నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 07:45

నైరుతి దాగుడుమూతలు.. అండమాన్‌ సమీపంలోనే ఆగిన రుతుపవనాలు

వాతావరణ మార్పుల ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడింది. గతేడాది ఈ సమయానికల్లా భారత్​లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కాస్త ఆలస్యం చేస్తున్నాయి..

ప్రస్తుతం అవి సముద్రంపైనే నిలకడగా ఉంటూ..దాగుడుమూతలు ఆడుతున్నాయి. ఈ కారణంగా మరో మూడు రోజుల తర్వాతే అవి కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 15 దాకా వర్షాలు పడకపోవచ్చని అంటున్నారు.

ప్రస్తుతం అండమాన్‌ దీవులను దాటి బంగాళాఖాతంలో కొంత ముందుకు వచ్చిన రుతుపవనాలు అక్కడే ఆగాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇటు అరేబియా సముద్రంలో లక్షదీవులను తాకినవీ ముందుకు కదలలేదని చెప్పారు. గతేడాది జూన్‌ ఒకటిన కేరళను తాకగా ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాటి ఆలస్యంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వానాకాలంలో వర్షపాతం అయిదు శాతం వరకూ తగ్గవచ్చని వాతావరణ శాఖ అధికారుల అంచనా..

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 21:47

హైదరాబాద్ లో భోపాల్ పోలీసుల తనిఖీలు..

దొరికితే దోసుకుందాం అనే చందంగా తయారయ్యింది దేశం,ముఖ్యంగా ఆన్ లైన్ మోసాలు దేశంలో రోజురోజుకీ ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఒక ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భోపాల్ నుండి పోలీసులు సోమవారం హైదరాబాద్ కు వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

బెట్టింగ్ యాప్ తో సూడో పోలీసుల అవతారం ఎత్తి ఓ ముఠా లక్షలు కాజేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సదరు గ్యాంగ్ సభ్యులను కొందరిని అరెస్టు చేసిన భోపాల్ పోలీసులు, మిగతా వారి కోసం హైదరాబాద్ ను జల్లెడ పడుతున్నారు. అల్కాపురి కాలనీ లో నిఘా పెట్టిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

బెట్టింగ్ యాప్స్ లో డబ్బు చెల్లిస్తామని, భారీగానే డిపాజిట్ చేస్తామని చెప్పి హవాలా ఏజెంట్లను నమ్మించి సదరు సూడోపోలీసుల గ్యాంగ్ బెట్టింగ్ యాప్ హెల్ప్ డెస్క్ ద్వారా లోకల్ ఏజెంట్ల ఫోన్ నెంబర్లను తీసుకుంటుంది. ఆ తర్వాత అసలు పని మొదలు పెడుతుంది. ఇక బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెడతామని చెప్పినా ఆ గ్యాంగ్ హవాలా ఏజెంట్లు తమ వద్దకు రాగానే పోలీసులమని చెప్పి వారిని ట్రాప్ చేస్తుంది.

ఆపై నిందితుల బెట్టింగ్ యాప్ లో ఉన్న డబ్బులను తమ ఖాతాలకు బదిలీ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతుంది. ఈ తరహా మోసాలు పలు రాష్ట్రాలలో ఈ గ్యాంగ్ అమలుచేసింది. హవాలా ఏజెంట్లు ఈ మోసాన్ని బయటకు చెప్పలేకపోతున్నారు. గతవారం ఇదే తరహాలో ఈ గ్యాంగ్ భోపాల్ లో 20 లక్షల రూపాయలు కాజేసింది.

భోపాల్ లో కృష్ణ, మహేష్ అనే ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు మిగతా వారి కోసం ఆచూకీ తీయగా హైదరాబాద్ నగరంలోని అల్కాపురి కాలనీలో ఉంటున్నట్టు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన భోపాల్ పోలీసులు , హైదరాబాద్లో ఉన్న నిందితులైన సతీష్, ప్రదీప్, అనిల్, శేఖర్ ల కోసం నగరాన్ని జల్లెడ పడుతున్నారు...

