నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 20:41

ఆ ఇద్దరు నేతల వల్లే ఏపీ బొక్కబోర్లా పడింది..

మరోసారి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

సంగారెడ్డి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మంత్రి హరీష్‌రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నేతల వల్ల ఏపీ బొక్కబోర్లా పడిందని.. వాళ్ళది ప్రచారం ఎక్కువ.. మనది పని ఎక్కువ అని అన్నారు. గతంలో ఒకరు హైటెక్ పాలన అంటూ హడావుడి చేశారని... ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. శనివారం సంగారెడ్డిలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సుపరిపాలన దినోత్సవంలో మంత్రి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి చూస్తే తెలంగాణ గొప్పతనం తెలుస్తుందన్నారు.

కేసీఆర్ తలయెత్తుకునేలా పాలన అందించారని గొప్పగా చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రం అయినా సుపరిపాలన అందించారన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని తెలిపారు. కేంద్ర, అన్ని రాష్ట్రాల ఉద్యోగుల వేతనాల కంటే ఎక్కువ వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే అని పేర్కొన్నారు. తెలంగాణ చేస్తున్న మంచి పనులు చూసి కేంద్రం తట్టుకోలేకపోతుందని మంత్రి విమర్శించారు.

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన లక్షా 30 వేల కోట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ వస్తే దళారి వ్యవస్థ వస్తుందని.. కేసీఆర్‌ర్ నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తారని చెప్పారు. తెలంగాణ వస్తే నక్షలైట్ల రాజ్యం వస్తుందని.. హైదరాబాద్‌లో కర్ఫ్యూ ఉంటుందని.. అంతా చీకటేనని చాలా మంది చెప్పారని గుర్తుచేశారు.

ఈ 9 ఏళ్లలో అది నిజం కాదని కేసీఆర్ చేసి చూపెట్టారన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని.. కేంద్రమే తెలంగాణకి అవార్డులు ఇస్తుందన్నారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వ్యతిరేక శక్తులకు ఇది చెంపపెట్టన్నారు. తెలంగాణ విభజనని వ్యతిరేకించి తప్పు పని చేశానని లగడపాటి అన్నట్టు గుర్తు అని... ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో లేరన్నారు. నవ్విన చోటే నాప పండు పండించినట్టు కేసీఆర్ తల ఎత్తుకునేలా చేశారని చెప్పుకొచ్చారు. కేంద్రం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చుకుందని ఆయన వ్యాఖ్యలు చేశారు.

‘‘మనం ఆడిట్ బాగా చేస్తున్నామని మన దగ్గర ఉన్న ఆడిట్ డైరెక్టర్‌ను ఢిల్లీకి పిలుచుకున్నారని’’ అన్నారు. తెలంగాణలో సర్పంచులు అందరూ ఓ బస్సులో గుజరాత్, మహారాష్ట్ర వెళ్లి అక్కడ అభివృద్ధి ఎలా ఉందో చూడాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పనితనానికి.. బీఆర్‌ఎస్ మోడల్ సర్కార్ పనితనానికి తేడా తెలుస్తుందన్నారు. ‘‘అస్సాం ముఖ్యమంత్రి స్వయంగా కరెంట్ సరిపోవట్లేదు కరెంట్ పొదుపుగా వాడాలని చెప్పారు. మనకి ఢిల్లీల అవార్డులు ఇస్తారు.. గల్లీల తిడుతారు. ధరణి వల్లే రైతుల సమస్య పరిష్కారం అయ్యింది. ధరణి రాకముందు రైతుల కష్టం అంతా ఇంతా కాదు. ధరణి తీసేయాలని కాంగ్రెస్ చెబుతుంది. ధరణి తీసేస్తే.. కాంగ్రెస్ కార్యకర్తలకే రైతు బంధు ఇస్తారు. నిజాలను ప్రచారంలో పెట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. కాంగ్రెస్ వాళ్లు మళ్ళీ వస్తే దళారీ వ్యవస్థ రాజ్యామేలుతుంది. తెలంగాణ దేశానికి దిక్సుచిగా నిలవాలంటే మూడోసారి కేసీఆర్ రావాలి’’ అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు..

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 20:36

ఘనంగా భాజపా రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ పుట్టినరోజు వేడుకలు

•ముఖ్య అతిధిగా హాజరైన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

నకిరేకల్ నియోజకవర్గo లోని చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

చిట్యాల లోని శ్రీ రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బిజేపి రాష్ట్ర నాయకులు 1వ వార్డు కౌన్సిలర్ శేపూరి రవీందర్ గారి జన్మదిన వేడుకలలో ముఖ్య అతిధిగా హాజరైన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు.

