ప్రజలు విచక్షణ తో ఆలోచన చేసి ఓటయ్యాలి...

...................

ప్రజలు విచక్షణ తో ఆలోచన చేసి ఓటయ్యాలి...

తుంగతుర్తి ప్రాంతO పోరాటాల గడ్డ.... గత ప్రభుత్వాల హయం లో కరువు బారిన పడ్డది..

ఇవ్వాళ తుంగతుర్తి పచ్చగా మారింది.. కాల్వలు, చెరువులలో కళ కళ లాడుతుOది..గోదావరి జలాలు అద్భుతమైన ప్రగతి తెచ్చింది.. లక్షన్నర ఎకరాల్లో పంటలు పండుతున్నాయి...బునాది గాని కాల్వల ద్వారా నీళ్లు అందిస్తాము...ఈ నియోజకవర్గంలో టోటల్ గా 

2 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తాము...

తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కాంగ్రెస్ వంచించింది... మనతో పొత్తు పెట్టుకొని కూడా మోసం చేసింది.. చివరకు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని పోరాటం చేస్తే స్వరాష్ట్రం సాదించుకున్నాం...తెలంగాణ కోసం యువత ఆత్మహత్య చేసుకున్నారు...ఎట్టకేలకు గమ్యాన్ని ముద్దాడాము..

మన ప్రభుత్వం లో

ఆసరా పెన్షన్ పెంచుతూ వచ్చాము.. కల్యాణ లక్ష్మీ పథకం రూపాయలను కూడా పెంచుకుంటూ వచ్చాము.. ఆదాయాన్ని పెంచి, పంచాము...

రైతు బంధు పథకాన్ని స్టార్ట్ చేసాము..సక్సెస్ అయింది...తెలంగాణ లో ఆత్మహత్య లు, వలసలు వుండే.. ఇవ్వాళ అన్నిటికీ చరమగీతం పాడాము...అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నాం.. ఇది అందరికి గర్వకారణం....తుంగతుర్తి లో ఎండ కాలంలో కూడా నీళ్లు మత్తడి దుంకుతున్నాయి...UP ముఖ్యమంత్రి వచ్చాడు...మనకు పాఠాలు చెప్తాడు... కర్ణాటక DY ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి రైతులకు 5 గంటలు  ఇస్తున్నాం అంటున్నాడు..

ఇలాంటి మోసకారులు కూడా తెలంగాణ కు వచ్చి నీతులు చెవుతారు... తస్మాత్ జాగ్రత్త....అందరి పట్ల అప్రమత్తంగా ఉండాలి...నల్గొండ దామరచర్ల లో 30 వెల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్ కడుతున్నాం....దళిత బంధు పథకం అద్భుతమైన మార్పు తెస్తుంది... దశాబ్దాలుగా దళితులు  మోసానికి గురవుతున్నారు... అందుకే తెలంగాణ లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తునం.. ఈ నియోజకవర్గంలో ఫైలెట్ ప్రాజెక్టుగా తిరుమల గిరి మండలం లో అమలు చేసాము.....ఈ నియోజకవర్గ ములో mla గాదరి కిషోర్ కుమార్ మంచి పనులు చేశారు....గాదరి కిషోర్ ను లక్ష ఓట్ల మెజారిటీ తో గెలిపించండి...ఉద్యమం లో నాతో పని చేసాడు.. గొప్ప పోరాటం చేసాడు... ఈ ఎన్నికల్లో కిషోర్ మంచి మెజార్టీతో గెలిలవాలి....గాదరి కిషోర్ ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలో మొత్తం దళిత బంధు అమలు చేస్తాం..

mla గాదరి కిషోర్ యువకుడు, ఉత్సాహవంతుడు... గెలిపించుకోండి...కాంగ్రెస్ కు చాన్స్ ఇస్తే తెలంగాణ ఆగం అవుతుంది....కరంట్ ఖతం అవుతుంది... కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేస్తాం అంటున్నారు ..అది ఎంత ప్రమాదమో మిరే ఆలోచన చేయాలి... ధరణి రావడం వల్ల అవినీతి అంతం అయింది... ధరణి రద్దు అయితే అవినీతి రాజ్యం వస్తుంది.... మళ్ళీ కొట్లాటలు వస్తాయి... రైతు బంధు కూడా రాదు... ..ధరణి రైతులకు గుండె కాయ లాంటిది...రైతు బంధు వెస్ట్ అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు ...వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలి .....

