ఈనెల 27న ఒకే రోజు డబుల్ బెడ్ రూమ్ మూడు నాలుగు విడతల లబ్ధిదారుల ఎంపిక...

ఈనెల 27న ఒకే రోజు డబుల్ బెడ్ రూమ్ మూడు నాలుగు విడతల లబ్ధిదారుల ఎంపిక

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కోసం ఈనెల 27న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాండో మైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా నిర్వహించనున్నారు. ఈ నెల 27న నిర్వహించే ఆన్ లైన్ డ్రా‌లో 3,4 విడతలకు సంబంధించి 21 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. అక్టోబర్ 2న 10,500 మందికి, అక్టోబర్ 5న మరో 10,500 మందికి చొప్పున ఇండ్లను పంపిణీ చేయనున్నారు.

GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి‌లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ‌కి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 2 విడతలలో ఎలాంటి విమర్శలకు తావులేకుండా ఎంతో పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి 24,900 ఇండ్లను పంపిణీ చేశారు. మొదటి, రెండో విడతలకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక కోసం అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే NIC రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ర్యాండో మైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా నిర్వహించారు.


Sb news


SB NEWS TELANGANA


Sb news are national news




కథ ముగియలేదు.. చంద్రయాన్ పై ఇస్రో ప్రకటన

కథ ముగియలేదు.. చంద్రయాన్ పై ఇస్రో ప్రకటన

   

చంద్రయాన్-3 పార్ట్-2 ఇంకా మొదలుకాలేదు. చంద్రుడి దక్షిణ దృవంపై సూర్యకాంతి పడినప్పటికీ, ల్యాండర్-రోవర్ ఇంకా యాక్టివేట్ కాలేదు. ఇస్రోకు సిగ్నల్ అందలేదు. అయితే కథ ఇక్కడితో ముగియలేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంకా 14 రోజులు టైమ్ ఉందని చెబుతున్నారు. ఈ 2 వారాల్లో ఏదైనా జరగొచ్చనేది వాళ్ల వాదన.

అక్టోబర్ 6న చంద్రుడిపై మరోసారి సూర్యాస్తమయం అవుతుంది. అప్పటివరకు విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ ను మేల్కొలిపేందుకు సైంటిస్టులు ప్రయత్నిస్తూనే ఉంటారని ఇస్రో ప్రకటించింది. ఒక్కసారి కమ్యూనికేషన్ ఏర్పడితే, చంద్రయాన్-3లో మరో ఘట్టం మొదలైనట్టు అవుతుంది.

 

విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ తో కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేశామని, అయితే ప్రస్తుతానికి, వాటి నుండి ఎటువంటి సంకేతాలు అందలేదని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అయినప్పటికీ, కమ్యూనికేషన్ కోసం ప్రయత్నాలను కొనసాగిస్తామని తెలిపారు.

అంతరిక్షంలోకి 40 రోజుల ప్రయాణం తర్వాత, చంద్రయాన్-3 ల్యాండర్, 'విక్రమ్', ఆగష్టు 23న నిర్దేశించని చంద్రుని దక్షిణ ధృవాన్ని తాకింది. దక్షిణ దృవాన్ని తాకిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ టచ్‌ డౌన్ స్పాట్ అయిన శివశక్తి పాయింట్ నుండి చంద్రుని ఉపరితలంపై 100 మీటర్లకు పైగా దాటిన తర్వాత, ప్రగ్యాన్ రోవర్ ను సురక్షితంగా పార్క్ చేశారు. సూర్యరశ్మి తగ్గిపోవడంతో.. అలా అటు రోవర్ ను, ఇటు ల్యాండర్ ను స్లీప్ మోడ్ లోకి పంపారు.

చంద్రయాన్-2 ఎలా మేల్కొంటుంది?

"విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ దాదాపు 2 వారాలుగా గాఢ నిద్రలో ఉన్నాయి. ఇది దాదాపుగా ఫ్రీజర్‌ లోంచి ఏదో తీసి దానిని ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్ 150 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉంటాయి కాబట్టి.. ల్యాండర్-రోవర్ వాటిని తట్టుకొని తిరిగి పునరుత్తేజం అవుతాయా అవ్వవా అనేది చెప్పలేని పరిస్థితి.

