నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 21:39

అమిత్ షా విశాఖ టూర్: ఈ నెల 11కి వాయిదా

అమరావతి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశాఖ పట్టణం పర్యటన ఈ నెల 11వ తేదీకి వాయిదా పడింది.

తొలుత ఈ నెల 8వ తేదీన అమిత్ షా విశాఖపట్టణం టూర్ ఉంటుందని బీజేపీ నేతలు ప్రకటించారు..

అయితే కేంద్ర మంత్రి అమిత్ షాకు ఇతర అత్యవసర సమావేశాలున్నందున ఈ నెల 8వ తేదీకి బదులుగా అమిత్ షా టూర్ 11కి వాయిదా పడింది..

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 17:28

తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉన్నారా ❓: సీతక్క

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు.

సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని ఉత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. పేపర్ లీకేజీని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏం తప్పు చేసిందని బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ధరణి వలన రైతుల ఇబ్బందులను సీఎం కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. వీఆర్ఓ వ్యవస్థను తీసివేసి కేసీఆర్ రెవిన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.

తెలంగాణలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని.. కేసీఆర్ పాలనలో మహిళలకు ప్రాధాన్యత లేదన్నారు. మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించండంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యలు చేశారు. ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన వారికి ఎమ్మెల్యే నివాళులర్పించారు......

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 14:24

ఈ నెల ఆఖరిలో గృహలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం

మెదక్:

జిల్లాలోని పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో నూతనంగా నిర్మించిన 56 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రాష్ట్ర ఆర్థిక ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

సోమవారం ఉదయం ప్రారంభించారు. లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రూపాయి ఖర్చు కాకుండా, చెమట చుక్క చిందించకుండా అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు.

పైరవీకారుల పని లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇల్లు అందేలాగా కలెక్టర్ చేతనే ఇళ్ల మంజూరు చేయించామని చెప్పారు. ఈ నెలాఖరిలోగా ఇంటి జాగా ఉన్న వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు కట్టుకొనేందుకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. కేంద్ర బీజేపీ బోరు బాయికాడ మీటర్ పెట్టి రైతులకు బిల్లు పంపించాలని తెలంగాణపై ఒత్తిడి తెచ్చిందని మండిపడ్డారు. రైతుపై ఇక్కడ మీటర్ పెట్టనందుకు 30 వేల కోట్లను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆపిందని తెలిపారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీటర్ పెట్టేది లేదని తేల్చి చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మంత్రి కొనియాడారు.

కాంగ్రెస్ పాలన తెస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. కాంగ్రెస్ పాలన అంటే ఏంటిది మీరు మర్చిపోయారా... కాంగ్రెస్ పాలన అంటే నీళ్లకు కష్టం, కరెంట్‌కు కష్టం, పెన్షన్‌కు కష్టం’’ అని వ్యాఖ్యలు చేశారు. ఎంత కష్టమైనా గింజ పోకుండా వడ్లను కేసీఆరే కొన్నారని తెలిపారు.

ఈనెల 14న న్యూట్రిషన్ కిట్టు ప్రారంభించబోతున్నామని చెప్పారు. గర్భిణీల ఆరోగ్యం కోసం న్యూట్రిషన్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కేసీఆర్ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి, బిడ్డ గర్భం దాలిస్తే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, ఆడబిడ్డ పురుడు పోస్తే కేసీఆర్ కిట్టు, ముసలోళ్లకు ఆసరా పెన్షన్, రైతుకు రైతుబంధు ఇలా అన్ని వర్గాలను అదుకుంటున్న నాయకుడు కేసీఆర్ అని మంత్రి హరీష్‌రావు కొనియాడారు.....

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 14:22

బీజాపూర్లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు..

రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలోని పుస్నార్, గంగలూరు మధ్య మావోయిస్టులు మందుపాతర పేల్చారు..

ఈ ఘటనలో 85వ బెటాలియన్కు చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి.

గాయపడిన ఇద్దరు జవాన్లను ప్రాథమిక చికిత్స అనంతరం హెలికాప్టర్లో రాయ్పూర్ జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనను జిల్లా ఎస్పీ ఆంజనేయ వర్షిణి ధృవీకరించారు. గత ఏప్రిల్ నెలలో దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేల్చారు.

దీంతో పది మంది జవాన్లు, వ్యాన్ డ్రైవర్ మృతిచెందారు. అర్ణాపూర్ స్టేషన్ పరిధిలో రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులు మావోయిస్టుల కోసం గాలింపు నిర్వహించి తిరిగి క్యాంపునకు వస్తుండగా మందుపారత పేల్చినట్లు అధికారులు తెలిపారు..

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 14:20

Peddireddy: ముందస్తు ఎన్నికలు.. మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ..

