నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 14:13

బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్ సర్వీస్

తిరుమల తీర్థయాత్రను సులభతరం చేయడానికి కొత్తగా బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు, ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం నుండి తిరుపతికి హెలికాప్టర్ ఈ సేవలను అందిస్తోంది. ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో హెలికాప్టర్ బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుండి 4.15 గంటల మధ్యలో తిరుపతి నుండి బెంగళూరుకు బయలుదేరవచ్చు.

తిరుపతికి బయలుదేరే హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణించడానికి అవకాశం ఉంది. హెలికాప్టర్ రైడ్ బెంగళూరు-తిరుపతి నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. బెంగళూరు నుండి తిరుపతికి సుమారు నాలుగు గంటల నుంచి ఐదు గంటల ప్రయాణించడానికి సమయం పడుతుంది. హెలికాప్టర్ సేవతో తిరుమల వెళ్లే భక్తులు దాదాపు 1. 5 గంటల్లో తిరుపతి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు అంటున్నారు.

తరువాత తిరుపతి నుంచి తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్‌లో ప్రయాణించాలంటే జీఎస్టీ మినహా దాదాపు రూ.3, 50, 000 ఖర్చు అవుతుంది. రూ. 3, 50, 000 నుండి పూర్తి హెలికాప్టర్ అందుబాటులో ఉంది. రూ. 3. 50, 000 లక్షలకు ఒకేసారి ఐదుగురు ప్రయాణికులు వెళ్లవచ్చు. ఒంటరిగా వెళుతున్నప్పటికీ మీరు ఈ ప్రైవేట్ హెలికాప్టర్ పొందవచ్చు.

ఫ్లైబ్లేడ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా బుకింగ్‌లు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. వెబ్‌సైట్‌లో లేదా 1800-102-5233లో బుకింగ్‌లు చేయవచ్చు. బుకింగ్‌లు కనీసం 24 గంటల ముందుగానే చేయాలి. దేశవ్యాప్తంగా యాత్రికులు తిరుపతి నగరానికి చేరుకుని తరువాత తిరుమల వెళ్లడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతిలోని విమానాశ్రయానికి రేణిగుంట విమానాశ్రయం కు చాలా మంది చేరుకుని తరువాత తిరుమల వెలుతున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 13:57

తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు

తెలంగాణలో ఇంకా ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ప్రతాపాన్ని చూపాయి. 47 మండలాల్లో వడగాలులతో జనం అల్లాడిపోయారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ, ములకలపల్లి, దమ్మపేట, మణుగూరు, ఖమ్మం జిల్లాలో సింగరేణి, వేంసూరు మండలాల్లో వడగాలులకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 6.5 డిగ్రీలపైన నమోదయ్యాయి.

ఇక శనివారం తెలంగాణ వ్యాప్తంగా పది మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 45-46.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాలు, ఖమ్మంలో 7, హనుమకొండ 4, మహబూబాబాద్‌ 4, సూర్యాపేట 4, జనగామ 3, కుమురం భీం ఆసిఫాబాద్‌ 3, పెద్దపల్లి 3, సిద్దిపేట 3, వరంగల్‌ 3, ఆదిలాబాద్‌ 2, నల్గొండ 2, కరీంనగర్‌ జిల్లాలో 2 మండలాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా నమోదైంది.

శని, ఆదివారాల్లోనూ తెలంగాణలో వేడిగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు రాష్ట్రాలపై కొనసాగుతుండగా, తెలుగు రాష్ట్రాలను తాకడానికి మరో 5 రోజులు పట్టనున్నాయని అధికారులు తెలిపారు.........

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 12:32

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ చేరికలు

కంగ్టి ,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తుర్కవడ్గవ్ గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ దిలీప్ కాంగ్రెస్ పార్టీని వీడి BRS లో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో BRS లో చేరినారు.

వారితో పాటుగా సోమనాథ్,మోషప్ప,రమేష్,సచిన్,ఆకాష్,హెజ్కల్,రాజు మరియు వారి కుటుంబాలు చేరినారు.

