షెడ్యూల్ sc ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆత్మగౌర సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు శివకుమర్

అక్టోబర్ 4న జరిగే ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని నేడు హైదరాబాద్ సెక్రటేరియట్ నందు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్టోబర్ 4న జరిగే దోబీ ఘాట్ గ్రౌండ్ కంటోన్మెంటl సికింద్రాబాద్ నందు జరిగే షెడ్యూల్ sc ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆత్మగౌర సభను విజయవంతం చేయాలని వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేష్ గారు అధ్యక్షతన వాల్పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ 

కొమరం భీం మనవడు కొమ్ర సోన్ రావే భీమ్ మరియు జై బి రాజ్ 

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ 

తెలంగాణ దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తీగల అశోక్

మిత్రాస్ యూనిట్ ఆఫ్ యూత్ గ్రూప్ చైర్మన్ కంబాలపల్లి శ్రీకాంత్ తదితరులు ఉపకులాల జిల్లా రాష్ట్ర అధ్యక్షులు అందరూ హాజరై విజయవంతం చేయాలని 

ఉప కులాల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేష్ గారు తెలిపారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గం *తిరుమలగిరి మండలంలో* ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని డి ఎం హెచ్ ఓ కు వినతిపత్రం అందజేత

నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని బిజెపి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ శ్రీమతి కంకణాల నివేదిత రెడ్డి గారు DMHO సార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగినది

తిరుమలగిరి నూతనంగా మండలంగా ఏర్పడి ఏడేళ్లు కావస్తున్న నేటికి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రభుత్వ వైద్యం ఈ మండల ప్రజలకు అందని ద్రాక్షలాగా

మిగిలిపోయింది.

నల్లగొండ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా.. తిరుమలగిరిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. దీంతో మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందక చాలా అవస్థలు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలగిరి మండల ప్రజలు ఆర్ఎంపీ డాక్టర్లు, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి వేలకువేలు డబ్బులు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఉంది.

మండలంలోని 34 గ్రామ పంచాయతీల్లో సుమారు 20 గ్రామాలకు పైగా మారుమూల తందాలే. ఉన్నాయి. ఈ తండాల్లో ఏదైనా ప్రమాదం, ఆపద వచ్చినా సమయానికి గమ్యానికి చేరుకోకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం 108 వాహనం రావాలంటే 40 కి.మీ. దూరం నుంచి రావాల్సి వస్తుంది. కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తిరుమలగిరి మండల కేంద్రంలో వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో భారతీయ జనతాపార్టీ పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాము.

ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల అధ్యక్షులు పాండు నాయక్ గారు జనరల్ సెక్రెటరీ శంకర్ నాయక్ గారు చంటి తదితరులు పాల్గొన్నారు

తెలంగాణలో వానలు లేకున్నా చెరువులు ఫుల్.. నీటి నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్...

వానల్లేకున్నా చెరువులు ఫుల్‌.. రిజర్వాయర్లలో అత్యధికంగా నీటి నిల్వలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ టాప్‌

 ఈఏడాది దేశవ్యాప్తంగా అదును ప్రకారం వర్షాలు కురవకపోయినా, లోటు వర్షపాతం నమోదైనా తెలంగాణలోని రిజర్వాయర్లలో మాత్రం జలకళ ఉట్టిపడుతున్నది. రిజర్వాయర్లలో అత్యధికంగా నీటి నిల్వలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది.

కాళేశ్వరంతో భూగర్భ జలాలు పైపైకి

60 ఏండ్ల గోస పదేండ్లలో తీర్చిన కేసీఆర్‌

ఇతర రాష్ర్టాల్లో దిగజారిన నీటి నిల్వలు

మన సరిహద్దు రాష్ర్టాల రిజర్వాయర్లలో సగటు నీటి నిల్వలు మైనస్‌ నమోదు

సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ నివేదికలో వెల్లడి

ఈ ఏడాది దేశవ్యాప్తంగా అదును ప్రకారం వర్షాలు కురవకపోయినా, లోటు వర్షపాతం నమోదైనా తెలంగాణలోని రిజర్వాయర్లలో మాత్రం జలకళ ఉట్టిపడుతున్నది. రిజర్వాయర్లలో అత్యధికంగా నీటి నిల్వలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని సాక్షాత్తు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. దేశంలోని ఐదు రాష్ర్టాల్లో మినహా మిగిలిన అన్ని రాష్ర్టాల్లోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు పదేండ్ల సగటు కంటే తక్కువగా ఉన్నాయని సీడబ్ల్యూసీ తాజా నివేదిక పేర్కొన్నది. తెలంగాణలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు 68.3% ఉండగా, ఆ తర్వాత గుజరాత్‌ 14.6%తో రెండో స్థానంలో నిలిచింది.

ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌ వరుసగా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ సరిహద్దు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్‌లోని రిజర్వాయర్లలో సగటు నీటి నిల్వలు మైనస్‌ 44.2%, మహారాష్ట్రలో మైనస్‌ 8.9%, ఛత్తీస్‌గఢ్‌లో 11%, ఒడిశాలో మైనస్‌ 13.9 శాతానికి పడిపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టుల నిర్మాణం లాంటి కార్యక్రమాలు రాష్ర్టాన్ని జలభాండాగారం తీర్చిదిద్దాయి. దీంతో ఒకనాడు బీటలు వారిన చెరువుల్లో నేడు జల రావాలు వినిపిస్తున్నాయి. బీడువారిన భూములు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. ఏ పల్లెకు వెళ్లినా వాగులు, వంకలు గలగలలతో స్వాగతం పలుకుతున్నాయి. ఏ రిజర్వాయర్‌ను చూసినా పాల నురగల జలహేల కనిపిస్తున్నది. ఏ రైతు ఇంటి తలుపు తట్టినా ఆనందం వెల్లివిరుస్తున్నది. లోటు వర్షపాతంలోనూ తెలంగాణ జలసిరులతో అలరారుతున్నది. వరుణుడు కరుణించకున్నా రిజర్వాయర్లలో పుష్కలంగా నీళ్లున్నాయి. దీంతో ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురకవపోయినా తెలంగాణలో పంటల సాగు ఆగలేదు. అనుకున్న సమయానికే ఎక్కువ మొత్తంలో రైతులు విత్తనాలు విత్తారు. ఇదంతా రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వలతోనే సాధ్యమైంది.

భూగర్భ జలాల్లో దేశంలోనే టాప్‌

'రైతు బాగుంటేనే.. రాజ్యం బాగుంటుంది' అని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. స్వరాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి రైతుల స్థితిగతులను మార్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రపంచమే అబ్బుర పడేలా కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కాంగ్రెస్‌ అడ్డుకునేందుకు ఎన్ని కుయుక్తులు పన్నినా మొక్కవోని దీక్షతో అనతికాలంలోనే కాళేశ్వరాన్ని పూర్తి చేశారు. దీనితోపాటు చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, కొత్త జలాశయాలు అందుబాటులోకి తీసుకురావడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో సగటు భూగర్భ జలమట్టం 15-20 మీటర్లు ఉండేది. ప్రస్తుతం తెలంగాణలో సగటు నీటిమట్టం 6 మీటర్లు. రాష్ట్రంలోని 98% గ్రామాలు సేఫ్‌జోన్‌ జాబితాలో చేరాయి. వర్షపాతం ద్వారానే కాకుండా ఇతర జలసంరక్షణ చర్యల ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 21.45% మేర భూగర్భజలాలు పెరిగాయి. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ టాప్‌. వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో రాష్ట్ర సర్కారు విజయం సాధించింది. ఫలితంగానే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.

ఆగస్టులో 36% లోటు వర్షపాతం

ఈ సీజన్‌లో నిరుడు ఇదే సమయానికి ప్ర ధాన రిజర్వాయర్లలో ఉన్న నీటినిల్వల కం టే ఈ ఏడాది 23% తకువగా నమోదయ్యాయని సీడబ్ల్యూసీ తెలిపింది. ఇది పదేండ్ల సగటు కంటే 9% తకువన్నది.

ఆగస్టులో వర్షపాతం 36% తకువగా నమోదైంది. దీంతో ఆగస్టు ప్రారంభంలో 7% లోటు పెరిగింది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ) కంటే 40% తకువని సీడబ్ల్యూసీ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టం ప్రస్తుతం 113.417 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు (బీసీఎం) మాత్రమే ఉన్నది. ఇది మొత్తం నీటినిల్వ సామర్థ్యంలో 63శాతమే.

