Eatala Jamuna: ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై ఈటల జమున సంచలన వ్యాఖ్యలు..
![]()
హైదరాబాద్: భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన సతీమణి జమున ఆరోపించారు. రూ.20కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానంటూ భారాస ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి అన్నట్లు తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు..
హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జమున మాట్లాడారు.
''ఈటలను చంపేస్తామంటే మేం భయపడిపోం. కౌశిక్ రెడ్డి మాటల వెనక సీఎం కేసీఆర్ ఉన్నారు. ఓటుతో ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్తారు. కౌశిక్ రెడ్డిని.. కేసీఆర్ హుజూరాబాద్ ప్రజలపైకి ఉసిగొల్పారు. ఆయన హుజూరాబాద్‌లో అరాచకాలు సృష్టిస్తున్నారు. అమరవీరుల స్తూపాన్ని కౌశిక్‌రెడ్డి కూలగొట్టించారు. మా కుటుంబంలో ఎవరికి హాని జరిగినా దానికి కేసీఆరే కారణం'' అని జమున ఆరోపించారు.
భాజపాలో ఈటల రాజేందర్ సంతృప్తిగా ఉన్నారని ఈటల జమున చెప్పారు. పార్టీ మారను అని ఆయన ఇప్పటికే స్పష్టంగా చెప్పారని తెలిపారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పారు..



Jun 27 2023, 17:30
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
19.8k