అనంతరం దిలీప్ మాట్లాడుతూ తమ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కి మా తాతల నుండి మా వరకు అధికారం ఇచ్చిన వ్యవస్థలో ఎటువంటి మార్పు లేదని,భూపాల్ రెడ్డి సారధ్యంలో నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుందని తమ గ్రామంలో మునుపెన్నడూ లేని అభివృద్ధి పనులు జరిగినాయి అని BRS లో చెరినాం అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ BRS పార్టీ సీనియర్ నాయకులు బసన్ని,రాజప్ప,తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 10:42

తిరుపతిలోని లార్డ్ వెంకటేశ్వర ఆలయంలో 'ఆదిపురుష్' చిత్రనిర్మాత సినీ నటి కృతి సనన్‌ను ముద్దుపెట్టుకోవడంతో వివాదం చెలరేగింది

•హోటల్‌కి వెళ్లండి అని తెలంగాణ పూజారి

'ఆదిపురుష్' చిత్రనిర్మాత జూన్ 7న తిరుపతిలోని లార్డ్ వెంకటేశ్వర ఆలయంలో సినీ నటి కృతి సనన్‌ను ముద్దుపెట్టుకోవడం కనిపించింది. దీనికి సంబంధించి వివాదం చెలరేగింది. తెలంగాణలోని చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి దీనిని ఖండించారు. దీనిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాన పూజారి "ఇది ఖండించదగినది. భార్యాభర్తలు కూడా కలిసి గుడికి వెళ్లరు. హోటల్ గదికి వెళ్లి ఆ పని చేయవచ్చు. మీ ప్రవర్తన రామాయణాన్ని, సీతాదేవిని అవమానించినట్లే."

చిత్రనిర్మాత ఆలయ ప్రాంగణం వెలుపల కృతి సనన్‌కు వీడ్కోలు పలికినట్లు మీకు తెలియజేద్దాం. అతను కృతిని ముద్దుపెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని తర్వాత సందడి నెలకొంది. బిజెపి రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు కూడా దీనిని విమర్శించారు, కానీ తరువాత అతని ట్వీట్‌ను తొలగించారు.

జూన్ 6న తిరుమలలో 'ఆదిపురుష్' టీమ్ ఈ సినిమా ఫైనల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇది గొప్ప ప్రదర్శన. బుధవారం, దర్శకుడు ఓం రౌత్ మరియు కృతి సనన్ తిరుపతిలోని లార్డ్ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు.

వైరల్ అయిన ఒక వీడియోలో, చిత్రనిర్మాత వీడ్కోలు చెప్పేటప్పుడు కృతి చెంపపై ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు. నెటిజన్లలో ఒక వర్గానికి ఇది నచ్చలేదు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు నాగోతు ఇలా చేయడం అవసరమా అని ప్రశ్నించారు.

ఇంతలో, కృతి సనన్ ఈ ఈవెంట్ నుండి తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తిరుపతి దేవస్థానం పట్ల తనకున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ కూడా రాశారు.

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 10:23

Amit Shah: నేడు చెన్నైకి కేంద్ర మంత్రి అమిత్‌ షా

•షా పర్యటన వివరాలు...

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా శనివారం ముంబైలో ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 9 గంటలకు చెన్నై చేరుకుంటారు.

అనంతరం ఐటీసీ గ్రాండ్‌ హోటల్‌లో 9.10 గంటలకు బీజేపీ నిర్వాహకుల భేటీ అనంతరం మిత్రపక్షాల నేతలు, ప్రముఖులతో సమావేశమవుతారు.

ఆదివారం ఉదయం 11.40 గంటలకు వేళచ్చేరిలో దక్షిణ చెన్నై బీజేపీ నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1.45 గంటలకు హెలికాప్టర్‌లో చెన్నై నుంచి వేలూరుకు వెళతారు.

2.45 గంటలకు వేలూరు పల్లికొండలో జరిగే బహిరంగ సభలో పాల్గొని, 3.55 గంటలకు హెలికాప్టర్‌లో చెన్నైకి తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 5.50 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్టణం బయల్దేరి వెళతారు.