నిరుడు ఇదే కాలంలో 146.828 బీసీఎం జలాలు నిల్వ ఉన్నాయి. పదేళ్ల సగటు చూసినా ఆగస్టులో 125.117 బీసీఎం జలాలు నిల్వ ఉండేవి. మొత్తంగా 9% మేర నీటినిల్వలు తగ్గిపోయాయి.

హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, అస్సాం, నాగాలాండ్‌, తెలంగాణ, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో గత సంవత్సరం కంటే మెరుగ్గా నీటినిల్వలు ఉన్నాయని సీడబ్ల్యూసీ వెల్లడించింది.

తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, బీహార్‌, ఒడిశాతో సహా అనేక ఇతర రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు గత సంవత్సరంతో పోలిస్తే పూర్తిగా తగ్గిపోయాయి.

తూర్పు భారతదేశంలోని 23 ప్రధాన డ్యామ్‌లలో నీటి మట్టాలు నిరుటి కంటే 38% తకువగా ఉన్నాయి.

దక్షిణ ప్రాంతంలోని 42 రిజర్వాయర్లు గత సంవత్సరం స్థాయి కంటే 10% తకువగా ఉన్నాయి.

తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవం.. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా జిల్లా శంకర్

తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవం.. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా జిల్లా శంకర్

తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవం.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో శంకర్ ది కీలకపాత్ర.

 

నల్గొండ జిల్లా కనగల్లు మండలం రేగట్ట గ్రామానికి చెందిన జిల్లా శంకర్ కు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఉద్యమ నాయకుని గుర్తించిన సీఎం కేసీఆర్ కు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి నల్గొండ జిల్లా శాసనసభ్యులందరికీ, కృతజ్ఞతలు తెలిపిన శంకర్.

Sb news

Sb news telangana

Sb news are national news

కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇండ్లు నిర్మించాయా?: మంత్రి కేటీఆర్

కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇండ్లు నిర్మించాయా?: మంత్రి కేటీఆర్  

హైదరాబాద్:సెప్టెంబర్ 21

ఒక్క రూపాయి చెల్లించే అవసరం లేకుండా పేదలకు ఇళ్లను అందిస్తున్నామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

దుండిగల్ లో గురువారం రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొని 2,100మంది అర్హులైన పేద లబ్దిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..ఇళ్లు కట్టి చూడు.. పెళ్ళి చేసి చూడు అని పెద్దలు అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఇళ్లు కట్టిస్తున్నాడు..పెళ్లి చేస్తున్నాడు. ఒక్క రూపాయి చెల్లించే అవసరం లేకుండా పేదలకు ఇళ్లు అందిస్తున్నాం. అత్యంత పారదర్శకంగా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగింది. కాంగ్రెస్, బిజెపి పార్టీల కార్యకర్తలకు సైతం రెండు పడకల గదుల ఇళ్లు అందిస్తున్నాం.

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే 13,300 ఇళ్లను అబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తున్నాం. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు అవుతుంది. కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇళ్లు నిర్మించారా అని ప్రశ్నించారు.

SB NEWS

SB NEWS TELANGANA

చదువుతో పాటు క్రీడలు ఉంటేనే విద్యార్థులు మానసికంగా రాణిస్తారు: మంత్రి గంగుల కమలాకర్

చదువుతో పాటు క్రీడలు ఉంటేనే విద్యార్థులు మానసికంగా రాణిస్తారు

ఉన్నత వర్గాల వారికే పరిమితమైన విద్యను నేడు బీసీలకు ఉచితంగా అందిస్తున్నాం

తల్లిదండ్రుల కలలు నెరవేర్చి...రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలి

