madagoni surendar

Apr 19 2023, 20:17

నల్గొండ జిల్లా:కేతేపల్లి:వీబీకే ల సమస్యలు తీర్చాలి.బీజేపీ మండల అధ్యక్షులు రాచకొండ గోపి గౌడ్.

వీబీకే ల సమస్యలు తీర్చాలి.బీజేపీ మండల అధ్యక్షులు రాచకొండ గోపి

కేతేపల్లి బీజేపీ మండల అధ్యక్షులు రాచకొండ గోపిగౌడ్ ఆధ్య్వర్యంలో వీబీకే ల సమస్యలు తీర్చాలి అని కేతేపల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు మండల వీబీకే లతో కలిసి వారికీ మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేతేపల్లి మండల ఇంచార్జి బీజేపీ రాష్ట్ర నాయకులు షేపురి రవీందర్, పాల్గొని. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వీబీకే లకు ప్రస్తుతం నెలకు ఇచ్చే 3600 రూపాయలు సరిపొవట్లేదని వారి జీతాలు పెంచాలి అని , వారికీ పది లక్షల ఆరోగ్య భీమా కల్పించాలి అని ,అర్హత కలిగిన వారిని సీసీ లుగా గుర్తించాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఐతగొని అనిత,జిల్లా కార్యవర్గ సభ్యలు జటంగి రాంచంద్రయ్య,మాజీ మండల అధ్యక్షులు తాడోజు నర్సింహా చారీ,మండల ప్రధాన కార్యదర్శి పిట్టల వెంకట్, కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి, మండల కోశాధికారి ఐతగొని చంద్రశేఖర్,బూతు అధ్యక్షులు సమ్మెట రాఘవరాజు,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 19 2023, 18:37

నల్గొండ జిల్లా::రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లిం లకు దుస్తువులు పంపిణీ చేసిన .కట్టంగూర్.ఎంపీపీ,జెడ్పీటీసీ.

రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లిం లకు దుస్తువులు పంపిణీ చేసిన.ఎంపీపీ' జెడ్పీటీసీ.

కట్టంగూర్ పట్టణ కేంద్రం ఎమ్మార్వో ఆఫీస్ లో రంజాన్ మాసం సందర్బంగా పేద ముస్లింలకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను పంపిణీ చెసిన.ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య మరియు. జెడ్పీటీసీ తరాల బలరామ్,అనంతరం. వారు మాట్లాడుతూ..సర్వ మతాల సంప్రదాయాలకు ఆధార వ్యవహారాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ,పి ఏ సి ఎస్.చైర్మన్ నూక సైదులు, ఎమ్మార్వో సునీత, మండల కో ఆప్షన్ మెంబర్ ఎస్ కే జానిపాషా, ఎంపిటిసి లు ఎడ్ల పురుషోత్తం రెడ్డి,మల్లేబోయిన శ్రీలత కృష్ణ,బెల్లి సుదాకర్, మాజీ సర్పంచ్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత. గద్దపాటి దానయ్య,మండల నాయకులు పెద్ది బాలనరసింహ,అటిపాముల.గ్రామ శాఖ అధ్యక్షులు చౌగోని నాగరాజు,రేఖల బిక్షం, జహంగీర్,స్లిమ్,తదితరులు పాల్గొన్నారు...

madagoni surendar

Apr 19 2023, 18:21

నల్గొండ జిల్లా::నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన.విఓఏఓలు,సీసీలు, ఏపియంలు,డీపియం లు.

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన.విఓఏఓలు,సీసీలు, ఏపియంలు,డీపియం లు.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పుట్టిన రోజు సందర్బంగా ముందస్తుగా వారిని కలసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నకిరేకల్, కట్టంగూర్, కేతపల్లి, నార్కట్ పల్లి మండలాల విఓఏఓలు,సీసీ లు, ఏపియంలు డీపియం లు తదితరులు ఉన్నారు. అనంతరం.

నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వి ఓ ఏ (బి టీ ఆర్ యు) అనుబంధ సంఘం వారి సమస్యల పరిష్కారం కొరకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ని కలసి వినతి పత్రం అందజేశారు.ఈసందర్భంగా. ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సిలివేరు ప్రభాకర్ బి.టి.ఆర్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఏపూరి నర్సయ్య,బి నాగమణి(వి ఓ ఏ), కే.స్వేత (వి ఓ ఏ),జి సంతోష,తదితరులు ఉన్నారు.

madagoni surendar

Apr 18 2023, 13:42

నల్గొండ జిల్లా :నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని ఆర్టిసి బస్ డిపో ను సందర్శించిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

*నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని ఆర్టిసి బస్ డిపో ను సందర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని ఆర్టిసి బస్ డిపో ను సందర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

బస్ డిపో పరిధిలో దుకాణ సముదాయాల నిర్మాణానికి ఆర్టిసి అధికారులతో కలిసి స్థల పరిశీలనచేసి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.

