నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 18:15

CM Jagan: ముందస్తు ఎన్నికలపై మంత్రులకు క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం జగన్‌ మంత్రులకు క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది..

ఇవాళ మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులతో సీఎం జగన్‌ దాదాపు గంటసేపు చర్చించారు.

ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై మంత్రులతో మాట్లాడారు. షెడ్యూల్‌ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని సీఎం జగన్‌ తేల్చి చెప్పినట్టు సమాచారం.

ఎన్నికల కోసం ఇంకా 9 నెలల సమయం ఉందన్న ముఖ్యమంత్రి.. ఈ తొమ్మిది నెలల పాటు గట్టిగా పనిచేయాలని సూచించారు..

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 18:13

బల్కంపేట్ ఎల్లమ్మ జాతర ‌డేట్ ఫిక్స్..

బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి జాతరకు సంబంధించి మంత్రి తలసాని కీలక ప్రకటన చేశారు. జాతర తేదీలను మంత్రి ప్రకటించారు.

జూన్ 19న ఎదురోళ్లు, 20న అమ్మవారి కల్యాణం, 21న రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.

అంతకు ముందు మంత్రి తలసాని కల్యాణం నిర్వహణ, జాతర ఏర్పాట్లపై ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

మూడు రోజుల పాటు సాగే ఈ జాతర మహోత్సవాన్ని చూడటానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వస్తారు. ప్రతి ఏడాది ఈ జాతరలో ఐదు లక్షల మంది వరకు పాల్గొంటారు.

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 14:30

త్వరలో పెళ్లి చేసుకుంటా : బాగేశ్వర్ ధామ్ అధినేత ధీరేంద్ర శాస్త్రి..

ప్రకటనలు మరియు కథనానికి పేరుగాంచిన ధీరేంద్ర శాస్త్రి తన వివాహం గురించి స్పష్టం చేశారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రముఖ కథావాచ్, బాగేశ్వర్ ధామ్ అధినేత ధీరేంద్ర శాస్త్రి తెలిపారు. అయితే తాను ఎవరితో పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఓ ఇంటర్వ్యూలో ధీరేంద్ర శాస్త్రి ఈ విషయాలు చెప్పారు.

ధీరేంద్ర శాస్త్రి పేరు ప్రముఖ కథకురాలు జయ కిషోరితో కూడా ముడిపడి ఉందని దయచేసి తెలియజేయండి. అయితే ఈ విషయమై జయ కిషోరిని ప్రశ్నించగా.. తాను బాగేశ్వర్ బాబాను ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేసింది. ఈ సమయంలో, బాగేశ్వర్ ధామ్ అధిపతిని మీరు అమ్మాయిని చూశారా అని అడిగారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. తాను ఇంకా అమ్మాయిని చూడలేదన్నారు.

కచ్చితంగా పెళ్లి చేసుకుంటా

బాగేశ్వర్ ధామ్ చీఫ్ సోమవారం ఒక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఈ సమయంలో, హిందువులను పెంచడం గురించి అతను మాట్లాడుతున్నాడని, అతను తన కుటుంబాన్ని ఎప్పుడు పెంచుకుంటాడు? ఈ ప్రశ్నకు ధీరేంద్ర శాస్త్రి సమాధానమిస్తూ.. త్వరలోనే తాను పెళ్లి చేసుకుని కుటుంబాన్ని పోషిస్తానని చెప్పాడు. ఇంతకు ముందు కూడా వీరి పెళ్లి గురించి చాలా సార్లు చర్చలు జరిగాయి. అయితే ప్రతిసారీ తన పెళ్లి గురించి క్లియర్ గా చెప్పుకొచ్చాడు.. త్వరలో పెళ్లి చేసుకుంటానని.

పదవీ విరమణ చేయలేదు: ధీరేంద్ర శాస్త్రి

ధీరేంద్ర శాస్త్రి తన పెళ్లి గురించి మాట్లాడేటప్పుడు చాలా నోరు జారాడు. పెళ్లి గురించి మాట్లాడుతూ ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తాను సన్యాసం తీసుకోలేదని, అందుకే పెళ్లి చేసుకోవచ్చని శాస్త్రి చెప్పారు. తాను మతానికి వ్యతిరేకంగా ఎలాంటి పని చేయడం లేదని, ఎందుకంటే తాను ఎవరి దగ్గర జోలి తీసుకోలేదని, అంటే సన్యాసం తీసుకోలేదన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 14:29

Cyclone Biparjoy: బిపోర్‌జాయ్‌ ముప్పు.. రుతుపవనాల రాక మరింత ఆలస్యం..!

