నల్గొండ జిల్లా :నకిరేకల్:పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి*

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

.

చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమాలు నిర్వహించారు.ఈ మేరకు పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వలేకపోతుందన్నారు. ప్రశ్నించిన వారిపై ఈడీ పేరుతో భయబాoత్రులకు గురి చేస్తోదన్నారు.

అనంతరం..

రామన్నపేట మండల కేంద్రంలో రామన్నపేట నుండి అమ్మనబోలు పి.డబ్ల్యు.డి రోడ్ నుండి లక్ష్మ పురం రోడ్డు మరమ్మతులకు రూ.33 లక్షలు మరియు చిట్యాల - భువనగిరి నుండి జైకేసారం వయా సిరిపురం రోడ్డు మరమ్మతులకు రూ. 4 కోట్ల 15 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

నల్గొండ జిల్లా:నకిరేకల్::ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య   

మన ఊరు-మన బడి కార్యక్రమంతో మారుతున్న తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి* 

.

 Streetbuzz news. నల్గొండ జిల్లా :        

.

        

         

  మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను బలోపేతం చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం నకిరేకల్ మండలం నోముల గ్రామంలోని ప్రభుత్వ మండల ప్రాధమిక పాఠశాల మరియు నకిరేకల్ పట్టణంలోని మండల ప్రాధమిక (బాలికల) పాఠశాల మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.50 లక్షలతో మౌలిక వసతుల బలోపేత పనుల ప్రారంబోత్సవానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హజరై ప్రారంభించారు.                            ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ....... తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగ రక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి వర్గాల పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుందన్నారు అని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి పథకం తో ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు మౌలిక సదుపాయాలు అదనపు తరగతి గదులు, మంచినీటి సౌకర్యం, విద్యుత్తు మూత్రశాలలు, మరుగుదొడ్లు, కిచేన్ షెడ్లు, డైనింగ్ హాల్లు, ప్రహరీ గోడలు,డిజిటల్ క్లాస్ రూమ్స్ ల ఏర్పాటుకోసం లక్షల బడ్జెట్ను పాఠశాల విద్యా కమిటీ ఖాతాల్లో జమ చేసింది అన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.. ఈ కార్యక్రమంలో.నకిరేకల్ జడ్పీటీసీ మాద ధనలక్ష్మినాగేష్ గౌడ్,నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మండల కో ఆప్షన్ నెంబర్ డాక్టర్ ఖాసీం ఖాన్,నోముల గ్రామ శాఖఅధ్యక్షులు ఆలకుంట్ల సైదులు,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,వార్డ్ నెంబర్లు, సీనియర్ నాయకులు యల్మాకంటి జానయ్య గౌడ్,మండల ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు,నోముల గౌడ సంఘం అధ్యక్షులు బాధిని రాము గౌడ్,యువజన నాయకులు బాధిని సైదులు గౌడ్,రాచకొండ గోపి గౌడ్, టీచర్లు,విద్యార్థులు, నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.

రేపు ఖమ్మంలో జరగబోయే నిరుద్యోగ నిరసన దీక్ష ఏర్పాట్లలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జ్ కొండేటి మల్లయ్య

రేపు ఖమ్మంలో జరగబోయే నిరుద్యోగ నిరసన దీక్ష ఏర్పాట్లలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జ్ కొండేటి మల్లయ్య

Streetbuzz news. నల్గొండ జిల్లా :

.

ఖమ్మంలో జరగబోయే నిరసనదీక్షకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరవుతుండటంతో ముందుగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్, సమన్వయ సమావేశంలో పాల్గొని ఈ సందర్భంగా కొండేటి మల్లయ్య మాట్లాడుతూ..

రేపు జరగబోయే నిరుద్యోగ నిరసన దీక్షను విజయవంతం అవుతుంది.

రేవంత్ రెడ్డి హాజరయ్యే నిరుద్యోగ నిరసన దీక్షకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి.

లక్షల మంది నిరుద్యోగులు తరలి వస్తున్నారు, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష దద్దరిల్లబోతోంది.

ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దిపేంతవరకూ ఊరుకోబోం కేంద్రం రాష్ట్రాల్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, నిరుద్యోగులకు, ప్రజలందరికీ మంచి రోజులు రాబోతున్నాయి.

ఈ ఏర్పాట్ల కార్యక్రమంలో

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి మల్లయ్యతో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతురావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్, ముఖ్యమైన నేతలు పాల్గొన్నారు.*

నల్గొండ జిల్లా:నకిరేకల్:బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం

బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం

Streetbuzz news నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణ కేంద్రంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీద మరియు కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన నిరాధరమైన ఆరోపణలు ఖండిస్తూ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు నకిరేకల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా జలెందర్ రెడ్డి సూచన మేరకు. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నకిరేకంటి శ్రీను ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొని.నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా. గుండా జలెందర్ రెడ్డి మరియు బొంబాయ్ శ్రీను మాట్లాడుతూ.. తక్షణమే రాజేందర్ క్షమాపణ చెప్పాలని లేదంటే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికి అక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు...ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు వేదాసు శ్రీధర్ పాల్గొన్నారు.వారి వెంట మాజీ వార్డు మెంబర్ గునగంటి రాజు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొంబాయి శ్రీను,మెడబాయిన నాగరాజు గంగరపు గణేష్ రవి,రాజు,మహేష్,భాస్కర్,అనిల్,రవి,శివ,వినయ్ రమేష్,తదితరులు పాల్గొన్నారు

నల్గొండ జిల్లా:కట్టంగూర్:నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన. నకిరేకల్ నియోజకవర్గ టిపిసిసి అధికార ప్రతినిధి.

నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన. నకిరేకల్ నియోజకవర్గ టిపిసిసి అధికార ప్రతినిధి నరసింహ్మ

Streetbuzz news. నల్గొండ జిల్లా:

కట్టంగూర్ మండల కేంద్రనికి చెందిన చెరుకు చంద్రయ్య కుమార్తె కుమారుడి నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన. నకిరేకల్ నియోజకవర్గ టిపిసిసి అధికార ప్రతినిధి సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,వారి వెంట కట్టంగూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కాముల శేఖర్ యాదవ్,సీనియర్ నాయకులు చెరుకు యాదయ్య,ముక్కాముల మల్లయ్య,మండల యువజన నాయకులు అడ్వకేట్ మేడి విజయ్ కుమార్,ముక్కాముల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా :బీఆర్ఎస్ ప్లీనరీని విజయవంతం చేయాలి.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

*బీఆర్ఎస్ ప్లీనరీని విజయవంతం చేయాలి.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

Streetbuzz news. నల్గొండ జిల్లా:

.

ఈ నెల 25 న నకిరేకల్ పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో నిర్వహించే బీఆర్ఎస్ నియోజకవర్గ ప్లినరీని విజయవంతం చేయాలనీ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ 2001 ఏప్రిల్ 27 న టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ నెల 25 న నియోజకవర్గ వ్యాప్తంగా గులాబీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు ప్లినరీ సమావేశానికి ప్రతి గ్రామం నుంచి 30 నుంచి 50 మంది హాజరుకావాలన్నారు ఈ సమావేశంలో పార్టీ ఆధ్వర్యంలో సాధించిన రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పార్టీ తరుపున చేపట్టిన కార్యక్రమాలన్నిటిని విస్తృతంగా చర్చించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి,గ్రంధాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి , కౌన్సిలర్లు,ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా :దీక్షాదక్షతకు ప్రతీక ఈద్ - ఉల్ - ఫితర్. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండగ రంజాన్.మాజీ ఎమ్మెల్యే.

*దీక్షాదక్షతకు ప్రతీక ఈద్ - ఉల్ - ఫితర్. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండగ రంజాన్.మాజీ ఎమ్మెల్యే వేదాస్ వెంకయ్య

Streetbuzz news. నల్గొండ జిల్లా :

.

రంజాన్ పర్వదినం సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని మసీదు వద్ద నిర్వహించిన సామూహిక ప్రార్థనలలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వేదాస్ వెంకయ్య పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు..

