*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిని అకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వనమా*
పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రోజు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమావెంకటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేసారు.
వార్డులలో తిరిగి పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులను అడిగి
తెలుసుకొని సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. పేషెంట్లకు సరైన వైద్యం అందించాలని డాక్టర్ లకు, వైద్య సిబ్బందికి సూచించారు.ప్రభుత్వ హాస్పటల్ ఆవరణలో షెడ్ నిర్మాణానికి 40 లక్షల రూపాయలు, లిఫ్ట్ మరియు ఎక్విప్ మెంట్ కోసం 20 లక్షలు శాంక్షన్ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ బీఅర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ రాజు గౌడ్,పెద్దమ్మగుడి చైర్మన్ మహిపతి రామలింగం, ఎస్ వీ అర్ కే ఆచార్యులు,హాస్పటల్ డాక్టర్స్ ముక్కంటేశ్వరరావు, సోమరాజు దొర, సిబ్బంది,తదితరులు
పాల్గొన్నారు.
May 21 2023, 13:30