నల్గొండ జిల్లా:పట్టణంలో సామాన్యుడిలా పర్యటన నిర్వహించిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
పట్టణంలో సామాన్యుడిలా పర్యటన నిర్వహించిన. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
.
నిరంతరం నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలిలా పర్యటించే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు సోమవారం నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు హంగు ఆర్భాటాలు లేకుండా స్థానిక ప్రజలతో కలసి మార్నింగ్ వాక్ చేశారు అందులో భాగంగా ప్రజలను ఆప్యాయంగా పలుకరించి వారితో కాసేపు ముచ్చటించారు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చర్చించారు స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు పిల్లలకు క్రీడ సామగ్రి ఇప్పిస్తానన్నారు ఇండోర్ స్టేడియంలో పైకప్పు రేకులు ఊడిపోవడంతో కొత్తవి ఏర్పాటు చేస్తానన్నారు వాకింగ్ ట్రాక్ కు మట్టి పోపిస్తానన్నారు పట్టణంలోని పలు వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు అనంతరం బార్బర్ షాప్ కి వెళ్లి సామాన్యుడిలా షేవింగ్ చేసుకున్నారు.
ఆపత్కాలంలో ఆపద్బాంధవుడు సీఎం కెసిఆర్. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రాష్ట్రంలోని పేద ప్రజలు ఆపత్కాలంలో ఉన్నపుడు ఆదుకునే ఆపద్బాంధవుడు సీఎం కెసిఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు సోమవారం నాడు నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నకిరేకల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 35 మంది లబ్దిదారులకు రూ.12 లక్షల 50 వేల రూపాయిల సిఎం సహాయ నిధి చెక్కులను మంజూరు చేయించి బాధిత కుటుంబాలకు తన చేతుల మీదుగా పంపిణి చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలకు విలువిచ్చి వారి కోసం తాను అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు ప్రాణపాయ స్థితిలో ఉండి వైద్య ఖర్చులు చెల్లించలేని పరిస్థితుల్లో పేద ప్రజల కోసం అండగా నిలుస్తానని పేర్కొన్నారు.
May 08 2023, 19:22