సాక్షి హత్య కేసులో నిందితుడు సాక్షితో సహా ఐదుగురిని హత్య చేసేందుకు ప్లాన్

ఢిల్లీలోని ప్రముఖ సాక్షి హత్య కేసులో 11 గంటలకు మద్యం, గంజాయి తాగి కత్తితో తిరుగుతున్న నిందితుడు సాక్షితో సహా ఐదుగురిని హత్య చేసేందుకు ప్లాన్ వేసినట్లు వెల్లడైంది.

ఢిల్లీలోని ప్రముఖ సాక్షి హత్యకేసులో పెద్ద సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు సాహిల్ ఆదివారం ఉదయం నుంచి సాక్షి హత్యపై నిఘా పెట్టినట్లు తెలిసింది. సీసీటీవీ కెమెరా ఫుటేజీలో కూడా పోలీసులు ఇందుకు సంబంధించిన ఆధారాలను గుర్తించారు. మూడు, నాలుగు రోజులుగా హత్యకు ప్లాన్ చేస్తున్నట్టు నిందితుడు చెప్పాడు. అతని టార్గెట్ సాక్షి మాత్రమే కాదు, ప్రవీణ్ మరియు మరో ఇద్దరు ముగ్గురు యువకులు కూడా. చంపాల్సిన ఐదుగురి జాబితాను తయారు చేశాడు. ఆదివారం మార్గమధ్యంలో ఎవరు కలిసినా చంపేసేవాడు. ఈ మార్గాన్ని సాక్షులు మరియు ఇతరులు ఉపయోగిస్తున్నారని అతనికి తెలుసు. అందుకే ఉదయం నుంచి కత్తితో తిరుగుతున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో మద్యం, గంజాయి సేవించినట్లు నిందితులు తెలిపారు. మధ్యమధ్యలో మత్తు మందు తాగుతూనే ఉన్నాడు. హత్య చేసినప్పుడు అతడు మద్యం మత్తులోనే ఉన్నాడు.

స్నేహం సాకుతో దాడి చేయొద్దని సాక్షి వేడుకున్నా.. దాడి మాత్రం కొనసాగించాడని నిందితుడు చెప్పాడు. హత్య చేసేందుకు హరిద్వార్ నుంచి కత్తిని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం కత్తిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరో సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సంఘటనా స్థలంలో సంఘటన జరగడానికి ముందు సాహిల్ ఓ యువకుడితో మాట్లాడుతున్నాడు. అయితే సాహిల్ ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఉండేవాడని పోలీసులు చెబుతున్నారు. అందుకే సంఘటన జరిగినప్పుడు తెలిసిన వారి పోవడం గురించి మాట్లాడుతున్నాడు. పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకుడు కూడా మరో యువకుడు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతానికి ఈ యువకుడిని కూడా పోలీసులు విచారించనున్నారు.

అడవిలో ఫోన్, కత్తి విసిరాడు

హత్య అనంతరం తాను రిథాలా మెట్రో స్టేషన్‌ వైపు వెళ్లినట్లు నిందితుడు చెప్పాడు. ఇంతలో ఫోన్, కత్తిని గుప్తా కాలనీలోని అడవిలో విసిరేశారు. రాత్రిపూట రోడ్డుపై నిద్రించిన తర్వాత, అతను తెల్లవారుజామున బస్సులో తన అత్త గ్రామం అటెర్ని బులంద్‌షహర్‌కు చేరుకున్నాడు. అయితే హత్య విషయాన్ని అత్తకు చెప్పలేదు.

అన్ని శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించండి

ఈ హత్యపై పోలీసులు అన్ని సైంటిఫిక్ టెక్నిక్‌లను ఉపయోగిస్తారని ఔటర్ నార్త్ డీసీపీ రవికుమార్ సింగ్ తెలిపారు. అవసరమైతే, నిందితుడి మానసిక పరీక్ష కోసం సైకాలజిస్ట్ సహాయం కూడా తీసుకోబడుతుంది.

