Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా..
హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పర్యటన వాయిదా పడింది. బిపర్‌జోయ్ తుఫాను కారణంగా ఈ పర్యటనకు బ్రేక్ పడింది..
త్వరలోనే ఖమ్మంలో నిర్వహించే సభ తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
తెలంగాణలో అధికారం దిశగా పార్టీని నడిపేలా.. బీజేపీ కార్యకర్తలు, శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సాగేలా ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి సమయానికి హైదరాబాద్‌కు చేరుకోనున్న షా.. గురువారం రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై పలు అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని, శ్రేణులను వార్ మోడ్‌లో పెడతారని బీజేపీ నేతలు భావించారు.
ముఖ్యంగా.. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మిగిలింది ఐదారు నెలల స్వల్ప సమయమేనని, ఈ సమయంలోగా పార్టీ పుంజుకుని మళ్లీ మునుపటిలాగా బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనన్న అభిప్రాయం ప్రజల్లో తేవాలంటే ఎలా దూకుడుగా వ్యవహరించాలి? సూక్ష్మస్థాయిలో ఏయే వ్యూహాలను రచించి పాటించాలి? వంటి అంశాలపై పార్టీ నేతలకు ఆయన సూచిస్తారని భావించారు..











Jun 14 2023, 18:38
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
27.4k