దిల్లీ: ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన 'బిపోర్‌జాయ్‌' తుపాను (Cyclone Biparjoy) మరింత తీవ్ర తుపానుగా మారింది..

దీంతో ఈ ప్రభావం నైరుతి రుతుపవనాల (Southwest Monsoon)పై పడింది. తుపాను కారణంగా రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు..

''నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక ఇప్పటికే ఆరు రోజులు ఆలస్యమైంది. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను (Cyclone Biparjoy) కారణంగా.. ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు మరో 2 - 3 రోజులు పట్టే అవకాశముంది'' అని ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్‌ అంచనా వేసింది.

గతేడాది జూన్‌ 1నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకగా.. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. తొలుత జూన్‌ 4 నాటికి తీరం తాకొచ్చని అంచనా వేసినా.. 7వ తేదీ వచ్చినా రుతుపవనాల ఆచూకీ కన్పించట్లేదు. ఇప్పుడు తుపాను ప్రభావంతో అరేబియా సముద్రంలో రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు..

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 14:28

AP: ఖరీఫ్ సీజన్‌కు కృష్ణా డెల్టా నీటి విడుదల.. నెల ముందుగానే

విజయవాడ: ఖరీఫ్ సీజన్‌ కృష్ణా డెల్టా నీటిని ప్రభుత్వం విడుదల చేసింది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిపారుదల శాఖ మంత్రి అంటి రాంబాబు కాలువలకు నీరు విడుదల చేశారు..

కృష్ణమ్మకు ప్రజాప్రతినిధులు, అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి.. పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, సారెను సమర్పించి వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. డిమాండ్‌ను బట్టి మరింత పెంచే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, దూలం నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు.

సీఎం జగన్‌ ప్రభుత్వంలో నీటి కొరత లేదు

ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. 

కృష్ణా, గుంటూరు జిల్లాల కాలువలకు నీరు విడుదల చేసినట్లు తెలిపారు. గతంలో జూన్ నెలాఖరులో కానీ, జూలై మొదటి వారంలో కానీ నీరు వదిలేవారని..

ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నెల ముందే నీరు విడుదల చేశామని పేర్కొన్నారు. త్వరగా ఖరీఫ్ ప్రారంభం కావడం వల్ల మూడు పంటలు పండే అవకాశం ఉందన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి రైతుకు ఇబ్బంది ఉండదని. పులిచింతలలో 34 టీఎంసీల నీరు ఉందని, అక్కడి నుంచే నీటిని రైతులకు అందిస్తున్నాని చెప్పారు.

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 14:27

ఢిల్లీ లిక్కర్‌ కేసులో మాగుంట రాఘవకు బెయిల్‌..

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మాగుంట రాఘవకు ఊరట లభించింది. మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు 15 రోజుల పాటు బెయిల్‌ మంజూరు చేసింది..

తన అమ్మమ్మ అనారోగ్యంతో ఉందని బెయిల్ కోసం రాఘవ హైకోర్టును ఆశ్రయించగా.. నేడు ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది..

కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాగుంట రాఘవను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఫిబ్రవరి 10న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

సౌత్ గ్రూప్ తరఫున చెల్లించిన రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో రాఘవరెడ్డి పాత్ర ఉందని.. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ ఆరోపించింది..

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 10:24

డౌటే లేదు.. అవును వాళ్ళిద్దరూ మారి పోయారు ❓️

అవును.. సారు నిజంగానే మారిపోయారు.. ప్రసంగం పూర్తిగా మార్చేశారు.. మొన్న నిర్మల్‌ లో, నిన్న నాగర్‌కర్నూల్‌లో అదే సీన్ రిపీటయ్యింది.. బీజేపీని పూర్తిగా పక్కనెట్టేశారు.. రెండ్రోజుల వ్యవధిలోనే రెండు బహిరంగ సభలు జరగ్గా ఒక్కసారంటే ఒక్కసారి కూడా బీజేపీ ప్రస్తావన అస్సలు తీసుకురాలేదు.. కనీసం ఒక్క విమర్శ అయినా చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సాహసించలేదు.