నిందితులను విచారించి ఆధారాలు సేకరిస్తామని మంగళవారం తెలిపారు. అలాగే హత్యకు గల కారణాలను కూడా కనుగొననున్నారు. హత్యకు ముందు మరియు తరువాత సాహిల్ ఢిల్లీ నుండి బులంద్‌షహర్‌కు వెళ్లడానికి మధ్య కూడా లింక్ ఉంది. నిందితులు, సాక్షులు, వారి స్నేహితుల ఫోన్‌లు, సోషల్‌ మీడియా ఖాతాలు, కాల్‌ డిటైల్స్‌ను స్కానింగ్‌ చేసి హత్యలో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఘటనకు ఉపయోగించిన ఫోన్‌, కత్తి ఇంకా లభ్యం కాలేదు. ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

ప్రవీణ్‌ను విచారించనున్నారు

ప్రవీణ్‌ని కూడా పోలీసులు విచారించనున్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రవీణ్ జాన్‌పూర్‌లో ఉన్నాడు. అతను ఐదు-ఆరు సంవత్సరాలు సాహిల్‌తో కలిసి జీవించాడు, కాని వెంటనే అతను తన స్వంత పనిని ప్రారంభించాడు. ప్రవీణ్‌ని విచారించడంతో కొన్ని ముఖ్యమైన లింకులు కూడా చేరి హత్యకు గల కారణాలు కూడా తెలుస్తాయి.

ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు కుటుంబాన్ని కలిశారు

ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు చౌదరి అనిల్ కుమార్ మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఢిల్లీలో పెరుగుతున్న నేరాలు మరియు శాంతిభద్రతల పరిస్థితికి బిజెపి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ సమానంగా బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

తెలంగాణపై అమిత్ షా కన్ను పడింది : కెసిఆర్ జాగ్రత్తగా ఉండాలి

ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పాగాకు బీజేపీ భారీ స్కెచ్‌ వేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణలో తన ప్రణాళిక అమలు చేసేందుకు అమిత్ షా నేరుగా హైదరాబాద్‌లోనే మకాం పెట్టబోతున్నారని చెప్పారు. ఇందుకోసం శంషాబాద్‌ వద్ద అమిత్ షా ఒక పెద్ద ఇంటిని నిర్మించుకున్నారని వివరించారు.

ఆ ఇంటిని ఒక పెద్ద వ్యాపారి నిర్మించి ఇచ్చారన్నారు. అమిత్ షా నెలలో రెండు రోజుల పాటు ఆ ఇంట్లో ఉంటూ తెలంగాణ రాజ‌కీయాల‌పై దృష్టి సారించబోతున్నారని ఒవైసీ వెల్లడించారు.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతారన్నారు. తెలంగాణ ప్రభుత్వ స్ట్రీరింగ్‌ ఎంఐఎం చేతుల్లో ఉందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఒవైసీ కొట్టిపారేశారు.

స్ట్రీరింగ్ తమ చేతుల్లో ఉంటే పాతబస్తీలో అభివృద్ధి మరోలా ఉండేద‌న్నారు. హైదరాబాద్‌ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటున్న బండి సంజయ్‌ దమ్ముంటే చైనా మీద చేయాలని సవాల్ చేశారు....

జగిత్యాల జిల్లాలో చెట్టును ఢీకొన్న లారీ.. క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్

జగిత్యాలజిల్లా :

జిల్లాలో ధాన్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ నుజ్జు నుజ్జు అయ్యింది. డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు.

జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండల కేంద్రం మూలమలుపు వద్ద ఈ ప్రమాదం బుధవారం జరిగింది. ప్రమాదానికి లారీ అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

క్యాబిన్ లో డ్రైవర్ సందీప్ ఇరుక్కుని.. గంట పాటు నరకయాతన అనుభవించాడు. ప్రమాదం గురించి తెలియగానే స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు.

క్యాబిన్ నుంచి డ్రైవర్ ను అతి కష్టం మీద బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ కు డాక్టర్లు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. చెన్నూరు నుండి అదిలాబాద్ కు ధాన్యం లోడుతో లారీ వెళ్తుండగా ప్రమాదం జరిగింది..............