రవీందర్ గారి జన్మదిన సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు బిజెపి నాయకులు కార్యకర్తలు ఉద్దేశించి భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు మాట్లాడారు.

రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అదేవిధంగా నకిరేకల్ నియోజకవర్గంలో శెపూరి రవీందర్ లాంటి నాయకుడిని మీరందరూ మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించి మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని బలపరుస్తారని ఆశిస్తున్నామన్నారు.

ఈ నకిరేకల్ నియోజకవర్గం లో ఏ ఇంట్లో ఏ ఆపద వచ్చినా అన్నా అంటే నేనున్నానని ఒక భరోసానిచ్చేటువంటి ప్రజా నాయకుడు రవీందర్ గారని, గత 20 సంవత్సరాలుగా తన రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు సాధించి ప్రజలకు సేవలు అందించి ప్రజా ఆశీర్వాదం పొందినారన్నారు అదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలన్నారు.

బిజెపి రాష్ట్ర నాయకులు చేపూరి రవీందర్ మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మహిళా సోదరీమణులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఇక ముందు ముందు కూడా మా మహిళా సోదరీమణులు ఎంత పెద్ద ఎత్తున నాకు మద్దతునిచ్చి రానున్న ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలని కోరుకున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కొరకై అహర్నిశలు శ్రమిస్తానని ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు సినీనటి కవిత, నకిరేకల్ అసెంబ్లీ కన్వీనర్ మైల నరసింహ, బిజెపి నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు, చిట్యాల మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ, పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, నకిరేకల్ రూరల్ మున్సిపాలిటీ అధ్యక్షులు యానాల శ్రీనివాస్ రెడ్డి, పల్సా శ్రీను గౌడ్, నార్కట్పల్లి మండల అధ్యక్షులు కొరివి శంకర్, కేతపల్లి మండల అధ్యక్షులు రాచకొండ గోపి, ఎస్సి మోర్చా రాష్ట్ర నాయకులు మాస శ్రీనివాస్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్న, ఎస్సీ సెల్ కోరబోయిన లింగస్వామి, సీనియర్ నాయకులు చికిలం మెట్ల అశోక్, గుండాల నరేష్ గౌడ్, పాపాని వనజ వాసుదేవ్, బొడిగ లక్ష్మయ్య, పీక వెంకన్న ఇమ్మడి విజయ్, చిట్యాల మండల మహిళా అధ్యక్షురాలు నర్రా మాధవి గోపాల్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు సలీం, ఓ బి సి మోర్చ అధ్యక్షులు నాగాచారి, కొండే నరేష్, అంతటి వెంకటేష్, పాకాల దినేష్, ఉయ్యాల లింగస్వామి, రాము, రూపాని నరసింహ, వరికుప్పల నరసింహ, భత్తుల వెంకన్న, గుడిపాటి సందీప్ ,సిద్దగాని అశోక్, వెంకన్న ,భత్తుల అనిల్, సైదులు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 18:10

Police Section 30: వారాహి యాత్ర నేపథ్యంలో ఆంక్షలు.. 20 రోజుల పాటు పోలీస్‌ సెక్షన్‌ 30 అమలు..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జనం ముందుకు వెళ్తున్నారు.. “వారాహి యాత్ర” కు సిద్ధం అయ్యారు.. ఈ నెల 14వ తేదీన వారాహి యాత్ర ప్రారంభం కానుంది..

అన్నవరం నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో సాగనుంది “వారాహి యాత్ర”.. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులు అలర్ట్ అయ్యారు.. అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి నుండి ఈనెల 30వ తేదీ వరకు పోలీస్ సెక్షన్ 30 అమల్లో ఉంటుందని ప్రకటించారు.

డీఎస్పీ అంబికా ప్రసాద్.. ఇక, ఈ సమయంలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఈనెల 14వ తేదీ నుండి 28వ తేదీ వరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేపథ్యంలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

, ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న వారాహి యాత్రలో ఉమ్మడి జిల్లాలో 8 నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది.. ఐదు బహిరంగ సభలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు..

జూన్ 14న – ప్రత్తిపాడు కత్తిపూడి జంక్షన్ లో..

జూన్ 16న – పిఠాపురం ఉప్పాడ జంక్షన్ లో..

జూన్ 18న – కాకినాడ సర్పవరం జంక్షన్ లో..

జూన్ 21న – అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో..

