త్వరలోనే కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్..? ఇదేం అరాచకం..!

త్వరలోనే కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్...? ఇదే మారాచకం...?


తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేస్తారా..? తెలంగాణకు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూరుస్తోన్న భాగ్యనగరాన్ని రాష్ట్రం నుంచి వేరు చేస్తారా..?

కేంద్రం మనసులో ఏముందో తెలీదుగానీ సోషల్ మీడియాలో మాత్రం జోరుగా చర్చ నడుస్తోంది.

హైదరాబాద్‌ను యూటీ చేస్తారంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తేనే ఇలాంటి ప్రచారాన్ని నమ్మాల్సి ఉంటుంది. లేకపోతే అప్పటి వరకూ దాన్ని పట్టించుకోనక్కర్లేదు.

sb news

sb news telangana

sb news are national news



ఇది భారత మహిళా అపురూప విజయం

ఇది భారత మహిళా అపురూప విజయం

న్యూఢిల్లీ:సెప్టెంబర్ 22

చట్టసభలలో మహిళలకు 33శాతం కోటా కల్పించే బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ లో బిల్లుకు ఆమోదం దక్కడంతో ఇక చట్టసభలలో ‘ ఆమె’ కొత్త కథకు, నయాసిల్‌సిలాకు జరిగింది. దాదాపు పది గంటలకు పైగా సుదీర్ఘ చర్చ తరువాత గురువారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఓటింగ్ జరిగింది.

ప్రతి సభ్యుడి వద్ద ఉన్న మల్టీ మీడియా డివైజ్ సిస్టమ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. పద్ధతిలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఓటింగ్‌లో మొత్తానికి మొత్తం 215 ఓట్లు అనుకూలంగా పడ్డాయి.

ఓటు ఒక్కటి పడలేదు . దీనితో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం దక్కింది. రాజ్యసభ అధ్యక్షుడు , ఉప జగదీప్ ధన్‌కర్ ఆధ్వర్యంలో ని ర్వహించారు.పార్లమెంట్ ఆమోదం పొందుతోన్న ఈ బిల్లు దేశ మహిళ శక్తి ని మరింత ద్విగుణీకృతం చేస్తుందని ప్రధాని మోడీ తమ ప్రసంగంలో తెలిపారు.

ఈ బిల్లుపై జరిగిన చర్చ లో ఉభయసభలకు చెందిన 132 మంది సభ్యులు పాల్గొన్నారని , ఇది కొత్త పార్లమెంట్‌కు గర్వకారణం అని మోడీ తెలిపారు. ఈ చర్చల దశలో వ్యక్తమైన ప్రతి అంశానికి రాబోయే చరిత్రలో విలువ ఉంటుందన్నారు.

బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఈ బిల్లు ఆమోదం పొం దడం పట్ల వెంటనే స్పందించారు. ఇది అపూర్వ ఘట్టం అని పేర్కొన్నారు. బిల్లును ఇప్పుడు పార్లమెంట్ ఆమోదం దక్కడంతో రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపిస్తారు.

అంతకుముందు మహిళా బిల్లును కేంద్రప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఒక్కరోజు క్రితం బుధవారం ఈ బిల్లు చారిత్రక రీతిలో లోక్‌సభలో ఆమోదం పొందింది.

చట్టసభలలో మూడింట ఒక వంతు మహిళా కోటా సంబంధిత బిల్లు దేశంలోని మహిళల సాధికారత దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పరంపరలో భా గం అని బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతూ న్యాయశాఖ మంత్రి తెలిపారు.

128వ రాజ్యాంగ సవరణ బిల్లును సభ ముందు కు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.

*అంగన్‌వాడీ టీచర్లకు త్వరలో పిఆర్సి ప్రకటిస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

అంగన్‌వాడీ టీచర్లకు త్వరలో పిఆర్సి ప్రకటిస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్ 

హైదరాబాద్:సెప్టెంబర్ 22

అంగన్‌వాడీ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అంగన్ వాడీ సిబ్బంది తమకు జీతాలు పెంచాలని ధర్నా చేస్తున్న సందర్భంగా సత్యవతి మీడియాతో మాట్లాడారు.

అంగన్‌వాడీ ఉద్యోగుల సమ్మె సరైనది కాదని, ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను సిఎం పరిష్కరిస్తారని, రూ.4200 ఉన్న జీతాన్ని రూ.7500లకు పెంచిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.