అయితే రెండు సభల్లోనూ కాంగ్రెస్‌నే టార్గెట్ చేయడంతో ఏదో తేడా కొడుతోందన్న విషయం తెలంగాణ ప్రజానికానికి స్పష్టంగా అర్థమైపోయింది. నిర్మల్‌ ప్రసంగంతో కాస్త డౌట్ అనిపించినా.. ఇవాళ్టి సభతో పక్కా అని తేలిపోయింది. అటు నాగర్‌కర్నూల్ కార్యక్రమం ముగిసిందో లేదో అటు బీఆర్ఎస్‌లో.. ఇటు కాంగ్రెస్‌లో ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది.. ఇక సోషల్ మీడియాలో అంటారా చెప్పక్కర్లేదు..!

కేసీఆర్ ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా.. బహిరంగ సభలో మాట్లాడినా మాటకు ముందు.. వెనుక బీజేపీని దుమ్మెత్తి పోస్తుండేవారు. కేంద్రంలోని బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేశారు. అయితే ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే ఎందుకో.. ఒకప్పటి బద్ధ శత్రువైన బీజేపీ.. ఇప్పుడెందుకో మిత్రపక్షంగా మారిపోయిందేమోననే అనుమానాలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్నాళ్లు ఆరోపణలు, విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఈ మధ్య ఎక్కడా వినిపించట్లేదు.. కనిపించట్లేదు. దీంతో బీఆర్ఎస్-బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒకప్పుడు అదిగో అరెస్ట్.. ఇదిగో అరెస్ట్ అన్న బీజేపీ.. ఇప్పుడు చలీ చప్పుడు చేయట్లేదు. అటు దర్యాప్తు సంస్థలు కూడా మిన్నకుండిపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మధ్య అస్సలు బీజేపీని కేసీఆర్.. కేసీఆర్‌ను బీజేపీ నేతలు విమర్శించిన పరిస్థితుల్లేవ్.

తెలంగాణ రాజకీయాల్లో ఏదో తేడా కొడుతోందే అని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద చర్చే నడుస్తోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో నిర్మల్, నాగర్ కర్నూల్‌లో బహిరంగ సభలు జరిగాయి. ఈ రెండు సభల్లోనూ కేసీఆర్ ఎక్కడా పొల్లెత్తు మాట కూడా బీజేపీని అనలేదు. ఈ రెండు సభల్లోనూ కాంగ్రెస్‌నే టార్గెట్ చేశారు కానీ కాషాయ పార్టీ ప్రస్తావన కానీ.. కమలనాథులను విమర్శించిన పరిస్థితి అస్సలేదు. దీన్ని బట్టి చూస్తే.. ఇన్నిరోజులుగా కేసీఆర్ వర్సెస్ బీజేపీగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిపోయాయన్న మాట. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఏకైక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్సేనని పదే పదే ఇలా కేసీఆర్ చెప్పకనే చెబుతున్నారని అర్థం చేసుకోవచ్చు.

నిర్మల్ సభలో కేంద్రంపై విమర్శల్లేవంటే ఓకే.. నాగర్‌కర్నూల్‌లో అయినా మునుపటి కేసీఆర్‌ను చూస్తామని బీఆర్ఎస్ శ్రేణులు ఆశించాయి.. తెలంగాణ ప్రజలు కూడా టీవీలకు అతుక్కుపోయి మరీ చూశారు. కానీ ఎక్కడ కేంద్రంపై ఇసుమంత విమర్శ కూడా చేయకపోవడంతో.. గత కొన్నిరోజులుగా వస్తున్న ఆరోపణలు, విమర్శలను కేసీఆర్ కన్ఫామ్ చేసేశారని టాక్ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తోంది. బహుశా.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న విషయాన్ని కేసీఆర్ నిజం చేసేశారేమోనని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం కేసీఆర్ వింత వైఖరితో ఆలోచనలో పడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే రెండ్రోజులు కేసీఆర్ తీరుపై చర్చ జరుగుతుండగా.. నాగర్ కర్నూల్ సభతో ఇది రెట్టింపయ్యింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ఇందులో నిజానిజాలెంత అనే దానిపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలే ఎన్నికల కాలం సమీపిస్తోంది.. ఈ పరిస్థితుల్లో జనాల్లోకి ఇలాంటి మెసేజ్‌ వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్ ఏముందో.. ఏంటో మరి..!

