నల్గొండ జిల్లా:చిట్యాల::హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

చిట్యాల మున్సిపాలిటీలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఈ కార్యక్రమంలో. చిట్యాల మున్సిపల్ ఛైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య,మున్సిపల్ వైస్ ఛైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, పలువురు ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా:నకిరేకల్ :క్షతగాత్రులను పరామర్శించిన. బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి

క్షతగాత్రులను పరామర్శించిన. బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి

.

Streetbuzz. News నల్గొండ జిల్లా :

నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం శివారులో జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నకిరేకల్ లో బీఎస్పీ మీటింగ్ ముగించుకొని చిట్యాల కు వచ్చే క్రమంలో బస్ ప్రమాదం కి గురికాగా అటు వైపు వెళ్తున్న బిఎస్పి ప్రచార వాహనంలో క్షతగాత్రులను కామినేని హాస్పిటల్ కి తరలించారు. చికిత్స నిమిత్తం చేర్పించగా చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి శుక్రవారం పరామర్శించారు. శుక్రవారం కామినేని హాస్పిటల్ కు వెళ్లి అక్కడ వైద్య బృందాన్ని ఎప్పటికప్పుడు క్షతగాత్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం వైద్యులను మంచి వైద్యం అందించాలని వారిని ఆమె కోరారు. అనంతరం వారు మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందన్నారు. రామన్నపేట కు చెందిన విఓఏ, అంగన్వాడీ, ఆశా వర్కర్లలను నకిరేకల్ లో మీటింగ్ వుంది అని పిలిచి ఈ ప్రమాదానికి కారణమైయ్యారు అని దుయ్యబట్టారు. ప్రభుత్వం కొత్త వారిని రిక్రూమెంట్ చేసుకోక పాతవారికే డబల్ డ్యూటీ వేయడం వల్ల వాళ్లకు నిద్ర సరిపోక ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. పేద ప్రజల ప్రభుత్వానికి లెక్క లేదా అని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి ఆర్టీసీలో కొత్త వారిని రిక్రూమెంట్ చేసుకొని ఎంప్లాయిస్ మీద భారం తగ్గించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కూమర్,కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, మల్లేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

టీఎస్ జేఏ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా మాధవరావు పటేల్ నియామకం.

టీఎస్ జేఏ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా మాధవరావు పటేల్ నియామకం

నిర్మల్ జిల్లా:

జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి ఇప్పటికే ఎన్నో ఉద్యమ కార్యక్రమాలను చేపట్టిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎస్ జేఏ) నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయులు (ఎం4 టీవీ చైర్మన్) సూర్యవంశ మాధవరావు పటేల్ ను నియమించారు.ఈ మేరకు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆదివారం ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా మాధవరావు పటేల్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి కి అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులకు సహకరించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీడియా రంగంలో కొనసాగుతూ ఇప్పటివరకు సొంత ఇండ్లు సొంత ఇంటి స్థలాలు పొందుకొనని ఎంతోమంది జర్నలిస్టుల సంక్షేమం కోసం కృతనిత్యంతో పోరాడుతామని తెలిపారు.ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరారు

నల్గొండ జిల్లా:కట్టంగూర్:ముత్యాలమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి విరాళం అందజేసిన.కొండేటి.

ముత్యాలమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి విరాళం అందజేసిన.కొండేటి

Streetbuzz న్యూస్ :నల్గొండ జిల్లా :

కట్టంగూర్ మండలం పిట్టంపల్లి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవాలయానికి 50,000 రూపాయలు విరాళం. అందించి ధ్వజస్తంభ ప్రతిష్టాత్మక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొండేటి మల్లయ్య.ఈ కార్యక్రమంలో. నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ ప్రతినిధి సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,మాజీ సింగిల్ విండో చైర్మన్ చౌగొని సాయిలు,గౌరవ నరసింహ, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు ముక్కామల శేఖర్ యాదవ్,ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు బొడ్డుపల్లి సైదులు,న్యాయవాది మేడి విజయ్ కుమార్, వెంకట్ రెడ్డి,చీర కిరణ్,

నల్గొండ జిల్లా :కట్టంగూర్ ను మోడల్ గా తీర్చిదిద్దుతా.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

కట్టంగూర్ ను మోడల్ గా తీర్చిదిద్దుతా.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

.

