Encounter ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్, మావోలకు మధ్య ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్ బస్తర్ డివిజన్‌లోని నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది..
ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నుంచి నలుగురు మావోయిస్టులు గాయపడ్డట్లుగా భద్రతా బలగాలు తెలిపాయి..
ఎన్‌కౌంటర్‌ను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు. జిల్లాలోని ఎర్రబోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారాయిగూడ-రేగడగట్ట ప్రాంతంలో కోట ఏరియా కమిటీ కమాండర్ మంగడు, వెట్టి భీమాతో పాటు పలువురు మావోలు ఉన్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు డీఆర్‌జీ బృందం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిందని పేర్కొంది..
అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగానే.. రేగడగట్ట గ్రామ సమీపంలోకి జవాన్లను చూసిన మావోలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన డీఆర్‌జీ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్ ప్రాంతంలో నలుగురైదుగురు గాయపడ్డారని భద్రతా దళం ప్రకటించింది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు మాత్రమే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని వివరించారు..
Jun 04 2023, 09:42