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 10:21

విద్యుత్ షాక్‌తోనే 40 మంది మృతి?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 278 మందికి చేరింది. అయితే వీరిలో కనీసం 40 మంది విద్యుతాఘాతంతోనే ప్రాణాలు కోల్పోయినట్టు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించిన రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. వీరి మృతదేహాలపై ఎలాంటి గాయాలు కానీ, రక్తస్రావం ఆనవాళ్లు కానీ కనిపించలేదన్నారు. ప్రభుత్వం, రైల్వే పోలీసులు (GRP) ఇదే విషయాన్ని తమ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. రైళ్లు ఢీకొన్న సమయంలో లైవ్ ఓవర్‌హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడటంతో విద్యుత్ షాక్ తగిలినట్టు రైల్వే పోలీసులు చెబుతున్నారు.

తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్సు రైలును ఢీకొట్టడంతో ఎక్స్‌ప్రెస్ బోగీలు పట్టాలు తప్పి, కొన్ని పక్క ట్రాక్‌పైకి వెళ్లి పడ్డాయి. ఆ సమయంలోనే అదే మార్గంలో బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ రావడం, పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఓవర్‌హెడ్ లోటెన్షన్ లైన్ విద్యుత్ తీగలు తెగి బోగీలపై పడ్డాయి. దీంతో విద్యుదాఘాతం చోటుచేసుకుందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు..

కాగా, ఒడిశా రైలు దుర్ఘటనపై దర్యాప్తును ప్రారంభించిన సీబీఐ (CBI) మంగళవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రమాదం మానవ తప్పిదం వల్ల జరిగిందా ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నాలే కారణమా అనే కోణం నుంచి సీబీఐ కూలంకషంగా దర్యాప్తు జరుపనుంది.

రైల్వే మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి, ఒడిశా ప్రభుత్వం అనుమతి, డీఓపీటీ నుంచి వచ్చిన తదుపరి ఆదేశాలతో దర్యాప్తు బాధ్యతను సీబీఐ చేపట్టినట్టు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం, మూడు రైళ్లు ఢీకొన్న ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 278కి చేరుకోగా, 1,200 మంది వరకూ గాయపడ్డారు. 100కు పైగా మృతదేహాలను ఇంకా గుర్తుపట్టాల్సి ఉంది. వీటిని వివిధ ఆసుపత్రులు, మార్చురీలలో ఉంచారు.....

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 10:18

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలు జారీ చేసింది. ఉచిత సేవలను వినియోగించుకోవాలనుకునే మహిళలు ‘శక్తి స్మార్ట్ కార్డు‘ కోసం దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం నాడు,తెలిపింది. అలాగే, ఉచిత బస్సు సేవలను అనుమతించని బస్సుల జాబితాను కూడా ప్రకటించింది.

ప్రభుత్వ జీవో ప్రకారం.. ఉచిత బస్సు ప్రయాణ సేవలు మహిళలు, థర్డ్ జెండర్ (హిజ్రాలు)కు కూడా వర్తిస్తుంది. ఈ నెల 11 నుంచి ఉచిత సేవలు అందుబాటులోకి వస్తాయి.

మూడు నెలల్లో స్మార్ట్‌కార్డుల పంపిణీ పూర్తవుతుంది.

స్మార్ట్‌కార్డులు చేతికి అందేవరకు కర్ణాటక ప్రభుత్వం జారీచేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

స్మార్ట్‌కార్డుల వల్ల మహిళలు ప్రయాణం చేసే దూరాన్ని సులభంగా గుర్తించవచ్చు.

ఏసీ బస్సులు, అంతర్రాష్ట్ర లగ్జరీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి లేదు.

రాజహంస, వజ్ర, వాయువజ్ర, నాన్ ఏసీ స్లీపర్, ఐరావత, ఐరావత క్లబ్ క్లాస్, ఐరావత గోల్డ్ క్లాస్, అంబారీ, అంబారీ డ్రీమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్, ఫ్లై బస్, ఈవీ పవర్ ప్లస్ ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు.

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సుల్లో సగం సీట్లు మహిళలకు, సగం సీట్లు పురుషులకు కేటాయిస్తారు....

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 18:59

లాల్‌దర్వాజలో నకిలీ స్వీట్స్ తయారీ గుట్టురట్టు

హైదరాబాద్‌:జూన్ 06

హైదరాబాద్ నగరంలోని లాల్‌దర్వాజలో మంగళవారం నకిలీ స్వీట్స్ తయారీ గుట్టురట్టయింది. రాజస్థాన్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న మిల్క్‌పౌడర్‌ను తీసుకొచ్చి నిందితులు నకిలీ స్వీట్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు..

SB NEWS

SB NEWS