జూన్ 22న – రాజోలు మల్కిపురం సెంటర్ లో

బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది జనసేన పార్టీ.. ఇప్పటికే వారాహి యాత్ర ఏర్పాట్లు, యాత్ర సాగే రూట్‌లో తగిన ఏర్పాట్లపై ఫోకస్‌ పెట్టారు జనసైనికులు..

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 18:08

AP NEWS | 10 కిలోల విదేశీ బంగారం పట్టివేత..ఇద్దరు అరెస్ట్‌

అక్రమంగా విదేశీ బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (Directorate of Revenue Intelligence,) అధికారులు పట్టుకుని వారి వద్ద నుంచి 10 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు..

నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. అధికారులకు అందిన సమాచారం మేరకు కారును తనిఖీ చేయగా సీటు కింద దాచిన 7.798 కిలోల విదేశీ బంగారాన్ని( Foreign Gold) గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

కారులో ఉన్న ఇద్దరుఅనుమానితులను పోలీసులు విచారించారు. వారు అందించిన సమాచారం మేరకు హైదరాబాద్‌లో మరో డీఆర్‌ఐ బృందం తనిఖీలు చేపట్టి 2.471 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత అధికారులు వివరించారు.

బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు క్యారియర్లతో పాటు ఒక రిసీవర్‌ను పట్టుకుని జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు వారు వెల్లడించారు..

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 15:46

'ఆదిపురుషం' సినిమాపై మళ్లీ ప్రశ్నలు : కస్తూరి శంకర్

•శ్రీరాముడు మరియు లక్ష్మణుడు ఏ సంప్రదాయంలో మీసాలు మరియు గడ్డం కలిగి ఉన్నారు?

ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ జంటగా నటించిన 'ఆదిపురుష' చిత్రం జూన్ 16న విడుదలకు సిద్ధమవుతుండగా, గహే బాఘే చిత్రం కూడా వివాదాలను ఎదుర్కొంది. ఇటీవల, ఈ చిత్రం చివరి ట్రైలర్ లాంచ్‌కు ముందు, తిరుపతి ఆలయంలో దర్శకుడు ఓం రౌత్ మరియు కృతి సనన్ 'గుడ్‌బై కిస్' గురించి సోషల్ మీడియాలో దుమారం రేగింది. కాగా ప్రస్తుతం సౌత్ ఇండియన్ నటి కస్తూరి శంకర్ ఈ సినిమాలో ప్రభాస్ లార్డ్ శ్రీరాముడి లుక్ పై విమర్శలు చేసింది. ఈ సినిమా ట్రైలర్ మరియు పోస్టర్ చూస్తుంటే ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కాదని, ప్రతాపి కర్ణుడి పాత్రలో ఉన్నట్లు అనిపిస్తోందని నటి తెలిపింది. 'రామాయణం' కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి సనన్ మా సీత పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో, సన్నీ సింగ్ లక్ష్మణ్ పాత్రలో కనిపించనున్నారు.

'ఆదిపురుష్' చిత్రం పోస్టర్‌ను ట్విట్టర్‌లో పంచుకున్న కస్తూరి శంకర్, ఈ చిత్రంలో హిందూ పౌరాణిక పాత్రలను చిత్రీకరించిన తీరు తనకు చాలా ఇబ్బంది కలిగించిందని రాశారు. ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ రాముడి కంటే మహాభారతంలోని కర్ణుడిని పోలి ఉందని అతను భావించాడు. 'ప్రభాస్ ఈ సినిమాలో రాముడు కాకుండా కర్ణుడిలా కనిపిస్తున్నాడు' అని ఆమె రాసింది.

'శ్రీరాముడికి ఏ సంప్రదాయంలో మీసాలు ఉన్నాయి?'

కస్తూరి ఇలా రాశారు, 'రాముడు మరియు లక్ష్మణుడిని మీసాలు మరియు గడ్డంతో చూపించే అలాంటి సంప్రదాయం ఏదైనా ఉందా? ఎందుకు ఈ బాధించే పద్ధతి? ముఖ్యంగా ప్రభాస్ తెలుగు ఇంటిలో శ్రీరామ్‌ని లెజెండ్స్ పర్ఫెక్షన్‌గా నిలబెట్టారు. సినిమాలో రామ్‌లా కాకుండా ప్రభాస్ కర్ణుడిలా కనిపిస్తున్నాడు.

