Monsoon: ఎట్టకేలకు కేరళను తాకిన రుతుపవనాలు.. విస్తారంగా వర్షాలు..
Monsoon: నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. వారం ఆలస్యం కేరళలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గురువారం వెల్లడించింది..
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుఫాన్ రుతుపవనాలను ప్రభావితం చేస్తాయని, కేరళపై దీని ప్రభాంత తక్కువగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు ముందుగానే చెప్పారు.
సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు కేరళకు చేరాలి. అయితే ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4న కేరళకు చేరుతాయని ముందుగా అంచనా వేసినప్పటికీ.. మొత్తంగా వారం రోజుల ఆలస్యం తరువాత ఇండియా మెయిన్ ల్యాండ్ లోకి ప్రవేశించాయి..
రుతుపవనాల ఎంట్రీతో కేరళ తీరంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు విస్తరించిన రుతుపువనాలు 48 గంటల్లో కేరళలోని అన్ని ప్రాంతాలకు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. మరో వారం-10 రోజుల్లో తెలంగాణలోకి విస్తరించే అవకాశం ఉంది..
Jun 08 2023, 16:52