*కేసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన టియూడబ్లూజే జిల్లా నాయకులు*
భద్రాద్రి కొత్తగూడెం
రెండు దశాబ్దాలకు పైగా పని చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ కృషితో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ జర్నలిస్ట్ భవన్ కు స్థలాన్ని కేటాయించడంపై టియూడబ్లూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కల్లోజి శ్రీనివాస్, మహ్మద్ సఫీ ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గురువారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లోని అమరవీరుల స్థూపం వద్ద టియూడబ్లూజే (టీజేఎఫ్) జిల్లా నాయకులు కేసీఆర్, కేటీఆర్, అల్లం నారాయణ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్ మాట్లాడుతూ
జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం ప్రెస్ అకాడమీ చైర్మన్ చేస్తున్న కృషిని కొనియాడారు. రాష్ట్ర రాజధాని కేంద్రంలోని ఉప్పల్ బగాయత్ లో జర్నలిస్టుల కోసం తెలంగాణ జర్నలిస్ట్ భవన్ నిర్మాణానికి 2000 గజాల స్థలాన్ని కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. టియూడబ్లూజే (టీజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులకు భవిష్యత్తు లో మరిన్నీ సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు చండ్ర నరసింహారావు, టెంజు అధ్యక్షులు వట్టి కొండ రవి, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ జిల్లా అధ్యక్షులు చెంగపొంగు సైదులు, కార్యదర్శి అఫ్జల్ పఠాన్, సీనియర్ పాత్రికేయులు మోటమర్రి రామకృష్ణ, అచ్చి ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు కనుకు రమేష్, శివ ,రాజ్ కుమార్, నవీన్, భాస్కరాచారి, సురేష్, నాగరాజు ,మురళి, చిరంజీవి, కనకారావు, జంపన్న, చదలవాడ సూరి, కిరణ్ ,రత్నకుమార్, వినోద్, రమేష్, ఆదాబ్ శ్రీను, దశరథ్ ,కలవ రాజా, మిలాప్ శ్రీను, రహీం తదితరులు పాల్గొన్నారు.
Aug 04 2023, 20:16