ల్యాండర్, రోవర్ మళ్లీ మేల్కొనాలంటే.. సూర్యరశ్మి వల్ల సౌరఫలకాలు వేడెక్కాలి. అవి బ్యాటరీలను రీఛార్జ్ చేయాలి. ఈ రెండు సక్సెస్ ఫుల్ గా సాగితే, ఆటోమేటిగ్గా సిస్టమ్ ఆన్ ఆవుతుంది.

చంద్రయాన్-3 తదుపరి మిషన్ ఏమిటి?

చంద్రుడి దక్షిణ దృవంపై నీటి ఉనికిని నిర్ధారించడం చంద్రయాన్-3 తదుపరి లక్ష్యం. రోవర్ లో తక్కువ ప్రేరేపిత స్పెక్ట్రోస్కోపీ పరికరం ఉంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న లోహాలన్నింటినీ మనకు చూపించింది. అక్కడ ఆక్సిజన్ ఉనికిని కూడా చూపించింది, కానీ నీటి జాడ కనిపించలేదు.

వాస్తవానికి విశ్వంలో ఎక్కడైనా సిలికాన్ ఆధారిత లోహాలు పగలడం ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. లేదా నీరు విచ్ఛిన్నం వల్ల కూడా ఆక్సిజన్ పుడుతుంది. అయితే దక్షిణ దృవంపై హైడ్రోజన్‌ను గుర్తించగలిగితే, హైడ్రోజన్ ఉనికిని గుర్తించడం వల్ల నీరు ఉందని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే హైడ్రోజన్ ఎప్పుడూ ఇతర సమ్మేళనంలో భాగం కాదు. కాబట్టి ఆ సందర్భంలో అక్కడ నీరు ఉందని కచ్చితంగా నిరూపించవచ్చు.

Sb news telangana

ప్లాస్టిక్ బాటిళ్లతో కోతుల బెడదకు పరిష్కారం.. శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కరణ..

ప్లాస్టిక్ బాటిళ్లతో కోతుల బెడదకు పరిష్కారం.. శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కరణ

మన దగ్గర ఏ ఊరికి వెళ్లినా మనుషుల కంటే ఎక్కువగా కోతులు కనిపిస్తున్నాయి. ఆహారం కోసం ఇళ్లలోకి దూరి చిందరవందర చేయడం, మనుషులపై దాడి చేయడం లాంటి ఘటనకు పాల్పడుతున్నాయి. కోతుల కారణంగా ఇళ్లలో పెంచుకుంటున్న పండ్ల చెట్లను కొట్టేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక రైతుల ఇబ్బందులైతే మాటల్లో చెప్పలేం. కోతుల బెడదను తప్పించడానికి మొహాలీలోని ఐఐఎస్ఈఆర్‌ఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న సామ్రాట్ ఘోష్ ఓ పరిష్కారం కనుగొన్నారు.

తెలంగాణలో గత కొన్నేళ్లుగా కోతుల బెడద ఎక్కువైంది. అడవులు తగ్గిపోవడంతో గ్రామాల్లోకి వచ్చేసిన కోతులు.. ఆహారం కోసం ఇళ్లలోకి దూరి బీభత్సం సృష్టిస్తున్నాయి. కోతుల దాడిలో ఎంతో మంది మహిళలు గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. కోతుల బెడద భరించలేక చాలా గ్రామాల్లో చెట్లను నరికేయాల్సిన దుస్థితి తలెత్తింది.

ఒకప్పుడు ఊళ్లలో ప్రతి ఇంట్లోనూ పండ్ల చెట్లు, కూరగాయ పాదులు ఉండేవి. కానీ కోతులు ఇళ్లలోనే తిష్ట వేస్తుండటంతో.. పల్లె ప్రజలు మనసుకు కష్టమైనా సరే వాటిని నరికేయక తప్పడం లేదు. కోతుల బాధ భరించలేక చాలా మంది రైతులు సాగు చేసే పంటలను సైతం మార్చేశారు.

