నేటి నుంచి ఏపీలో గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షలు

అమరావతి :

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు ఈరోజు నిర్వహించారు ఇవి ఈ రోజు నుంచి జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 6,455 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 జిల్లాల్లో ఈ పరీక్ష సెంటర్లను కేటాయించారు.

11 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు జూన్ 10 వరకు జరగనున్నట్లు ఏపీపీఎస్సీ సెక్రటరీ ప్రదీప్కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ సారి బయోమెట్రిక్ తో పాటు.. తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని సెక్రటరీ ప్రకటించారు. దీని కోసం మొత్తం 70 బయో మెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేశామని పేర్కొన్నారు. ఈ పరీక్ష రాసే దివ్యాంగుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 290 మంది దివ్యాంగ అభ్యర్థులు ఉన్నట్లు చెప్పారు. వారికి గంట అదనపు సమయం ఇస్తామన్నారు. పరీక్షను పూర్తిగా ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రశ్నాపత్రాలతో పాటు జవాబు పత్రాల బుక్ లెట్ ఇస్తామన్నారు. మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం ఉండదన్నారు. పేపర్ లీకేజీకి అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరి 8 న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. పరీక్షలు నిర్వహించిన కేవలం 19 రోజులకే ఫలితాలను విడుదల చేసి రికార్డు సృష్టించింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొత్తం 92 పోస్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు 1,26,449 మంది అప్లై చేసుకోగా.. మెయిన్స్ కు 6,455 మంది అర్హత సాధించారు. జులైలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు, ఆగస్టులో ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ప్రణాళిలకు రూపొందిస్తున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ ఇటీవల వెల్లడించారు....

Train Accident: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 178 మంది ఏపీ ప్రయాణికులు: వాల్తేరు డీఆర్‌ఎం

విశాఖపట్నం: ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఏపీకి చెందిన 178 మంది ప్రయాణికులు ఉన్నట్లు వాల్తేరు డీఆర్‌ఎం వెల్లడించారు..

వందమందికి పైగా విశాఖకు రిజర్వేషన్‌ చేయించుకున్నట్లు చెప్పారు. వీరితోపాటు జనరల్‌ బోగీలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.

బాలేశ్వర్‌ నుంచి ప్రత్యేక రైలు మరో 2 గంటల్లో విశాఖ రానున్నట్లు చెప్పారు. మరోవైపు విశాఖ నుంచి మరమ్మతు సిబ్బందితో ఒక రైలు బాలేశ్వర్‌ వెళ్తోందని చెప్పారు. యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎంతమంది ఏపీ వాసులున్నారో తేలాల్సి ఉందని అన్నారు..

SB NEWS

Avinash CBI Enquiry: కొనసాగుతున్న అవినాశ్ విచారణ.. సీబీఐ ప్రశ్నలు ఇవే..

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) సీబీఐ విచారణ కొనసాగుతోంది..

ఎంపీని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటలకు అవినాశ్ సీబీఐ ఎదుట హాజరయ్యారు. సాయంత్రం 5 గంటలకు విచారణ సాగనుంది. వాట్సప్ కాల్స్, నిందితులతో పరిచయాలపై సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం.

అడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారి సమక్షంలో విచారణ కొనసాగుతోంది. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియోలు సీబీఐ అధికారులు చిత్రీకరిస్తున్నారు. వివేకా హత్యకు వాడిని గొడ్డలిపై కూడా సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సునీల్ యాదవ్ గొడ్డలి దాచిన విషయంపై ఆరా తీస్తోంది.

వివేకా మరణంపై జగన్ మోహన్ రెడ్డికి (AP CM YS Jaganmohan Reddy) ముందుగా ఎవరు చెప్పారన్న విషయాన్ని సీబీఐ లేవనెత్తింది. అయితే తనకు, ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని అవినాశ్ సీబీఐ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అవినాష్ స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేస్తున్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు : పార్టీలకు సవాల్ గా మారనున్నాయా ❓️

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు కేంద్రం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారుల బదిలీ విషయంలో మార్గదర్శకాలు సూచిస్తూ ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లకు లేఖలు రాసింది.

మరో ఆరు,ఏడు నెలల్లో ఐదు రాష్ట్రాలలో ఎన్నికల సందడి మొదలుకానుంది,

తెలంగాణలో 16-1-2024,

రాజస్థాన్ లో 14-01-2024,

మధ్యప్రదేశ్ లో 06-01-2024,

మిజోరాం లో 17-12-2023,

ఛత్తీస్‌గడ్ లో 03-01-2024,

తేదీల ప్రకారం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారులను వారి సొంత జిల్లాల్లో విధులు నిర్వహించకూడదని, అంతేకాకుండా మూడేళ్లపాటు ఒకేచోట ఉద్యోగం చేస్తున్న అధికారులను సైతం కొనసాగించవద్దని పేర్కొంది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు తెలుపుతూ రాష్ట్రాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లకు లేఖలు రాసింది.

ఎన్నికల డ్యూటీలో పాల్గొనే అధికారులు క్రిమినల్ కేసులు లేవని డిక్లరేషన్ తీసుకోవాలని తెలిపింది. అభ్యర్థుల్లో తమ బంధువులు లేరని కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, బదిలీలు, పోస్టింగ్‌లపై జూలై 31లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం లేఖలో పేర్కొంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం..

ఎన్నికల అధికారుల పోస్టింగ్ లపై ఆయా రాష్ట్రాల CS, CEO లకు మార్గదర్శకాలు జారీచేసిన భారత ఎన్నికల కమీషన్..

మిజోరాం 17.12.23

చత్తీస్గఢ్ 03.01.24

మధ్యప్రదేశ్ 06.01.24

రాజస్థాన్ 14.01.24

తెలంగాణ 16.01.24

తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రకటించారు..

SB NEWS

మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా

•చాలా బాధపడ్డా : ప్రధాని నరేంద్ర మోడీ

•రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి

ఒరిస్సా : ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు. మరో 350 మందికిపైగా క్షతగాత్రులై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బహనాగ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద సాయంత్రం 7.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఓడీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. బోగీల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. క్షతగాత్రులను సోరో, గోపాల్‌పూర్, ఖంటపాడ పీహెచ్‌సీలకు తరలించారు. బాలేశ్వర్‌లో ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 06782262286కు ఫోన్‌ చేయాలని అధికారులు తెలిపారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, నాలుగు రాష్ట్ర సహాయక బృందాలు రంగంలోకి దించారు.

ఇదీ జరిగింది : గూడ్స్‌ రైలును ఢీ కొట్టడం వల్ల కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పాయి. మరో ట్రాక్‌పై పడిన బోగీలను అటువైపుగా వస్తున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టింది. దీంతో యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ 4 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా లెక్కించలేదని ఒడిశా సీఎస్‌ వెల్లడించారు.

మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియో

ఒడిశా రైలు ప్రమాదంలో మృతులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. మృతులకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.2లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.

చాలా విషాదకరం : నవీన్ పట్నాయక్​

ఈ ఘటనపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటన చాలా విషాదకరమన్నారు. శనివారం ఉదయం ఘటనా స్థలానికి వెళ్లనున్నట్టు తెలిపారు. రెవెన్యూశాఖ మంత్రి ప్రమీలా మాలిక్‌ను ఘటనా స్థలికి వెళ్లాలని ఆదేశించారు.

చాలా బాధపడ్డా : ప్రధాని నరేంద్ర మోడీ

ఈ రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. 'ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం గురించి విని బాధపడ్డాను. ఈ దుఃఖ సమయంలో, నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించాను. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి

కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురికావడంపై బంగాల్​ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తమ రాష్ట్రం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న రైలు బాలేశ్వర్‌ వద్ద ఈ సాయంత్రం గూడ్సు రైలును ఢీకొట్టిందని తెలిపారు. తమ రాష్ట్రానికి చెందిన వారి క్షేమం కోసం ఒడిశా ప్రభుత్వం, సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెబుతూ.. 033-22143526/22535185 నంబర్లను ఆమె షేర్‌ చేశారు. ఘటనా స్థలానికి 5-6 సభ్యుల బృందంతో పాటు రైల్వే అధికారులను పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర సీనియర్‌ అధికారులతో కలిసి తాను వ్యక్తిగతంగా అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు దీదీ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన స్టేషన్లలో రైల్వేశాఖ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసింది.

విశాఖలో హెల్ప్‌లైన్‌ నంబర్లు: 08912746330, 08912744619

విజయనగరం: 08922-221202, 08922-221206

విజయవాడ: 0866 2576924

రాజమహేంద్రవరం: 08832420541

odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష..

అమరావతి : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఘటనాస్థలికి ముగ్గురు అధికారుల బృందాన్ని పంపాలని ఆదేశించారు..

మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందం ఘటనాస్థలికి వెళ్లనుంది. ఆయా కలెక్టరేట్లలో విచారణ విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

అవసరమైతే అంబులెన్స్‌లు సన్నద్ధం చేయాలని సూచించారు. ఎమర్జెన్సీ సేవలకు సరిహద్దు జిల్లాల్లో ఆస్పత్రులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు..

SB NEWS

మధ్యాహ్నం భోజనంలో మార్పులు ప్రతిరోజు పప్పన్నం

కొత్త విద్యాసంవత్సరం నుంచి బడుల్లో మెనూ మారనున్నది. మధ్యాహ్న పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై ప్రతిరోజు పప్పు అందించనున్నారు.కొత్తగా కిచిడీని మెనూలో జత చేశారు.

ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మధ్యాహ్న పథకంలో రోజు విడిచి రోజు పప్పును అందించేవారు. పోషకాహారంలో భాగంగా ఇకపై ప్రతిరోజు పప్పును భోజనంలో వడ్డిస్తారు.

సోమవారం కిచిడీ, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ, కోడిగుడ్డు,

మంగళవారం రైస్‌, సాంబార్‌, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ,

బుధవారం రైస్‌, ఆకుకూర పప్పు, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ, కోడిగుడ్డు,

గురువారం వెజిటబుల్‌ బిర్యానీ, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ,

శుక్రవారం రైస్‌, సాంబార్‌, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ, కోడిగుడ్డు,

శనివారం రైస్‌, ఆకుకూర పప్పు, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీతో కొత్త మెనూను సిద్ధం చేశారు.

ప్రతిరోజు విద్యార్థులకు ఏదో ఒకరూపంలో పప్పు ఉండేలా మెనూ సిద్ధం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 28,606 బడుల్లోని 25,26,907 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు.

ఇవాళ సాయంత్రం ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

- రాత్రికి అమిత్‍షాతో భేటీకానున్న చంద్రబాబునాయుడు

- రేపు ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం

- ఏపీలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత..

SB NEWS

SB NEWS

SB NEWS

అసెంబ్లీ ఎన్నికలపైనే బీఆర్‌ఎస్‌ ఫోకస్‌!

పూర్తిగా పార్టీ కార్యకలాపాలపైనే కేసీఆర్‌ దృష్టి

జాతీయ స్థాయిలో విస్తరణ కోసం పార్టీని భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్చినా.. ప్రస్తుతానికి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించాలని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నట్టు తెలిసింది. మహారాష్ట్రలో పార్టీ కార్యకలాపాల విస్తరణ చేపట్టినా.. అంతకన్నా ముందు తెలంగాణలో పార్టీ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన నేతగా ఇప్పటికే గుర్తింపు పొందిన కేసీఆర్‌.. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ ఘనతను సొంతం చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎన్నికల సన్నద్ధతను ప్రా రంభించిన కేసీఆర్‌.. తాజాగా ప్రారంభమైన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కూడా బీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహంలో అంతర్భా గం చేస్తున్నారు. 21 రోజుల పాటు జరిగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్‌ఎస్‌ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తూ.. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఆకట్టుకోవడం దిశగా అడుగులు వేస్తున్నారు.

దశాబ్ది ఉత్సవాలు పూర్తికాగానే పూర్తిస్థాయిలో ఎన్నికల సమరానికి కార్యాచరణ ప్రకటించేందుకు కేసీఆర్‌ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో సభలు, సమావేశాల ద్వారా ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించి.. అక్టోబర్‌ 10న వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభతో ఎన్నికల సన్నద్ధతను పతాక స్థాయికి తీసుకెళ్లే యోచనలో కేసీఆర్‌ ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

జాతీయ స్థాయిలో గ్రాఫ్‌ పెంచుకునేందుకూ..

రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టడం ద్వారా జాతీయస్థాయిలో గ్రాఫ్‌ పెంచుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది. ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తే.. 2024 ఆరంభంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఆకర్షణ పెరుగుతుందని సీఎం లెక్కలు వేస్తున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలలోని సుమారు 20 లోక్‌సభ స్థానాలపై కేసీఆర్‌ దృష్టి కేంద్రీకరించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అవసరమైతే పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్‌ లేదా ఔరంగాబాద్‌ నుంచి కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అవకాశముందని మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అప్పటిదాకా విపక్షాలకు దూరమే!

జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్‌.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు విపక్ష పార్టీల ఐక్యత కోసం జరుగుతున్న ప్రయత్నాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలిసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు తాము సమ దూరమనే సంకేతాలు ఇవ్వకుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు జాతీయ పార్టీలు బీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుంటాయనే అభిప్రాయంలో పార్టీ అధినేత ఉన్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు వివరిస్తున్నాయి.

ఇటీవల ప్రగతిభవన్‌లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో జరిగిన భేటీ సందర్భంగా కూడా జాతీయ రాజకీయాల్లో తమదైన శైలిలో ముందుకు వెళ్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారని అంటున్నాయి. భావసారూప్య పార్టీలతో స్నేహభావంతో వ్యవహరిస్తామని చెప్తూనే.. జాతీయస్థాయిలో విపక్షాల ఐక్యతపై ఆచితూచి అడుగులు వేయాలని సీఎం భావిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడ్డాకే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ఉన్నారని అంటున్నాయి...