SB NEWS

హుజురాబాద్ బీఆర్ఎస్‌లో వర్గ పోరు❓️

కమలాపూర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌లో వర్గపోరు నడుస్తోంది. అవినీతి ఆరోపణలపై ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించడంతో ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం అందరికీ తెలిసిందే. అయితే అనంతరం నిర్వహించిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఈటల గెలిచిన విషయం విధితమే. అయితే ప్రస్తుతం కమలాపూర్ మండలంలో పార్టీ కార్యకర్తల మధ్య సఖ్యత లేక విభేదాలు తలెత్తుతున్నాయి. పార్టీ నేతల మధ్య వర్గపోరు ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో గెలవడం సాధ్యమేనా? అంటూ సొంత పార్టీ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు ఒకరినొకరు దూషించుకున్నారు. ఆయన ఎంత చెప్పినా వినకుండా కుర్చీలు విసురుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం ఆశ్చర్యపరిచింది. అంతేకాక ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరిన నాయకులు పాతవారిపై అజమాయిషి చలాయిస్తున్నారనే పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమను గుర్తించడం లేదని ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కిందిస్థాయి నాయకులు మదనపడుతున్నారు.

తారాస్థాయికి గొడవులు:

ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికల ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌‌తో కలిసి పనిచేసిన పార్టీ నాయకులు ఒక వర్గంగా, ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి వర్గం నాయకుల మధ్య వర్గపోరు నడుస్తోంది. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గ పూర్తి బాధ్యతలు కౌశిక్ రెడ్డికి అప్పగించగా నియోజకవర్గంలో పర్యటిస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటీవల పార్టీలో కొంతమంది నేతలు పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేయడం లేదంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈటల గెలిచినప్పుడు కూడా కొంతమంది ముఖ్యనాయకులు ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే కొందరు ఒక పార్టీ జెండా పట్టుకుని ఇంకో పార్టీ కోసం పనిచేస్తూ సొంత పనిచేస్తున్నామంటూ చెప్పుకుంటూ పార్టీలో కొనసాగుతున్నారని ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటుండడంతో గొడవలు తారాస్థాయికి చేరాయనే పలువురు చర్చించుకుంటున్నారు. పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు, వీడియోలు రావడంతో కౌశిక్ రెడ్డి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తాడనే అంశంపై మండలంలో అన్ని వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఈ వర్గ పోరు, వివాదాలు ఇలానే కొనసాగితే పార్టీలో ఉండి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రజల మధ్యకు రాలేమంటూ ఒక వర్గం నాయకులు అభిప్రాయపడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా ముఖ్య నాయకులు మేల్కొని ఈటలపై గెలుస్తారో..? లేక వీరి విభేదాల వల్ల ఈటలకు లాభం చేకూర్చి మళ్లీ ఈటలకు పట్టం కడతారో వేచి చూడాల్సిందే..........

APPSC: త్వరలో గ్రూప్‌ -1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: గౌతమ్‌ సవాంగ్

విజయవాడ: త్వరలోనే గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు..

గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్‌ పరీక్షలను జూన్‌ 3 నుంచి 10 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు సవాంగ్‌ తెలిపారు.

ఈ ఏడాది జనవరి 8న ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహించామని సవాంగ్‌ చెప్పారు. పరీక్షలు జరిగిన 19 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించామని.. 6,455 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారన్నారు.

జూన్‌ 3 నుంచి మెయిన్స్‌ పరీక్షలను 10 జిల్లాల్లోని 11 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు.

కేవలం 15 నిమిషాలు మాత్రమే గ్రేస్‌ పిరియడ్‌ ఉంటుందని.. ఆ సమయం దాటితే లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. జులైలో మెయిన్స్‌ ఫలితాలు వెల్లడించి ఆగస్టు చివరి నాటికి గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు పూర్తిచేస్తామని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

పుష్ప 2 మూవీ ఆర్టిస్టులతో వెళుతున్న బస్సు కు ప్రమాదం

నార్కట్ పల్లి :

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్ప 2’. షూటింగ్ ప్రస్తుతం యమఫాస్ట్ గా జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడీ చిత్రయూనిట్ కు అనుకోని అవాంతరం ఎదురైంది.

‘పుష్ప 2’ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు.. ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేనప్పటికీ.. చాలామంది యాక్టర్స్ కు తీవ్రగాయాలయ్యాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇంతకీ ఏం జరిగింది?

వివరాల్లోకి వెళ్తే.. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తొలి భాగం కంటే గ్రాండ్ గా తీస్తున్నారు. అయితే ‘పుష్ప 2’ ఆర్టిస్టులతో ఉన్న బస్సు ప్రమాదానికి గురైంది. నార్కట్ పల్లి దగ్గర బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఆర్టిస్టులతో వెళ్తున్న ఈ బస్సును.. మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఇన్సిడెంట్ లో పలువురు నటీనటులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన వాళ్లని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

‘పుష్ప 2’లో అల్లు అర్జున్ తోపాటు రష్మిక, ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ ఈసారి అంతకు మించి అనేలా సినిమాను తీస్తున్నట్లు సమాచారం.