అంగన్‌వాడీ ఉద్యోగులకు ప్రస్తుతం రూ.13850 జీతం అందుతోందని, ఆయాల జీతంలో కేంద్రం వాటా కేవలం రూ.1350 మాత్రమేనని సత్యవతి చెప్పారు.

తెలంగాణలో అందుతున్న అంగన్‌వాడీ సేవలపై కేంద్రం నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని కొనియాడారు. అంగన్‌వాడీ టీచర్లకు త్వరలో పిఆర్‌సి ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.

Sb news

sb news telangana

sb news are national news

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కొత్తిమీర ఆకులను నమిలితే ఎన్ని లాభాలో.. ఈ రోగాలన్నీ పరార్..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కొత్తిమీర ఆకులను నమిలితే ఎన్నో లాభాలే.. ఈ రోగాలన్నీ పరార్..

యాంటీమైక్రోబయల్, యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వంటి గుణాలు కూడా కొత్తిమీరలో ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కొత్తిమీర తింటే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం.

 

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి మరియు వ్యాధులను అధిగమించడానికి వైద్యులు ఆకుపచ్చ కూరగాయలను తినాలని సిఫార్సు చేస్తారు. పచ్చి కూరగాయల జాబితాలో పచ్చి కొత్తిమీర పేరు కూడా ఉంది. పచ్చగా కనిపించే కొత్తిమీర వంటల రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

 

గ్రీన్ కొత్తిమీరలో శక్తి, కార్బోహైడ్రేట్, కొవ్వు, డైటరీ ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, రాగి, జింక్, సెలీనియం, మాంగనీస్, సోడియం, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ బి6, థయామిన్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

 అంతే కాదు యాంటీమైక్రోబయల్, యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వంటి గుణాలు కూడా కొత్తిమీరలో ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కొత్తిమీర తింటే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం.

 గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది: పచ్చి కొత్తిమీర గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది శరీరం నుండి అదనపు సోడియంను తొలగిస్తుంది. అంతే కాదు, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ సమస్యను కూడా దూరం చేస్తుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చి కొత్తిమీరను రోజూ తినండి.4/ 8

గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది: పచ్చి కొత్తిమీర గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది శరీరం నుండి అదనపు సోడియంను తొలగిస్తుంది. అంతే కాదు, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ సమస్యను కూడా దూరం చేస్తుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చి కొత్తిమీరను రోజూ తినండి.

బ్లడ్ షుగర్ స్థాయిని అదుపులో ఉంచుకోండి: పచ్చి కొత్తిమీర డయాబెటిక్ పేషెంట్లకు లైఫ్ సేవర్ కంటే తక్కువ కాదు. వీటి ఆకులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మీకు కావాలంటే, మీరు ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకులను తినవచ్చు.

 రోగనిరోధక శక్తి: రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.దీనిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

 వాపును తగ్గిస్తుంది: పచ్చి కొత్తిమీరలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, అంటే దీన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో వాపు సమస్య తగ్గుతుంది. వాపు తరచుగా తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. అందుకే సకాలంలో చికిత్స చేయడం చాలా ముఖ్యం.7/ 8

వాపును తగ్గిస్తుంది: పచ్చి కొత్తిమీరలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, అంటే దీన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో వాపు సమస్య తగ్గుతుంది. వాపు తరచుగా తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. అందుకే సకాలంలో చికిత్స చేయడం చాలా ముఖ్యం.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.sb news దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

షెడ్యూల్ sc ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆత్మగౌర సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు శివకుమర్

అక్టోబర్ 4న జరిగే ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని నేడు హైదరాబాద్ సెక్రటేరియట్ నందు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్టోబర్ 4న జరిగే దోబీ ఘాట్ గ్రౌండ్ కంటోన్మెంటl సికింద్రాబాద్ నందు జరిగే షెడ్యూల్ sc ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆత్మగౌర సభను విజయవంతం చేయాలని వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేష్ గారు అధ్యక్షతన వాల్పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ 

కొమరం భీం మనవడు కొమ్ర సోన్ రావే భీమ్ మరియు జై బి రాజ్ 

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ 

తెలంగాణ దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తీగల అశోక్

మిత్రాస్ యూనిట్ ఆఫ్ యూత్ గ్రూప్ చైర్మన్ కంబాలపల్లి శ్రీకాంత్ తదితరులు ఉపకులాల జిల్లా రాష్ట్ర అధ్యక్షులు అందరూ హాజరై విజయవంతం చేయాలని 