కోతులను తరిమేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రయోజనం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. కోతుల సమస్య కేవలం మనకే కాదు.. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఉంది. దీంతో కోతుల బెడదను తప్పించడానికి, తేలిగ్గా వాటిని తరిమేయడానికి డాక్టర్ సామ్రాట్ ఘోష్ అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ బాటిళ్లతో ‘నీల్‌ గగన్’ అనే సోనిక్ రాకెట్‌ను తయారు చేశారు. వీటి నుంచి బుల్లెట్ షాట్ల తరహాలో సౌండ్ వస్తుంది. 60 అడుగుల వరకూ ఈ ప్లాస్టిక్ బాటిళ్ల రాకెట్‌ను ప్రయోగించొచ్చు. 2017లోనే సామ్రాట్ ఘోష్ ఈ సోనిక్ రాకెట్‌ను తయారు చేశారు. ఇందుకోసం రకరకాల ప్రయోగాలు చేసిన ఆయన.. తాను తయారు చేసిన ప్రోటోటైప్స్‌ను ఆపిల్ తోటలు సాగు చేసే హిమాచల్ ప్రదేశ్ రైతులకు ఇచ్చారు. హిమాచల్ రైతులు తనకు ప్లాస్టిక్ బాటిళ్లు ఇస్తే.. వాటి సాయంతో తాను రాకెట్లను తయారు చేసినట్లు ఆయన చెప్పారు.

ఘోష్ ప్రస్తుతం మొహాలీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండర్ రీసెర్చ్ (IISERM)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. 1992-98 మధ్య బెంగళూరులోని ఐఐఎస్‌సీ నుంచి పీహెచ్‌డీ చేసిన ఘోష్.. ఆ సమయంలో తాను చేసిన అధ్యయనం నుంచి రూపొందించిన ఫార్ములాతో కోతులను పారదొలే రాకెట్‌ను రూపొందించానని చెప్పారు. ఐఐటీ బాంబే నుంచి ఎమ్మెస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ చదివిన ఘోష్.. అమెరికా, కెనడా, జర్మనీల్లో పని చేశారు.

కోతులు, పక్షుల బారి నుంచి పంటను కాపాడుకోవడం కోసం గంధకం-పొటాష్‌తో కూడిన గన్‌ను రైతులు వాడుతుంటారు. వాటిని వాడే క్రమంలో చాలా మంది రైతులు గాయపడటాన్ని చూసిన ఘోష్..

ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నారు. ఆ దిశగా ప్రయోగాలు చేసి నీల్ గగన్‌ను రూపొందించారు. నేషనల్ సైన్స్ సెంటర్ ఢిల్లీ నిర్వహించిన ఇన్నోవేషన్ ఫెయిర్‌లో గ్రాస్‌రూట్స్ నీల్ గగన్‌కు ఫస్ట్ ప్రైజ్ లభించింది. నీల్ గగన్ కోతులను పారదోలడంలో సత్ఫలితాలను ఇస్తుండటంతో ఘోష్ దానికి పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

   

Sb news telangana

మానసిక స్థితి సరిగా లేని దివ్యాంగుల వివరాలు ఇవ్వండి: హైకోర్టు

మానసిక స్థితి సరిగా లేని దివ్యాంగుల వివరాలు ఇవ్వండి: హైకోర్టు

మానసిక స్థితి సరిగా లేని దివ్యాంగులు, అనాధలైన మానసిక దివ్యాంగులతో పాటు వారికి వైద్య సేవలు అందిస్తున్న నిపుణులు, పారా మెడికల్ సిబ్బంది వివరాలను జిల్లాల వారీగా ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం-2017 అమలుకు ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. 

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22 (నమస్తే తెలంగాణ): మానసిక స్థితి సరిగాలేని దివ్యాంగులు, అనాథలైన మానసిక దివ్యాంగులతోపాటు వారికి వైద్యసేవలు అందిస్తున్న నిపుణులు, పారా మెడికల్‌ సిబ్బంది వివరాలను జిల్లాలవారీగా ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం-2017 అమలుకు ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 19కి వాయిదా వేసింది.

Sb news

sb news telangana

మహిళా హక్కుల రక్షణ, భద్రతా భరోసా కొరకు చలో ఢిల్లీ జయప్రదం చేయండి.