ఎలాంటి అంచనాల్లేకుండా 2021 డిసెంబరులో వచ్చిన ‘పుష్ప’ సంచలనాలు క్రియేట్ చేసింది. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా అంటే చాలా క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇలాంటి ఈ టైంలో అనుకోని విధంగా బస్ ప్రమాదం జరగడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరి ‘పుష్ప 2’ ఆర్టిస్టులు వెళ్తున్న బస్ ప్రమాదానికి గురి కావడంపై అల్లు అర్జున్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు..

తెలుగు రాష్ట్రాలలో మోగనున్న బడిగంట?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా వేసవి సెలవులు కొనసాగతున్నాయి. పాఠశాలలకు జూన్ 12వ తేదీ వరకు సెలవులను ప్రకటించిన ప్రభుత్వం.. జూన్ 01వ తేదీ నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానుండగా.. ఇదే రోజు నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

ఇప్పటికే పలు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం విద్యార్థులకు సందేశాలను పంపించాయి. అయితే.. ఒకటి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

అయితే.. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో.. ఈ సెలవులను పొడిగించే అవకాశాలు ఉంటాయనే ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. ఎండ తీవ్రత తగ్గి దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశం చేశాయి.

దీంతో .. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఒక వేళ ఎండ వేడి తీవ్రంగా ఉంటే అప్పటి పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయా రాష్ట్రాల విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి......

SB NEWS

నిన్న కవిత పేరు లేదు ఈరోజు : ఈడీ ఏం చెప్పింది..!❓️

లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన కేసు ఇవాళ జరిగిన వాదనల్లో ఈడీ తరఫు న్యాయవాదులు సుదీర్ధ వాదనలు వినిపించారు. ‘ లిక్కర్ పాలసీ ద్వారా పెద్ద కుంభకోణమే జరిగింది. అరుణ్ పిళ్లై సౌత్ గ్రూప్‌లో కీలక వ్యక్తి. కవితకు సంబంధించిన వ్యక్తిగా ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అరుణ్ పిళ్లై వ్యవహరించారు. లిక్కర్ దందాలో వచ్చిన లాభాలతో ప్రాపర్టీలు కొన్నారు. లిక్కర్ వ్యాపారానికి సంబంధించి కవితతో పలుమార్లు సమావేశాలు జరిగాయి.

ఫీనిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబులు హైదరాబాద్‌లో ప్రాపార్టీలు కొన్నారు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై నోటీసులు ఇచ్చి విచారణ జరిపాం’ అని కోర్టుకు ఈడీ స్పష్టం చేసింది. మరోవైపు.. తమ వాదన వినిపించేందుకు సమయం కావాలని పిళ్లై తరపు న్యాయవాది కోరారు. ఎందుకిలా రోటీన్ వాదనలు చేస్తున్నారని జస్టిస్ నాగ్‌పాల్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను జూన్- 2కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

ఇదీ అసలు కథ..!

మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ మనీ లాండరింగ్ కేసుపై మంగళవారం నాడే రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన నాల్గవ అనుబంధ చార్జ్‌షీట్‌‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. మే-04న లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో నాలుగవ అనుబంధ చార్జ్‌షీట్‌‌ను ఈడీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా మనీష్ సిసోడియాపైనే ఈడీ అభియోగాలు మోపింది. అంతేకాదు.. ఈ చార్జ్‌షీట్‌‌లో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ పలుమార్లు ప్రస్తావించింది. కవిత విషయంలో గత చార్జ్‌షీట్‌‌‌లో మోపిన అభియోగాలు, అంశాలనే మరోమారు ఈడీ ప్రస్తావించింది. సౌత్ గ్రూపులో కవిత ఉన్నారని.. ఆ గ్రూప్‌కు- ఆప్ నేతలకు మధ్య ఒప్పందం ఉందని ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూపునకు లబ్ధి చేకూర్చేలా సిసోడియా విధాన రూపకల్పనలో అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. అయితే ఇలా లబ్ధి చేకూర్చినందుకు గాను సౌత్ గ్రూప్ నుండి ఆప్ నేతలకు ముడుపులు ముట్టాయని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది.