కొందరు ప్రభాస్‌ను సమర్థించగా, మరికొందరు కస్తూరికి మద్దతుగా నిలిచారు.*

కస్తూరి శంకర్‌ చేసిన ఈ ట్వీట్‌పై పలు వ్యాఖ్యలు వస్తున్నాయి. ప్రభాస్ లార్డ్ రామ్ లాగా కనిపించడం లేదని కొందరు వినియోగదారులు నటిగా భావించినట్లు తమకు కూడా అనిపించిందని అంటున్నారు. అయితే కొంతమంది అభిమానులు కూడా ప్రభాస్‌ను మరియు సినిమాను సమర్థించారు. అలాంటి ఒక అభిమాని ఇలా రాశాడు, 'మన హిందూ మతంలో మనం దేవుణ్ణి ఏ రూపంలోనైనా పూజించవచ్చు మరియు అనుసరించవచ్చు. మరొక వినియోగదారు కస్తూరికి మద్దతు ఇస్తూ, 'ఖచ్చితంగా సరైనదే. ఈ సినిమాతో కనెక్ట్ అవ్వలేకపోతున్నాను.

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 14:13

బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్ సర్వీస్

తిరుమల తీర్థయాత్రను సులభతరం చేయడానికి కొత్తగా బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు, ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం నుండి తిరుపతికి హెలికాప్టర్ ఈ సేవలను అందిస్తోంది. ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో హెలికాప్టర్ బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుండి 4.15 గంటల మధ్యలో తిరుపతి నుండి బెంగళూరుకు బయలుదేరవచ్చు.

తిరుపతికి బయలుదేరే హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణించడానికి అవకాశం ఉంది. హెలికాప్టర్ రైడ్ బెంగళూరు-తిరుపతి నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. బెంగళూరు నుండి తిరుపతికి సుమారు నాలుగు గంటల నుంచి ఐదు గంటల ప్రయాణించడానికి సమయం పడుతుంది. హెలికాప్టర్ సేవతో తిరుమల వెళ్లే భక్తులు దాదాపు 1. 5 గంటల్లో తిరుపతి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు అంటున్నారు.

తరువాత తిరుపతి నుంచి తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్‌లో ప్రయాణించాలంటే జీఎస్టీ మినహా దాదాపు రూ.3, 50, 000 ఖర్చు అవుతుంది. రూ. 3, 50, 000 నుండి పూర్తి హెలికాప్టర్ అందుబాటులో ఉంది. రూ. 3. 50, 000 లక్షలకు ఒకేసారి ఐదుగురు ప్రయాణికులు వెళ్లవచ్చు. ఒంటరిగా వెళుతున్నప్పటికీ మీరు ఈ ప్రైవేట్ హెలికాప్టర్ పొందవచ్చు.

ఫ్లైబ్లేడ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా బుకింగ్‌లు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. వెబ్‌సైట్‌లో లేదా 1800-102-5233లో బుకింగ్‌లు చేయవచ్చు. బుకింగ్‌లు కనీసం 24 గంటల ముందుగానే చేయాలి. దేశవ్యాప్తంగా యాత్రికులు తిరుపతి నగరానికి చేరుకుని తరువాత తిరుమల వెళ్లడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతిలోని విమానాశ్రయానికి రేణిగుంట విమానాశ్రయం కు చాలా మంది చేరుకుని తరువాత తిరుమల వెలుతున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 13:57

తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు

తెలంగాణలో ఇంకా ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ప్రతాపాన్ని చూపాయి. 47 మండలాల్లో వడగాలులతో జనం అల్లాడిపోయారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ, ములకలపల్లి, దమ్మపేట, మణుగూరు, ఖమ్మం జిల్లాలో సింగరేణి, వేంసూరు మండలాల్లో వడగాలులకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 6.5 డిగ్రీలపైన నమోదయ్యాయి.

ఇక శనివారం తెలంగాణ వ్యాప్తంగా పది మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 45-46.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాలు, ఖమ్మంలో 7, హనుమకొండ 4, మహబూబాబాద్‌ 4, సూర్యాపేట 4, జనగామ 3, కుమురం భీం ఆసిఫాబాద్‌ 3, పెద్దపల్లి 3, సిద్దిపేట 3, వరంగల్‌ 3, ఆదిలాబాద్‌ 2, నల్గొండ 2, కరీంనగర్‌ జిల్లాలో 2 మండలాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా నమోదైంది.

శని, ఆదివారాల్లోనూ తెలంగాణలో వేడిగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు రాష్ట్రాలపై కొనసాగుతుండగా, తెలుగు రాష్ట్రాలను తాకడానికి మరో 5 రోజులు పట్టనున్నాయని అధికారులు తెలిపారు.........

