తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: జూన్ 13

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (మంగళవారం) టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.41 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న (సోమవారం) శ్రీవారిని79,087 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 35,640 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

SB NEWS

SB NEWS

Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్..

Cyclone Biparjoy Latest News: బిపోర్‌ జాయ్‌ తుఫాన్ తీవ్రరూపం దాల్చింది. అరేబియా సముద్రంలో చురుగ్గా కదులుతూ దూసుకువస్తోంది.

ఈ నెల 15వ మధ్యాహ్నం గుజరాత్‌లోని కచ్‌ జిల్లా జఖౌవద్ద తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ సమయంలో బిపోర్‌ జాయ్‌ తీవ్ర తుఫాన్‌గా ఉంటుందని.. గంటలకు 150 కి.మీ వేగంలో గాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బిపోర్‌ జాయ్‌ తుఫాన్ ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గుజరాత్‌లోని కచ్, దేవభూమి ద్వారక, పోర్‌బందర్, జామ్‌నగర్, మోర్బీ, జునాఘర్, రాజ్‌కోట్‌లతోపాటు పలు జిల్లాలపై బిపోర్‌ జాయ్‌ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో అధికారులను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అప్రమత్తం చేసింది.

సౌరాష్ట్ర, కచ్ తీరాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ.. బుధవారం ఆరెంజ్ అలర్ట్, జూన్ 15న రెడ్ అలర్ట్ జారీ చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సముంద్ర తీరప్రాంతానికి దగ్గరగా వారిని అధికారులు ఖాళీ చేస్తున్నారు. వారందరనీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చేపల వేటను ఇప్పటికే నిషేధించారు. విపత్తును ఎదుర్కొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రెడీ అయ్యాయి..

కాంగ్రెస్‌లోకే పొంగులేటి, జూపల్లి రేపే ప్రకటన

ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కూడా!

రేపు ప్రెస్‌మీట్‌లో ప్రకటించనున్న నేతలు

అమిత్‌షా ఖమ్మం టూర్‌కు ఒకరోజు ముందే..

బీజేపీకి నిరాశ.. కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌

ఖమ్మం అసెంబ్లీ బరిలోకి పొంగులేటి?

బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. వీరికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కూడా జత కలవనున్నారు. వీరు ముగ్గురూ కలిసి బుధవారమే హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్‌లో తమ చేరిక విషయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా బీఆర్‌ఎ్‌సను వీడాల్సివచ్చిన పరిస్థితులు, తాము ఎదుర్కొన్న ఇబ్బందులతోపాటు తమ భవిష్యత్తుపై నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తారని తెలిసింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఖమ్మం జిల్లా పర్యటనకు సరిగ్గా ఒకరోజు ముందే కాంగ్రె్‌సలో చేరికకు సంబంధించి వీరు ప్రకటన చేయనుండడం గమనార్హం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాకే చెందిన నేత కావడం, ఖమ్మంలో అమిత్‌షా సభకు ముందురోజే తన నిర్ణయాన్ని వెల్లడించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలు నియోజకవర్గాల నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పొంగులేటితోపాటు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పొంగులేటి.. కాంగ్రెస్‌ తరఫున ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా కాలంగా బీఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఒకదశలో అధిష్ఠానం ఆయనతో మాట్లాడినా.. పార్టీలో ఉండేందుకు ఇష్టపడలేదని సమాచారం. దీంతో సీఎం కేసీఆర్‌ ఒక సందర్భంలో, ‘‘పొంగులేటి పోతాడు.. వదిలేయండి’’ అని అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానించారు. అయితే పొంగులేటి ఒంటరిగా కాకుండా.. జిల్లాలోని తన అనుచర గణాన్ని వెంట తీసుకొని మరీ పార్టీని వీడుతుండడమే కీలకంగా మారింది. ఈ మేరకు ఆయన గత కొన్నినెలలుగా నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆ సమావేశాల్లో తన భవిష్యత్తు రాజకీయ వ్యూహంపై కూడా చర్చించారు. తొలుత బీజేపీలో చేరాలని పొంగులేటి భావించినా.. ఇందుకు ఆయన అనుచరుల నుంచి పూర్తి మద్దతు రాలేదు. దీంతో ఆయన పలు దఫాలుగా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. బీజేపీ చే రికల కమిటీ కన్వీనర్‌ ఈటల రాజేందర్‌తో, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితో కూడా ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. కానీ, ఆ పార్టీ నుంచి తగిన భరోసా రాలేదన్నది సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో అయితేనే బాగుంటుందనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది.