అంతా రోటీన్..!

లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో కవితను సీబీఐ, ఈడీ పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. నిందితులను కవిత కలిశారని.. సమావేశం కూడా అయ్యారని.. మాట్లాడారని ఇలా పలు అభియోగాలనే గతంలో దర్యాప్తు సంస్థలు మెపాయి. తాజా అభియోగపత్రంలోనూ ఇదే విషయాలను ఈడీ పునరుద్ఘాటించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ప్రశ్నించిన 51 మంది వివరాలను అభియోగ పత్రాల్లో ఈడీ పేర్కొంది. అయితే.. ఈడీ ప్రశ్నించిన జాబితాలో మొన్న కవిత పేరు లేకపోగా ఈసారి మాత్రం ఉంది. కాగా.. గతంలో కవితను మూడుసార్లు విచారణకు ఈడీ పిలిచి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. నిందితులతో కవిత పలుమార్లు హైదరాబాద్, ఢిల్లీలో సమావేశమయ్యారని.. తాను కవిత బినామీనని అరుణ్ పిళ్ళై చెప్పిన విషయం.. ఇలా రోటీన్ అభియోగాలనే మళ్లీ ఈడీ మోపినట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి చూస్తే.. లిక్కర్ స్కామ్ కథ మళ్లీ మొదటికి వచ్చినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. మొన్న కవిత పేరే అస్సలు లేకపోవడం.. ఇప్పుడు మళ్లీ అభియోగాలు ఉన్నట్లు చార్జ్‌షీట్‌లో పెట్టడం బిగ్ ట్వి్స్టే అని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే పలు అనుమానాలకు దర్యాప్తు సంస్థలు తావిస్తున్నాయి. అది కూడా రెండ్రోజులు వ్యవధిలోనే దర్యాప్తు సంస్థలు ఇలా రెండు మాటలు మాట్లాడాన్ని బట్టి చూస్తే మున్ముందు ఇంకా పెను సంచలనాలే వెలుగులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై కవిత ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో మరి......

నిర్మల్‌ హృదయ్‌ భవన్‌కు సీఎం జగన్ దంపతులు

గుంటూరు:

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం విజయవాడలో పర్యటించారు. నగరంలోని రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు సందర్శించారు.

వారికి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీరావు తదితరులు స్వాగతం పలికారు. 

నిర్మల్‌ హృదయ్‌ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న అనాథ పిల్లలతో సీఎం దంపతులు ముచ్చటించారు. మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి నివాళులర్పించారు.

అక్కడ నూతనంగా నిర్మించిన భవనాన్ని పిల్లలతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి పయనమయ్యారు.

మరోవైపు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకోవడంతో.. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే సేవా కార్యక్రమాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేక్‌ కట్‌ చేసి ప్రారంభించారు....

ఖిల్లా మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా:

మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కే పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ అమ్మవారిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి దర్శించుకున్నారు.

దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం

ఆలయ అభివృద్ధి కొరకై కోటి రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.అభివృద్ధి అనేది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉండాలని మంత్రి అన్నారు.

మన తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఏ రంగాన్ని ఎంచుకున్న రంగంలో అన్ని విధాల అభివృద్ధి చెందేటట్లు 50 సంవత్సరాలు చరిత్రలో నిలిచే విధంగా గుర్తు పెట్టుకునే విధంగా అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని పేర్కొన్నారు.

నా నియోజకవర్గంలో గల అతి పురాతనమైన దేవాలయాల మరమ్మత్తులకై ముఖ్యమంత్రి ని అడగగా తక్షణమే 8 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్,రామనర్సింహ గౌడ్,ఎండోమెంట్ ఇంజనీరింగ్ అధికారులు మరియు ఆలయ కమిటీ ధర్మకర్తలు, అరవింద్ శర్మ, బేర బాలకిషన్,లోకసాని కొండల్ రెడ్డి, అంకిరెడ్డి ఆర్కే పురం డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్, సాజిద్, ధర్పల్లి అశోక్,సునీత రెడ్డి, స్వప్న మరియు ఇతర నాయకులు,మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు...