నల్లగొండ: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఘనంగా నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని, నల్లగొండ మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణాచారి శుక్రవారం, నల్లగొండ పట్టణంలోని గణేష్ విగ్రహాల నిమజ్జన కేంద్రాలైన వల్లభరావు చెరువు మరియు భీమసముద్రంలను పరిశీలించి, నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
కార్యక్రమంలో పలువురు మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS
SB NEWS NALGONDA
STREETBUZZ NEWS
Sep 22 2023, 22:11