దేశం మొత్తం నేడు తెలంగాణ వైపు చూస్తోంది

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు భాగం కావాలని...శారీరకంగా బాగుంటేనే పిల్లలు మానసికంగా రాణిస్తారని స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రము లోని మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేజీ నుండి పీజీ వరకు విద్యను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో కెసిఆర్ గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. తాము చదువుకునే రోజుల్లో ఎటువంటి వసతులు ఉండేవి కావని..చదవాలని తపన ఉన్నా చదివించే ప్రభుత్వాలు ఉండేవి కావని అన్నారు. ఆనాడు చదువు అంటే కేవలం ఉన్నత వర్గాల వారికే పరిమితం అనే పరిస్థితి ఉండేదని..బీసీలు కేవలం కుల వృత్తులు చేసుకొని బతకాలని అనే వారని... కానీ నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో బీసీలు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని అన్ని వసతులు కల్పించి విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 19 పాఠశాలలు మాత్రమే ఉంటే... నేడు స్వరాష్ట్రంలో కెసిఆర్ గారు 337 పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే ఉన్న కళాశాలలో పాటు మరో 33 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్య అంటే బీసీ బిడ్డలు వెనుకబడిన పరిస్థితి నుండి ఉన్నత వర్గాల వారిని మించి ఫలితాలు వచ్చే పరిస్థితి కి రావడాన్ని చూసి బీసీ బిడ్డగా గర్విస్తున్నాను అని అన్నారు. దేశం మొత్తం నేడు తెలంగాణ వైపు చూస్తోందని, కష్టపడి చదివి తల్లి దండ్రుల కలలు నిజం చేయాలని, రాష్ట్రానికి తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మనకొండుర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ గోపి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు, ఎం.జే.పీ స్కూల్స్ డిప్యూటీ కమిషనర్ తిరుపతి, ఎంపిపి కేతిరెడ్డి వనిత, ప్రిన్సిపల్ విమల తదితరులు పాల్గొన్నారు

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 11వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణ కేంద్రంలో గాంధీనగర్ లో యాదవ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి మాట్లాడుతూ..

కొండా లక్ష్మణ్ బాబూజీ ఐదు శతాబ్దాల తెలంగాణ ఉద్యమ యోధుడు రజాకార్ల ఉద్యమంలో క్విటీ ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి గొప్ప నాయకుడు వారు ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ నియోజకవర్గం లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా 1952 లో ఎన్నిక కాబడి తర్వాత అది ఎస్సీ నియోజకవర్గం కావడం వల్ల హైదరాబాదులో ఉంటూ మొత్తం మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రివర్యులు గా డిప్యూటీ స్పీకర్ గా ఎన్నో సేవలు అందించిన గొప్ప నాయకుడు వారు న్యాయవాద వృత్తిలో బడుగు బలహీన వర్గాలకు ఉద్యమ నాయకులకు ఉచితంగా వాదించినటువంటి గొప్ప నాయకుడు 1969 లో తెలంగాణ కోసం ఆనాడు ప్రధాని ఇందిరాగాంధీకి తన మంత్రి పదవిని సైతం ఇచ్చినా నాయకుడు కొండా లక్ష్మణ్ బాబుజి తెలంగాణ వచ్చేంతవరకు ఎలాంటి పదవులు తీసుకోకుండా మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారికి తన ఇంటిని నుండే ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకుడు వారు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలనే దిశగా బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు కుల సంఘాలు కు ఎంతో మందిని నాయక నాయకత్వం అందించినటువంటి గొప్ప నాయకులు.

వారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ మొత్తం పది జిల్లాలు బస్సుయాత్ర చేసి ఢిల్లీలో చలిలో నిరాహారదీక్ష చేసినటువంటి గొప్ప మహానీయుడు  కొండా లక్ష్మణ్ బాబూజీ .

అంతే కాకుండా చేనేత కుటుంబంలో జన్మించి చేనేత పితామహుడుగా పేరుపొందినటువంటి గొప్ప నాయకుడు వారి సేవలు ఎంతో ముందు చూపుతున్నటువంటి నాయకుడు కొండా లక్ష్మణ్ వారి ఆశయాల కోసం ముందుకు తీసుక పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొని ఆడారు.

ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అఖిల భారతీయ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు జెల్లా బిక్షం మాజీ పద్మశాలి రాష్ట్ర కార్యదర్శి ఉపాధ్యక్షులు దత్త గణేష్ పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల వెంకన్న యాదవ్ మాజీ కౌన్సిలర్ అల్లివేణు యాదవ్ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు మునాస్ ప్రసన్న జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్ జిల్లా కార్యదర్శి యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పగిళ్ల కృష్ణ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన సతీష్ యాదవ్ పద్మశాలి యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిలుకూరి శ్రీనివాస్ పగిళ్ల ఉజ్వల్ వల్ల కీర్తి శ్రీనివాస్ చల్లేటి రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

SB NEWS TELANGANA

పేదలను బ్రహ్మాండంగా ఆదుకోవాలని కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారు.. ఆ విషయాలను తొందరలోనే సీఎం చెబుతారు మంత్రి కేటీఆర్‌

పేదలను బ్రహ్మాండంగా ఆదుకోవాలని కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారు.. ఆ విషయాలను తొందరలోనే సీఎం చెబుతారు మంత్రి కేటీఆర్‌

ఢిల్లీ, బెంగళూరు నంచి వచ్చి వచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్‌ సూచించారు. దుండిగల్‌లో రెండో విడత డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.

 ఢిల్లీ, బెంగళూరు నంచి వచ్చి వచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్‌ సూచించారు. దుండిగల్‌లో రెండో విడత డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. పనితో గెలవలేక.. ఇదివరకు ఏం చేసిండ్రో చెప్పలేక.. కొత్త రూపాల్లో వస్తున్నారని.. ఇష్టమొచ్చిన హామీలు ఇస్తున్నారని తెలిపారు. వాళ్లు ఇచ్చి హామీలు నమ్మి మోసపోదామా? అని ప్రశ్నించారు. ప్రజలు తొందరపడొద్దని.. ప్రజలు, రైతులపై కేసీఆర్‌ కంటే ఎక్కువ ప్రేమ ఉన్న నాయకులు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచించుకోవాలని సూచించారు.

వాళ్లు చెప్పినదానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని కేసీఆర్‌కు కూడా ఉందని అన్నారు. తప్పకుండా వాళ్లు చెప్పినదానికంటే బ్రహ్మాండగా పేదలను ఆదుకోవాలని కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారని తెలిపారు.

ఆ విషయాలను తొందరలోనే సీఎం కేసీఆర్‌ చెబుతారని పేర్కొన్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ ఈ తొమ్మిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో జోడెద్దుల మాదిరిగా తెలంగాణ రాష్ట్రం ప్రగతి బాటలో ముందుకెళ్తున్నదని అన్నారు. ‘ ఒకప్పుడు హైదరాబాద్‌లో ఏ బస్తీకి పోయినా మంచి నీళ్ల కోసం లొల్లి. ఖైరతాబాద్‌ జలమండలి ముందు నుంచి వెళ్దామంటే భయం. ఎప్పుడు చూసినా ఖాళీ బిందెలు, ఖాళీ కుండలు పెట్టి ధర్నాలు చేసేవాళ్లు. కరెంటు గోస చెప్పక్కర్లేదు. అపార్ట్‌మెంట్‌ కిందకు వెళ్తే డీజిల్‌ కంపుతో ముక్కులు పగిలిపోయేవి. ఇన్వర్టర్లు, జనరేటర్లు లేకపోతే జ్యూస్‌ స్టాల్‌, జిరాక్స్‌ సెంటర్లు నడుపుకోలేని అవస్థ. గణేశ్‌ పండగ వచ్చిందంటే వారం రోజులు కర్ఫ్యూ కంపల్సరీ.’ ఉండేవని గుర్తుచేశారు.

ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని.. మంచినీళ్ల సవులత్‌ మంచిగైందని.. రోడ్లు బాగైనయని.. పేదలకు కడుపు నిండా పింఛన్‌ వస్తున్నదని.. డబుల్‌ బెడ్రూం ఇండ్లు వస్తున్నాయని తెలిపారు. ఇన్ని పనులు చేసుకుంటూ ముందుకుపోతున్న ఈ ప్రగతి చక్రాలను ఆపేందుకు.. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల ముందు కొంతమంది వస్తున్నారని తెలిపారు. సంక్రాంతికి గంగిరెద్దు వచ్చినట్టుగా ఎన్నికల ముందు ఇష్టమొచ్చినట్టు మాటలు చెప్పే వాళ్లు వస్తున్నారని ఎద్దేవా చేశారు.