రోడ్డు వెడల్పు పనులతో పాటు దుకాణ సముదాయాల నిర్మాణాలు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటం. అనంతరం.

నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో రంజాన్ మాసం సందర్బంగా పేద ముస్లింలకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను మంగళవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేశారు.మరియు నార్కట్ పల్లి కి చెందిన 9 మంది లబ్ధిదారులకు మంజూరైన షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చిరుమర్తి అందజేశారు.

madagoni surendar

Apr 18 2023, 13:09

నల్గొండ జిల్లా:నార్కట్ పల్లి ::కబడ్డీ పోటీలో విజయం సాధించి సిల్వర్ మేడల్ సాధించిన.దీపిక కి శుభాకాంక్షలు తెలియజేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

కబడ్డీ పోటీలో విజయం సాధించి సిల్వర్ మేడల్ సాధించిన.

దీపిక కి శుభాకాంక్షలు తెలియజేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

నార్కట్ పల్లి క్యాంపు కార్యాలయంలో నార్కట్ పల్లి మండల కేంద్రానికి చెందిన ఉండ్రతి దీపిక నేపాల్ లో జరిగిన ఇంటర్నేషనల్ స్థాయిలో కబడ్డీ పోటీలో విజయం సాధించి సిల్వర్ మేడల్ సాధించిన దీపిక ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేపాల్ లో కబడ్డీ పోటీలకు వెళ్ళడానికి ఆర్ధిక సహాయం అందించినందుకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కి కృతజ్ఞతలు తెలిపారు.

madagoni surendar

Apr 18 2023, 12:08

నల్గొండ జిల్లా:మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన.కట్టంగూర్ జెడ్పీటీసీ తరాల బలరామ్.

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన.

కట్టంగూర్ జెడ్పీటీసీ తరాల బలరామ్.

కట్టంగూర్ టౌన్ చెందిన కోమటి ఎల్లేష్ మృతి చెందగా వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించి. అనంతరం కుటుంబం సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన. జెడ్పీటీసీ తరాల బలరామ్, ఆయన వెంట నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ, గ్రామ శాఖ అధ్యక్షులు చౌగోని జనార్ధన్,ఉప సర్పంచ్ అంతటీ శీనువాస్,పి.ఏ.సి. ఎస్.డైరెక్టర్ నిమ్మల సత్యనారాయణ, మండల నాయకులు పెద్ది బాలనరసింహ, వార్డు మెంబర్ అయితగోని సునిత సైదులు, నోములు వెంకటేశ్వర్లు, కానుగు లింగయ్య,రాచకోండ యాదయ్య,పోగుల అంజయ్య, మేకల సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.......

madagoni surendar

Apr 18 2023, 11:54

నల్గొండ జిల్లా. నకిరేకల్ ::ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోండి.రైతులకు అండగా సీఎం కేసీఆర్. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోండి.

రైతులకు అండగా సీఎం కేసీఆర్.

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ మండలం నోముల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. మంగళవారం ప్రారంభించి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ..రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. అన్నదాతకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లపుడు అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో.జడ్పీటీసీ మాద ధనలక్ష్మినాగేష్ గౌడ్,నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి,మండల కో ఆప్షన్ నెంబర్ డాక్టర్ ఖాసీంఖాన్, ఎంపీటీసీలు,సర్పంచులు,ఉప సర్పంచ్లు,వార్డ్ నెంబర్లు, నాయకులు ఎల్మకంటి జానయ్య గౌడ్,రాచకొండ శ్రవణ్ గౌడ్,మండల ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు.నోముల గౌడ సంఘం అధ్యక్షులు బాధిని రామ్ గౌడ్,గ్రామ శాఖ అధ్యక్షులు అలకుంట్ల సైదులు, యువజన నాయకులు బాధిని సైదులు గౌడ్,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 17 2023, 23:27

నల్గొండ జిల్లా ::ఏప్రిల్ 28న పూలే అంబేద్కర్ జాతరను జయప్రదం చేయండి.కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున.

ఏప్రిల్ 28న పూలే అంబేద్కర్ జాతరను జయప్రదం చేయండి.

మహాత్మ జ్యోతిబాపూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకై నల్లగొండలోనీ (ఎస్ బి ఆర్ ఫంక్షన్ హాల్) బోయవాడ లో ఏప్రిల్ 28న ఉదయం 10 గంటలనుండి సాయంత్రం వరకు పూలే అంబేడ్కర్ జన జాతరను జయప్రదం చేయవలసిందిగా రిటైర్డ్ ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్ కోరారు.