ఒకరు ఇద్దరై.. ఆ తర్వాత ముగ్గురై

బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పట్ల అసంతృప్తిని తొలుత పొంగులేటి ఒక్కరే ప్రకటించగా.. నెల రోజుల క్రితం ఆయనకు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తోడయ్యారు. జూపల్లి కలిశాక తాము ఎటువైపు వెళ్లాలన్నదానిపై ఇద్దరి మధ్య అంతర్గత సమావేశాలు జరిగాయి. అదే సమయంలో ఇద్దరూ కలిసి పలువురు నేతలతో రహస్యంగా సమావేశాలు నిర్వహించారు. వారం రోజుల క్రితం వీరికి బీఆర్‌ఎ్‌సకే చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి జత కలిశారు. దీంతో ముగ్గురూ కలిసి టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవితో చర్చలు జరిపారు. ఈ 14న సంయుక్తంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలుస్తోంది. అయితే ఈ ముగ్గ్గురు నేతలు కాంగ్రె్‌సలోకి వెళ్లడమనేది అధికార బీఆర్‌ఎ్‌సకే కాకుండా బీజేపీకి కూడా నిరాశ కలిగిస్తోందని అంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఈ పరిణామం భవిష్యత్తులో తమకు బూస్ట్‌గా ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి సోమవారం సీఎం కేసీఆర్‌ గద్వాల జోగుళాంబ జిల్లాలో జరిపిన పర్యటనలో పాల్గొని ఆశ్చర్యపరిచారు. కేసీఆర్‌ వెంట పర్యటన ఆసాంతం ఉండడంతోపాటు గద్వాలలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. సభావేదికపై బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి కూర్చున్నారు. దీంతో ఆయన నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తెలంగాణలో జనసేన పోటీపై పవన్ కల్యాణ్ క్లారిటీ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న కొద్ది రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి..

మరో వైపు రానున్న ఎన్నికల్లో సత్తా చాటి కింగ్ మేకర్‌గా నిలవాలని మిగిలిన పార్టీలు వ్యూహలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దృష్టి సారించారు..

ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ జనసేన నేతలు పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌ను అమరావతిలో కలిసి రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీపై చర్చించారు. ఈ సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తోందని పవన్ కల్యాణ్ తెలంగాణ జనసేన నేతలకు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ జనసేన నేతలకు పవన్ సూచించారు.

అంతేకాకుండా త్వరలోనే వారాహి యాత్ర కూడా ఉంటుందని తెలిపారు. తెలంగాణలో జనసేన సత్తా చూపించేలా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. అలాగే, తెలంగాణలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జనసేన ఇన్ ఛార్జ్‌లను పవన్ నియమించారు. కాగా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా ఉండగా.. జనసేన ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి..

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి స్వల్ప ఊరట..

ముంబయి: పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి స్వల్ప ఊరట లభించింది. కోర్టు హాజరు నుంచి మినహాయింపునిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముంబయి హైకోర్టు పొడిగించింది..

ఆగస్టు 2 వరకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకుగానూ బీజేపీకి చెందిన మహేశ్ శ్రీశ్రీమల్ 2021లో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణకు రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ గతంలో స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ ముంబయి హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్వీ కొత్వాల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తాజాగా రాహుల్ గాంధీ హాజరు మినహాయింపును ఆగస్టు 2 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది..

TS News: ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్‌కు బాంబ్ బెదిరింపు.. పరుగులు తీసిన ఉద్యోగులు..

హైదరాబాద్: అది రద్దీగా ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయం (Income Tax Office). సోమవారం కావడంతో గతవారం పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు కొందరు అధికారులు పీజీలను శరవేగంతో తిరిగేస్తున్నారు..

మరి కొందరు అక్రమార్కుల చిట్టాను తయారు చేస్తున్నారు. ఇలా అధికారులు ఎవరి పనిలో వాళ్లు మునిగిపోయారు. ఇంతలోనే ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ రింగ్ మంటూ మోతమోగింది. పనిలో పడ్డ ఓ అధికారి ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. ఓ అంగతకుడు మీ ఆఫీస్‌లో బాంబు పెట్టామని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు.

క్షణాల్లో పిడుగు లాంటి వార్త దావాణంలా వ్యాపించింది. వార్త విన్న ఉద్యోగులు బతుకు జీవుడా అంటూ ఎక్కడ పనులక్కడ వదిలేసి బయటకు పరుగులు తీశారు. ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయం బాంబ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది.

ఇటీవల ఈ తరహా ఫోన్ కాల్స్ ఎక్కువవుతున్నాయి. రైల్వేస్టేషన్, బస్ స్టేషన్‌తో పాటు జనం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో బాంబు పెట్టామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ పోకిరీలు చివరకు స్కూళ్లను కూడా వదలం లేదు. అయితే ఫోన్ చేసిన వ్యక్తులను గుర్తించి వారిని శిక్షించనప్పటికే మార్పు రావడం లేదు. ఆటపట్టించేందుకు బెదిరింపు ఫోన్ చేయడం వల్ల ప్రజాధనం నిరుపయోగం అవుతోంది. ఇలాంటి కాల్స్ వల్ల పోలీసులు, అధికారులు అంతకుముందే నిర్ణయించుకున్న పనులు పెడింగ్ పడుతున్నాయి. అలాగే బాంబ్ బెదిరింపు వల్ల ఉద్యోగులు మానసిన ఆందోళనకు గురవుతున్నారు..

