Arvind Kejriwal | ప్రధాని మోదీని సాగనంపాల్సిందే.. ఢిల్లీకి ధైర్యాన్ని ఇచ్చిన కేసీఆర్‌కు థ్యాంక్స్: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal | ఢిల్లీ ప్రజల హక్కుల కోసం తాము 8 ఏండ్లు న్యాయపోరాటం చేసి సాధించుకొన్న న్యాయాన్ని ప్రధానమం త్రి నరేంద్రమోదీ 8 రోజుల్లోనే ఆవిరి చేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
•ఆయనను నిలువరిస్తేనే దేశ మనుగడ
•సుప్రీంనూ అపహాస్యం చేస్తున్న మోదీ
•8 ఏండ్ల పోరాట ఫలం 8 రోజుల్లో ఆవిరి
•ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ ప్రజల హక్కుల కోసం తాము 8 ఏండ్లు న్యాయపోరాటం చేసి సాధించుకొన్న న్యాయాన్ని ప్రధానమం త్రి నరేంద్రమోదీ 8 రోజుల్లోనే ఆవిరి చేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను మోదీ సర్కా ర్ అపహాస్యం చేస్తున్నదని విమర్శించారు. మోదీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటం మినహా మరో మార్గం లేదని చెప్పారు. శనివారం ప్రగతిభవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌తో కలిసి ఆయన మీ డియాతో మాట్లాడారు.
ఢిల్లీలో తమకన్నా ముం దున్న షీలా దీక్షిత్ ప్రభుత్వానికి అధికార యంత్రాంగంపై పూర్తి అజమాయిషీ ఉండేదని, అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు, ఉద్యోగులపై క్రమశిక్షణా చర్య లు, కొత్త పోస్టుల సృష్టి వంటి అన్ని రకాల అధికారాలు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేవని గుర్తుచేశా రు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 లో మోదీ సర్కార్ ఒక్క నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారాలన్నింటినీ బలవంతంగా లాగేసుకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం హోదాలో తనకు కనీసం ఒక అధికారిని బదిలీ చేయటం, పోస్టింగ్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని అన్నారు.
8 ఏండ్ల పోరాటం.. 8 రోజుల్లో ఆవిరి
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును బీజేపీ ప్రభు త్వం అపహాస్యం చేసిందని కేజ్రీవాల్ విమర్శించారు. మే 11న సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే.. మే 19న మోదీ సర్కార్ ఆ తీర్పును తుంగలో తొక్కి ఆర్డినెన్స్ తెచ్చిందని మండిపడ్డారు. ఈ ఆర్డినెన్స్ చూసి దేశ ప్రజలంతా నివ్వెరపోతున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పునే ప్రభుత్వం లెక్కచేయకపోతే ఇక న్యాయం కోసం ఎక్కడికి పోవాలి? అని ప్రశ్నించారు. సాక్షాత్తు ప్రధానే సుప్రీంకోర్టు తీర్పును లెక్కచేయకపోతే దానిని ఇంకెవరు గౌరవిస్తారు? అని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో అడ్డుకోవాలి
కేంద్ర తెచ్చిన ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో అడ్డుకొనేందుకు వ్యూహం రచిస్తున్నామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. రాజ్యసభలో బీజేపీకి సరైన మెజారిటీ లేదని, రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 238 (12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు) సభ్యుల్లో బీజేపీకి 93 మంది సభ్యులే ఉన్నారని, ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ మద్దతుతో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటామని చెప్పారు. రాజ్యసభలో ఈ బిల్లు వీగిపోతే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, తద్వారా 2024లో మోదీ సర్కార్ తిరిగి అధికారంలోకి రాదని అన్నారు. మోదీ సర్కార్‌ను నిలువరించినపుడే దేశ స్వాతంత్య్రాన్ని కాపాడినవాళ్లం అవుతామని స్పష్టంచేశారు.
కేసీఆర్‌కు ధన్యవాదాలు
సీఎం కేసీఆర్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. తమ కు సమయం కేటాయించి తమ సమస్యను దేశసమస్యగా భావించి ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 'రావుసాబ్.. ప్రేమకు పాత్రులం అయినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు' అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించామని, ఢిల్లీ ప్రజల న్యాయమైన కోరికకు సీఎం కేసీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు. 'ఇది కేవలం ఢిల్లీ సమస్య కాదని, యావత్ దేశం ఎదుర్కొంటున్న సమస్య' అని మానవీయ హృదయంతో స్పందించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఇంత ధైర్యాన్ని ఇచ్చిన కేసీఆర్‌కు ఢిల్లీ ప్రజల పక్షాన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను పనిచేయకుండా అడ్డుకోవటమే ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఆయన త్రిముఖ వ్యూహం అనుసరిస్తున్నారు. విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి ఆ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరచటం, దారికి రాని ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను ఉసిగొల్పటం, మొదటి రెండు పద్ధతులు పనిచేయకుంటే ఆర్డినెన్స్‌ల ద్వారా, గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను చిన్నాభిన్నం చేయటం అనే మూడు వ్యూహాలను అనుసరిస్తున్నారు.
May 29 2023, 11:33