Streetbuzz న్యూస్. నల్గొండ జిల్లా :

కట్టంగూర్ ను మోడల్ పట్టణంగా మారుస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

ఆదివారం నాడు కట్టంగూర్ మండల కేంద్రంలో మార్నింగ్ వాక్ లో భాగంగా ఉదయం స్థానిక ప్రజలతో కలసి మార్నింగ్ వాక్ చేశారు అందులో భాగంగా ప్రజలను ఆప్యాయంగా పలుకరించి వారితో కాసేపు ముచ్చటించారు నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి పనులను చర్చించారు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని పలు విధుల్లో పర్యటించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రతి విధుల్లో సీసీ రోడ్, డ్రైనేజి నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో.జడ్పీటీసీ తరాల బలరాం,మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు,నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ గౌడ్,కట్టంగూర్ గ్రామ శాఖ అధ్యక్షులు చెవుగోని జనార్ధన్ గౌడ్,మాజీ ఉప సర్పంచ్ అంతటి శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు,ఉప సర్పంచులు వార్డ్ నెంబర్లు,సీనియర్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా:నకిరేకల్ :ఎమ్మెల్యే చిరుమర్తి పర్యటన.

ఎమ్మెల్యే చిరుమర్తి పర్యటన

Streetbuzz news :నల్గొండ జిల్లా :

నకిరేకల్ మండలంలోని వల్లభాపురం గ్రామంలో మార్నింగ్ వాక్ లో భాగంగా శనివారం నాడు ఉదయం ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని పలు వీధుల్లో పర్యటించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.పెండింగ్ లో ఉన్న పనులను పరిశీలించారు.ప్రతి వీధిలో సీసీ రోడ్డు, డ్రైనేజి నిర్మించేల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నీటికి ఇబ్బందులు అవుతున్నావని గ్రామస్థులు తెలపడంతో తక్షణమే బోరు వేపిస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో 17 మంది దళిత బంధు లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆర్ధిక సంపాదన గురించి తెలుసుకున్నారు దళిత బంధు మంజూరు చేసిన సీఎం కెసిఆర్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కి కృతజ్ఞతలు తెలిపారు.

నల్గొండ జిల్లా:తెలంగాణలో బహుజన రాజ్యం రావడం ఖాయం. నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి బీఎస్పీ ప్రియదర్శిని మేడి.

తెలంగాణలో బహుజన రాజ్యం రావడం ఖాయం. నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి బీఎస్పీ ప్రియదర్శిని మేడి

Streetbuzz న్యూస్. నల్గొండ జిల్లా :

తెలంగాణ బీఎస్పీ అధికారంలోకి వస్తే ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ సీఎం అవుతారని ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించటం పట్ల నకిరేకల్ నియోజకవర్గ కమిటీ తరుపున హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ.. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినన్ని రోజులు యూపీలో బీఎస్పీ గెలిచిందని తెలిపారు. ఈవీఎం ద్వారా ఎన్నికలు మొదలైనప్పటి నుంచి బీజేపీ గెలుస్తోందన్నారు. సీఎం కేసీఆర్ యూపీ పాలనను కాపీ కొట్టాలని చూశారని, తాము చేసినట్లు 3 ఎకరాల భూమి ఇవ్వలేక పోయారని విమర్శించారు. కేసీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మారుస్తా అన్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను ఎన్నికల్లో గెలవనివ్వలేదని గుర్తుచేశారు. బహుజన వర్గాలకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ కుటుంబం తెలంగాణను దోచుకుంటుందని దుయ్యబట్టారు. ప్రగతిభవన్ మీద నీలి జెండా ఎగరేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దోపిడీ దొరల నుంచి తెలంగాణను కాపాడాలని పిలుపునిచ్చారు. 213 రోజులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కూమర్ సర్ తెలంగాణలో పర్యటించారాని అధికార పార్టీ వాళ్లు ఎన్ని అడ్డంకులు పెట్టినా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి దిగ్విజయంగా పూర్తి చేశారాని తెలిపారు.

