ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలు జారీ చేసింది. ఉచిత సేవలను వినియోగించుకోవాలనుకునే మహిళలు ‘శక్తి స్మార్ట్ కార్డు‘ కోసం దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం నాడు,తెలిపింది. అలాగే, ఉచిత బస్సు సేవలను అనుమతించని బస్సుల జాబితాను కూడా ప్రకటించింది.
ప్రభుత్వ జీవో ప్రకారం.. ఉచిత బస్సు ప్రయాణ సేవలు మహిళలు, థర్డ్ జెండర్ (హిజ్రాలు)కు కూడా వర్తిస్తుంది. ఈ నెల 11 నుంచి ఉచిత సేవలు అందుబాటులోకి వస్తాయి.
మూడు నెలల్లో స్మార్ట్‌కార్డుల పంపిణీ పూర్తవుతుంది.
స్మార్ట్‌కార్డులు చేతికి అందేవరకు కర్ణాటక ప్రభుత్వం జారీచేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
స్మార్ట్‌కార్డుల వల్ల మహిళలు ప్రయాణం చేసే దూరాన్ని సులభంగా గుర్తించవచ్చు.
ఏసీ బస్సులు, అంతర్రాష్ట్ర లగ్జరీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి లేదు.
రాజహంస, వజ్ర, వాయువజ్ర, నాన్ ఏసీ స్లీపర్, ఐరావత, ఐరావత క్లబ్ క్లాస్, ఐరావత గోల్డ్ క్లాస్, అంబారీ, అంబారీ డ్రీమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్, ఫ్లై బస్, ఈవీ పవర్ ప్లస్ ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు.
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సుల్లో సగం సీట్లు మహిళలకు, సగం సీట్లు పురుషులకు కేటాయిస్తారు....
Jun 07 2023, 18:16