Encounter | చత్తీస్‌ఘఢ్ లో ఎన్‌కౌంటర్ : అటవీ ప్రాంతంలో కాల్పుల హోరు..

ఛత్తీస్‌ఘఢ్‌లోని కాంకేర్ జిల్లాలో సోమవారం ఉదయం నక్సల్స్‌కు భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూడాల్సి ఉందని పోలీసులు తెలిపారు..

రాయ్‌పూర్ : చత్తీస్‌ఘఢ్‌లోని కాంకేర్ జిల్లాలో సోమవారం ఉదయం నక్సల్స్‌కు భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా నక్సల్ మరణించింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూడాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈనెల 7న బిజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య ఎన్‌కౌంటర్ జరిగిన అనంతరం మరోసారి నక్సల్స్‌, పోలీసులు తలపడ్డారు.

7న జరిగిన ఘటనలో కోబ్రా, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా నక్సల్స్‌ను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో చత్తీస్‌ఘఢ్‌లోని బీజాపూర్‌, సుక్మా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు, కాల్పుల శబ్ధాలు వినిపించాయి.

ఇక జూన్ 5న సుక్మా జిల్లాలో కరుడుగట్టిన నక్సల్‌ను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. సుర్పంగుడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి సునీల్ అలియాస్ సోది దేవను భద్రతా దళాలు అరెస్ట్ చేశాయని సుక్మ ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు..

Biparjoy : తుఫాను కారణంగా ముంబైలో భారీ వర్షాలు.. PM అత్యవసర సమావేశం..

అరేబియా సముద్రంలో బైపోర్‌జోయ్ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో ముంబై సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది..

ఈదురుగాలులతో పాటు సముద్రంలో అలలు ఎగిసిపడ్డాయి. తుఫాను కారణంగా అనేక విమానాలు కూడా దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే మహారాష్ట్రను అలర్ట్ చేసింది. తుఫాను ఇప్పుడు దేవభూమి ద్వారక నుండి 380 కి.మీ దూరంలో ఉంది. జూన్ 15 నాటికి గుజరాత్‌లోని జఖౌ ఓడరేవును దాటే అవకాశం ఉంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు..

తుఫాను కారణంగా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుఫాను హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. మహారాష్ట్ర, గుజరాత్ తీరంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ సమయంలో ముంబైలో తుఫాను వచ్చి చాలా చెట్లు నేలకూలాయి. తీవ్ర వాయుగుండం తీవ్ర తుఫానుగా మారిందని తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాతావరణ పర్యవేక్షణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం బైపోర్‌జోయ్ తుపాను గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది..

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన కారు..

కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ వద్ద ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కారు ప్రమాదానికి గురైంది..

ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది..

ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షేమంగా బయటపడ్డారు.

బైక్‌ పైన వెళ్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలవ్వగా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఎస్కార్ట్ వెహికిల్ ఎక్కి వెళ్లిపోయారు.

అయితే హైదరాబాద్ నుంచి హుజూరాబాద్‌కు నేడు(సోమవారం) నిర్వహించబోయే 2కే రన్ కోసం వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కారు పాక్షికంగా ధ్వంసమైంది..

పండుగలా విద్యాకానుక.. మేనమామగా సంతోషిస్తున్నా: సీఎం జగన్‌..

పల్నాడు:వీళ్లు చిన్నారులు వీళ్లకు ఓటు హక్కు లేదు.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది గతం. కానీ, ఇవాళ వాళ్ల జగన్‌ మామ ప్రభుత్వంలో విద్యాకానుక ఓ పండుగలా జరుగుతోంది..

ఒక ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రతీ ప్రజాప్రతినిధులందరూ పిల్లలతో కలిసి ఈ పండుగలో పాల్గొంటుడడం.. ఆ పిల్లల మేనమామగా సంతోషపడుతున్నా: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. సోమవారం పల్నాడు జిల్లా క్రోసూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారాయన. ''పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యాకానుక అందిస్తున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. కిట్లలో మెరుగైన మార్పులు తెచ్చాం. ప్రతీ విద్యార్థికి మూడు జతల యూనిఫామ్‌, స్కూల్‌ బ్యాగ్‌, షూస్‌, సాక్సులు అందిస్తున్నాం.

నోట్‌ బుక్స్‌, వర్క్‌ బుక్స​, బైలింగువల్‌ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలతో పాటు బ్యాగు సైజులు పెంచాం. యూనిఫామ్‌ డిజైన్‌లోనూ మార్పులు చేశాం అని తెలిపారాయన. 

ఈ ఒక్క పథకం మీదే ఈ నాలుగు ఏళ్లలో ఈ పిల్లల మేనమామ ప్రభుత్వం అక్షరాల రూ. 3,366 కోట్లు ఖర్చు చేశామని చెప్పడానికి గర్వపడతున్నాం అని సీఎం జగన్‌ చెప్పారు..