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 21:46

ప్రకాశం జిల్లా: ఒంగోలు రాజాపానగల్‌లో తుపాకీ పేలుడు

ప్రకాశం జిల్లా: ఒంగోలు రాజాపానగల్‌లో తుపాకీ పేలుడు కలకలం రేగింది. యూబీఐ కరెన్సీ టెస్సీ సెంటర్‌ లో ఎస్పీఎఫ్ గార్డు వెంకటేశ్వర్లు గన్ పేలింది.

ఈ ఘటనలో గార్డు వెంకటేశ్వర్లు తలలోకి బుల్లెట్ దూసుకువెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఇది ఆత్మహత్య లేక గన్ మిస్ ఫైర్ అయిందా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగింది.

ఎస్పీఎఫ్ గార్డు వెంకటేశ్వర్లు మధ్యాహ్నం డ్యూటీకి వచ్చారు. వచ్చిన 30 నిముషాలలోనే అతని గన్ ఫైర్ అయినట్లుగా సమాచారం. అయితే గన్ మిస్ ఫైర్ అయిందా? లేక ఇతర కారణాలతో వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంఘటన ప్రదేశంలో లోపలకు ఎవరినీ రానివ్వడంలేదు. క్లూస్ టీమ్ సాయంతో అక్కడున్న వేలిముద్రలు సేకరించారు. ఆ వేలి ముద్రలు వెంకటేశ్వర్లువేనా? లేక ఇతరులవా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది....

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 21:45

గొప్ప మానవత్వం చాటుకున్న సెహ్వాగ్

ఒడిశా రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 290 మంది మృత్యువాత పడగా, వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ విషాదకర ఘటనలో అయినవారిని, ఆత్మీయులను కోల్పోయిన కోల్పయిన వారి వేదన వర్ణనాతీతంగా మారింది. ఈ పరిస్థితులలో క‌న్న‌వాళ్ల‌ను కోల్పోయిన పిల్ల‌ల‌ను చ‌ద‌వించేందుకు టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు. తాను నడుపుతున్న స్కూల్లో ఆ పిల్ల‌లంద‌రిని ఉచితంగా చ‌దివిస్తాన‌ని సెహ్వాగ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

'ఒడిశా రైలు ప్రమాద ఘటన నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఈ విషాద స‌మ‌యంలో నేను చేయ‌గ‌లిగిన అతి చిన్న సాయం ఏంటంటే..

ఈ ప్ర‌మాదంలో క‌న్న‌వాళ్ల‌ను కోల్పోయిన అనాథ పిల్ల‌ల‌ను ఉచితంగా చదివించడమే. వాళ్ల‌కు సెహ్వాగ్ ఇంట‌ర్నేష‌న్ స్కూళ్ల‌లో చదువుతో పాటు ఉచిత వ‌స‌తి సౌక‌ర్యం కూడా క‌ల్పిస్తాను..' అని సెహ్వాగ్ ట్వీట్ చేశారు..........

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 21:43

ఒడిశా రైలు ప్రమాదం: రాత్రింబవళ్లు అక్కడే

కొరాపుట్‌:

బాలేశ్వర్‌ రైలు దుర్ఘటన జరిగిన ప్రాంతంలో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. సోమవారం దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. రాష్ట్రానికి చెందిన కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ శ్రీవైష్టవ్, మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు అక్కడే మకాం వేశారు. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణలో ఉన్న అత్యంత నాణ్యమైన టెక్నాలజీ వినియోగించారు. వందల సంఖ్యలో రైల్వే కార్మికులు షిఫ్ట్‌ల వారీగా పనులు చేస్తున్నారు. మరోవైపు ఇద్దరూ మంత్రులు భద్రక్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.

