తెలంగాణ ప్రభుత్వం హోంగార్డు వ్యవస్థను శ్రమ దోపిడికి గురిచేస్తుంది: కిషన్ రెడ్డి

17 సంవత్సరాలుగా హోంగార్డు ఉద్యోగం చేస్తున్న రవీందర్ ఆత్మహత్యాయత్నం బాధాకరమని, దురదృష్టకరమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడీ జరుగుతోందని, తెలంగాణ ప్రభుత్వం హోంగార్డు వ్యవస్థను అవమానిస్తోందని, హోంగార్డు సంక్షేమం కోసం నిరంతర పోరాటం చేశానని అన్నారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హోంగార్డు హక్కులు, సమస్యల కోసం ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు కాలేదని ఆరోపించారు. హోంగార్డు వ్యవస్థను క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి.. ఇంత వరకు చేయలేదని విమర్శించారు.

హోంగార్డుల డ్యూటీ 8గంటలయితే.. అంతకంటే ఎక్కువ సమయం డ్యూటీ చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని, హెల్త్ పరంగా, అలెవెన్సు, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు హోంగార్డులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చిన హోంగార్డులకు న్యాయం జరగలేదన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన వీడియోను మీడియాకు చూపించారు. కేసీఆర్ హామీ ఇచ్చి ఐదున్నరేళ్లు కావొస్తున్న సమస్య పరిష్కారం కాలేదన్నారు. హోంగార్డులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హోంగార్డులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని, రవీందర్ ప్రాణాలు కాపాడడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రవీందర్ ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నానన్నారు.

హోంగార్డు హక్కులను కపాడాల్సిన అవసరం ఉందని, హోంగార్డులు ఎవ్వరు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ఆత్మహత్యల ద్వారా సమస్య పరిష్కారం కాదని, హక్కుల కోసం శాంతియుతంగా పోరాడాలన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక హోంగార్డులకు అండగా ఉంటామని, రవీందర్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణా ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసిన:సీఎం కెసిఆర్

శ్రీకృష్ణ జన్మాష్టమి’ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఉట్ల పండుగ"గా పిలుచుకుంటూ యువతి, యువకులు కేరింతలతో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని సీఎం తెలిపారు.

శ్రీకృష్ణుడి జీవితాన్ని అవలోకనం చేసుకుంటే స్థితప్రజ్ఞులుగా ఎదగవచ్చని సీఎం తెలిపారు.

భగవద్గీత ద్వారా కర్తవ్యబోధన, లక్ష్య సాధన కోసం ఫలితం ఆశించని స్థితప్రజ్ఞతతో కూడిన కార్యనిర్వహణ వంటి పలు ఆదర్శాలను మానవాళికి అందించిన శ్రీకృష్ణుని కృపాకటాక్షాలు ప్రజలందరికీ అందాలని సీఎం ప్రార్థించారు....

Japan Moon Mission: జాబిల్లిపైకి దూసుకెళ్లిన జపాన్‌ 'స్లిమ్‌'.. ల్యాండింగ్‌ ఎప్పుడంటే..?

టోక్యో: జాబిల్లి (Moon)పై తొలిసారి అడుగుపెట్టాలన్న కలను సాకారం చేసుకునేందుకు జపాన్‌ (Japan) కీలక ప్రయోగం చేపట్టింది. పలుమార్లు వాయిదా పడిన ఈ రాకెట్‌ ప్రయోగం గురువారం ఉదయం విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరింది..

నైరుతి జపాన్‌లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఎక్స్‌-రే టెలిస్కోప్‌ (X-ray telescope), లూనార్‌ ల్యాండర్‌ (lunar lander)ను తీసుకొని హెచ్‌-2ఏ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.

జపార్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ JAXA ఈ ప్రయోగాన్ని లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసింది. నింగిలోకి దూసుకెళ్లిన 13 నిమిషాల తర్వాత XRISM (ఎక్స్‌-రే ఇమేజింగ్ అండ్‌ స్పెక్ట్రోస్కోపి మిషన్‌) ఉపగ్రహాన్ని హెచ్‌-2ఏ రాకెట్‌ భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. గెలాక్సీల మధ్య వేగం, ఇతర పరామితులను కనుగొనేందుకు ఈ ఉపగ్రహం ప్రయోగించారు. విశ్వ రహస్యాలను ఛేదించేందుకు, ఖగోళ వస్తువులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని జపాన్‌ చెబుతోంది..