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 09:28

తెలంగాణలోపాఠశాలకు చేరని పాఠ్యపుస్తకాలు

ఓ జిల్లా కేంద్రంలో గుట్టలుగా పడివున్న పాఠ్య పుస్తకాలు

పాఠ్యపుస్తకాల ముద్రణ పూర్తయినా ఇంకా జిల్లా కేంద్రాల్లోనే..

స్కూళ్లు తెరిచేలోగా పాఠశా లలకు పాఠ్య పుస్తకాలు చేరుస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన కార్యాచరణకు ఆమడ దూరంలో ఉంది. మరో రెండురోజుల్లో స్కూళ్లు తెరుస్తున్నా ఇప్పటివరకు ఒక్క పుస్తకం కూడా పాఠశాళలకు చేరలేదు. ముద్రణ పూర్తయిన పుస్తకాలు ఎక్కడిక క్కడే ఉండిపోయాయి. వాటిని విద్యార్థులకు అందించే బాధ్యత హెచ్‌ఎంలదే అని విద్యాశాఖ చెబుతుండగా తమకేం సంబంధం లేదని హెచ్‌ఎంలు స్పష్టం చేస్తుండటంతో పుస్తకాలు జిల్లా కేంద్రాల్లోనే మగ్గుతున్నాయి. పుస్తకాలను గుట్టలుగా పడేయడంతో కొన్నిచోట్ల ఎలుకలు కొడుతున్నాయి. సరైన సదు పాయం లేని స్కూళ్లలో వర్షం వస్తే తడిసిపోయే ప్రమాదముందని అంటున్నారు. ఈ నెల 12న స్కూళ్లు తెరుచుకోనుండగా ఇప్పుడు హడావుడి చేసినా నెలాఖరుకు కూడా వాటిని పంపడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

100 శాతం పూర్తికాని ముద్రణ

విద్యాశాఖ అడకమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం జూన్‌ 15 నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు ప్రారంభించాలి. రాష్ట్రవ్యాప్తంగా 28,77,675 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నారు. వీరికి ఉచితంగా పుస్తకాలు అందించాల్సి ఉంది. సబ్జెక్టులు, లాంగ్వేజీలు కలిపి 1,63,78,607 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. గత ఏడాది ముద్రించినవి పోను, ఇంకా 1,57,48,270 పుస్తకాలు అందించాలి. ఇందులో ఇప్పటివరకు 1,35,85,185 పుస్తకాలు ముద్రించారు. వీటిని జిల్లా కేంద్రాలకూ చేరవేశారు. ఇంకా 14 శాతం పుస్తకాల ముద్రణ పూర్తి కావలసి ఉండటంతో.. ఇప్పుడున్నవి పంపిణీ చేసినా, కొన్ని స్కూళ్ళకు పుస్తకాల కొరత ఏర్పడనుంది.

రవాణా టెండర్లు ఏమయ్యాయి?

ముద్రణ అనంతరం జిల్లా కేంద్రాలకు చేరిన పుస్తకా లను హెచ్‌ఎంలు తమ పాఠశాలలకు తీసుకు వెళతారు. ఇందుకయ్యే ఖర్చంతా ముందుగా హెచ్‌ఎంలే భరించి ఆ తర్వాత విద్యాశాఖకు బిల్లులు పెట్టి తీసుకుంటారు. అయితే గత రెండేళ్లుగా బిల్లులు రాలేదని హెచ్‌ఎంలు అంటున్నారు. ఈ కారణంగా వారు పుస్తకాలు తీసుకెళ్లట్లేదు. దీంతో పుస్తకాల రవా ణాకు టెండర్లు పిలవాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ ఇటీవల అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. టెండర్లు ఆహ్వానించే గడువు కూడా ఈ నెల 15 వరకూ పెట్టారు. అయితే ఇప్పటివరకు ఒకటి, రెండు జిల్లాల్లో తప్ప ఎక్కడా టెండర్లు పిలవలేదు. దీంతో టెండర్లు దాఖలయ్యేదెప్పుడు? ఖరారు చేసేదెప్పుడు? టెండర్‌ దక్కించుకున్న సంస్థ పుస్తకాలు చేరవేసేదెప్పుడు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బడులు తెరిచాక పుస్తకాలు అందించకపోతే పిల్లలకు పాఠాలు చెప్పేదెలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

*పుస్తకాలు లేకుంటే ఎలా..?"