అలాంటి వాళ్ల మాటలకు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అర్హులందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇచ్చే బాధ్యత మాదే.. ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్

జీనోమ్‌ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తాం : మంత్రి కేటీఆర్‌

జీనోమ్‌ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తాం : మంత్రి కేటీఆర్‌

దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ శివారులోని జీనోమ్‌ వ్యాలీలో బీఎస్‌వీ కంపెనీ కొత్త యూనిట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారత్‌ సీరం సంస్థకు అన్నిరకాల సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం జీనోమ్‌ వ్యాలీలో ఫేజ్‌-3లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని మంత్రి కేటీఆర్‌ సందర్భంగా ప్రకటించారు. 

దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ శివారులోని జీనోమ్‌ వ్యాలీలో బీఎస్‌వీ కంపెనీ కొత్త యూనిట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారత్‌ సీరం సంస్థకు అన్నిరకాల సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం జీనోమ్‌ వ్యాలీలో ఫేజ్‌-3లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని మంత్రి కేటీఆర్‌ సందర్భంగా ప్రకటించారు.

దేశంలో ఎక్కడా లేని అనుకూలతలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు.. ఎక్కడా లేనంత వేగంగా పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందనడం నిర్వివాదమని పేర్కొన్నారు. మాకు కేంద్ర ప్రభుత్వానికి పడదు.. తెల్లారిలేస్తే మేమూ, వాళ్లూ తిట్టుకుంటాం.. విమర్శలు చేసుకుంటాం. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య ఎప్పుడు ఏదో పంచాయితీ నడుస్తూనే ఉంటుంది.. అయినప్పటికీ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో నంబర్‌వన్‌ ఎవరని అడిగితే తెలంగాణ అని వాళ్లు కూడా ఒప్పుకునే పరిస్థితిని సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చారని అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం 1,49,000 ఉండగా.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,17,000గా ఉందన్నారు.

సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్‌ రాజధానిగా హైదరాబాద్‌ మారిందని ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గర్వంగా చెప్పగలనని పేర్కొన్నారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 50 శాతం మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దీనికి నిపుణులైన యువకులు ఉండటం, వాళ్లను చూసి కంపెనీలు ఇక్కడికి రావడం, వారికి ప్రభుత్వం సహకరించడమే కారణమని అన్నారు.

SB NEWS

SB NEWS TELANGANA

ఈ చెట్లను అస్సలు ఇంట్లో పెట్టోద్దు.. పొరపాటున పెడితే పాములకు వెల్ కమ్ చెప్పినట్లే..

ఈ చెట్లను అస్సలు ఇంట్లో పెట్టోద్దు.. పొరపాటున పెడితే పాములకు వెల్ కమ్ చెప్పినట్లే..

కొన్నిరకాల మొక్కలు , చెట్లు పాములను ఆకర్శిస్తుంటాయి. ఇవి ఇంట్లో ఉండే వీటి నుంచి వెలువడే వాసనలు పాములను ఆకర్శిస్తాయని అంటుంటారు..

 

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరికి పాములంటే చచ్చేంత భయం ఉంటుంది. ఇక వర్షాకాలంలో లేదా అడవులకు దగ్గరగా ఉన్న ప్రదేశాలలో పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి.. వర్షంపడ్డాక చెరువులు, కుంటలు నిండుతుంటాయి. అలాంటి సమయంలో ఇళ్లలోనికి నీరు వచ్చి చేరుతుంది.

 

అప్పుడు పాములు మనన ఇళ్లలోనికి వచ్చి చేరుతుంటాయి. కొందరైతే పాముల పేర్లను ఎత్తడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూయించరు. మరికొందరు పాము అనగానే.. వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతుంటారు.. ఇవి ముఖ్యంగా మన ఇళ్లలో ఎలుకలు, మొదలైన వాటిని తినడానికి వస్తుంటాయి.