మూన్‌ స్నైపర్‌ మిషన్‌..

ఇక ఇదే ప్రయోగంలో జాబిల్లి రహస్యాలను తెలుసుకునేందుకు స్లిమ్‌ (స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌) పేరుతో ఓ తేలికపాటి లూనార్‌ ల్యాండర్‌ను కూడా పంపించారు. ఈ ల్యాండర్‌.. మూడు - నాలుగు నెలల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. అంటే.. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో ఈ స్లిమ్‌ ల్యాండర్‌ (SLIM Lander) జాబిల్లిపై దిగనుందని స్పేస్‌ ఏజెన్సీ వెల్లడించింది.

జాబిల్లి, ఇతర గ్రహాలపైకి పంపించే భవిష్యత్తు ప్రయోగాల కోసం 'పిన్‌పాయింట్‌ ల్యాండింగ్‌ టెక్నాలజీ'తో స్లిమ్‌ను అభివృద్ధి చేశారు. సాధారణంగా ల్యాండర్లు నిర్దేశించిన ప్రదేశానికి 10 కిలోమీటర్లు అటుఇటూగా దిగుతుంటాయి. కానీ, నిర్దేశిత ప్రాంతానికి కేవలం 100 మీటర్లు అటుఇటుగా ల్యాండ్‌ అయ్యేట్లు దీనిని డిజైన్‌ చేశారు..

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి రోజా
విజయవాడ : రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి శ్రీమతి ఆర్కే రోజా ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనార్థముకి విచ్చేసిన రోజా గారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు రోజా గారికి వేదాశీర్వచనం అందించి ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదము అందజేశారు. కార్యక్రమం లో దుర్గ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ రాంబాబు గారు, EO గారు, ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు....

విజయవాడ : రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి శ్రీమతి ఆర్కే రోజా ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనార

హరీష్ రాసిన పరీక్ష ఫలితాలను వెంటనే వెల్లడించండి: ధర్మాసనం

పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్‌ను హైకోర్టు ఎత్తివేసింది. వరంగల్ జిల్లా కమలాపూర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థి హరీష్‌‌ను డీఈవో డీబార్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థి హైకోర్టుకు వెళ్లగా.. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులతో హరీష్ పదో పరీక్షలు రాశాడు.

అయితే పరీక్షలు పూర్తి అయి ఫలితాలు రాగా.. అధికారులు మాత్రం హరీష్ పదో తరగతి ఫలితాలను హోల్డ్‌లో పెట్టేశారు. ఫలితాలు వెళ్లడించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును హరీష్ కోరారు. దీనిపై ఈరోజు విచారణ జరుగగా.. హరీష్‌పై డీబార్ ఉత్తర్వులు కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. హరీష్ రాసిన పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. వరంగల్ జిల్లాలోని కమలాపూర్‌ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం వాట్స్‌ప్‌లో లీక్‌ అవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే టెన్త్ విద్యార్థి హరీష్ నుంచి పదో తరగతి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు తేలడంతో విద్యార్థిని డీఈవో ఐదేళ్లపాటు డీబార్ చేశారు. తాను ఏతప్పు చేయలేదని తనను పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని హరీష్‌ ఎంతగానో విలపించాడు. చివరకు హరీష్ తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడిని బెదిరంచడం వల్లే ప్రశ్నాపత్రం ఇతరులకు ఇచ్చాడని.. అదే వాట్సప్‌లో వచ్చిందని తెలిపారు.

తన కుమారుడిని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు హరీష్‌‌ను పదో తరగతి పరీక్ష రాసేందుకు అనుమతించింది. దీంతో హైకోర్టు తీర్పుపై విద్యార్థి హరీష్ హర్షం వ్యక్తం చేస్తూ మిగిలిన పరీక్షలు పూర్తి చేశాడు.

అయితే పదీ తరగతి ఫలితాలు విడుదల సమయంలో అధికారులు హరీష్ ఫలితాలను వెల్లడించకుండా హోల్డ్‌లో పెట్టాడు. దీంతో మరోసారి విద్యార్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విద్యార్థిపై ఉన్న డీబార్‌ను కొట్టివేస్తూ.. వెంటనే ఫలితాలు వెల్లడించాలంటూ ఈరోజు గురువారం హైకోర్టు తీర్పునిచ్చింది........