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 12:32

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ చేరికలు

కంగ్టి ,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తుర్కవడ్గవ్ గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ దిలీప్ కాంగ్రెస్ పార్టీని వీడి BRS లో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో BRS లో చేరినారు.

వారితో పాటుగా సోమనాథ్,మోషప్ప,రమేష్,సచిన్,ఆకాష్,హెజ్కల్,రాజు మరియు వారి కుటుంబాలు చేరినారు.

అనంతరం దిలీప్ మాట్లాడుతూ తమ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కి మా తాతల నుండి మా వరకు అధికారం ఇచ్చిన వ్యవస్థలో ఎటువంటి మార్పు లేదని,భూపాల్ రెడ్డి సారధ్యంలో నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుందని తమ గ్రామంలో మునుపెన్నడూ లేని అభివృద్ధి పనులు జరిగినాయి అని BRS లో చెరినాం అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ BRS పార్టీ సీనియర్ నాయకులు బసన్ని,రాజప్ప,తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 10:42

తిరుపతిలోని లార్డ్ వెంకటేశ్వర ఆలయంలో 'ఆదిపురుష్' చిత్రనిర్మాత సినీ నటి కృతి సనన్‌ను ముద్దుపెట్టుకోవడంతో వివాదం చెలరేగింది

•హోటల్‌కి వెళ్లండి అని తెలంగాణ పూజారి

'ఆదిపురుష్' చిత్రనిర్మాత జూన్ 7న తిరుపతిలోని లార్డ్ వెంకటేశ్వర ఆలయంలో సినీ నటి కృతి సనన్‌ను ముద్దుపెట్టుకోవడం కనిపించింది. దీనికి సంబంధించి వివాదం చెలరేగింది. తెలంగాణలోని చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి దీనిని ఖండించారు. దీనిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాన పూజారి "ఇది ఖండించదగినది. భార్యాభర్తలు కూడా కలిసి గుడికి వెళ్లరు. హోటల్ గదికి వెళ్లి ఆ పని చేయవచ్చు. మీ ప్రవర్తన రామాయణాన్ని, సీతాదేవిని అవమానించినట్లే."

చిత్రనిర్మాత ఆలయ ప్రాంగణం వెలుపల కృతి సనన్‌కు వీడ్కోలు పలికినట్లు మీకు తెలియజేద్దాం. అతను కృతిని ముద్దుపెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని తర్వాత సందడి నెలకొంది. బిజెపి రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు కూడా దీనిని విమర్శించారు, కానీ తరువాత అతని ట్వీట్‌ను తొలగించారు.

జూన్ 6న తిరుమలలో 'ఆదిపురుష్' టీమ్ ఈ సినిమా ఫైనల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇది గొప్ప ప్రదర్శన. బుధవారం, దర్శకుడు ఓం రౌత్ మరియు కృతి సనన్ తిరుపతిలోని లార్డ్ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు.

వైరల్ అయిన ఒక వీడియోలో, చిత్రనిర్మాత వీడ్కోలు చెప్పేటప్పుడు కృతి చెంపపై ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు. నెటిజన్లలో ఒక వర్గానికి ఇది నచ్చలేదు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు నాగోతు ఇలా చేయడం అవసరమా అని ప్రశ్నించారు.

ఇంతలో, కృతి సనన్ ఈ ఈవెంట్ నుండి తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తిరుపతి దేవస్థానం పట్ల తనకున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ కూడా రాశారు.

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 10:23

Amit Shah: నేడు చెన్నైకి కేంద్ర మంత్రి అమిత్‌ షా

•షా పర్యటన వివరాలు...

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా శనివారం ముంబైలో ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 9 గంటలకు చెన్నై చేరుకుంటారు.

అనంతరం ఐటీసీ గ్రాండ్‌ హోటల్‌లో 9.10 గంటలకు బీజేపీ నిర్వాహకుల భేటీ అనంతరం మిత్రపక్షాల నేతలు, ప్రముఖులతో సమావేశమవుతారు.

ఆదివారం ఉదయం 11.40 గంటలకు వేళచ్చేరిలో దక్షిణ చెన్నై బీజేపీ నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1.45 గంటలకు హెలికాప్టర్‌లో చెన్నై నుంచి వేలూరుకు వెళతారు.

2.45 గంటలకు వేలూరు పల్లికొండలో జరిగే బహిరంగ సభలో పాల్గొని, 3.55 గంటలకు హెలికాప్టర్‌లో చెన్నైకి తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 5.50 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్టణం బయల్దేరి వెళతారు.