నచ్చిన కారు తీసుకో... ఆర్చర్ సీతల్ దేవికి ఆనంద్ మహేంద్ర ప్రశంస

నచ్చిన కారు తీసుకో... ఆర్చర్ సీతల్ దేవికి ఆనంద్ మహేంద్ర ప్రశంస

తాజాగా ఆసియా పారా గేమ్స్‌ బంగారు పతక విజేత, ఆర్చర్‌ శీతల్ దేవిని ప్రశంసిస్తూ 'ఎక్స్‌' (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టిన ఆనంద్‌ మహీంద్రా తమ కంపెనీ కార్లలో ఆమెకు నచ్చిన కారును తీసుకోవాలని కోరారు. దాన్ని ఆమె నడిపేందుకు వీలుగా తయారు చేసిస్తామని కూడా చెప్పారు.

రెండు చేతులూ లేని శీతల్ దేవి ఆసియా పారా గేమ్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు బంగారు పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా అవతరించింది. 'జీవితంలో ఇంకెప్పుడూ చిన్న చిన్న పనికిమాలిన సమస్యల గురించి ఆలోచించను. శీతల్‌దేవీ.. నువ్వు అందరికీ స్ఫూర్తి ప్రదాతవు. నీ నుంచి ఎంతో నేర్చుకోవాలి. మా కంపెనీ కార్లలో నీకు నచ్చినది తీసుకో. దాన్ని నువ్వు నడిపేందుకు వీలుగా తయారు చేసిస్తాం' అని ట్వీట్‌లో రాసుకొచ్చారు ఆనంద్‌ మహీంద్రా. ఆమె కఠోర సాధనకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు.

ఈ ట్వీట్‌కు యూజర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. చాలా మంది ఆనంద్‌ మహీంద్రను అభినందిస్తూ కామెంట్లు చేశారు.

మూడు రోజుల క్రితం నా చిన్న కూతురు చనిపోయింది.. కనీసం నా రెండు కూతుర్ని కాపాడుకునే ఆర్థిక శక్తి నా దగ్గర లేదు కావున నన్ను ఆదుకోండి ప్రజలారా...

మిత్రులందరికీ నమస్కారం మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మిషన్ స్కూల్ గ్రౌండ్ నందు నా పేరు వట్టం రాజు wo/అనుష మా ఇద్దరి కుమార్తెలు మా యొక్క చిన్న పాప మూడు రోజుల కిందట జ్వరంతోనే మరణించడం జరిగినది అదే విధంగా మా యొక్క పెద్ద కుమార్తె వట్టం ప్రణీత పాప కూడా హైదరాబాద్ బంజారాహిల్స్ లిటిల్ స్టార్ హాస్పటల్ నందు చికిత్స పొందుతున్నది రక్త కణాలు పడిపోయి బాడీ ఇన్ఫెక్షన్ అయిందని డాక్టర్ గారు చెప్పడం జరిగినది ఈ యొక్క వైద్య నిమిత్త ఖర్చు సుమారు నాలుగు లక్షల నుండి 5 లక్షల వరకు అవుతాయి అని చెప్పడం జరిగినది మాది చాలా నిరుపేద కుటుంబం దాతలు ఎవరైనా మాకు సహకరించగలరని కోరుకుంటున్నాం అన్న పుట్టడి దుఃఖంలో మా యొక్క చిన్న కుమార్తె చనిపోయిన తర్వాత పెద్ద కుమార్తెకు ఇలా ఇవ్వడం జరిగింది పెద్దమనిషి చేసుకొని మా పాపను బతికించగలరని కోరుకుంటున్నాం అన్న                        

  మా యొక్క అకౌంట్ నెంబర్ SBI BANK ACCOUNT NUMBER 39053856697 IFCD CODE SBIN0020162 PHONE pay number 7702888034

ఎన్నికల మేనిఫెస్టోలో చేతి వృత్తిదారుల సమస్యలను చేర్చాలి‌‌

ఎన్నికల మేనిఫెస్టోలో చేతి వృత్తిదారుల సమస్యలను చేర్చాలి‌‌.