మహిళా హక్కుల రక్షణ, భద్రతా భరోసా కొరకు చలో ఢిల్లీ జయప్రదం చేయండి.

   పాలడుగు ప్రభావతి ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పిలుపు

మహిళా హక్కుల రక్షణ భద్రత భరోసా కై అక్టోబర్ 5న చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతీ పిలుపునిచ్చారు

  శనివారం రోజున నల్లగొండ భాస్కర్ టాకీస్ వద్ద జీపు ప్రచార జాత సభను ప్రారంభించి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా సంవత్సరాలు గా కాలయాపన చేసి నేడు మహిళా రిజర్వేషన్ 33% బిల్లును ఆమోదించారని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం మానుకోవాలని చిత్తశుద్ధితో జరిగే అసెంబ్లీ తదుపరి పార్లమెంటు లో అమలు చేయాలన్నారు.

బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మహిళలపై ఆకృత్యాలు ఎక్కువ అయ్యాయని అన్నారు. మహిళలపై రోజురోజుకు హింస, లైంగిక దాడులు, అత్యాచారాలు తీవ్రతరమైపోతున్నాయని భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా మహిళల రక్షణకై మార్పు రాలేదన్నారు. పార్లమెంటు వేదికగా మహిళా రక్షణ కోసం అనేక చట్టాలు రూపొందిస్తున్నా ఆచరణలో ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. బేటి బచావో బేటి పడావో అని చెప్తున్న బిజెపి ప్రభుత్వం నేరగాళ్లకే కొమ్ముకాస్తుందన్నారు. అత్యాచారాలకు లైంగిక వేధింపులకు పాల్పడేవారిలో బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ లాంటి వారే అగ్రస్థానంలో ఉన్నారన్నారు. మహిళల పై జరుగుతున్న వివిధ రకాల దాడులను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఉపాధి హామీ పనులు సంవత్సరానికి ₹200 రోజులు కల్పించి 600 వేతనాలు ఇవ్వాలన్నారు కేరళ తమిళనాడు ప్రభుత్వాల మాదిరిగా ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు సబ్సిడీ ధరలకు అందించాలని కోరారు ఇంటి జాగాలేని పేదలకు 125 గజాల భూమి ఇచ్చి ఇంటి నిర్మాణానికి కేంద్రం 10 లక్షలు రాష్ట్ర 5 లక్షలు ఇవ్వాలని కోరారు.

మహిళా హక్కుల కోసం పోరాడుతున్న అతిపెద్ద మహిళా సంఘంగా ఐద్వా క్రియాశీలక పాత్ర పోషిస్తూ మహిళల పట్ల జరుగుతున్న వివిధ సంఘటన పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ మహిళల ను రక్షించుకోవడం కోసం,మరిన్ని హక్కులను సాధించుకోవడం బలమైన ఉద్యమాలను నిర్మించింది అన్నారు. అందులో బాగంగానే అక్టోబర్ 5 న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలను సమీకరించి నిర్వహిస్తున్నామని ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున కదిలి రావాలని ప్రభావతి పిలుపునిచ్చారు.

 

  ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలే బోయిన వరలక్ష్మి మాట్లాడుతూ మాట్లాడుతూ మహిళా స్వేచ్ఛా స్వాతంత్యాలను కాపాడడం కంటే వారి హక్కులను ఏలా కాలరాయాలో బిజెపి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుందన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు చుక్కలంటాయని గ్యాస్ పెట్రోలు డీజిల్ ధరలు పెరిగిపోయాయి అన్నారు. ధరలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు.

ఈ జీపు ప్రచార జాత కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి పాతూరి గోవర్ధన జిల్లా కమిటీ సభ్యురాలు గోలి వెంకటమ్మ బొల్లేపల్లి మంజుల ఎండి సుల్తానా జంజిరాల ఉమా చిన్నపాక మంజుల తదితరులు పాల్గొన్నారు.

