పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సురక్షా దినోత్సవం
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సురక్షా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఫుట్ పెట్రోలింగ్, బైక్ రాల్యీలు, పెట్రోలింగ్ కార్లు, బ్లూ క్లోట్స్, ఫైర్ వెహికిల్స్‌తో ర్యాలీ నిర్వహిస్తున్నారు.
సురక్షా దినోత్సవంలో భాగంగా హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. లిబర్టీ, అబిడ్స్, చార్మినార్, తెలుగుతల్లి విగ్రహం మీదుగా ర్యాలీ కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు, అగ్నిమాపక శకటాలను ప్రదర్శించారు. మూడు కమిషనరేట్‌ల పరిధిలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పోలీసుల బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని
వీధులమీదుగా సాగిన ర్యాలీలో ఎమ్మెల్యేల ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ పోలీసుల బైక్ ర్యాలీని ప్రారంభించారు.
నల్లగొండలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రారంభించారు.
పెద్దపల్లిలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు,
భూపాలపల్లిలో గండ్ర వెంకట రమణారెడ్డి పోలీసు బైక్ ర్యాలీ, కవాతును ప్రారంభించారు....
Jun 04 2023, 13:57