ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆత్మహత్యాయత్నం
న్యూఢిల్లీ: బెల్లంపల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆరిజన్ పాల సంస్థ భాగస్వామి శైలజ విషం తాగారు.
వెంటనే ఆమెను ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సుసైడ్ లెటర్ రాశారు. అందులో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన అనుచరులు భీమా గౌడ్, సంతోష్, పోచన్న, కార్తీక్ మానసికంగా హింసిస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే చిన్నయ్య నన్ను చంపుతానని అనుచరులతో బెదిరిస్తున్నారు. ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న నా ఫోటోలను సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేశారు. అసభ్యకరంగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో నేను తీవ్రమైన మనస్థాపానికి గురయ్యాను. ఈ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా సమస్య గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. అంతేగాక నాపైన తప్పుడు కేసులు పెడుతున్నారు. నేను చనిపోయిన తర్వాతనైనా న్యాయం జరుగుతుందని సూసైడ్ లెటర్ రాస్తున్న’ అని లేఖలో పేర్కొన్నారు.
కాగా ఎమ్మెల్యే చిన్నయ్యకు, అరిజిన్ డెయిరీ పాల సంస్థ ప్రతినిధులకు మధ్య గతంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపులతో పాటు ఎమ్మెల్యే తమపై అక్రమ కేసులు బనాయించారని సదరు యువతి ఆరోపిస్తోంది. దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవలె జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
ఆ బాధ తట్టుకోలేక ఎమ్మెల్యే దగ్గరకు అమ్మాయిలను పంపించాను
దుర్గం చిన్నయ్య వల్ల తమ కంపెనీలో ఉన్న వాళ్లంతా రోడ్డున పడ్డారని బాధితురాలు శైలజ ఆరోపించారు. ఇప్పటికే తమపై తప్పుడు కేసులు పెట్టారని.. బెయిల్‌పై బయటకు వచ్చినా.. బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
Jun 03 2023, 08:32