ఈ సందర్భంగా వేదాసు వెంకయ్య మాట్లాడుతూ..

నెలరోజుల పాటు ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి,ప్రేమ,దయ , సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని,తెలంగాణలో గంగా జమునా తహజీబ్ కు రంజాన్ పండుగ ప్రతీక అని ఆయన తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ముగింపు వేడుక అన్ని అన్నారు.

నియోజకవర్గ ప్రజలంతా భక్తి, శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఇంటిల్లిపాది రంజాన్ పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో.మాజీ వార్డ్ నెంబర్ గుణగంటి రాజు నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు గుండ జలంధర్ రెడ్డి,ఎస్సీ సెల్ అధ్యక్షులు కోతపల్లి సైదులు,నకిరేకల్ మండల యూత్ అధ్యక్షులు బొంబాయి శ్రీను,శివ,మహేష్,తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా :ముస్లిం సోదర, సోదరి మణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి..

ముస్లిం సోదర, సోదరి మణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

.

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నకిరేకల్ పట్టణంలోని ఈద్గా దగ్గర ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...అందరికి అల్లా దీవెనలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.అత్యంత పవిత్ర పర్వదినం గా భావిస్తున్న ఈద్ ఉల్ ఫితర్ ను సాంప్రదాయ బద్దంగా సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు.గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణా ప్రతీక అని లౌకిక వాదం, మత సామారస్యం కాపాడడం లో తెలంగాణా యావత్ భారత దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో.నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,జడ్పీటీసీ మాద ధనలక్ష్మినగేష్,కౌన్సిలర్లు, మైనార్టీలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నకిరేకల్ లో షాదీఖానా నిర్మాణానికి రూ. కోటి రూపాయలు మంజూరు చేసిన సీఎం.ఎమ్మెల్యే చిరుమర్తి.

నకిరేకల్ లో షాదీఖానా నిర్మాణానికి రూ. కోటి రూపాయలు మంజూరు చేసిన సీఎం.ఎమ్మెల్యే చిరుమర్తి.

నకిరేకల్ లో షాదీఖానా నిర్మాణానికి రూ.1 కోటి రూపాయలు మంజూరు..

ఎమ్మెల్యే చిరుమర్తికి జీ.ఓ కాపీని ప్రగతి భవన్ లో అందజేసిన సిఎం కేసీఆర్..

షాదీఖాన నిర్మాణానికి నిధులిచ్చిన సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే చిరుమర్తి..

బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ పూర్తికి నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ను వివరించిన ఎమ్మెల్యే చిరుమర్తి..

మే నెలలో ట్రయల్ రన్ వేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సిఎం కేసీఆర్..

వాటితోపాటు నియోజకవర్గంలో పలు పెండింగ్ పనులను సిఎం కేసీఆర్ కు వివరించిన ఎమ్మెల్యే చిరుమర్తి..

సానుకూలంగా స్పందించిన సిఎం కేసీఆర్, అధిక నిధుల కేటాయింపుకు సముఖత..

ఐపీల్ లో కి అడుగు పెట్టబోతున్న రామ్ చరణ్..! ఆర్‌ఆర్ఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఐపీల్ లో కి అడుగు పెట్టబోతున్న రామ్ చరణ్..!

ఆర్‌ఆర్ఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఆర్‌ఆర్ఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే ఈ హీరో తన సతీమణితో కలిసి మల్దీవ్స్ టూర్స్‌లో ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్క టీమ్ కూడా లేదు.

కాగా ఏపీ నుంచి కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని చరణ్ సన్నాహాలు చేస్తున్నారని, దీనికి సంబంధించి ప్లాన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయని, వచ్చే సంవత్సరం ఈ హీరో ఫ్రాంచైజీ నుంచి ఒక కొత్త ఐపీఎల్ టీమ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే ఈ టీమ్‌కు వైజాగ్ వారియర్స్ పేరు కూడా ఫిక్స్ చేశారట. కానీ దీన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ న్యూస్‌తో మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.