Sb news

Sb news telangana

పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్న బిజెపి పార్టీ నీ మాదిగలు భూస్థాపితం చేస్తాం

పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్న బిజెపి పార్టీ నీ మాదిగలు భూస్థాపితం చేస్తాం

వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చిన బిజెపి పార్టీ ఇంతవరకు పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్న బిజెపి పార్టీ నీ మాదిగలు భూస్థాపితం చేస్తాం 

ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు మారపాక నరేందర్ మాదిగ          

మాదిగలకు ఇచ్చిన చిరకాల కోరినటువంటి వర్గీకరణ గతంలో కిషన్ రెడ్డి కావచ్చు వెంకయ్య నాయుడు కావచ్చు సుష్మ స్వరాజ్ కావచ్చు చాలామంది కూడా వర్గీకరణ అంశం న్యాయం అయిన డిమాండ్ వర్గీకరణ బిల్లునుచేసే బాధ్యత మాది అని చెప్పేసి చాలా సార్లు మాట ఇచ్చారు బిజెపి పార్టీ నాయకులు ఈరోజు వరకు కూడా బిల్లు ను పార్లమెంటులో పెట్టకుండా బిజెపి పార్టీ నిర్లక్ష్యం వయిస్తుంది ఉంది.

కాబట్టి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఎలక్షన్లలో మాదిగల సత్తా ఏందో బిజెపి పార్టీకి చూపిస్తామని తెలియజేస్తున్నా. బిజెపి పార్టీ నాయకులు కావచ్చు ఎవరైనా గాని మాదిగలకు ఇచ్చినటువంటి మాట తప్పినందుకు రాబోయే ఎలక్షన్లలో గ్రామం నుండి రాష్ట్రంలో వ్యాప్తంగా వాళ్ళు ను అడ్డుకుంటామని తెలియజేస్తున్నాను మాకు ఇచ్చినటువంటి హామీ నీ నిలబెట్టుకున్నంత వరకు తక్షణమే వారి యొక్క బిజెపి పార్టీని భూస్థాపితం చేసేంతవరకు నిద్రపోము అని తెలియజేస్తా ఉన్నాం.

ఈ యొక్క వర్గీకరణ ఉద్యమంలో ఎంతోమంది అభాగ్యులు, నాయకులు చాలామంది కూడా ప్రాణత్యాగాలు చేయడం జరిగింది ... మాదిగ అమరుల యొక్క కోరికను వర్గీకరణ అంశాన్ని మాదిగలు ఈ బీజేపీ పార్టీ మోసాన్ని ఎండ కడుతూ రాబోయే ఎలక్షన్లో బిజెపి పార్టీ వాళ్లకు గుణ పాఠం చేపుతం. ..

ఒక్కరో ఇద్దరో ఎమ్మెల్యేలు ఉన్నారు అదేవిధంగా ఎంపీలు ఒకరో ఇద్దరో ఉన్నారు కానీ రాబోయే ఎలక్షన్లలో ఒక్కరు లేకుండా గాని మాదిగలు వారి లేకుండా ప్రతి గ్రామం నుండి వాళ్ళని తరిమి కొడతారని తెలియజేస్తా ఉన్నాం తిప్పర్తి మండలం నుంచి ఎమ్మార్పీఎస్ -TS పక్షాన నల్గొండ జిల్లా అధ్యక్షులు మారపాక నరేందర్ మాదిగ డిమాండ్ చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పుల్లెముల యాదయ్య మాదిగ, మండల అధ్యక్షులు బొజ్జ ఎల్లయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు బోస్క్ శ్రినయ మాదిగ, కొండేటి అంజి మాదిగ తిప్పర్తి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

ప్రపంచ వేదిక పైన తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానం

ప్రపంచ వేదిక పైన తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానం

తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానం పైన ప్రసంగించాల్సిందిగా మంత్రి కేటీఆర్ కు అందిన ప్రతిష్టాత్మక ఆహ్వానం

ఈ సంవత్సరం అమెరికాలో జరగనున్న నార్మన్ బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేటీఆర్ కి ఆహ్వానం

తెలంగాణ వ్యవసాయ విధానాల నుంచి ఆహార భద్రత రంగంలో అనేక అంశాలు నేర్చుకునేందుకు వీలుందని తెలిపిన నిర్వాహకులు

గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుతమైన వ్యవసాయ ప్రగతి ప్రస్థానాన్ని వివరించాలని మంత్రి కె. తారక రామారావుకి ఒక అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాత ఆహ్వానం అందింది. వ్యవసాయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శాస్త్రవేత్త, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ ఈ బోర్లాగ్ పేరిట ఏర్పాటు చేసిన బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్ సమావేశం లో మంత్రి కేటీఆర్ ను ప్రసంగించాలని నిర్వాహకులు ఆహ్వానం అందించారు. అక్టోబర్ 24 నుంచి 26వ తేదీ వరకు అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలోని డేస్మోయిన్ లో ఈ సమావేశం జరగనున్నది.