పుస్తకాల చేరవేతకు టెండర్లు పిలవమని ఉన్నతాధికారులు చెప్పినా, అది అమలుకు నోచుకోవడం లేదు. జూన్‌ 12న స్కూళ్ళు తెరిచేలోగా పుస్తకాలు అందకపోతే బోధనకు ఇబ్బంది అవుతుంది. డీఈవోలు తక్షణమే ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేయాలి. వంద శాతం పుస్తకాలు ఉంటేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.........

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 09:26

రేపే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష

హైదరాబాద్‌:జూన్‌ 10

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్ష నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో అడ్డంకులు తొలగిపోయాయి.

రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయగా.. గత అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఫలితాలనూ ప్రకటించారు. అయితే పేపర్‌ లీక్‌ నేపథ్యంతో ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేశారు.

రద్దయిన పరీక్షను ఆదివారం ఈ నెల 11న నిర్వహించనున్నారు. గ్రూప్‌-1 పోస్టుల కోసం సుమారు 3.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష హాల్‌టికెట్లు కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఓఎంఆర్‌ షీట్‌ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరగనుంది.

అభ్యర్థులకు సూచనలు ఇచ్చేందుకు జిల్లాకొకటి చొప్పున 33 హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణలో భాగస్వాములయ్యే సిబ్బందిపై నిఘా పెట్టనున్నారు. పరీక్ష ప్రారంభానికి 2 గంటల ముందే కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లను మూసేస్తారు. అంటే ఉదయం 10.15 గంటలలోపే పరీక్ష హాల్‌లోకి అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అనుమతించరు. అలాగే పరీక్ష కేంద్రంలోకి పెన్సిల్‌, ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌ వంటి వాటికి అనుమతి లేదు. బ్లూ, బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌లను మాత్రమే అనుమతించనున్నారు. అభ్యర్థులు షూతో వస్తే అనుమతించరు. చెప్పులు వేసుకుని రావాలి.

నిబంధనలను అతిక్రమిస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నారు. ఇక గ్రూప్‌-1 పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు పోలీస్‌శాఖ పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టింది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీ స్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పరీక్ష కేంద్రాలకు సమీపంలోని అన్ని ఇంటర్నెట్‌, జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని కమిషనరేట్లు, ఎస్పీ కా ర్యాలయాల పరిధిలో ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్ష కేంద్రానికి 500 మీటర్ల దూరం వరకు జనం గుమిగూడరాదని ఆదేశాలిచ్చారు....

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 09:19

కవిత చెపితే కరెక్టే

తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చే దిశగా వ్యూహరచన చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకోసం కొత్త పథకాలను తీసుకురావడంతో పాటు విపక్షాలను ఏ రకంగా కట్టడి చేయాలనే దానిపై ఫోకస్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను పక్కనపెట్టి వారి స్థానంలో కొత్తవారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముందుగానే సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి.. మిగతా స్థానాలను పెండింగ్‌లో పెట్టాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని.. ప్రస్తుతం ఆ దిశగా ఆయన కసరత్తు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కొందరికి ఈసారి టికెట్ రాదనే విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చిందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

మిగతా వారి సంగతి ఎలా ఉన్నా.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలకు మాత్రం మరోసారి ఎమ్మెల్యే టికెట్ గ్యారంటీ అనే చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణంగా కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కొద్ది రోజుల నుంచి నిజామాబాద్ ప్లారమెంట్ నియోజకవర్గ పరిధిలోని స్థానాల్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటున్నారు కవిత. ఈ సమావేశాల్లో కవిత చేస్తున్న ప్రకటనలు పలువురు ఎమ్మెల్యేల్లో ఉత్సాహం నింపుతున్నాయి. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న కవిత.. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మళ్లీ గెలిపించాలని ప్రజలను, కార్యకర్తలను కోరారు.

