకు విక్రయించాడు.

కర్ణాటక: కలలో దేవుడు కనిపించి పొలంలో గొయ్యి తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా..!
బ్రేకింగ్ న్యూస్

నల్లగొండ 17,35 వార్డులలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ మరియు జనంలోకి దూసుకు వెళ్లిన కార్యకర్తల ప్రచార హోరు
ఈ కార్యక్రమంలో 35వ వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న, 35 వ వార్డు ఇన్చార్జి తలారి యాదగిరి, నల్గొండ టౌను ప్రధాన కార్యదర్శి జయప్రకాష్, నల్గొండ టౌన్ కోశాధికారి గంజి రాజేందర్, 17వ వార్డు ఉపాధ్యక్షుడు వనం చంద్రశేఖర్, మూడ వేణు, గంజి లక్ష్మీనారాయణ, జెల్లా శ్రీనివాస్,జెల్లా మధు, దొంత రవి, మిరియాల కిరణ్ కుమార్, కైరం కొండ శివకుమార్, కైరం కొండ అరుణ్,పోశం గిరి, గంజి మహేష్, చందు తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ బి.ఆర్.ఎస్ పార్టీలోకి వలసల జోరు... ఆగకుండా పరిగెత్తుతున్న కారు...
రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో ఐదేళ్లు పెంపు
బీఆర్ఎస్ హయాంలోనే సూర్యాపేట ప్రగతిబాట: గుంటకండ్ల సునిత జగదీష్ రెడ్డి
శబరిమలకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులు సమకూర్చేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంట మనుషులు, సామాన్లు సర్దేందుకు ఓ వ్యక్తికి, బస్సు బుక్ చేసిన గురుస్వామికి ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులు సమకూర్చేందుకు సిద్ధమైంది.


Nov 09 2023, 15:02
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
16.6k