నల్గొండ జిల్లా:నార్కట్ పల్లి:సుడిగాలి పర్యటన చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

సుడిగాలి పర్యటన చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సుడిగాలి పర్యటన చేసారు, ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని ప్రధాన వీధుల్లో ఆయన పర్యటించారు, కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు, మునుపెన్నడూ లేని విధంగా కాలనీలలో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందని, పార్టీలకతీతంగా పూర్తి మద్దతు తెలుపుతామని ఎమ్మెల్యే చిరుమర్తి తో వారు అన్నారు..

నల్గొండ జిల్లా :పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

.

నకిరేకల్ మున్సిపాలిటీ సిబ్బంది వంటేపాక పెద్ద లింగయ్య ఆనారోగ్యంతో మరణించడంతో మృతదేహానికి పులా మాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి *రూ.20 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేసి. అనంతరం.

కట్టంగూర్ మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన బండారు నర్సింహా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మృతదేహానికి పులా మాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.25 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,వారి వెంట నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,కట్టంగూర్ జెడ్పీటీసీ తరాల బలరామ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఊట్కురి శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రవిన్, ఉపేందర్,శీను,బండరు సత్తయ్య,ఊట్కురి మల్లేష్, సైదులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా:నకిరేకల్:కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధానకార్యదర్శి కొండేటి మల్లయ్య. జన్మదిన వేడుకలు

నా జీవితమే.. పేదల కోసం..ప్రజల మధ్యనే ఉండి సేవ చేస్తా టీపీసీసీ ప్రధానకార్యదర్శి కొండేటి మల్లయ్య స్పష్టం నకిరేకల్ లో వైభవంగా జన్మదిన వేడుకలు వేలాదిమంది అభిమానులు శుభాకాంక్షల వెల్లువ

.

Streetbuzz న్యూస్. నల్గొండ జిల్లా :

నకిరేకల్: తన జీవితం ప్రజసేవకే అంకితమని, పేదల మధ్య ఉండి సేవచేయడమే తన లక్ష్యమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య అన్నారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు కొండేటి మల్లయ్య జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కేక్ చేసి స్వీట్లు అభిమానులకు స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే తన జన్మదిన వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుపుకుంటానని అన్నారు. నకిరేకల్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రత్యక్షంగా పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కేతేపల్లి మండలంలో జఠంగి వెంకటనర్సయ్య, కట్టంగూరులో సుకంరబోయిన నర్సింహ యాదవ్, ముక్కామల శేఖర్ ఆధ్వర్యంలో, చిట్యాలలో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రామన్నపేట జమీర్, సాల్వేర్ అశోక్, ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కాగా, నకిరేకల్ క్యాంపు కార్యలయంలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జటంగి రామనర్సయ్య యాదవ్, లింగాల వెంకన్న, పన్నాల రాఘవరెడ్డి, రాచకొండ లింగయ్య, యాస కర్ణాకర్ రెడ్డి, బొప్పని యాదగిరి, పల్ రెడ్డి ఉపేందర్ రెడ్డి, బడుగుల చంద్రశేఖర్ యాదవ్, కొండ భాస్కర్, కొండ అంజమ్మ, సురిగి జ్యోతి, ఆవుల వేణు, మధు, కేతేపల్లి, కట్టంగూరు, నార్కెట్ పల్లి,చిట్యాల,రామన్న పెట,నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గుడివాడ శివాలయంలో కొండేటి పూజలు

కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలోని శివాలంయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య తన అనుచరులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల ద్వారా స్వామివారికి అభిశేకం నిర్వహించారు. నియోజకవర్గం ప్రజలను ఆ దేవుడు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పన్నాల రాఘవరెడ్డి, యాసకర్ణాకర్ రెడ్డి, రాచకొండ లింగయ్య, బొప్పని యాదగరి, గుడి వాడ గ్రామ శాఖ అధ్యక్షుడు లింగయ్య, మాజీ సర్పంచ్ లతీఫ్, వార్డుమెంబర్ సైదులు, మాజీ వార్డు మెంబర్ దస్తగిరి, నాగభూషణం, సతీష్, కదిరే శ్రవణ్, నారాయణ, వి. నర్సింహ, చారి, రమేష్, సాయిబాబా, సీతయ్య, రేపని సత్తయ్య, చంద్రశేఖర్, పి. సైదులు, తదితరులు పాల్గొన్నారు.