ఉప కులాల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేష్ గారు తెలిపారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గం *తిరుమలగిరి మండలంలో* ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని డి ఎం హెచ్ ఓ కు వినతిపత్రం అందజేత

నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని బిజెపి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ శ్రీమతి కంకణాల నివేదిత రెడ్డి గారు DMHO సార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగినది

తిరుమలగిరి నూతనంగా మండలంగా ఏర్పడి ఏడేళ్లు కావస్తున్న నేటికి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రభుత్వ వైద్యం ఈ మండల ప్రజలకు అందని ద్రాక్షలాగా

మిగిలిపోయింది.

నల్లగొండ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా.. తిరుమలగిరిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. దీంతో మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందక చాలా అవస్థలు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలగిరి మండల ప్రజలు ఆర్ఎంపీ డాక్టర్లు, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి వేలకువేలు డబ్బులు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఉంది.

మండలంలోని 34 గ్రామ పంచాయతీల్లో సుమారు 20 గ్రామాలకు పైగా మారుమూల తందాలే. ఉన్నాయి. ఈ తండాల్లో ఏదైనా ప్రమాదం, ఆపద వచ్చినా సమయానికి గమ్యానికి చేరుకోకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం 108 వాహనం రావాలంటే 40 కి.మీ. దూరం నుంచి రావాల్సి వస్తుంది. కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తిరుమలగిరి మండల కేంద్రంలో వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో భారతీయ జనతాపార్టీ పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాము.

ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల అధ్యక్షులు పాండు నాయక్ గారు జనరల్ సెక్రెటరీ శంకర్ నాయక్ గారు చంటి తదితరులు పాల్గొన్నారు

తెలంగాణలో వానలు లేకున్నా చెరువులు ఫుల్.. నీటి నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్...

వానల్లేకున్నా చెరువులు ఫుల్‌.. రిజర్వాయర్లలో అత్యధికంగా నీటి నిల్వలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ టాప్‌

 ఈఏడాది దేశవ్యాప్తంగా అదును ప్రకారం వర్షాలు కురవకపోయినా, లోటు వర్షపాతం నమోదైనా తెలంగాణలోని రిజర్వాయర్లలో మాత్రం జలకళ ఉట్టిపడుతున్నది. రిజర్వాయర్లలో అత్యధికంగా నీటి నిల్వలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది.

కాళేశ్వరంతో భూగర్భ జలాలు పైపైకి

60 ఏండ్ల గోస పదేండ్లలో తీర్చిన కేసీఆర్‌

ఇతర రాష్ర్టాల్లో దిగజారిన నీటి నిల్వలు

మన సరిహద్దు రాష్ర్టాల రిజర్వాయర్లలో సగటు నీటి నిల్వలు మైనస్‌ నమోదు

సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ నివేదికలో వెల్లడి

ఈ ఏడాది దేశవ్యాప్తంగా అదును ప్రకారం వర్షాలు కురవకపోయినా, లోటు వర్షపాతం నమోదైనా తెలంగాణలోని రిజర్వాయర్లలో మాత్రం జలకళ ఉట్టిపడుతున్నది. రిజర్వాయర్లలో అత్యధికంగా నీటి నిల్వలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని సాక్షాత్తు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. దేశంలోని ఐదు రాష్ర్టాల్లో మినహా మిగిలిన అన్ని రాష్ర్టాల్లోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు పదేండ్ల సగటు కంటే తక్కువగా ఉన్నాయని సీడబ్ల్యూసీ తాజా నివేదిక పేర్కొన్నది. తెలంగాణలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు 68.3% ఉండగా, ఆ తర్వాత గుజరాత్‌ 14.6%తో రెండో స్థానంలో నిలిచింది.

ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌ వరుసగా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ సరిహద్దు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్‌లోని రిజర్వాయర్లలో సగటు నీటి నిల్వలు మైనస్‌ 44.2%, మహారాష్ట్రలో మైనస్‌ 8.9%, ఛత్తీస్‌గఢ్‌లో 11%, ఒడిశాలో మైనస్‌ 13.9 శాతానికి పడిపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టుల నిర్మాణం లాంటి కార్యక్రమాలు రాష్ర్టాన్ని జలభాండాగారం తీర్చిదిద్దాయి. దీంతో ఒకనాడు బీటలు వారిన చెరువుల్లో నేడు జల రావాలు వినిపిస్తున్నాయి. బీడువారిన భూములు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. ఏ పల్లెకు వెళ్లినా వాగులు, వంకలు గలగలలతో స్వాగతం పలుకుతున్నాయి. ఏ రిజర్వాయర్‌ను చూసినా పాల నురగల జలహేల కనిపిస్తున్నది. ఏ రైతు ఇంటి తలుపు తట్టినా ఆనందం వెల్లివిరుస్తున్నది. లోటు వర్షపాతంలోనూ తెలంగాణ జలసిరులతో అలరారుతున్నది. వరుణుడు కరుణించకున్నా రిజర్వాయర్లలో పుష్కలంగా నీళ్లున్నాయి. దీంతో ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురకవపోయినా తెలంగాణలో పంటల సాగు ఆగలేదు. అనుకున్న సమయానికే ఎక్కువ మొత్తంలో రైతులు విత్తనాలు విత్తారు. ఇదంతా రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వలతోనే సాధ్యమైంది.

భూగర్భ జలాల్లో దేశంలోనే టాప్‌

'రైతు బాగుంటేనే.. రాజ్యం బాగుంటుంది' అని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. స్వరాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి రైతుల స్థితిగతులను మార్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రపంచమే అబ్బుర పడేలా కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కాంగ్రెస్‌ అడ్డుకునేందుకు ఎన్ని కుయుక్తులు పన్నినా మొక్కవోని దీక్షతో అనతికాలంలోనే కాళేశ్వరాన్ని పూర్తి చేశారు. దీనితోపాటు చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, కొత్త జలాశయాలు అందుబాటులోకి తీసుకురావడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో సగటు భూగర్భ జలమట్టం 15-20 మీటర్లు ఉండేది. ప్రస్తుతం తెలంగాణలో సగటు నీటిమట్టం 6 మీటర్లు. రాష్ట్రంలోని 98% గ్రామాలు సేఫ్‌జోన్‌ జాబితాలో చేరాయి. వర్షపాతం ద్వారానే కాకుండా ఇతర జలసంరక్షణ చర్యల ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 21.45% మేర భూగర్భజలాలు పెరిగాయి. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ టాప్‌. వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో రాష్ట్ర సర్కారు విజయం సాధించింది. ఫలితంగానే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.

ఆగస్టులో 36% లోటు వర్షపాతం

ఈ సీజన్‌లో నిరుడు ఇదే సమయానికి ప్ర ధాన రిజర్వాయర్లలో ఉన్న నీటినిల్వల కం టే ఈ ఏడాది 23% తకువగా నమోదయ్యాయని సీడబ్ల్యూసీ తెలిపింది. ఇది పదేండ్ల సగటు కంటే 9% తకువన్నది.

ఆగస్టులో వర్షపాతం 36% తకువగా నమోదైంది. దీంతో ఆగస్టు ప్రారంభంలో 7% లోటు పెరిగింది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ) కంటే 40% తకువని సీడబ్ల్యూసీ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టం ప్రస్తుతం 113.417 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు (బీసీఎం) మాత్రమే ఉన్నది. ఇది మొత్తం నీటినిల్వ సామర్థ్యంలో 63శాతమే.

నిరుడు ఇదే కాలంలో 146.828 బీసీఎం జలాలు నిల్వ ఉన్నాయి. పదేళ్ల సగటు చూసినా ఆగస్టులో 125.117 బీసీఎం జలాలు నిల్వ ఉండేవి. మొత్తంగా 9% మేర నీటినిల్వలు తగ్గిపోయాయి.

హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, అస్సాం, నాగాలాండ్‌, తెలంగాణ, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో గత సంవత్సరం కంటే మెరుగ్గా నీటినిల్వలు ఉన్నాయని సీడబ్ల్యూసీ వెల్లడించింది.

తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, బీహార్‌, ఒడిశాతో సహా అనేక ఇతర రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు గత సంవత్సరంతో పోలిస్తే పూర్తిగా తగ్గిపోయాయి.

తూర్పు భారతదేశంలోని 23 ప్రధాన డ్యామ్‌లలో నీటి మట్టాలు నిరుటి కంటే 38% తకువగా ఉన్నాయి.

దక్షిణ ప్రాంతంలోని 42 రిజర్వాయర్లు గత సంవత్సరం స్థాయి కంటే 10% తకువగా ఉన్నాయి.

తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవం.. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా జిల్లా శంకర్

తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవం.. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా జిల్లా శంకర్

తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవం.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో శంకర్ ది కీలకపాత్ర.

 

నల్గొండ జిల్లా కనగల్లు మండలం రేగట్ట గ్రామానికి చెందిన జిల్లా శంకర్ కు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఉద్యమ నాయకుని గుర్తించిన సీఎం కేసీఆర్ కు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి నల్గొండ జిల్లా శాసనసభ్యులందరికీ, కృతజ్ఞతలు తెలిపిన శంకర్.

Sb news

Sb news telangana

Sb news are national news

కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇండ్లు నిర్మించాయా?: మంత్రి కేటీఆర్

కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇండ్లు నిర్మించాయా?: మంత్రి కేటీఆర్  

హైదరాబాద్:సెప్టెంబర్ 21

ఒక్క రూపాయి చెల్లించే అవసరం లేకుండా పేదలకు ఇళ్లను అందిస్తున్నామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

దుండిగల్ లో గురువారం రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొని 2,100మంది అర్హులైన పేద లబ్దిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..ఇళ్లు కట్టి చూడు.. పెళ్ళి చేసి చూడు అని పెద్దలు అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఇళ్లు కట్టిస్తున్నాడు..పెళ్లి చేస్తున్నాడు. ఒక్క రూపాయి చెల్లించే అవసరం లేకుండా పేదలకు ఇళ్లు అందిస్తున్నాం. అత్యంత పారదర్శకంగా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగింది. కాంగ్రెస్, బిజెపి పార్టీల కార్యకర్తలకు సైతం రెండు పడకల గదుల ఇళ్లు అందిస్తున్నాం.

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే 13,300 ఇళ్లను అబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తున్నాం. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు అవుతుంది. కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇళ్లు నిర్మించారా అని ప్రశ్నించారు.

SB NEWS

SB NEWS TELANGANA

చదువుతో పాటు క్రీడలు ఉంటేనే విద్యార్థులు మానసికంగా రాణిస్తారు: మంత్రి గంగుల కమలాకర్

చదువుతో పాటు క్రీడలు ఉంటేనే విద్యార్థులు మానసికంగా రాణిస్తారు

ఉన్నత వర్గాల వారికే పరిమితమైన విద్యను నేడు బీసీలకు ఉచితంగా అందిస్తున్నాం

తల్లిదండ్రుల కలలు నెరవేర్చి...రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలి

దేశం మొత్తం నేడు తెలంగాణ వైపు చూస్తోంది

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు భాగం కావాలని...శారీరకంగా బాగుంటేనే పిల్లలు మానసికంగా రాణిస్తారని స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రము లోని మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేజీ నుండి పీజీ వరకు విద్యను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో కెసిఆర్ గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. తాము చదువుకునే రోజుల్లో ఎటువంటి వసతులు ఉండేవి కావని..చదవాలని తపన ఉన్నా చదివించే ప్రభుత్వాలు ఉండేవి కావని అన్నారు. ఆనాడు చదువు అంటే కేవలం ఉన్నత వర్గాల వారికే పరిమితం అనే పరిస్థితి ఉండేదని..బీసీలు కేవలం కుల వృత్తులు చేసుకొని బతకాలని అనే వారని... కానీ నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో బీసీలు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని అన్ని వసతులు కల్పించి విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 19 పాఠశాలలు మాత్రమే ఉంటే... నేడు స్వరాష్ట్రంలో కెసిఆర్ గారు 337 పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే ఉన్న కళాశాలలో పాటు మరో 33 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్య అంటే బీసీ బిడ్డలు వెనుకబడిన పరిస్థితి నుండి ఉన్నత వర్గాల వారిని మించి ఫలితాలు వచ్చే పరిస్థితి కి రావడాన్ని చూసి బీసీ బిడ్డగా గర్విస్తున్నాను అని అన్నారు. దేశం మొత్తం నేడు తెలంగాణ వైపు చూస్తోందని, కష్టపడి చదివి తల్లి దండ్రుల కలలు నిజం చేయాలని, రాష్ట్రానికి తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మనకొండుర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ గోపి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు, ఎం.జే.పీ స్కూల్స్ డిప్యూటీ కమిషనర్ తిరుపతి, ఎంపిపి కేతిరెడ్డి వనిత, ప్రిన్సిపల్ విమల తదితరులు పాల్గొన్నారు