నల్లగొండలో ఈరోజు అంబేద్కర్ భవనంలో పూలే అంబేడ్కర్ సన్నాహక సమావేశం కొండేటి శ్రీను గంజి మురళీధర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ పూలే అంబేడ్కర్ తమ జీవితాంతం కష్టించి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని భావితరాలకు రాజ్యాంగాన్ని అందించారని చదువు సమాజ అభివృద్ధికి పాటు పడ్డారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్బండా కులాలలో నీ సాంస్కృతిక బృందాలు డప్పులు కోలాటం భజన యక్షగానం చిందువేషాలు గోసంగి ఒగ్గు కథలు గంగిరెద్దులు, చెంచుల కాటికాపరుల ఎరుకల సోది అనేక రకాల కళారూపాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఏప్రిల్ 19న నల్లగొండ పూలే విగ్రహం వద్ద కరపత్రాల ఆవిష్కరణ 20న నకరికల్లు నల్లగొండ మునుగోడులో సమావేశాలు కరపత్రం ఆవిష్కరణ 21న మిర్యాలగూడ నాగార్జునసాగర్ దేవరకొండలో కరపత్రాల పంపిణీ సామాజిక సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలను కలవనున్నట్లు తెలిపారు. 23 24 తేదీలలో నియోజకవర్గ కేంద్రాలలో సైకిల్ మోటార్ యాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 25న నల్లగొండ పట్టణ పురవీధులలో సైకిల్ మోటార్ యాత్రలు నిర్వహించాలని తెలిపారు. పూలే అంబేడ్కర్ జాతరలకు ముఖ్యఅతిదులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ మరియు నల్లగొండ ప్రముఖులు మేధావులు కవులు సాహితీవేతలు దళిత గిరిజన మైనారిటీ బిసి వృత్తి సంఘాల జిల్లా స్థాయి నాయకులు అంబేద్కర్ సంఘాలు స్వచ్ఛంద సంఘాలు నాయకులు పాల్గొంటారు సన్నాహక సమావేశంలో వృత్తిదారుల జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్ వైద్యుల సత్యనారాయణ కత్తుల షణ్ముఖ అవుట రవీందర్ ఎస్సీ ఉద్యోగుల సంఘం నాయకులు బిక్షపతి కత్తుల జగన్ మిరియాల యాదగిరి పిడిఎస్యు సాగర్ తెలగమల్ల యాదగిరి బొల్లూరి నరసింహ అవిశెట్టి శంకరయ్య చెరుకు పెద్దలు వనం నారాయణ గాదె నరసింహ మురారి మోహన్ కట్టెల శివకుమార్ బొల్లు రవీందర్ తదితర సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు.

పలడుగు నాగార్జున

గంజి మురళీధర్

madagoni surendar

Apr 17 2023, 21:06

నల్గొండ జిల్లా :నకిరేకల్::అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

నకిరేకల్ పురపాలిక ప్రధాన రహదారి విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధికారులను కోరారు. రహదారి విస్తరణ పనులను సోమవారం సాయంత్రం పరిశీలించారు ఈ పనులకు స్థానిక దుకాణాల యజమానులు సంపూర్ణ సహకారం అందించాలని అభివృద్ధిలో నకిరేకల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దే కృషిలో భాగస్వాములు కావాలని కోరారు. మధ్య నుంచి ఇరువైపులా 50 అడుగుల మేర రహదారి విస్తరణ పనులు చేపట్టినందున భవిష్యత్ అవసరాల దృష్ట్యా సహకరించాలన్నారు. విస్తరణలో భాగంగా రహదారిపైకి వచ్చిన దుకాణాలు, ఇళ్ల శ్లాబుల ముందు భాగాలను తొలగించేందుకు పుర సిబ్బందికి విస్తరణ పనుల కాంట్రాక్టర్ సిబ్బందికి వ్యాపారస్తులు సహకరించాలని ఎమ్మెల్యే చిరుమర్తి కోరారు.

madagoni surendar

Apr 17 2023, 20:12

నల్గొండ జిల్లా :నకిరేకల్ ::ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

*ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నకిరేకల్ పట్టణంలోని శకుంతల ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన దావత్- ఏ- ఇఫ్తార్ విందులో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ...

ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు ఐక్యతకు చిహ్నం ఇఫ్తార్ అన్నారు.

ఉపవాసాలతో పేదల ఆకలి బాధలు తెలిపిన మహమ్మద్ ప్రవక్త చూపిన దారిలో మంచి పనులు చేయడం గొప్ప విషయమన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలు కులాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని దసరా సందర్బంగా చీరల పంపిణి, క్రిస్మస్ సందర్బంగా కానుకలు , రంజాన్ కు తోఫా అందిస్తున్నారని పేర్కొన్నారు.

రంజాన్ పవిత్ర మాసంలో ఎంతో నిష్ఠతో ఉపవాసాలు ఉంటున్న ముస్లింలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో.నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,నకిరేకల్ మండల కో ఆప్షన్ నెంబర్ డాక్టర్ ఖాసింఖాన్,మైనార్టీలు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.