రూ.50 వేలకు ఇద్దరు కూతుర్లను అమ్మకానికి పెట్టిన కన్న తల్లి

తెలంగాణలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో కన్నతల్లి కూతుర్లను అమ్మకానికి పెట్టింది. ఓ కన్నతల్లి రూ.20 వేలకు మూడ్రోజుల పసికందును.. రూ.30 వేలకు ఏడేళ్ల పాపను అమ్మాకానికి పెట్టింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఐసీడీఎస్ అధికారుల వద్ద ఉన్నట్లు సమాచారం.

అనారోగ్య సమస్యలు తీవ్రతరం కావడంతో డబ్బుల కోసం కూతుర్లను విక్రయించినట్లు సమాచారం. ఐసీడీఎస్ అధికారుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, గతకొంత కాలంగా మండలంలో చిన్నపిల్లల విక్రయాలు జరుగుతున్నా.. బాలల సంరక్షణ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. పేదరికంతో కూతుర్లను విక్రయింస్తున్న కుటుంబాల వివరాలు తెలుసుకొని ఆదుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు..

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి రోజా
అమ్మతోడు... మీరు నమ్మండి.. ఇది నీటి మడుగు కాదు.. రోడ్డే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయంటూ విపక్ష పార్టీల నేతలతో పాటు ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్నారు. కానీ, అధికర పార్టీ నేతలు మాత్రం వీటిని మాటలతో తిప్పికొడుతున్నారు..

దీనికి గుంటూరు జిల్లా కాకునూరు - కొమ్మూరు గ్రామాల మధ్య ఉన్న ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి కావడం గమనార్హం.

జిల్లా కేంద్రం బాపట్లకు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. కానీ, ఈ రోడ్డు దుస్థితి చూస్తే బైర్లు కమ్మాల్సిందే. ఏకంగా నాలుగు కిలోమీటర్ల భారీగా గుంతలు పడ్డాయి. వీటిని పూడ్చకపోవడంతో వర్షం కురిస్తే చిన్నపాటి మడుగులుగా కనిపిస్తున్నాయి. కార్లు గుంతల్లో వెళ్లగానే ఆగిపోతున్నాయి. ఇక ద్విచక్రవాహనదారుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. రోడ్డు అంచుల వెంబడి ప్రమాదకర స్థాయిలో వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఓ ఆటో గుంతను తప్పించే క్రమంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు ఈ రోడ్డులో ప్రయాణిస్తున్నా వారు ఏమాత్రం స్పందించక పోవడం శోచనీయం..

దీంతో ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు.. ఈ రహదారిలో సీఎ జగన్ లేదా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తే రోడ్డు బాగుపడుతుందని కాకుమాను ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా, సీఎం వస్తున్నారంటే నిధులతో సంబంధం లేకుండా అప్పటికప్పుడు రహదారుల నిర్మాణాలు చేపడతారు కదా?' అని ప్రశ్నిస్తున్నారు. ఈ రహదారిలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, అధికారుల వాహనాలు కూడా ఉంటాయి..

PM Modi in Jakarta: జకార్తా టూర్‌లో ప్రధాని మోదీ..

రెండ్రోజుల్లో ఇండియాలో జీ-20 సదస్సు ఉన్నా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం తన షెడ్యూల్‌ని అత్యంత బిజీగా ఉంచుకుంటూ.. ఇవాళ ఇవాళ ఇండొనేసియాలోని జకార్తాలో పర్యటిస్తున్నారు..

అక్కడ ఇవాళ జరిగే 20వ ఆసియన్ (ASEAN)- ఇండియా సదస్సులో పాల్గొన్నారు. ఇండియా అమలుచేస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియన్ గ్రూప్.. మూల స్తంభం లాంటిది అని మోదీ అన్నారు.

ఇండో-పసిఫిక్ దేశాలపై ఆసియన్ గ్రూప్ అవుట్‌లుక్‌ని పూర్తిగా భారత్ సమర్థిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. "మన భాగస్వామ్యం 4వ దశాబ్దంలోకి ప్రవేశించింది. ఇండియా యొక్క ఇండో-పసిఫిక్ ఇన్షియేటివ్‌లో ఆసియన్ కీలక పాత్ర పోషిస్తోంది" అని మోదీ తెలిపారు.

ఆసియన్ గ్రూపు.. అభివృద్ధికి కీలక కేంద్రంగా ఉందనీ, ప్రపంచ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తోందని మోదీ తెలిపారు. "మన పరస్పర సహకారంలో స్థిరమైన వృద్ధి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నా మనం కలిసి సాగుతున్నాం" అని మోదీ అన్నారు.