గొప్ప మానవత్వం చాటుకున్న సెహ్వాగ్
ఒడిశా రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 290 మంది మృత్యువాత పడగా, వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ విషాదకర ఘటనలో అయినవారిని, ఆత్మీయులను కోల్పోయిన కోల్పయిన వారి వేదన వర్ణనాతీతంగా మారింది. ఈ పరిస్థితులలో కన్నవాళ్లను కోల్పోయిన పిల్లలను చదవించేందుకు టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు. తాను నడుపుతున్న స్కూల్లో ఆ పిల్లలందరిని ఉచితంగా చదివిస్తానని సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
'ఒడిశా రైలు ప్రమాద ఘటన నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఈ విషాద సమయంలో నేను చేయగలిగిన అతి చిన్న సాయం ఏంటంటే..
ఈ ప్రమాదంలో కన్నవాళ్లను కోల్పోయిన అనాథ పిల్లలను ఉచితంగా చదివించడమే. వాళ్లకు సెహ్వాగ్ ఇంటర్నేషన్ స్కూళ్లలో చదువుతో పాటు ఉచిత వసతి సౌకర్యం కూడా కల్పిస్తాను..' అని సెహ్వాగ్ ట్వీట్ చేశారు..........
Jun 05 2023, 21:46