అలాగే రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రతాప్‌ జెన్నా మీడియా మాట్లాడుతూ మెత్తం 275మంది మృతులు తుది ప్రకటన చేశారు. ప్రతి మృతదేహాన్ని రాష్ట్ర ఖర్చులతో వారి స్వస్థలాలకు పంపిస్తున్నామన్నారు. బంధువులకు అప్పగించని మృతదేహాలను అన్ని ఆస్పత్రుల నుంచి భువనేశ్వర్‌కు రప్పిస్తున్నామన్నాని తెలిపారు. ఏ రాష్ట్రానికి చెందిన మృతులు ఉన్నా.. వారి బంధువులు వస్తే డెత్‌ సరి్టఫికెట్లు అందజేస్తామన్నారు. మృతదేహాలను ఫొటోలు తీసి, ప్రదర్శనగా ఉంచారు. బాధిత కుటుంబం సభ్యులు ఫొటో గుర్తించిన వెంటనే అధికారులు ఆ ఫొటో నంబర్‌ చూసి బాధితులను మృతదేహం ఉన్న ఆస్పత్రికి తీసుకు వెళ్తున్నారు. వెనువెంటనే తరలింపు ప్రక్రియ చేపడుతున్నారు.

అందుకే.. అంత వేగంగా..

కేంద్ర రైల్వేమంత్రి అశ్విని శ్రీవైష్టవ్‌ పనితీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకున్న ఆయన.. అప్పటి నుంచి విశ్రాంతి లేకుండా అక్కడే మకాం వేశారు. పగలు, రాత్రీ తేడా లేకుండా పరుగులు పెడుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయాన రైల్వేమంత్రే ఘటన స్థలంలో తిష్ట వేయడంతో ఆ శాఖలో ఉన్నతాధికారులెవరూ అక్కడి నుంచి కదల్లేకపోయారు. ఈ నేపథ్యంలో శిథిలమైన బోగీలులను తరచూ సందర్శిస్తూ, ట్రాక్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయిస్తున్నారు.

మరోవైపు మృతదేహాల తరలింపు పూర్తయినప్పటికీ కొన్ని బోగీల కింద ఇంకా ఎవరైనా ఉన్నారనే అనుమానంతో పూర్తిస్థాయిలో తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మరోవైపు సహాయక చర్యల్లో అందరి మన్ననలు పొందిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు చెట్ల కిందే సేద తీరుతున్నాయి. రైళ్ల రాకపోకలు నిలిచి పోవడంతో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నయక్‌ ఉచిత బస్సు సర్వీసులు నడపాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సహయ నిధి నుంచి ఈ పరిహరాన్ని బస్సు యజమానులకు చెల్లిస్తామన్నారు. ఈ బస్సులు బాలేశ్వర్, పూరీ, కోల్‌కతా, భువనేశ్వర్, కటక్‌ మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి...

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 21:41

రేపు సీఎం జగన్‌ పోలవరం పర్యటన.. ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన..

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(మంగళవారం) పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు.

ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించనున్నారు..

అనంతరం.. అధికారులతో ప్రాజెక్ట్‌పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 21:39

అమిత్ షా విశాఖ టూర్: ఈ నెల 11కి వాయిదా

అమరావతి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశాఖ పట్టణం పర్యటన ఈ నెల 11వ తేదీకి వాయిదా పడింది.

తొలుత ఈ నెల 8వ తేదీన అమిత్ షా విశాఖపట్టణం టూర్ ఉంటుందని బీజేపీ నేతలు ప్రకటించారు..

అయితే కేంద్ర మంత్రి అమిత్ షాకు ఇతర అత్యవసర సమావేశాలున్నందున ఈ నెల 8వ తేదీకి బదులుగా అమిత్ షా టూర్ 11కి వాయిదా పడింది..

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 17:28

తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉన్నారా ❓: సీతక్క

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు.

సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని ఉత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. పేపర్ లీకేజీని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏం తప్పు చేసిందని బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ధరణి వలన రైతుల ఇబ్బందులను సీఎం కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. వీఆర్ఓ వ్యవస్థను తీసివేసి కేసీఆర్ రెవిన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.

తెలంగాణలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని.. కేసీఆర్ పాలనలో మహిళలకు ప్రాధాన్యత లేదన్నారు. మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించండంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యలు చేశారు. ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన వారికి ఎమ్మెల్యే నివాళులర్పించారు......

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 14:24

ఈ నెల ఆఖరిలో గృహలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం

మెదక్:

జిల్లాలోని పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో నూతనంగా నిర్మించిన 56 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రాష్ట్ర ఆర్థిక ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

సోమవారం ఉదయం ప్రారంభించారు. లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రూపాయి ఖర్చు కాకుండా, చెమట చుక్క చిందించకుండా అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు.

పైరవీకారుల పని లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇల్లు అందేలాగా కలెక్టర్ చేతనే ఇళ్ల మంజూరు చేయించామని చెప్పారు. ఈ నెలాఖరిలోగా ఇంటి జాగా ఉన్న వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు కట్టుకొనేందుకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. కేంద్ర బీజేపీ బోరు బాయికాడ మీటర్ పెట్టి రైతులకు బిల్లు పంపించాలని తెలంగాణపై ఒత్తిడి తెచ్చిందని మండిపడ్డారు. రైతుపై ఇక్కడ మీటర్ పెట్టనందుకు 30 వేల కోట్లను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆపిందని తెలిపారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీటర్ పెట్టేది లేదని తేల్చి చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మంత్రి కొనియాడారు.

కాంగ్రెస్ పాలన తెస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. కాంగ్రెస్ పాలన అంటే ఏంటిది మీరు మర్చిపోయారా... కాంగ్రెస్ పాలన అంటే నీళ్లకు కష్టం, కరెంట్‌కు కష్టం, పెన్షన్‌కు కష్టం’’ అని వ్యాఖ్యలు చేశారు. ఎంత కష్టమైనా గింజ పోకుండా వడ్లను కేసీఆరే కొన్నారని తెలిపారు.

ఈనెల 14న న్యూట్రిషన్ కిట్టు ప్రారంభించబోతున్నామని చెప్పారు. గర్భిణీల ఆరోగ్యం కోసం న్యూట్రిషన్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కేసీఆర్ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి, బిడ్డ గర్భం దాలిస్తే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, ఆడబిడ్డ పురుడు పోస్తే కేసీఆర్ కిట్టు, ముసలోళ్లకు ఆసరా పెన్షన్, రైతుకు రైతుబంధు ఇలా అన్ని వర్గాలను అదుకుంటున్న నాయకుడు కేసీఆర్ అని మంత్రి హరీష్‌రావు కొనియాడారు.....

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 14:22

బీజాపూర్లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు..

రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలోని పుస్నార్, గంగలూరు మధ్య మావోయిస్టులు మందుపాతర పేల్చారు..

ఈ ఘటనలో 85వ బెటాలియన్కు చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి.

గాయపడిన ఇద్దరు జవాన్లను ప్రాథమిక చికిత్స అనంతరం హెలికాప్టర్లో రాయ్పూర్ జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనను జిల్లా ఎస్పీ ఆంజనేయ వర్షిణి ధృవీకరించారు. గత ఏప్రిల్ నెలలో దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేల్చారు.

దీంతో పది మంది జవాన్లు, వ్యాన్ డ్రైవర్ మృతిచెందారు. అర్ణాపూర్ స్టేషన్ పరిధిలో రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులు మావోయిస్టుల కోసం గాలింపు నిర్వహించి తిరిగి క్యాంపునకు వస్తుండగా మందుపారత పేల్చినట్లు అధికారులు తెలిపారు..