_

రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేతివృత్తిదారుల సంక్షేమం వృత్తి రక్షణ కోసం జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధుల వాటా పెంచాలని వృత్తిదారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బండ శ్రీశైలం, జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్ డిమాండ్ చేశారు.

       

శనివారం నాడు నల్లగొండలో జరిగిన చేతి వృత్తిదారుల సంఘం సమావేశం దొడ్డి కొమురయ్య భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృత్తి దారులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి వాటికి పాలకమండలి ఏర్పాటు చేసి విధి విధానాలు ప్రకటించాలని అన్నారు. వృత్తిదారులలో ఉన్న నిరుపేదలకు గృహలక్ష్మి పథకం అమలు చేయాలి ,అన్ని వృత్తుల వారికి బీసీ బందు ఇవ్వాలి, 50 సంవత్సరాలు నిండిన ప్రతి వృత్తిదారునికి 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, భూమిలేని వృత్తిదారులందరికీ మూడు ఎకరాల భూమి ఇవ్వాలి ,ప్రతి వృత్తిదారునికి 10 లక్షల రూపాయలు జీవిత బీమా ఇవ్వాలి ,గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలి, చేతి వృత్తిదారుల కుటుంబాలకు విద్యా వైద్యం ఉచితంగా అందించాలని పై డిమాండ్లన్నింటినీ వివిధ రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

      

 ఈ సమావేశంలో వృత్తి సంఘాల నాయకులు అవిశెట్టి శంకరయ్య, కందగట్ల గణేష్, కొండ వెంకన్న, శ్రీనివాస్, పెద్దలు, మల్లేశం, ఐలయ్య, కర్నాటి శ్రీరంగం తదితరులు పాల్గొన్నారు.

    

ఓటరుగా నమోదుకు లాస్ట్ డేట్ ఇదే!

ఓటరుగా నమోదుకు లాస్ట్ డేట్ ఇదే!

తెలంగాణలో కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 31 వరకు మాత్రమే అవకాశం ఉంది. అన్ని అర్హతలు ఉండి ఓటరు జాబితాలో పేరు లేని వారు తమ ప్రాంతానికి చెందిన బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) వద్ద మాన్యువల్ లేదా eci.gov.in లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇందుకోసం మొబైల్ నంబర్, ఫొటో, గుర్తింపు కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పది రోజుల్లో దరఖాస్తును పరిశీలించి ఆమోదం తెలుపుతారు.

దీపావళి తేదీపై సందిగ్ధత - పండితుల క్లారిటీ, సెలవు ఖరారు..!!

Diwali 2023: దీపావళి తేదీపై సందిగ్ధత - పండితుల క్లారిటీ, సెలవు ఖరారు..!!


దీపావళి కి పండుగల్లో ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఈ పండగను కార్తీకమాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు రెట్టింపు అవుతుందని భక్తుల నమ్మకం. అయితే ఈ సంవత్సరం దీపావళి తేదీల్లో మార్పులు రావడంతో తేదీల్లో గందరగోళం నెలకొంది. దీని పైన పండితులు స్పష్టత ఇస్తున్నారు. ప్రభుత్వం సెలవు పైన క్లారిటీ ఇచ్చింది.


అమావాస్య తిధి ఇలా

దీపావళి ప్రతి సంవత్సరం ఈ పండగను ఘనంగా ఐదు రోజుల పాటు జరుపుకుంటారు.ప్రతి సంవత్సరం దీపావళి పండుగను అమావాస్య తిథి రోజున జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం నవంబర్ 12వ తేదీన అమావాస్య తిథి ప్రారంభం కాబోతోంది. ఈ తిథి మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 2.50 గంటలకు ముగుస్తుంది.


ఈరోజు ప్రత్యేక పూజలు చేయాలనుకునేవారు అమ్మవారికి ప్రదోషకాలంలో ఉపవాసాలు, పూజలు చేయడం శ్రేయస్కరమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో లక్ష్మీదేవి పూజతో పాటు గణేశుడి పూజను కూడా చేయడం శుభప్రదంగా చెబుతున్నారు. నవంబర్ 12 సాయంత్రం 5:39 నుంచి 7:35 వరకు లక్ష్మీపూజకు అనువైన సమయం గా పేర్కొంటున్నారు.