 

ఈ క్రమంలో కొన్నిసార్లు అవి మనుషులను కాటు వేయడం జరుగుతుంది. మరికొందరు మాత్రం పాములు కన్పించగానే స్నేక్ హెల్ప్ సోసైటివారికి సమాచారం అందిస్తారు..అయితే.. ఈకింద ఇచ్చిన చెట్లను ఇంట్లో పెంచవద్దని అంటుంటారు..

 

పొరపాటున కూడా ఇంటి బయట ఈ 6 మొక్కలు నాటాడు అంటే పామును ఆహ్వానించాడని అర్ధం చేసుకోండి..కొన్ని పూల మొక్కలు పాములను ఆకర్షిస్తాయి. కాబట్టి అలాంటి మొక్కలను ఇంటి చుట్టూ నాటకూడదు. పాములను ఆకర్షించే మొక్కల జాబితా ఇక్కడ ఉంది.

 1. జాస్మిన్- ఇండియాటుడే వార్తల ప్రకారం, జాస్మిన్ వైన్స్ కుటుంబానికి చెందిన మొక్కల దగ్గర పాములు ఎక్కువగా నివసిస్తాయి. ఎందుకంటే మల్లె మొక్క చాలా దట్టమైనది మరియు పాములు దాని రంగులో తమను తాము కప్పుకుంటాయి. దాక్కున్న తర్వాత, పాము తన ఎరను సులభంగా బంధిస్తుంది. మల్లె మొక్కల దగ్గర పాములు నివసించే ప్రమాదం ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం.

1. జాస్మిన్- ఇండియాటుడే వార్తల ప్రకారం, జాస్మిన్ వైన్స్ కుటుంబానికి చెందిన మొక్కల దగ్గర పాములు ఎక్కువగా నివసిస్తాయి. ఎందుకంటే మల్లె మొక్క చాలా దట్టమైనది మరియు పాములు దాని రంగులో తమను తాము కప్పుకుంటాయి. దాక్కున్న తర్వాత, పాము తన ఎరను సులభంగా బంధిస్తుంది. మల్లె మొక్కల దగ్గర పాములు నివసించే ప్రమాదం ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం.

2. సైప్రస్ లేదా సైప్రస్ - తమ ఇంటి దగ్గర యార్డ్ ఉన్నవారు సైప్రస్ మొక్కను నాటుతారు. ఇది అలంకారమైన మొక్క. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. కానీ అది కూడా చాలా దట్టమైనది. దట్టంగా ఉండడం వల్ల పాములు దాక్కుని కీటకాలను వేటాడతాయి.

3. క్లోవర్ మొక్కలు- క్లోవర్ మొక్కలు కూడా అలంకారమైన మొక్కలు. దీని ఆకులు మందంగా మరియు దట్టంగా ఉంటాయి. అవి భూమిని పూర్తిగా కప్పేస్తాయి. పాములు ఈ ఆకుల కింద హాయిగా కూర్చుని తమ ఆహారం కోసం రహస్యంగా వెతకడానికి ఇదే కారణం. కాబట్టి అనుకోకుండా ఇంట్లో క్లోవర్ ఆకులను నాటకండి.(Image credit:Pixabay.com)

4. నిమ్మ చెట్టు- నిమ్మ చెట్టు లేదా ఏదైనా సిట్రస్ చెట్టు ఎలుకలు మరియు చిన్న పక్షులకు నిలయం. ఎందుకంటే చిన్న కీటకాలు మరియు పక్షులు దాని పండ్లను తింటాయి. నిమ్మ చెట్ల చుట్టూ పాములు తిరగడానికి ఇదే కారణం. కాబట్టి మీ ఇంటి దగ్గర నిమ్మకాయను నాటకండి.(Image credit:Pixabay.com)

5. దేవదారు చెట్లు - దేవదారు వృక్షాలు ఎత్తైన ప్రదేశాలలో పెరిగినప్పటికీ, అవి మైదాన ప్రాంతాల్లో కూడా కొన్ని సంవత్సరాలు జీవించగలవు. అందుకే కొందరు తమ మైదానాల్లో దేవదారు చెట్లను నాటారు. కానీ గంధపు చెట్టులా, పాము దేవదారు చెట్టులో చుట్టుకొని ఆనందిస్తుంది. కాబట్టి ఇంటి చుట్టూ దేవదారు చెట్లను నాటకండి.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. SB NEWS దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)