దీంతో ఆయన స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లకు ఎలాంటి డోకా లేదనే విషయంలో బీఆర్ఎస్ వర్గాలకు దాదాపుగా ఓ క్లారిటీ వచ్చిందని నిజామాబాద్ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఓ వైపు కేసీఆర్ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో.. కవిత ఈ రకంగా ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎవరెవరికి మళ్లీ టికెట్లు ఇస్తారనే విషయంలో ఎమ్మెల్సీ కవితకు స్పష్టమైన సమాచారం ఉంటుంది కాబట్టే ఆమె ఈ రకంగా ప్రకటన చేస్తున్నారని.. కాబట్టి ఆమె మళ్లీ గెలిపించాలని కోరిన వారందరికీ టికెట్లు దాదాపుగా గ్యారంటీ అని పలువురు లెక్కలు వేసుకుంటున్నారు...

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 09:17

మహిళా కౌన్సిలర్ ఆత్మహత్య

పట్టణంలోని 24వ వార్డు కౌన్సిలర్ కుందూరు నాగలక్ష్మి శుక్రవారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. డీఎస్పీ వెంకట గిరి తెలిపిన వివరాల ప్రకారం

మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు వాసవినగర్ కాలనీ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్, శివాని పాఠశాల ప్రిన్సిపల్ కుందూరు నాగలక్ష్మి(40) శుక్రవారం సాయంత్రం తన నివాసంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలం పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగా రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మరెడ్డిలు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

నాగలక్ష్మికి భర్త శ్యాంసుందర్ రెడ్డి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహారావు పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న ఆమె సోదరుడు ఆదివారం వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు....,....

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 09:15

రైల్వే అధికారుల్లారా ఇది నీకు న్యాయమేనా ❓️

వలస కూలీలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు, పేదలు ప్రయాణించే జనరల్ బోగీలు, స్లీపర్ క్లాస్ బోగీలంటే రైల్వేశాఖకు లెక్కే లేదు. అన్ని రైళ్లల్లో స్లీపర్ బోగీలు తగ్గించి ఏసీ బోగీలు పెంచాలనే లక్ష్యాన్ని రైల్వే నిర్ధేశించుకుంది.

ఏదో ఉంచామంటే ఉంచాం అనే రీతిలో మొక్కుబడిగా ఒకటి లేదంటే రెండు బోగీలనే రైలుకు ఉంచుతోంది. దీనివల్ల దూర ప్రాంతాలకు ప్రయాణించేవారు ఎంతో కష్టనష్టాలకు గురవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే అనేక రైళ్లను పరిశీలిస్తే ఈ విషయం వెల్లడవుతుంది. పై నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేయడమే కానీ తమదగ్గర ఏమీలేదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు.

అన్ని మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోని జనరల్‌ బోగీల్లో ప్రయాణం చేయాలంటే ప్రజలకు ప్రత్యక నరకంలా మారింది. రిజర్వేషన్‌ లేకుండా సాధారణ టిక్కెట్‌ తీసుకొని ప్రయాణించాలనుకునే వారంతా ఈ రెండు బోగీల్లోనే సర్దుకోవాల్సి ఉంటుంది.

రద్దీని తట్టుకోలేక బాత్ రూమ్ లో కూడా నిలబడి ప్రయాణిస్తున్నారు.

రైళ్లల్లో గతంలో ఉన్న స్లీపర్ బోగీలను తగ్గించి వాటిస్థానంలో ఏసీ బోగీలను క్రమంగా పెంచుతున్నారు. దీనివల్ల స్లీపర్ లో బెర్త్ దొరకడం గగనంగా మారింది. చివరకు బాత్రూంలు కూడా ప్రయాణికుల కు జనరల్ బోగీల్లా మారాయి...