అయిదు రోజుల పండుగ

ధంన్ తేరాస్ జరుపుకున్న మరుసటిరోజే ఈ నరక చతుర్దశి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం నవంబర్ 11వ తేదీన నరక చతుర్దశిని జరుపుకోవాలని వేద జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ధంన్ తేరాస్ జరుపుకున్న మరుసటిరోజే ఈ నరక చతుర్దశి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం నవంబర్ 11వ తేదీన నరక చతుర్దశిని జరుపుకోవాలని వేద పండితులు చెబుతున్నారు.ప్రతి సంవత్సరం గోవర్ధన పూజను దీపావళి జరుపుకున్న తర్వాత మరుసటి రోజు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పూజను కార్తీక మాసం రోజున జరుపుకోవాలని సూచిస్తున్నారు. తిథుల ప్రకారం నవంబర్ 14వ తేదీన గోవర్ధన జరుపుకోవాల్సి ఉంటుంది.



సెలవుల ప్రకటన

దసరా సెలవులు ముగియటంతో తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. దసరా సెలవుల విషయంలో అధికారికంగా ప్రకటించే సందర్భంగా చివరి నిమిషం వరకు ఊగిసలాట కనిపించింది. దీంతో, దీపావళి సెలవు పైన మాత్రం ఈ సారి ముందే స్పష్టత ఇచ్చారు. ఈ సారి నవంబర్ 12న (ఆదివారం) దీపావళి రావడంతో ఆ రోజునే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సెలవుగా ప్రకటించాయి. ఇక దీపావళి ఏ రోజు చేసుకోవాలి అనే విషయానికి వస్తే.. నవంబర్ 12వ తేదీ రాత్రి గడియల్లో అమావాస్య తిథి ఉండటంతో ఆ రోజునే దీపావళి పండుగ జరుపుపోవాలని పండితులు సూచిస్తున్నారు. దీంతో..మొత్తంగా ఈ సారి నవంబర్ 12వ తేదీనే దీపావళి జరుపుకొనేందుకు సిద్దం అవుతున్నారు.


గూగుల్ పే వాడుతున్న వారికి గుడ్ న్యూస్!

గూగుల్ పే వాడుతున్న వారికి గుడ్ న్యూస్!

బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా కస్టమర్లకు ఇంకా చిన్న వ్యాపారాలకు లోన్ ప్రొడక్ట్స్ అందించడం ప్రారంభిస్తామని Google Pay తెలిపింది. 

 


భారతదేశంలో గుర్తింపుని మరింతగా విస్తరించాలని చూస్తున్న Google Pay వినియోగదారులకు ఇంకా చిన్న వ్యాపారాలకు లోన్ ప్రొడక్ట్స్ అందించడం ప్రారంభించనున్నట్లు తెలిపింది. దేశంలో చాలా మందికి ఇప్పటికీ సరైన లేదా సమానమైన ఆర్థిక సేవలు పొందేందుకు తగిన ఆక్సెస్ లేదు.

 

ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలతో భాగస్వామ్యంతో దేశంలోని వినియోగదారులకు, చిన్న వ్యాపారాలకు లోన్ ప్రొడక్ట్స్ అందించడం ప్రారంభిస్తామని Google Pay ప్రకటించింది. "గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల ద్వారా క్రెడిట్ (లోన్) జారీ చేయబడినప్పటికీ, Google Pay వాటిని యాక్సెస్ చేయడానికి, సులభంగా ఇంకా సౌకర్యవంతంగా చేయడానికి వారితో సహకరిస్తుంది" అని ఏజెన్సీ తెలిపింది.

 

భారతదేశంలోని Paytm, PhonePe వంటి వాటితో పోటీ పడుతున్న ఫిన్‌టెక్ కంపెనీ వ్యాపారులకు రూ. 15,000 నుండి సాచెట్ లేదా స్మాల్-టికెట్ రుణాలను అందించడానికి DMI ఫైనాన్స్‌తో భాగస్వామ్యం ఉంది. అంతేకాకుండా, వ్యాపారులు వారి వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడంలో సహాయపడటానికి దీని ద్వారా వారికి ePayLater భాగస్వామ్యంతో క్రెడిట్ లైన్‌ను కూడా అందిస్తుంది.