ఈ సంవత్సరం జరగనున్న బోర్లాగ్ డైలాగ్ సమావేశంలో transformative solutions to achieve a sustainable, equitable, and nourishing food system అనే ప్రధాన ఇతివృత్తం ఆధారంగా చర్చలు కొనసాగనున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన 1200 మంది అతిథులు ఈ సమావేశానికి నేరుగా హాజరవుతారు. దీంతో పాటు వేలాదిమంది సామాజిక మాధ్యమాల ద్వారా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన విస్తృతస్థాయి చర్చలను ప్రతి ఏటా ఈ సమావేశాల్లో చర్చిస్తారు. 

తెలంగాణ రాష్ట్ర అనుభవాలను ఈ సమావేశంలో చర్చించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ సమావేశాలకు హాజరవుతున్న అనేకమందికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ కు పంపిన ఆహ్వాన పత్రంలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అధ్యక్షులు టెర్రి ఈ బ్రాడ్ స్టాడ్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యవసాయ ప్రగతి కోసం రాష్ట్రం అనుసరించిన విధానాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించడం ద్వారా ప్రపంచ ఆహార భద్రతను మరియు సరఫరాను పెంచడం, ప్రపంచ ఆహార కొరతను ఎదుర్కోవడం వంటి కీలకమైన అంశాల పట్ల ఒక విస్తృతమైన అవగాహన ఏర్పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని వివరించాలని మంత్రి కేటీఆర్ కు పంపుతున్న ఆహ్వానం ఈ సమావేశానికి గౌరవాన్ని అందిస్తుందని కేటీఆర్ కు పంపిన ఆహ్వాన లేఖలో టెర్రీ తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ముఖ్యంగా వ్యవసాయ రంగ ప్రగతిని గుర్తించి ఈ అంశం పైన ప్రసంగించాల్సిందిగా వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఫౌండేషన్ పంపిన ఆహ్వానం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలలో రాష్ట్రం వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎన్నో వినూత్నమైన, విప్లవాత్మకమైన కార్యక్రమాలను అనుసరించిందని వాటి ప్రతిఫలాలను ఈరోజు తెలంగాణ రైతాంగం అందుకుంటున్నదని, ఆహార భద్రత అంశంలో దేశానికి కూడా తెలంగాణ రాష్ట్రం భరోసాగా నిలుస్తుంది అన్నారు. ఇంతటి విజయవంతమైన తెలంగాణ వ్యవసాయ నమూనాను అంతర్జాతీయ వేదిక పైన వివరించాలని వచ్చిన ఆహ్వానం తెలంగాణ రాష్ట్ర విధానాలకు దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. 

మంత్రి కేటీఆర్ తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కి కూడా ఆహ్వానాన్ని సంస్థ అందించింది.

త్వరలోనే కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్..? ఇదేం అరాచకం..!

త్వరలోనే కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్...? ఇదే మారాచకం...?


తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేస్తారా..? తెలంగాణకు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూరుస్తోన్న భాగ్యనగరాన్ని రాష్ట్రం నుంచి వేరు చేస్తారా..?

కేంద్రం మనసులో ఏముందో తెలీదుగానీ సోషల్ మీడియాలో మాత్రం జోరుగా చర్చ నడుస్తోంది.