అమరావతి: ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైకాపాకు లేదని చెప్పారు..

అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయన్నారు. వైకాపా బలంగా ఉందని.. తమకు వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదని పెద్దిరెడ్డి చెప్పారు.

తెదేపా అధినేత చంద్రబాబు వేరే పార్టీలపై ఆధారపడుతున్నారని.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గురించి తానేమీ మాట్లాడనని వ్యాఖ్యానించారు..

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 14:18

AP CM Jagan: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడులపై సీఎం జగన్‌ సమీక్ష..

రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు..

మార్చి నెలలో ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. విశాఖ కేంద్రంగా రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది.

ఆ సమ్మిట్‌లో పెట్టుబడిదారులతో 13 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. చేసుకున్న ఒప్పందాలు ఎంత మేరకు కార్యరూపం దాల్చాయనే అంశంపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష చేపట్టారు..

ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్, టూరిజం సీఈవో కన్నబాబు, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు..

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 13:29

కోకాపేటలో భారత్ భవన్ కు శంకుస్థాపన చేసిన కేసీఆర్

రంగారెడ్డి జిల్లా:

కోకాపేటలో భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భారత్ భవన్ సెంటర్ పర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్ఆర్డీగా భవనానికి నామకరణం చేశారు.

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు.

కోకాపేటలో మొత్తం 11 ఎకరాల్లో మొత్తం 15 అంతస్తుల్లో భవనం నిర్మిస్తున్నారు. కార్యకర్తలకు అవగాహనా కార్యక్రమాలు,శిక్షణా తరగతులు నిర్వహించేలా ప్లాన్ చేశారు. కోకాపేటలో అత్యంత విలువైన భూమిని తక్కువ ధరకు బీఆర్ఎస్ కు కేటాయిస్తు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

కేవలంలో ఐదు రోజుల్లో నే భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కోకాపేటలో గజం లక్ష రూపాయలకు పైగా పలుకుతుండగా కేవలం రూ. 7500 లకు గజం చొప్పున 11 ఎకరాలను ప్రభుత్వం కట్టబెట్టింది. వందల కోట్ల స్థలాన్ని కేవలం 40 కోట్లకే కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి............

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 12:51

TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమినరీకి.. 15 నిమిషాల ముందే గేట్ల మూసివేత

హైదరాబాద్‌: రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది..

ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్థులను ఎవరినీ అనుమతించబోమని తెలిపింది. ఈ మేరకు అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ పలు సూచనలు చేసింది.

''ఓఎంఆర్‌ పత్రంలో ఎవరైనా తప్పులు చేస్తే, దానికి బదులుగా కొత్తది ఇవ్వబోం. ఓఎంఆర్‌ పత్రంలో వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌తో సక్రమంగా బబ్లింగ్‌ చేయాలి. సరైన వివరాలు బబ్లింగ్‌ చేయని, పెన్సిల్‌, ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌ ఉపయోగించిన, డబుల్‌ బబ్లింగ్‌ చేసిన పత్రాలు చెల్లుబాటు కావు.

అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్‌, పాన్‌ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపుకార్డులు తీసుకురావాలి. వీటి విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి, కమిషన్‌ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్‌ చేస్తాం'' అని వివరించింది..

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 12:50

Odisha: ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

ఒడిశాలోని బాలేశ్వర్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘోర ప్రమాదానికి గురైన ఘటన మరువక ముందే మరో గూడ్స్‌ రైలు ప్రమాదానికి గురైంది..

సోమవారం ఉదయం ఒడిశాలోని బర్గఢ్‌ జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. సున్నపు రాయి లోడుతో వెళుతున్న ఈ రైలు సంబర్‌ధార వద్ద ప్రమాదానికి గురైంది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

ఈ రైలు బర్గఢ్‌ నుంచి దుంగ్రీ ప్రాంతానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. ఏసీసీ సిమెంట్‌ కర్మాగారంలో సున్నపురాయి గనుల నుంచి ప్లాంట్‌కు లోడు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది..

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 12:49

TDP-YSRCP: కొండపిలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో తెదేపా ఎమ్మెల్యే

టంగుటూరు: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నాయుడుపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు యత్నించారు..

గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి ముట్టడికి వెళ్లేందుకు టంగుటూరులోని వైకాపా కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అక్కడ సుమారు 350 మంది పోలీసులు మోహరించారు..

మరోవైపు వైకాపా తీరును నిరసిస్తూ తెదేపా నేతలు ప్రతిస్పందిస్తూ టంగుటూరులోని వరికూటి అశోక్‌బాబు ఇంటి ముట్టడికి బయల్దేరారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు బయల్దేరగా.. మార్గంమధ్యలో 16వ నంబర్‌ హైవేపై పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించారు. పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ తెదేపా నేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..