"ప్రపంచ సగటుతో పోలిస్తే భారతదేశం రుణాలు గణనీయంగా తక్కువగా ఉన్నాయి" అని ఏజెన్సీ పేర్కొంది. అలాగే, PhonePe అండ్ Paytmతో పాటు Google Pay దేశంలోని UPI వాల్యూమ్‌లలో అత్యధిక వాటా ఉంది.

వినియోగదారుల కోసం Google Pay Axis బ్యాంక్‌తో భాగస్వామ్యం ద్వారా వ్యక్తిగత రుణాల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. దీని ద్వారా వ్యక్తిగత రుణాలను Google Payలో అందుబాటులో ఉంచడం కూడా తెలిసిందే. 

దేశంలో కొన్నేళ్లుగా యూపీఐ వినియోగం పెరుగుతుండడంతో నగదు వినియోగం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి అప్లికేషన్లను కస్టమర్లు ఎక్కువగా వాడుతున్నారు. 


హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..ఇలా దరఖాస్తు చేసుకోండి..!!

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..ఇలా దరఖాస్తు చేసుకోండి..!!


నిరుద్యోగులకు శుభవార్త. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, HAL మేనేజర్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు HAL hal-india.co.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో అందించిన వివరాల ప్రకారం, దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 30 నవంబర్ 2023.

ఖాళీల వివరాలు :

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 84 పోస్టులను భర్తీ చేస్తుంది. వీటిలో-

సీనియర్ టెస్ట్ పైలట్ (FW) / టెస్ట్ పైలట్ (FW): 2 పోస్టులు

చీఫ్ మేనేజర్ (సివిల్): 1 పోస్ట్

సీనియర్ మేనేజర్ (సివిల్): 1 పోస్ట్

డిప్యూటీ మేనేజర్ (సివిల్): 9 పోస్టులు

మేనేజర్ (IMM) I: 5 పోస్ట్‌లు

డిప్యూటీ మేనేజర్ (IMM): 12 పోస్టులు

ఇంజనీర్ (IMM): 9 పోస్టులు

డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్): 9 పోస్టులు

ఫైనాన్స్ ఆఫీసర్: 6 పోస్టులు

డిప్యూటీ మేనేజర్ (HR): 5 పోస్టులు

డిప్యూటీ మేనేజర్ (లీగల్): 4 పోస్టులు

డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్): 5 పోస్టులు

సెక్యూరిటీ ఆఫీసర్: 9 పోస్టులు

ఆఫీసర్ (ఆఫీసర్ లాంగ్వేజ్): 1 పోస్ట్

ఫైర్ ఆఫీసర్: 3 పోస్టులు

ఇంజనీర్ (CS) (కాంప్లెక్స్ ఆఫీస్): 3 పోస్టులు

దరఖాస్తు రుసుము:

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 500/-. ఈ అప్లికేషన్ ఫీజులో 18% GST కూడా యాడ్ చేసి ఉంటుంది. అయితే, SC/ST/PWBD కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

ఎక్కడ దరఖాస్తు చేయాలి?

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ పూర్తి చేసిన దరఖాస్తును నిర్ణీత నమూనాలో చివరి తేదీలోపు కింది చిరునామాకు పంపవచ్చు: చీఫ్ మేనేజర్ (హెచ్‌ఆర్), రిక్రూట్‌మెంట్ విభాగం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్, 15/1 కబ్బన్ రోడ్, బెంగళూరు – 560 001. మరిన్నింటికి ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం, అభ్యర్థులు HAL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అర్హత ప్రమాణాలు:

ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి పోస్ట్‌కు వేర్వేరు అర్హత ప్రమాణాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ ద్వారా విద్యార్హత, వయోపరిమితిని చెక్ చేసుకోవచ్చ.

సూర్యాపేటలో కాంగ్రెస్నూ వీడి టిఆర్ఎస్ లోకి కార్యకర్తల వలసలు...