హైదరాబాద్‌ను యూటీ చేస్తారంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తేనే ఇలాంటి ప్రచారాన్ని నమ్మాల్సి ఉంటుంది. లేకపోతే అప్పటి వరకూ దాన్ని పట్టించుకోనక్కర్లేదు.

sb news

sb news telangana

sb news are national news



ఇది భారత మహిళా అపురూప విజయం

ఇది భారత మహిళా అపురూప విజయం

న్యూఢిల్లీ:సెప్టెంబర్ 22

చట్టసభలలో మహిళలకు 33శాతం కోటా కల్పించే బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ లో బిల్లుకు ఆమోదం దక్కడంతో ఇక చట్టసభలలో ‘ ఆమె’ కొత్త కథకు, నయాసిల్‌సిలాకు జరిగింది. దాదాపు పది గంటలకు పైగా సుదీర్ఘ చర్చ తరువాత గురువారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఓటింగ్ జరిగింది.

ప్రతి సభ్యుడి వద్ద ఉన్న మల్టీ మీడియా డివైజ్ సిస్టమ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. పద్ధతిలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఓటింగ్‌లో మొత్తానికి మొత్తం 215 ఓట్లు అనుకూలంగా పడ్డాయి.

ఓటు ఒక్కటి పడలేదు . దీనితో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం దక్కింది. రాజ్యసభ అధ్యక్షుడు , ఉప జగదీప్ ధన్‌కర్ ఆధ్వర్యంలో ని ర్వహించారు.పార్లమెంట్ ఆమోదం పొందుతోన్న ఈ బిల్లు దేశ మహిళ శక్తి ని మరింత ద్విగుణీకృతం చేస్తుందని ప్రధాని మోడీ తమ ప్రసంగంలో తెలిపారు.

ఈ బిల్లుపై జరిగిన చర్చ లో ఉభయసభలకు చెందిన 132 మంది సభ్యులు పాల్గొన్నారని , ఇది కొత్త పార్లమెంట్‌కు గర్వకారణం అని మోడీ తెలిపారు. ఈ చర్చల దశలో వ్యక్తమైన ప్రతి అంశానికి రాబోయే చరిత్రలో విలువ ఉంటుందన్నారు.

బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఈ బిల్లు ఆమోదం పొం దడం పట్ల వెంటనే స్పందించారు. ఇది అపూర్వ ఘట్టం అని పేర్కొన్నారు. బిల్లును ఇప్పుడు పార్లమెంట్ ఆమోదం దక్కడంతో రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపిస్తారు.

అంతకుముందు మహిళా బిల్లును కేంద్రప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఒక్కరోజు క్రితం బుధవారం ఈ బిల్లు చారిత్రక రీతిలో లోక్‌సభలో ఆమోదం పొందింది.

చట్టసభలలో మూడింట ఒక వంతు మహిళా కోటా సంబంధిత బిల్లు దేశంలోని మహిళల సాధికారత దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పరంపరలో భా గం అని బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతూ న్యాయశాఖ మంత్రి తెలిపారు.

128వ రాజ్యాంగ సవరణ బిల్లును సభ ముందు కు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.

*అంగన్‌వాడీ టీచర్లకు త్వరలో పిఆర్సి ప్రకటిస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

అంగన్‌వాడీ టీచర్లకు త్వరలో పిఆర్సి ప్రకటిస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్ 

హైదరాబాద్:సెప్టెంబర్ 22

అంగన్‌వాడీ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అంగన్ వాడీ సిబ్బంది తమకు జీతాలు పెంచాలని ధర్నా చేస్తున్న సందర్భంగా సత్యవతి మీడియాతో మాట్లాడారు.

అంగన్‌వాడీ ఉద్యోగుల సమ్మె సరైనది కాదని, ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను సిఎం పరిష్కరిస్తారని, రూ.4200 ఉన్న జీతాన్ని రూ.7500లకు పెంచిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.

అంగన్‌వాడీ ఉద్యోగులకు ప్రస్తుతం రూ.13850 జీతం అందుతోందని, ఆయాల జీతంలో కేంద్రం వాటా కేవలం రూ.1350 మాత్రమేనని సత్యవతి చెప్పారు.

తెలంగాణలో అందుతున్న అంగన్‌వాడీ సేవలపై కేంద్రం నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని కొనియాడారు. అంగన్‌వాడీ టీచర్లకు త్వరలో పిఆర్‌సి ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.

Sb news

sb news telangana

sb news are national news