TS: రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు

Telangana: రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
గురువారం ఆసిఫాబాద్ లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిర్పూర్(టీ)లో 11.3 సెం.మీ వర్షపాతం కురిసింది.
ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, ములుగు, వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
SB NEWS
SB NEWS TELANGANA
STREETBUZZ APP
Sep 24 2023, 11:46