సూర్యాపేట పట్టణంలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్

కాంగ్రెస్ ను వీడి కారెక్కుతున్న కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు

28వ వార్డులో కాంగ్రెస్ గుడ్ బై చెప్పిన కాంగ్రెస్ కార్యకర్తలు 

మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక

కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం

 సూర్యాపేట

 ఎన్నికలు సమీపిస్తున్న వేళ సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది. పట్టణంలో, నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కారెక్కుతున్నారు. తాజాగా కాంగ్రెస్ కు పట్టు ఉన్న సూర్యాపేట మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన మైనార్టీ కాంగ్రెస్ నాయకులతోపాటు , 100 మంది యూత్ నాయకులు కాంగ్రెస్ కు రాజీనామా చేసి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్దం పుచ్చుకున్నారు. గులాబీ కండువాతో ఆహ్వానం పలికారు. కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన చేరీకల కార్యక్రమంలో మొయినుద్దీన్ పాల్గొనగా , అంజద్, సాజిద్, నజీర్, నజీర్, జునైద్, జానీ, ఆరీఫ్, తో పాటు చింతల నాగరాజు, నవీన్, కార్తీక్, రోహిత్, సందీప్, చంద్రశేఖర్, లక్ష్మణ్, సుధాకర్ తో పాటు వందమంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు.

పాక్‌కి వెళ్లినప్పుడు నాపైన రాళ్లు వేశారు! ‘జై శ్రీరామ్’ అంటే తప్పేంటి... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

పాక్‌కి వెళ్లినప్పుడు నాపైన రాళ్లు వేశారు! ‘జై శ్రీరామ్’ అంటే తప్పేంటి... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..



అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం అందుకుంది. ఈ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తున్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ని చూస్తూ ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు కొందరు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్. ఈ ప్రవర్తనపై పాకిస్తాన్ క్రికెట్ కోచ్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు..

article_image1



భారత్ చేతుల్లో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కూడా దీన్ని సాకుగా పెట్టుకుని, సానుభూతి పొందాలని ప్రయత్నించింది. అహ్మదాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ ప్రవర్తనపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఫ్యాన్స్ చేసిన దానికి తామేం చేయలేమని, వారికి కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తించదని తేల్చేసింది ఐసీసీ..


తాజాగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ దీనిపై స్పందించాడు. ‘నేను ఓ సారి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాను. అప్పుడు నా పైకి రాళ్లు, ఐరన్ బోల్ట్‌లు విసిరారు. అందులో ఓ రాయి నా కళ్ల మధ్య తగిలింది. కంటికి తగిలి ఉంటే నా చూపు పోయి ఉండేది..


అయితే అభిమానులు చేసిన ఆ చిల్లర పనిని పట్టుకుని, మేం రచ్చ చేయాలని అనుకోలేదు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ మాత్రం చెత్త పర్ఫామెన్స్ కారణంగా వస్తున్న ట్రోలింగ్ తప్పించుకునేందుకు అహ్మదాబాద్ ఫ్యాన్స్ చేసిన చిన్న పనిని పెద్దది చేయాలని చూస్తోంది..’ అంటూ వ్యాఖ్యానించాడు ఇర్ఫాన్ పఠాన్..


పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా దీనిపై ఘాటుగా స్పందించాడు. ‘పాకిస్తాన్ మహిళా జర్నలిస్ట్ జైనబ్ అబ్బాస్ ఇండియా గురించి, హిందువుల గురించి పిచ్చి పిచ్చి రాతలు రాస్తే తప్పులేదు..

 


article_image5

ఐసీసీ ఈవెంట్‌లో పాకిస్తాన్ పాటలు వేయలేదని మిక్కీ ఆథర్, దీన్ని బీసీసీఐ ఈవెంట్ అంటే తప్పులేదు? ప్లే గ్రౌండ్‌లో, భారతీయుల మధ్య మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేస్తే తప్పులేదు.. ఎదుటివారిలోనే తప్పులు వెతకాలని చూడకండి?’ అంటూ ట్వీట్లు చేశాడు డానిష్ కనేరియా...

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా ఓటమి తర్వాత భారత జట్టుపై పాక్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మహ్మద్ షమీ, ఓ పాక్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. అయితే మిగిలిన టీమ్ ప్లేయర్లు, ఓటమి బాధతో డ్రెస్సింగ్ రూమ్‌కి సైలెంట్‌గా వెళ్లారే తప్ప, జనాల ప్రవర్తనను పెద్దది చూసి సానుభూతి పొందాలని చూడలేదు..