హరీష్ రాసిన పరీక్ష ఫలితాలను వెంటనే వెల్లడించండి: ధర్మాసనం

పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్‌ను హైకోర్టు ఎత్తివేసింది. వరంగల్ జిల్లా కమలాపూర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థి హరీష్‌‌ను డీఈవో డీబార్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థి హైకోర్టుకు వెళ్లగా.. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులతో హరీష్ పదో పరీక్షలు రాశాడు.

అయితే పరీక్షలు పూర్తి అయి ఫలితాలు రాగా.. అధికారులు మాత్రం హరీష్ పదో తరగతి ఫలితాలను హోల్డ్‌లో పెట్టేశారు. ఫలితాలు వెళ్లడించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును హరీష్ కోరారు. దీనిపై ఈరోజు విచారణ జరుగగా.. హరీష్‌పై డీబార్ ఉత్తర్వులు కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. హరీష్ రాసిన పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. వరంగల్ జిల్లాలోని కమలాపూర్‌ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం వాట్స్‌ప్‌లో లీక్‌ అవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే టెన్త్ విద్యార్థి హరీష్ నుంచి పదో తరగతి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు తేలడంతో విద్యార్థిని డీఈవో ఐదేళ్లపాటు డీబార్ చేశారు. తాను ఏతప్పు చేయలేదని తనను పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని హరీష్‌ ఎంతగానో విలపించాడు. చివరకు హరీష్ తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడిని బెదిరంచడం వల్లే ప్రశ్నాపత్రం ఇతరులకు ఇచ్చాడని.. అదే వాట్సప్‌లో వచ్చిందని తెలిపారు.

తన కుమారుడిని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు హరీష్‌‌ను పదో తరగతి పరీక్ష రాసేందుకు అనుమతించింది. దీంతో హైకోర్టు తీర్పుపై విద్యార్థి హరీష్ హర్షం వ్యక్తం చేస్తూ మిగిలిన పరీక్షలు పూర్తి చేశాడు.

అయితే పదీ తరగతి ఫలితాలు విడుదల సమయంలో అధికారులు హరీష్ ఫలితాలను వెల్లడించకుండా హోల్డ్‌లో పెట్టాడు. దీంతో మరోసారి విద్యార్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విద్యార్థిపై ఉన్న డీబార్‌ను కొట్టివేస్తూ.. వెంటనే ఫలితాలు వెల్లడించాలంటూ ఈరోజు గురువారం హైకోర్టు తీర్పునిచ్చింది........

రూ.50 వేలకు ఇద్దరు కూతుర్లను అమ్మకానికి పెట్టిన కన్న తల్లి

తెలంగాణలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో కన్నతల్లి కూతుర్లను అమ్మకానికి పెట్టింది. ఓ కన్నతల్లి రూ.20 వేలకు మూడ్రోజుల పసికందును.. రూ.30 వేలకు ఏడేళ్ల పాపను అమ్మాకానికి పెట్టింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఐసీడీఎస్ అధికారుల వద్ద ఉన్నట్లు సమాచారం.

అనారోగ్య సమస్యలు తీవ్రతరం కావడంతో డబ్బుల కోసం కూతుర్లను విక్రయించినట్లు సమాచారం. ఐసీడీఎస్ అధికారుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, గతకొంత కాలంగా మండలంలో చిన్నపిల్లల విక్రయాలు జరుగుతున్నా.. బాలల సంరక్షణ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. పేదరికంతో కూతుర్లను విక్రయింస్తున్న కుటుంబాల వివరాలు తెలుసుకొని ఆదుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు..

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి రోజా
అమ్మతోడు... మీరు నమ్మండి.. ఇది నీటి మడుగు కాదు.. రోడ్డే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయంటూ విపక్ష పార్టీల నేతలతో పాటు ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్నారు. కానీ, అధికర పార్టీ నేతలు మాత్రం వీటిని మాటలతో తిప్పికొడుతున్నారు..

దీనికి గుంటూరు జిల్లా కాకునూరు - కొమ్మూరు గ్రామాల మధ్య ఉన్న ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి కావడం గమనార్హం.

జిల్లా కేంద్రం బాపట్లకు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. కానీ, ఈ రోడ్డు దుస్థితి చూస్తే బైర్లు కమ్మాల్సిందే. ఏకంగా నాలుగు కిలోమీటర్ల భారీగా గుంతలు పడ్డాయి. వీటిని పూడ్చకపోవడంతో వర్షం కురిస్తే చిన్నపాటి మడుగులుగా కనిపిస్తున్నాయి. కార్లు గుంతల్లో వెళ్లగానే ఆగిపోతున్నాయి. ఇక ద్విచక్రవాహనదారుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. రోడ్డు అంచుల వెంబడి ప్రమాదకర స్థాయిలో వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఓ ఆటో గుంతను తప్పించే క్రమంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు ఈ రోడ్డులో ప్రయాణిస్తున్నా వారు ఏమాత్రం స్పందించక పోవడం శోచనీయం..

దీంతో ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు.. ఈ రహదారిలో సీఎ జగన్ లేదా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తే రోడ్డు బాగుపడుతుందని కాకుమాను ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా, సీఎం వస్తున్నారంటే నిధులతో సంబంధం లేకుండా అప్పటికప్పుడు రహదారుల నిర్మాణాలు చేపడతారు కదా?' అని ప్రశ్నిస్తున్నారు. ఈ రహదారిలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, అధికారుల వాహనాలు కూడా ఉంటాయి..

