నేడు పార్వతిపురంలో సీఎం జగన్ పర్యటన
![]()
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో పర్యటిస్తున్నారు. సందర్భంగా ఏర్పాట్లను జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి నాలుగో విడత నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం కురుపాంలో ప్రారంభించనున్నారు. మొదటిసారి సిఎం జగన్మోహనరేడ్డి జిల్లాకు రానున్న నేపథ్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు.
ముఖ్యమంత్రి హౌదాలో మొట్టమొదటిసారిగా జగన్ మోహన్ రెడ్డి జిల్లాకు వస్తుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, వాహనాల పార్కింగ్ లాంటి ఏర్పాట్లు చేపడుతున్నారు. అమ్మ ఒడి కార్యక్రమం కురుపాం లో ప్రారంభించడం ఇక్కడ ప్రజలు తమ అదృష్టంగా భావిస్తున్నారని మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు...


Jun 28 2023, 09:13
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
21.8k