PM Modi in Jakarta: జకార్తా టూర్‌లో ప్రధాని మోదీ..

రెండ్రోజుల్లో ఇండియాలో జీ-20 సదస్సు ఉన్నా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం తన షెడ్యూల్‌ని అత్యంత బిజీగా ఉంచుకుంటూ.. ఇవాళ ఇవాళ ఇండొనేసియాలోని జకార్తాలో పర్యటిస్తున్నారు..

అక్కడ ఇవాళ జరిగే 20వ ఆసియన్ (ASEAN)- ఇండియా సదస్సులో పాల్గొన్నారు. ఇండియా అమలుచేస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియన్ గ్రూప్.. మూల స్తంభం లాంటిది అని మోదీ అన్నారు.

ఇండో-పసిఫిక్ దేశాలపై ఆసియన్ గ్రూప్ అవుట్‌లుక్‌ని పూర్తిగా భారత్ సమర్థిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. "మన భాగస్వామ్యం 4వ దశాబ్దంలోకి ప్రవేశించింది. ఇండియా యొక్క ఇండో-పసిఫిక్ ఇన్షియేటివ్‌లో ఆసియన్ కీలక పాత్ర పోషిస్తోంది" అని మోదీ తెలిపారు.

ఆసియన్ గ్రూపు.. అభివృద్ధికి కీలక కేంద్రంగా ఉందనీ, ప్రపంచ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తోందని మోదీ తెలిపారు. "మన పరస్పర సహకారంలో స్థిరమైన వృద్ధి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నా మనం కలిసి సాగుతున్నాం" అని మోదీ అన్నారు.

తిరుమల లో చిక్కిన ఐదో చిరుత

తిరుమల అలిపిరి నడక మార్గంలో బుధవారం రాత్రి మరో చిరుత చిక్కింది.

నరసింహస్వామి ఆలయం ఏడవ మైలు వద్ద ఇటీవల చిరుత సంచారాన్ని ట్రాప్ కెమెరాల్లో గుర్తించిన… అక్కడే బోను ఏర్పాటు చేసి బంధించారు. నిన్న అర్ధరాత్రి అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది

గత రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలను అధికారులు బంధించారు ...

పసుపు బోర్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్:ఎంపీ అర్వింద్‌

దశాబ్దాల పసుపు రైతుల కల త్వరలోనే నెరవేరనుంది. తెలంగాణలో అత్యధికంగా పసుపు పండించే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు వచ్చే నెలలో మోడీ పర్యటన సందర్భంగా బోర్డును ప్రారంభించడానికి సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు సూత్రప్రాయంగా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ రాజకీయాలను పసుపు బోర్డు ఏర్పాటు అంశం షేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవితను ఓటమి పాలు చేసింది కూడా పసుబోర్డు అంశమే. 2014 పార్లమెంట్ ఎన్నికలలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన కవిత దాన్ని నెరవేర్చకపోవడంతో వందలమంది రైతులు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలిచి ఆమె ఓటమికి కారణమయ్యారు.

అదే ఎన్నికల్లో అర్వింద్ తాను ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డును తెప్పిస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలోని అన్ని రకాల బోర్డులను రద్దు చేసిన విషయం తెలిసిందే.

తిరుపతి లో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు గురువారం శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

బుధవారం రోజున 75,804 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నేడు శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు జరుగనున్నాయి...

ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి 4లక్షల టిక్కెట్లు.. సెప్టెంబర్...8 నుండి టికెట్స్ అందుబాటులో

ప్రపంచ కప్ 2023 ప్రారంభం కావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. అక్టోబర్ 5 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టోర్నీ ప్రారంభం కానుంది. భారత్‌లో జరగనున్న ఈ ప్రపంచకప్‌పై అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొని ఉంది.అందుకే అందరూ టిక్కెట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొంతమంది మాత్రమే విజయం సాధించారు. ఈ క్రమంలో ICC, BCCI విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. అభిమానుల నుంచి నిరంతర ఫిర్యాదుల తరువాత, BCCI మరో రౌండ్ టిక్కెట్ విక్రయాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో అన్ని మ్యాచ్‌ల కోసం మొత్తం 4 లక్షల టిక్కెట్లు సేల్‌లో ఉంచనున్నట్లు తెలిపింది.

సెప్టెంబర్ 8 న విక్రయాలు ప్రారంభం..

ఈ 4 లక్షల టిక్కెట్ల విక్రయం సెప్టెంబర్ 8 రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. వీటిని ప్రపంచ కప్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. మరోసారి టిక్కెట్ల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందని, అందుకే వెంటనే టిక్కెట్లు పొందేందుకు ప్రయత్నించాలని బీసీసీఐ అభిమానులకు సూచించింది. ఇది మాత్రమే కాదు, దీని తర్వాత మరో రౌండ్ విక్రయాలు ఉంటాయని, దాని గురించి త్వరలో అభిమానులకు సమాచారం ఇవ్వనున్నట్లు ఇండియన్ బోర్డ్ తెలిపింది.